ఈ చైతన్యం కనబడదా?


Sat,October 6, 2012 03:19 PM

సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి సరికొత్త పోరాట రూపాలను అందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు విలువను, పవివూతతను కాపాడారు. ఓటు డబ్బుకు అమ్ముడుపోయేది కాదని, మద్యానికి కుదు వ పెట్టేది కాదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం ప్రభావాన్ని తగ్గించాలనే స్వచ్ఛంద ఉద్యమాలు నడుస్తున్న తరుణంలో ఇక్కడి జనం ప్రలోభాలకు లొంగమని ఆచరణలో చూపి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.సకల జనుల సమ్మెలో రోడ్డెక్కి.. తెలంగాణ ద్రోహులను బజారుకీడ్చి, పట్టాపూక్కి రైళ్లు ఆపి.. ఢిల్లీకి సెగ పెట్టారు. జీతాలు లేకున్నా సరే జాతి కోసం ఉద్యమం చేసిన ఉద్యోగ గణం.. నడి బజారులో వంటావార్పు పెట్టి ప్రభుత్వ గుండెల్లో మహిళా లోకం మంట పెట్టింది. ఊళ్లకు ఊళ్లు రోజుల తరబడి ఉపాసముండి సత్యక్షిగహ బాటపట్టిన తెలంగాణ శాంతికాముకులు.. ఎన్నికల్లో కూడా తమ నిజాయితీని చాటుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు పోటీపడి డబ్బు సంచులు పంచారు. మద్యం సీసాలు సరఫరా చేశారు. తండాలకు లక్ష చొప్పున రేటు కట్టారు. చిన్న చిన్న గ్రామాలకు కూడా రెండు లక్షలకు తగ్గకుండా నోట్లు పంచారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు పార్టీలు చెరో పదికోట్లు కుమ్మరించాయి. ఒకరు ఉద్యోగాలు ఆశచూపితే, మరొకరు ఉచిత బియ్యం అన్నారు. ఒకరు రోడ్డేస్తామంటే, ఇంకొకరు బోరేస్తామన్నారు. ఎన్నికల ‘కోడ్’ను ఉల్లంఘించి మరీ పనులు మొదలుపెట్టారు.
చివరికి తెలంగాణ ప్రజల చిత్తశుద్ధి ముందు అన్నీ బలాదూర్ అయ్యాయి. తెలంగాణ జనం ప్రలోభాలకు లొంగేదిలేదని ప్రపంచానికి చాటి చెపింది.

డబ్బులు, మద్యంతో లోబరుచుకోవాలనుకునే పార్టీలు నేతల చెంప చెల్లుమనిపించేలా ఒక్కరూపాయి కూడా ఇవ్వని అభ్యర్థులకు ఓటేసి తమ విశ్వసనీయత ముందు ఆ పార్టీ లు, అభ్యర్థులు కాలి గోటికి సరిపోరని చూపించారు. తెలంగాణ కోసం నిజాయితీగా పనిచేస్తున్న నాయకులపై కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఓటు ద్వారానే తుత్తునియలు చేశారు. 700 మంది తమ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్న కసి ఓటు వినియోగంలో కనిపించింది. ఏండ్ల తరబడి ఆంధ్రోళ్ల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతున్న చైతన్యం ఓట్ల రూపంలో కనిపించింది. ఆంధ్ర పార్టీలకు ఏజెంట్లుగా పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించడం ద్వారా తెలంగాణ పార్టీలకు తప్ప మిగతా వారికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. పొద్దున లేస్తే నీతి వాక్యాలు చెప్పే ఆంధ్రా టీవీ ఛానళ్లు, ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడే జయవూపకాశ్ నారాయణ లాంటి స్వయం ప్రకటిత మేధావులు తెలంగాణ జనం ప్రదర్శించిన విజ్ఞతను ఎందుకు విస్మరిస్తున్నారు? కోట్లు ఇచ్చినా సరే ఓటును అమ్ముకునేది లేదని ఆచరణలో చూపిన తెలంగాణ ప్రజలు ప్రపంచానికే ఆదర్శం కాదా? వీరు నడుస్తున్న తోవ మంచిదని చెప్పడానికి నోరు ఎందుకు రావడం లేదు? ‘డబ్బుకు అమ్ముడుపోని తెలంగాణ ఓటర్లు’ అని వాళ్ల పేపర్లలో రాయందుకు? కాంగ్రెస్, టీడీపీలు కోట్లు ఖర్చు చేస్తున్నారని వాళ్ల ఛానళ్లలో చూపందుకు? తెలంగాణ పట్ల ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో? ఎవరు డ్రామాలు ఆడుతున్నారో ఓట్ల ద్వారా జనం తేల్చి చెప్పారని వార్తలు ఎందుకు ప్రసారం చేయరు?
సీమాంధ్ర మీడియా పట్టించుకోకున్నా అఖిలభారత సర్వీసు అధికారులు, మేధావులు ఈ ప్రాంత జనం చూపిన బాటను అభినందిస్తున్నారు.

