పతకాల వేటలో పతన బాట


Sat,October 6, 2012 03:18 PM

విజయ్ కుమార్, మేరీ కోమ్, గగన్ నారంగ్, సైనా నెహ్వాల్...ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంతసేపు పొగిడినా.. ఎన్ని పేజీలు రాసినా... ఎన్ని బులెటిన్లు ప్రసారం చేసినా లండన్ ఒలింపిక్స్‌లో మిగిలింది ఈ పేర్లే. వీరైనా వ్యక్తిగత ప్రతిభ చూపబట్టి భారత్‌కు పతకాల పట్టికలో 50లోపునైనా చోటు దక్కింది. ఈసా రి అనేకాదు, ఎప్పుడు ఒలింపిక్స్ జరిగినా మన పతకాల సంఖ్యను లెక్కిం చడానికి ఒక చేతి వేళ్లు చాలు. మన ప్రభుత్వం క్రీడల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి ఈ పత కాలు కూడా రావడం అద్భుతమే అనిపిస్తోంది. మొత్తం ఒలింపిక్ చరిత్రలో స్వతం త్ర భారత్‌కు లండన్‌లో వచ్చినన్ని పతకాలు గతంలో ఎన్నడూ రాలేదు. గత ఒలింపిక్స్‌లతో పోల్చుకుంటే లండన్ ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధించినట్లే లెక్క. కానీ, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇప్పటిదాకా జరిగిన 26 ఒలింపిక్స్‌లలో 23 సార్లు భారత్ పాల్గొంది. సాధించిన పతకాల సంఖ్య 24. అది అమెరికా స్విమ్మర్ ఫెల్ఫ్స్ ఒక్కడే సాధించిన పతకాల సంఖ్య కన్నా కేవలం రెండు ఎక్కువ. మొత్తం ఒలింపిక్స్‌లో మనదేశం ఇప్పటిదాకా సాధించిన స్వర్ణ పతకాలు 9. ఫెల్ప్స్ ఒక్కడే సాధించిన బంగారు పతకాల్లో అవి సగం. లండన్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో 204 దేశాలు మొత్తం 900 పతకాల కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటిదాకా 61 దేశాలు పతకాల జాబితాలో చోటు సంపాదించుకుంటే అందులో మన స్థానం 42(ఒలింపిక్స్ ముగిసే నాటికి మన స్థానంలో కొంచెం మార్పు రావచ్చు). మొత్తం 26 క్రీడాంశాల్లో పోటీలు జరుగు తుంటే అందులో సగం పోటీల్లో మనకు ఆడేందుకు అర్హతే రాలేదు. ఎటొచ్చీ మనం షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీలపైనే మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నాం. వీటిల్లో దేంట్లో కూడా స్వర్ణం వస్తుందనే ఆశ మొదటి నుంచీ లేదు. దానికనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి కూడా.

గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయిలో pandu3 మంది క్రీడాకారులు ఈసారి ఒలింపిక్స్‌కు వెళ్లారు. ఇందుకోసం ప్రభుత్వం అక్షరాలా 2pandu కోట్ల pandu0 లక్షలు ఖర్చు చేసింది. ప్రైవేటు సంస్థలు మరో ఆరున్నర కోట్లు వెచ్చించాయి. కొత్తగా ఆశలు రేకిత్తించే వారితో పాటు గతంలో పతకాలు తెచ్చిన లియాండర్‌పేస్, అభినవ్ బింద్రా లాంటి వారు కూడా ఒలింపిక్స్ వెళ్లారు. అక్కడ వీరంతా ఏం చేశారో మనం చూశాం. ఈవెం ట్లలో ఒక్కొక్కరూ వెనుదిరుగుతుంటే ఈ మాత్రం దానికి ఎందుకు పోయినట్లు అని నిట్టూర్పువిడుస్తాం. కానీ పతకాలు రాకపోవడానికి క్రీడాకారులు ఎంత వరకు బాధ్యులనే ప్రశ్న మనం వేసుకోవాలిప్పుడు. 1927లో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి మనం క్రమం తప్పకుండా ఒలింపిక్స్ ఆడుతున్నాం. ఒలింపిక్స్ మొదట్లో భారత్‌కు హాకీ ఆటతో ఎంతో పేరొచ్చింది. 192panduలో భారత హాకీ జట్టు మొదటిసారి స్వర్ణం సాధిం చింది. అప్పటి నుంచి వరుసగా ఆరు ఒలింపిక్స్‌లో హాకీ జట్టు బంగారు పతకాలను భారత్‌కు మోసుకొచ్చింది. 1956 తర్వాత కూడా మరో రెండు ఒలింపిక్స్‌లో భారత్ కు హాకీలో స్వర్ణాలు వచ్చాయి. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ కావడానికి ధ్యాన్‌చంద్ కారకుడు. మొత్తం ఒలింపిక్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ భారత ప్రాతినిధ్యం అదే మరి. అంతకుమించి మరే ఆటలోనూ భారత్ ఇప్పటి దాకా స్థిరంగా రాణించలేదు. ఈ ఒలింపిక్స్‌లో అయితే పతకం మాట అటుంచి అస లు అర్హత సాధించడమే గొప్ప విజయమైపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే హాకీ తో పాటే ఒలింపిక్స్‌లో మన స్థానం కూడా పడిపోయింది.

