నూటొక్క అబద్ధాలు.. ఓ పిచ్చి వాదన


Thu,February 14, 2013 03:55 PM

‘తెలంగాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’
పేరుతో సీమాంవూధులు ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం కోరుకునే వారు చేసే వాదనలన్నీ తప్పు అని చెప్పడమే ఈ పుస్తకం లక్ష్యం. ప్రొఫెసర్ జయశంకర్‌సార్ లాంటి వారు గతంలోనే ఈ విషయాలపై తను రాసిన పుస్తకాల్లో వివరాలు కూడా ఇచ్చారు. ఇంకా చాలామంది మేధావులు లెక్కలతో సహా వాస్తవాలు బయటపెట్టారు. అయినా సరే, తెలంగాణ ఉద్యమానికి సరైన కారణం లేదనే వాదన చేయడానికి ఉపయోగపడేలా పుస్తకం రూపొందించారు. నిజానికైతే ఇదో చెత్త కాగితాల కుప్ప. సమాధానం ఇవ్వాల్సిన అవసరంలేదు. కానీ దానికి సమాధానం ఇవ్వకుంటే ఆ వాదనే నిజమని విర్రవీగే వెర్రి బాపతు మేధావులుంటారు కాబట్టి ఈ సమాధానాలు. 101 అబద్ధాలుగా పుస్తకంలో పేర్కొన్న ముఖ్యమైన అంశాల వెనక ఉన్న వాస్తవాలు ఇవి.

1.2500 సంవత్సరాల తెలుగుజాతి చరివూతలో 2200 ఏండ్లు తెలంగాణ విడిగానే ఉంది. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. రాతిశిలాయుగం నుంచి ఆంధ్రవూపదేశ్ అవతరణ వరకు చరిత్ర చదివితే విషయం అర్థమౌతుంది. రాతిశిలాయుగం నాటి ఆనవాళ్లు కూడా ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న కాళేశ్వరం, వరంగల్ జిల్లాలో ఉన్న ఏటూరునాగారం,ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం ప్రాంతాల్లోనే దొరికాయి. ఇప్పటికీ రాతిశిలాయుగానికి సంబంధించి సీమాంవూధలో నాగరికత ఉన్న ఆనవాళ్లే లేవు. భారతదేశం అనే భావన మగధ సామ్రాజ్యంలో మొదటిసారి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 16 రాష్ట్రాలు భారతదేశంలో భాగమయ్యాయి. వాటినే 16 జనపదాలు అన్నా రు. ఆపదహారిట్లో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌గా పిలుస్తున్న అశ్మక, ములక రాజ్యాలు. అప్పుడు మగధ సామ్రాజ్యంలో సీమాంధ్ర ప్రాంతాలు లేవు. మొత్తం చరిత్ర చూసుకుంటే శాతవాహనుల కాలంలో వంద సంవత్సరాలు, కాకతీయుల కాలంలో యాభై సంవత్సరాలు, గోల్కొండ కుతుబ్ షాహి పాలనలో నూటా ఇరవై సంవత్సరాలు మాత్రమే ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ కలిసున్నాయి. ఇక నిజాం పాలనలో రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలు ఎక్కువ రోజులు లేవు. 1724లో నిజాం పాలన ప్రారంభమైంది. ముజఫర్ షా కాలంలోనే ఆంధ్రా, రాయలసీమ జిల్లా లు ఫ్రెంచ్‌బిటీష్ పాలనలోకి వెళ్లిపోయాయి. ఇదంతా 1749 నుంచి జరిగిన పరిణామం. అప్పటి నుంచి ఆంధ్రవూపదేశ్ ఏర్పడే వరకు విడివిడిగానే ఉన్నాం. నిజాం పాలన 1724-1948 వరకు సాగింది. అదంతా తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. కుతుబ్‌షాహీల నుంచి పాలన నిజాంలకు మారే కాలంలో కేవలం 20 ఏండ్లు మాత్ర మే అన్ని ప్రాంతాలు కలిసున్నాయి.