ఓటును అమ్ముకోని తెలంగాణ ప్రజలు చరివూతలో నిలిచిపోతారని మెచ్చుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు చూపిన బాటలో నడవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డబ్బుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఆన్‌లైన్ బ్యాకింగ్‌పై నిఘా పెట్టాలని,ఎన్నికల ప్రచారం ఖర్చును కూడా ప్రభుత్వమే పెడితే మంచిదని వాదనలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే జనం తమ మనోగతాన్ని వెల్లడిస్తారు. ఉన్న మార్గమూ అదే. ఆ మార్గాన్ని కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగాయి. కానీ ఎప్పటిలాగే ప్రజలు కుట్రలను తెలుసుకుని మసలారు. డబ్బుకు అమ్ముడు పోలేదు. సమయం ఏదైనా, ఎప్పుడు అవకాశం వచ్చినా తెలంగాణవాదాన్ని చాటడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. అందరూ తెలంగాణ జపం చేస్తున్నా, నీళ్లేవో పాలేవో గుర్తించే హంసల్లా ప్రవర్తించారు. ద్రోహులకు బుద్ధి చెప్పారు. ఈ చైతన్యం చాలు.. మన తెలంగాణ సాధించుకోవడానికి!

-గటిక విజయ్‌కుమార్
ప్రిన్సిపల్ కరస్పాండెంట్ టీ న్యూస్

35

VIJAYKUMAR GATIKA

Published: Sun,February 2, 2014 01:56 AM

పెద్దల సభ స్ఫూర్తి...?

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన్మోహన్‌సింగ్, లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సుజనా చౌదరి, కనిమొళి, సుబ్బిరామిరెడ్డి, సీఎం రమేష్, హరిక

Published: Sun,October 6, 2013 01:48 AM

మన సాంస్కృతిక ప్రతీక

పెళ్లినాడు తద్దినం మంత్రమేంది’ అని విసుక్కోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తరు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు మనం

Published: Thu,February 14, 2013 03:55 PM

నూటొక్క అబద్ధాలు.. ఓ పిచ్చి వాదన

‘తెలంగాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ పేరుతో సీమాంవూధులు ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు

Published: Thu,January 3, 2013 01:44 PM

ఓరుగల్లు ఎందుకు?

ఉరుములేని మెరుపులా వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాకతీ

Published: Thu,November 8, 2012 02:22 AM

కాకతీయ ఉత్సవాలుపభుత్వ కుట్ర

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం... ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహి స్తాం. అంతర్జాతీయ స్థాయిలో సదస్సు

Published: Sat,October 6, 2012 03:18 PM

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట

సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరా

Published: Sat,October 6, 2012 03:18 PM

పతకాల వేటలో పతన బాట

విజయ్ కుమార్, మేరీ కోమ్, గగన్ నారంగ్, సైనా నెహ్వాల్...ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంతసేపు పొగిడినా.. ఎన్ని పేజీలు రాసినా... ఎన్ని బ

Published: Sat,October 6, 2012 03:19 PM

మేడారం నేర్పిన పాఠం

ఏదైనా కార్యం కోసం ఓ భారీ జన సమూహం ఒక్కచోట చేరితే.. వచ్చిన జనాల సంఖ్యను బట్టి అది విజయవంతమైందని చెప్పాలా? లేక వచ్చినజనం వెళ్లేటప్పు

Featured Articles