ఒలింపిక్స్ ప్రస్తావన వస్తే చాలు చైనా పేరు వినిపిస్తుంది. ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడా వేదికల్లో పతకాల పంట పండించడానికే చైనా ప్రభుత్వం 4,500 కోట్లు ఖర్చు చేసి మండారిన్ మిషన్ పేరుతో క్రీడాకారులకు సుదీర్ఘ శిక్షణ ఇస్తుంది. పిల్లలు పుట్టిన మూడేండ్ల నుంచే టాలెంట్ ఐడెంటిఫికేషన్ స్ట్రాటెజీ అమలు చేస్తోంది. అంటే ఏ శిశువు ఏ ఆట ఆడిస్తే రాణిస్తాడో పసిప్రాయంలోనే గుర్తించి ప్రభుత్వమే దత్తత తీసుకుని శిక్షణ ఇస్తుంది. ఇలా శిక్షణ ఇచ్చిన వారిలో 4 లక్షల మందిని ఒలింపిక్స్ జరగడానికి నాలుగేళ్ల ముందే శిక్షణా శిబిరాలకు తరలించి ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తుం ది. ఇలాంటి ఇంటిన్సివ్ కోచింగ్ సెంటర్లే చైనాలో మూడువేలున్నాయి. మూడేళ్ళ పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసినా వారు శిక్షణకు వెళ్లి తీరాల్సిందే. అది అక్కడి రూల్. మనదేశంలో ప్రభుత్వ నిర్వాకం చూస్తే 14లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్‌లో క్రీడల కోసం వెచ్చిస్తోంది కేవలం 720 కోట్లు. లక్ష కోట్లు పైబడిన రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడల కోసం కేటాయించింది కేవలం 220 కోట్లు. అందులో రెండొందల కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు పోతే నికరంగా మిగిలేది 20 కోట్లు. పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కోచింగ్ సెంటర్ల వ్యవస్థ దేశంలో లేనేలేదు.

స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌ను ఓ సబ్జెక్టుగా పెట్టాలని ఎంతో కాలం నుంచి ప్రతిపాదన ఉన్నా అదీ అమలు కాదిక్కడ. అసలు మనదేశంలో క్రీడలను ఓ ప్రొఫెషన్‌గా చూడ రు. కనీసం ప్రభుత్వం క్రమం తప్పకుండా పోటీలు కూడా నిర్వహించదు. స్వచ్చంద సంస్థలు నిర్వహించే టోర్నమెంట్స్ మాత్రమే దిక్కు. ప్రతీ ఏటా స్కూల్ గేమ్స్ నిర్వహించినా అదీ నామమాత్రమే. పిల్లలకు కనీసం ట్రెయినింగ్ ఇవ్వరు. పోటీలకు వెళ్లే పిల్లలకు బస్‌చార్జీలు కూడా ఇవ్వరు. ఎవరికైనా క్రీడల పట్ల ఇంట్రస్ట్ ఉంటే సొంత ఖర్చులతో నేర్చుకోవాల్సిందే. ఆసియన్ గేమ్స్, ఆఫ్రో ఏసియన్ గేమ్స్ నిర్వ హించినప్పుడు కట్టిన స్టేడియాలను కనీసం మెయింటెయిన్ చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అలాంటి స్టేడియాల్లో క్రీడాకారులే ఖర్చు భరించే విధంగా ప్లే అండ్ పే పాలసీ అమలు చేస్తోంది ప్రభుత్వం. ఎంతో ఆర్థిక స్థోమత ఉంటే తప్ప సొంతంగా నేర్చుకుని ఒలింపిక్స్ దాకా వెళ్లడం సాధ్యం కాదు. అందుకే క్రీడల పట్ల ఎంత ఇంట్రస్ట్ ఉన్నా ఏదో ఓ ఉద్యోగం సంపాదించడానికి స్టేట్ లెవల్, నేషనల్ లెవల్ వరకు మాత్రమే ఆటలు ఆడుతున్నారు. ఉద్యోగం రాగానే చాలా మంది ప్రతిభా వంతులైన పేదవారు ఆగిపోతున్నారు.