5. నెహ్రూ విలీనానికి వ్యతిరేకం.
1956 మార్చి 5న నిజామాబాద్‌లో భారత్ సమాజ్ సమావేశం ఉదయం, సాయంత్రం సెషన్స్‌లో జరిగాయి. ఉదయం సెషన్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటాన్ని నిరసిస్తూ నినాదాలు వచ్చాయి. దీనికి స్పందించిన నెహ్రూ ‘ఆంధ్రా తుంటరి అబ్బాయికి అమాయకపు తెలంగాణ అమ్మాయికి పెళ్లి జరిగింద’ని వ్యాఖ్యానించారు. ఐతే నెహ్రూ ముందుగా రాసుకొచ్చిన ఉపన్యాసంలో అది లేదు. ఈవ్యాఖ్యలను అప్పటికప్పుడు నెహ్రూ చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బాంబే ఎడిషన్ (ఈవినింగ్)లో ఈ వార్త కూడా వచ్చింది. ఆసభలో పాల్గొన్న పండిట్ నారాయణడ్డి, సరోత్తమరావు ఇంకా బతికే ఉన్నారు. నిజామాబాద్ మీటింగ్‌లో మాట్లాడిన దానికన్నా ఎక్కువగానే కర్నూలు, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో నెహ్రూ స్పందించారు. ‘ఆంధ్ర, తెలంగాణ కలపాలనే ఆలోచన వెనుక సామ్రాజ్య విస్తరణవాద కాంక్ష ఉంద’ని నెహ్రూ చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు, పేపర్ కటింగ్స్ ఉన్నాయి.

8. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తెలంగాణ ప్రజల అభిమతానికి వ్యతిరేకం.
ఇది ముమ్మాటికీ నిజం. హైదరాబాద్ అసెంబ్లీ తీర్మానాన్ని సాకుగా చూపుతున్నా రు. ఆరోజు అసెంబ్లీ ఏకక్షిగీవ తీర్మానం చేయలేదు. 29 మంది సభ్యులు వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి ఆంధ్ర నాయకుల నాయకత్వంలోని ఎక్కువమంది కమ్యూనిస్ట్ సభ్యు లు తీర్మానానికి అనుకూలంగా ఓటువేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంధ్ర నాయకుల పెత్తనంలో ఉన్న రాజకీయపార్టీల వల్లే తెలంగాణ నష్టపోయింది. అసెంబ్లీ తీర్మానాలూ వారికి అనుకూలంగానే చేసుకుంటున్నారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం ఆంధ్రకు వ్యతిరేకంగానే జరిగింది.ఇడ్లీ సాంబార్ ఉద్యమం 1952లో జరిగింది. అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిం ది. ఖమ్మం తర్వాత ప్రాంతమంతా అప్పుడు మద్రాసులోనే ఉండేది. వాళ్లను మద్రాసీలని, ఇడ్లీ సాంబార్ గాండ్లని పిలిచేవారు. వారికి వ్యతిరేకంగానే ఉద్యమం వచ్చింది.

16. సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు భిన్నమైన వారు. వారి సంస్కృతులు వేరు.
దీనికి కోటి ఉదాహరణలు చెప్పవచ్చు. తెలంగాణ చరిత్ర వేరు. సంస్కృతి వేరు. భాష వేరు. పండుగలు వేరు. తెలంగాణలో ఆశ్వయుజ మాసంలో ప్రతీ ఊర్లో బతుకమ్మ ఆడతారు. ఆంధ్రలో ఆడతారా?. ఇక్కడ బోనాల సంస్కృతి ఉంది. అక్కడ ఉం దా? ఆంధ్రాలో అట్లతద్ది పండుగ ఉంది. తెలంగాణలో ఆ పండుగ ఎక్కడైనా ఆడంగా చూశారా?

19. రెండున్నర జిల్లాల భాషను రాష్ట్రమంతా బలవంతంగా రుద్దుతున్నారు.
ఇది ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రజలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాంత ప్రజలు కూడా ఒప్పుకొని తీరుతున్న విషయం. సినిమాలు, సాహిత్యం, నవలలు, నాటకాలు, టీవీలు, పేపర్లు అన్నింట్లో ఈ భాషే ఉన్నది.

