ఓరుగల్లు ఎందుకు?


Thu,January 3, 2013 01:44 PM

ఉరుములేని మెరుపులా వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాకతీయ ఉత్సవాల ముగిం పు సందర్భంగా ఈ ప్రకటన చేశారు. నిజంగా వరంగల్ వాసుపూవరూ ఏ సందర్భంలోనూ ఓరుగల్లు పేరును డిమాండ్ చేయలే దు. అయినా సరే, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏదో ఒకటి చేశామని చెప్పుకోవడానికి పేరు మార్పు అం శాన్ని ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది.అంతే తప్ప పేరు మార్పుకు ఓ నిర్దిష్ట కారణం లేదు.

వాస్తవానికి వరంగల్‌కు ఓరుగల్లుకు పెద్దతేడా ఏమీలేదు.దేశంలోని వేరే నగరాల పేరు మార్పు కు వరంగల్‌కు ముడిపెట్టడం కూడా హేతుబద్ధంగా లేదు. చెన్నయ్, ముంబయ్, కోల్‌కతా లాంటి పేర్లు వందల ఏళ్ల నుంచి ఉన్నాయి. ఆయా నగరాల ప్రజలు మాట్లాడే తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఉన్న పేర్లవి. ఐరోపా దేశస్తులు మనదేశంలోకి వచ్చిన తర్వాత వాటి పేర్లను తమ భాషలకు అనుగుణంగా మార్చుకున్నారు. కడప, నెల్లూరు,రంగాడ్డి జిల్లాలకు కూడా వ్యక్తుల పేర్లుపెట్టాం కాబట్టి వరంగల్‌కు కూడా కాకతీయులు గుర్తొచ్చేలా ఓరుగల్లు పెడతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మరోమాట. అయితే దేశంలోని వేర్వేరు నగరాల పేరు మార్పు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల పేర్ల విషయంతో వరంగల్‌కు ముడిపెట్టడం ఎంత మాత్రం భావ్యంకాదు.

వరంగల్ పేరు వెనక చాలా చరిత్రే ఉంది. ప్రస్తుతం వరంగ ల్ కోట ఉన్న ప్రాంతంలో పెద్దశిల ఉంది. దాన్ని అంతా ఏకశిల అని పిలిచేవారు.అందుకే ఈ నగరానికి ఏకశిల అనే పేరు వచ్చిం ది. వరంగల్ కోటలో శిల్పాలు, కాకతీయ కీర్తి తోరణం చెక్కడానికి వచ్చిన వారంతా తమిళనాడు, కర్ణాటకకు చెందినవారు. వారు తమ భాషలో ఏకశిలా నరగాన్ని ఓరుగల్లు అని సంబోధించారు. ఓరు అంటే ఒకటి, గల్లు అంటే శిల. అందుకే ఏకశిల ను వారు ఓరుగల్లు అని పిలిచారు. అదే పేరును శాసనాల్లో రాశా రు. దీంతో ఓరుగల్లు పేరు స్థిరపడింది. అయితే చాలా శాసనాల్లో ఓరుగల్లుకు ముందు ఈ నగరాన్ని ఏకశిలా నగరమని, హనుమకొండ అని పిలిచేవారు అని ఉన్నది.

కాకతీయులు హనుమకొండ రాజధానిగా పాలించినప్పుడు ఈ నగరం పేరు హనుమకొండ. తర్వాత వరంగల్‌కు రాజధానిగా మార్చినప్పుడు దీని పేరు ఏకశిలా నగరం. అంటే చరివూతలో ఓరుగల్లుకు ఎంత పేరుం దో హనుమకొండ, ఏకశిలా నగరాలకు కూడా అంతే పేరుంది. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరువూదుడి కాలం లో ఓరుగల్లుగా పేరు స్థిరపడింది. తర్వాత వచ్చిన ఢిల్లీ రాజులు, హైదరాబాద్ నవాబులు కాలంలో ఓరుగల్లును ఓర్గల్‌గా పిలిచారు. తర్వాత కాలంలో ఓర్గాల్ వారాంగల్ అయింది. చివరికి వరంగల్‌గా స్థిరపడింది. వాడుకలో ఓరుగల్లు కన్నా వరంగల్ అని పలకడం తేలిక కావడం వల్లే పేరు మారింది తప్ప ఎవరో ఉద్దేశపూర్వకంగా మార్చింది కాదు. కాబట్టి వరంగల్ పేరు మార్చాల్సిన అవసరం లేదు. వరంగల్ పేరు మార్చదలిస్తే మరో మూడు ప్రాచీన పేర్లున్నాయి. ఓరుగల్లు ఒక్కటి ప్రత్యామ్నాయం కాదు.

కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ. పీవీ లాంటి ఉద్ధండులు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు,అసెంబ్లీ నియోజకవర్గం అది. కానీ డీ లిమిటెషన్‌లో హనుమకొండ పేరును ఎగరగొట్టి దానికి వరంగల్ వెస్ట్ అని పేరు పెట్టారు. హనుమకొండ పేరు మాసిపోయేలా ఎందుకు చేశారని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు. తాడ్వాయి మండలాన్ని మేడారం సమ్మక్క, సారలమ్మ మండ లంగా మార్చాలని జనం ఎప్పటి నుంచో కోరు తున్నారు. వైఎస్, సీఎం కిరణ్ కూడా మేడారం గద్దెల సాక్షిగా ఈ విషయంలో హమీ ఇచ్చారు. కాని తాడ్వాయి మండలం పేరు మారలేదు. ఎన్నో ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డ ఆంధ్రా వారి తో గుంటూరు పల్లెలు వెలిశాయి. ఇటీవల కాలంలో ఆయా గ్రామాలు పంచాయితీల ద్వారా పేరు మార్పు కోసం తీర్మానాలు చేశారు. గుంటూరు పల్లెలను కాకతీయనగర్, ఆదర్శనగర్, గాంధీనగర్, శ్రీనగర్‌లుగానో మార్చుకుంటూ ఈ తీర్మానాలున్నాయి. కానీ వాటి పేర్లను మార్చడం లేదు. ప్రజలు ఏది కోరుతున్నారో అది పట్టించుకోకుండా, అనవసర విషయాలను ముందుకు తేవడం ఎందుకు?

-గటిక విజయ్ కుమార్
టీ న్యూస్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్

35

VIJAYKUMAR GATIKA

Published: Sun,February 2, 2014 01:56 AM

పెద్దల సభ స్ఫూర్తి...?

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన్మోహన్‌సింగ్, లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సుజనా చౌదరి, కనిమొళి, సుబ్బిరామిరెడ్డి, సీఎం రమేష్, హరిక

Published: Sun,October 6, 2013 01:48 AM

మన సాంస్కృతిక ప్రతీక

పెళ్లినాడు తద్దినం మంత్రమేంది’ అని విసుక్కోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తరు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు మనం

Published: Thu,February 14, 2013 03:55 PM

నూటొక్క అబద్ధాలు.. ఓ పిచ్చి వాదన

‘తెలంగాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ పేరుతో సీమాంవూధులు ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు

Published: Thu,November 8, 2012 02:22 AM

కాకతీయ ఉత్సవాలుపభుత్వ కుట్ర

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం... ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహి స్తాం. అంతర్జాతీయ స్థాయిలో సదస్సు

Published: Sat,October 6, 2012 03:18 PM

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట

సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరా

Published: Sat,October 6, 2012 03:18 PM

పతకాల వేటలో పతన బాట

విజయ్ కుమార్, మేరీ కోమ్, గగన్ నారంగ్, సైనా నెహ్వాల్...ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంతసేపు పొగిడినా.. ఎన్ని పేజీలు రాసినా... ఎన్ని బ

Published: Sat,October 6, 2012 03:19 PM

ఈ చైతన్యం కనబడదా?

సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి సరికొత్త పోరాట రూపాలను అందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు విలువను, పవివూతతను క

Published: Sat,October 6, 2012 03:19 PM

మేడారం నేర్పిన పాఠం

ఏదైనా కార్యం కోసం ఓ భారీ జన సమూహం ఒక్కచోట చేరితే.. వచ్చిన జనాల సంఖ్యను బట్టి అది విజయవంతమైందని చెప్పాలా? లేక వచ్చినజనం వెళ్లేటప్పు

Featured Articles