ఒలింపిక్‌కు ఒలింపిక్‌కు మధ్య ప్రతీ దేశం ఎంతో అప్‌డేట్ అవుతోంది. ఒక ప్పు డు మట్టిలోనే ఎక్కువ ఆటలు ఆడేవారు. కానీ ఇప్పుడు ఒక్క ఆట కూడా మట్టిలో ఆడడం లేదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు కూడా సింథటిక్ ట్రాక్ మీదే. కానీ మన దేశంలో క్రీడాకారులంతా మట్టిలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. బురదలోనే పరుగు తీస్తు న్నారు. పాతకాలం నాటి ఎక్విప్‌మెంట్‌తోనే కుస్తీలు పడుతున్నారు. లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో లేదు. అది సొంతంగా కొనే ఆర్థిక స్థోమత పేదలున్న దేశంలో సాధ్యం కాదు. షటిల్ నుంచి స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, వాలీబాల్ వరకు అన్ని క్రీడలు ప్రస్తుతం ఇండోర్‌లోనే ఆడుతున్నారు. మన దేశంలో కనీసం జిల్లాకో ఇండోర్ స్టేడియం కూడా లేదు. ఇండోర్ స్టేడియం ఉన్నచోట ప్రభుత్వం కరెంటు చార్జీలు కూడా భరించదు. స్వీపర్‌ను కూడా పెట్టదు. అందుకే చాలా స్టేడియాలు ఇప్పుడు ప్రైవేటు ఫంక్షన్ హాళ్లుగా మారుతున్నాయి. ఒలింపిక్స్‌లో ఎనిమిదిసార్లు స్వర్ణం అందుకు న్న ఆట హాకీ . ఇప్పుడా ఆటను సింథటిక్ కోర్టుల్లో ఆడుతున్నారు. జిల్లా కేంద్రాల్లో సింథటిక్ కోర్టులు లేవు. హాకీ ఆడేవాళ్ళు మట్టిలో బొర్లుతున్నారు. వీరు ఒలింపిక్స్‌కు అర్హత ఎలా సాధిస్తారు. ప్రతీ క్రీడకూ, క్రీడా కారుడికీ కోచ్ కావాలి. కానీ మన స్పోర్ట్స్ పాలసీలో కోచ్ ఉద్యోగాలే ఉండవు.

ఒలింపిక్స్ లాంటి పోటీలకు తయారయ్యే క్రీడాకారులకు దాదాపు అన్ని దేశాల్లో వ్యక్తిగ త కోచ్‌తో పాటు, సైకాలజిస్ట్, ఫిజియోథెర పి స్టు తదితరులు ఉంటారు. ఒలింపిక్స్‌కు నాలుగేళ్ల ముందు నుంచే ఇంటెన్సివ్ కోచింగ్ ప్రారంభిస్తారు. కానీ మనకు అంత సీన్ లేదు. ఎవరి ఎక్విప్‌మెంట్ వారే కొనుక్కోవాలి. ప్రభుత్వం మొక్కుబడిగా ఒలింపి క్స్‌లో ఎంపికైన వారి కోసం నెలో రెండు నెలలో ట్రెయినింగ్ క్యాంపు పెడుతుందంతే. అందుకే ఒకసారి పతకం తెచ్చిన వారు కూడా మరోసారి అంతే ప్రతిభ చూపలేకపోతు న్నారు. చాలా దేశాలు తమ దేశంలోని క్రీడాకారుల ప్రతిభకు సానబెట్టడంతో పాటు ఇతర దేశాల క్రీడాకారుల ఆటలను కూడా నిశితంగా గమనిస్తాయి. ఇందుకోసం ప్రత్యేక విశ్లేషకులు ఉంటారు. వారి బలాలు, బలహీనతలు అంచనావేసి పోటీకి సిద్ధమవుతారు. దేశాల మధ్యే కాదు. ఒకేదేశంలోని ఇద్దరు క్రీడాకారుల మధ్య కూడా అలాంటి పోటీయే ఉంటుంది. స్విమ్మింగ్‌లో స్వర్ణాల పంట పండించే ఫెల్స్ప్‌కు సొంత దేశం అమెరికాలోనే మరో స్విమ్మర్ పోటీగా మారాడు. జమైకా పరుగువీరుడు బోల్ట్‌కు అదే దేశం నుంచి బ్లేక్ పక్కలో బల్లెమై కూర్చున్నాడు. చివరికి బాడ్మింటన్ కూడా వరల్డ్ నంబర్‌వన్ స్థానాలకు చైనా దేశస్తుల మధ్యే భీకరపోరు నడిచింది. ఒక ఒలిం పిక్‌లో తాము సాధించిన రికార్డును మరో ఒలింపిక్‌లో తామే బద్దలు కొట్టుతుంటే తదుపరి ఒలంపిక్స్‌లో తమకు స్థానం కూడా ఉండదనే భయం ఇతర దేశాల క్రీడా కారులను పరుగు పెట్టి స్తుంది. ఇప్పటి నుంచే సాధన చేయకుంటే 2016లో బ్లేక్ తనను ఓడించే ప్రమాద ముందని వరల్డ్ రికార్డుతో వందమీటర్ల స్వర్ణం అందుకున్న బోల్ట్ చెప్పిందం దుకే.