22. నిజాంపాలనలో భాషా స్వేచ్ఛ ఉంది.
ఉర్దూ అధికార భాషగా ఉన్నా నిజాం రాజ్యంలో భాషా స్వేచ్ఛ ఉంది. 1901లోనే వరంగల్‌లో రాజ రాజనరేంద్ర గ్రంథాలయం ఏర్పడింది. సుల్తాన్ బజార్‌లో శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయ స్థాపన జరిగింది. 1946 వరకు నిజాం రాజ్యంలో 11 ఆంధ్ర మహాసభలు జరిగాయి. తెలుగు భాష ఉద్యమానికి నిజాములు అడ్డుపడలేదు. తెలు గు భాషలో విద్యాబోధన కూడా జరిగింది. ఇప్పుడు తెలంగాణ సమావేశాలు పెట్టుకుందామన్నా సీమాంధ్ర సర్కారు అనుమతివ్వటం లేదు, కానీ అప్పుడు నిజాం రాజులు తెలుగు భాష ఉద్యమానికి సంబంధించిన సమావేశాలకు అనుమతి, అవకాశాలిచ్చారు.

23. కవులకు గుర్తింపు లేదు. ట్యాంక్ బండ్ విగ్రహాల ఏర్పాటులో వివక్ష.
ట్యాంక్‌బండ్‌పై మొత్తం 32 విగ్రహాలుంటే అందులో 24 సీమాంవూధులవే. శ్రీశ్రీ, జాషువా లాంటి వారు గొప్పవారే. కానీ జ్జానపీఠ్ అవార్డు అందుకోవటంతోపాటు ప్రభుత్వ ఆస్థాన కవిగా కూడా ఉన్న దాశరథిని ఎందుకు విస్మరించారు. కొమురంభీము పోరాట యోధునిగా ఎందుకు కనిపించలేదు. ట్రైబల్ కాకున్నా కోయ వీరుడి గా అల్లూరికి ఇచ్చిన గౌరవం కొమురంభీముకు దక్కిందా? చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి ఎందరో పోరాట యోధుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదు?

24. తెలుగు సినీ పరిక్షిశమ ఆంధ్రవాళ్ల చేతుల్లోనే ఉంది.
ఇది వెయ్యిపాళ్లు నిజం. దీనికి వేరే సాక్ష్యాలు, ఆధారాలు కూడా అవసరం లేదు. ఇప్పుడున్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు? జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న కృష్ణకు పద్మాలయ స్టూడియో పేరు మీద హైదరాబాద్‌లో భూమి ఇచ్చారు. నాగేశ్వర్‌రావు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడి యో, రామోజీరావు ఫిలింసిటీలకు స్థలం ఇచ్చారు. ఒక్క తెలంగాణ ప్రొడ్యూసర్‌కైనా ఈ ప్రోత్సహం దొరికిందా? సినిమాల్లో తెలంగాణ భాషను అవమానించటం లేదా? విలన్లు, కామెడీ యాక్టర్లకు తెలంగాణ యాస పెట్టి, హీరోలకు ఆంధ్ర యాస పెట్టుకోవడం ఎంత వరకు న్యాయం? నిన్న గాక మొన్న ‘జై బోలో తెలంగాణ’ సినిమా విడుదల కాకుండా ఎన్ని కుట్రలు చేశారు! సెన్సార్‌బోర్డును అడ్డుపెట్టుకుని ఎన్ని డ్రామాలాడారు. తెలంగాణకు చెందిన ఒక్క హీరోకైనా అవకాశాలు దక్కనిచ్చారా?
29. నిజాం పాలనలో తెలంగాణ ఆంధ్ర కంటే ఆర్థికంగా బలంగా ఉంది.

ఈ విషయాన్ని 101 అబద్ధాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సంజయ్‌బారు తండ్రి బీపీఆర్ విఠల్ స్వయంగా రాసిన ‘తెలంగాణ సర్‌ప్లస్’ అనే పుస్తకంలోనే వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చీఫ్ సెక్రెటరీగా పనిచేసిన విఠల్ 1956 నుంచి 1967 వరకు 62 కోట్ల ఆదాయాన్ని ఆంధ్రకు తరలించినట్లు అధికారికంగానే వెల్లడించారు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడకముందు హైదరాబాద్ రాష్ట్ర బడ్జెట్ 16 కోట్లయితే, ఆంధ్ర రాష్ట్రం బడ్జెట్ 8 కోట్లు. అంతెందుకు- కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు లేవు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇదే విషయాన్ని అక్కడి నాయకులు చెప్పి మరీ హైదరాబాద్‌తో


కలవాలని నిర్ణయించుకోలేదా?
34. నీటి పారుదల రంగంలో తెలంగాణకు అన్యాయం
61. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం దెబ్బతిన్నది.
కనీసం ఆంధ్ర ప్రాంత ప్రజలు, మేధావులు కూడా కాదనలేని వాస్తవం. ఆంధ్రవూపదేశ్ ఏర్పడకముందు నెల్లూరులో సంగం ఆనకట్ట, విజయవాడంలో ప్రకాశం బ్యారేజి, రాజమంవూడిలో ధవళేశ్వరం, కర్నూలులో కె.సి.కెనాల్, తుంగభద్ర కాల్వలు(అప్పటికి నీటి పారకం లేదు) మాత్రమే ఉండేవి. ఇందులో పెద్ద ప్రాజెక్టులుగా చెప్పుకునే ప్రకా శం బ్యారేజీ, ధవళేశ్వరం ప్రాజెక్టులను ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాతే కాటన్ కట్టిన పాత ప్రాజెక్టులను పెద్దగా చేశారు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత ఇటు కృష్ణ, అటు గోదావరి నదులపై అధికారికంగానే 20 దాకా ప్రాజెక్టులు కట్టారు. అనధికారికంగా హంద్రీనీవా లాంటి దొంగ ప్రాజెక్టులకు లెక్కేలేదు. పోతిడ్డిపాడు ద్వారా జరుగుతున్న జల దోపిడీ ఎంత? తెలంగాణలో మాత్రం ఉన్న చెరువులను నాశనం చేశారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నాశనం చేశారు. కనీసం పూడిక కూడా తీయకుండా అందులో నీరు నిల్వకుండా కుట్ర చేశారు. నాగార్జునసాగర్ లాంటి భారీ ప్రాజెక్టు కట్టినా ఎడమకాల్వకు మాత్రం నీరివ్వడం లేదు. సీమాంధ్ర ప్రాంతంలో కాల్వల ద్వారా మూడు పంటలకు నీరందుతుంటే, తెలంగాణ ప్రాంతంలో కాల్వలు లేవు. నీరు లేదు. కేవలం బావులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలి.

45. సీమాంవూధులు హైదరాబాద్‌ను దోచుకున్నారు
46. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నది.
దాన్ని తెలంగాణ అభివృద్ధికి వాడడం లేదు.
51. హైదరాబాద్‌లో మెజారిటీ పరిక్షిశమలు ఆంధ్రావారివే.
62. తెలంగాణ ప్రజలు పేదలు

హైదరాబాద్, రంగాడ్డి, మెదక్ జిల్లాల్లో పరిక్షిశమల పేర లక్షలాది ఎకరాలు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పేద రైతుల నుంచి అక్రమంగా భూములు గుంజుకున్నది, కాజేసిందీ సీమాంధ్ర పెట్టుబడిదారులే. ఇక్కడి జనానికి ఉపాధి కల్పించకుండా సీమాంవూధులకే ఉద్యోగాలు ఇచ్చారు. సెక్ర లాంటి అత్యున్నత ప్రభుత్వ కార్యాలయాల్లోనే సీమాంవూధులు తిష్ట వేశారు. సినీ, ఫార్మా, ఐటి కంపెనీలు, సెజ్‌లు దక్కించుకున్న దెవరు? వనరులు దోచుకున్నదెవరు? అరబిందో, దివిస్ ఫార్మా కంపెనీలు ఎవరివి? జివికెభగంధి మల్లికార్జునరావు, రామోజీరావు, రామానాయుడు, అక్కినేని, లగడపాటి, కావూరి ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువ అని వాదిస్తున్నారు! హైదరాబాద్, రంగాడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న ఆంధ్రా పెట్టుబడి దారుల సంపాదనంతా తెలంగాణ ప్రజల ఆదాయంలో జమచేసి చెబితే తలసరి ఆదాయం లెక్కలు ఎలా ఉంటాయి!

65 పెద్ద మనుషుల ఒప్పందం రాజ్యాంగబద్ధమైంది.
కర్నూలు అసెంబ్లీలో బెజవాడ గోపాలడ్డి, నీలంసంజీవడ్డి, గౌతులచ్చన్న లాంటి వారు మాట్లాడిన మాటలు, చేసిన తీర్మానాలే పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో వచ్చాయి. అంటే కర్నూలు అసెంబ్లీకి చట్టబద్ధత ఉన్నట్లే కదా. పెద్ద మనుషుల ఒప్పందానికి రాజ్యాంగబద్ధత లేదని వాదిస్తే వారిని కూడా అంగీకరించనట్లే కదా!
71. తెలంగాణ కోసం 750 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇది కూడా అబద్ధమని సీమాంధ్ర మేధావుల రూపంలో ఉన్న మూర్ఖులు వాదిస్తే ఏం సమాధానం చెప్పాలి.
73. తెలంగాణకు చెందిన ఏ ముఖ్యమంత్రి పూర్తి కాలం పనిచేయలేదు.

ఇది వాస్తవం కాదా? తెలంగాణకు చెందిన వారు పీవీ నర్సింహారావు, చెన్నాడ్డి, అంజయ్య మాత్రమే. పీవీ 13 నెలలు, అంజయ్య 18 నెలలు, చెన్నాడ్డి ఒకసారి 18 నెలలు, మరోసారి 13 నెలలు ముఖ్యమంవూతిగా చేశారు. కృష్ణా జిల్లాలో పుట్టి, పెరిగి, అక్కడే చదువుకుని ఉద్యోగం కోసం ఖమ్మం జిల్లాకు వచ్చి సత్తుపల్లి నుంచి పోటీ చేసిన జలగం వెంగళరావును కూడా తెలంగాణ ముఖ్యమంవూతిగానే లెక్క వేస్తున్నారు. ఇట్ల చెప్పుకుంటే పోతే, కేసీఆర్ అన్నట్లు రాస్తె రామాయణమంత. చెబితే బాగవతమంత. తెలంగాణవాదులు చేసే వాదనను నిర్వీర్యం చేయడానికి, చేతిలో ఉన్న మీడియాను వాడుకోవడానికి సీమాంధ్ర నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించవు.

-గటిక విజయ్ కుమార్
‘టీ న్యూస్’ ప్రిన్స్‌పల్ కరస్పాండెంట్

35

VIJAYKUMAR GATIKA

Published: Sun,February 2, 2014 01:56 AM

పెద్దల సభ స్ఫూర్తి...?

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన్మోహన్‌సింగ్, లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సుజనా చౌదరి, కనిమొళి, సుబ్బిరామిరెడ్డి, సీఎం రమేష్, హరిక

Published: Sun,October 6, 2013 01:48 AM

మన సాంస్కృతిక ప్రతీక

పెళ్లినాడు తద్దినం మంత్రమేంది’ అని విసుక్కోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తరు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు మనం

Published: Thu,January 3, 2013 01:44 PM

ఓరుగల్లు ఎందుకు?

ఉరుములేని మెరుపులా వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాకతీ

Published: Thu,November 8, 2012 02:22 AM

కాకతీయ ఉత్సవాలుపభుత్వ కుట్ర

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం... ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహి స్తాం. అంతర్జాతీయ స్థాయిలో సదస్సు

Published: Sat,October 6, 2012 03:18 PM

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట

సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరా

Published: Sat,October 6, 2012 03:18 PM

పతకాల వేటలో పతన బాట

విజయ్ కుమార్, మేరీ కోమ్, గగన్ నారంగ్, సైనా నెహ్వాల్...ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంతసేపు పొగిడినా.. ఎన్ని పేజీలు రాసినా... ఎన్ని బ

Published: Sat,October 6, 2012 03:19 PM

ఈ చైతన్యం కనబడదా?

సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి సరికొత్త పోరాట రూపాలను అందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు విలువను, పవివూతతను క

Published: Sat,October 6, 2012 03:19 PM

మేడారం నేర్పిన పాఠం

ఏదైనా కార్యం కోసం ఓ భారీ జన సమూహం ఒక్కచోట చేరితే.. వచ్చిన జనాల సంఖ్యను బట్టి అది విజయవంతమైందని చెప్పాలా? లేక వచ్చినజనం వెళ్లేటప్పు