కాంపిటీటివ్ స్పిరిట్ మనకు కనిపించదు. ఒక్కసారి నేషనల్ చాంపియన్ అయితే చాలు. ఏండ్ల తరబడి ఢోకా ఉండదు. మనదేశంలో మరొకరు పుట్టుకు రారనే గట్టి నమ్మకమే ఉదాసీనతకు దారితీస్తుంది. టెన్నిస్ క్రీడాకారుల ధిక్కార స్వరానికీ కారణమదే. ప్రభుత్వం పట్టించుకోకున్నా అక్కడక్కడా మట్టిలో మాణిక్యాలు పుడుతూనే ఉన్నారు. పీటీ ఉష నుంచి మొన్నటి కరణం మల్లీ శ్వరి దాకా. నేటి సైనా నెహ్వాల్, విజయ్‌కుమార్, గగన్ నారంగ్, మేరీ కామ్ వరకు అంతా ఆ కోవకే చెందుతారు. వీరంతా వ్యక్తిగత ప్రతిభ చూపి దేశ పరువు నిలిపిన వారే. వీరికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందింది అంతం త మాత్రమే. కానీ పతకం గెలిచిన తర్వాత మాత్రం పోటీలు పడి కోట్లకు కోట్లు కుమ్మరించి ప్రచార ఆర్భాటం చేస్తుంది ప్రభుత్వం. టెండూల్కర్ క్రికెట ర్ కావడానికి సర్కారు చేయూత అందించ లేదు. కానీ పేరు వచ్చాక అతనికి రాజ్యసభ పదవి ఇచ్చింది. భారతరత్న కోసం ప్రయత్నిస్తోందియకికెట్ పట్ల జనానికున్నఅభిమానాన్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వెనక ఉన్న రాజకీయం అది. అదే మూడు సార్లు స్వర్ణం అందించిన ధ్యాన్‌చంద్‌కు ఆ గౌరవం దక్కలేదు. కారణం క్రికెట్‌కు ఉన్న ఆకర్షణ హాకీకి లేకపోవడమే. ప్రభు త్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలో అవలంబిస్తున్న విధానాలు చివరికి విశ్వవిజేతలకు కూడా కోపం తెప్పిస్తోంది. అందుకే పతకం గెలిచిన వెంటనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దేశం తమను ఓన్ చేసుకుంటున్నా, తమకు మొదట్లో జరిగిన నిరాదరణను నెమరువేసుకుని రగిలిపోతున్నారు. అభివన్ బింద్రా లాంటి షూటర్లు పతకం రావడం తన వ్యక్తిగత ప్రతిభ తప్ప ప్రభు త్వం చేసిందేమీ లేదని చెప్పడం వెనక ఎంతో అసహనం ఉంది. హిమాచల్ ప్రదేశ్ సర్కార్ గానీ, ఆర్మీ గానీ తనను గుర్తించలేదన్న ఒలింపిక్ రజతం సాధించిన షూటర్ విజయ్‌కుమార్ అసంతృప్తీ అందుకే. 45 అంతర్జాతీయ పతకా లు సాధించిన ఆయన ఆర్మీలో ఇప్పటికీ పోలీస్‌శాఖలో హెడ్ కానిస్టేబుల్‌కు సమానమైన సుబేదార్ పోస్టులోనే ఉన్నాడు. ఈ అసంతృప్తులు కూడా ఉత్సాహ వంతులను నీరుగార్చడం లేదు. సర్కారు సాయం చేయకున్నా ఇంకా దేశంలో లక్షల సంఖ్యలో క్రీడాకారులు తయారవుతూ నే ఉన్నారు. చైనా స్థాయిలో కాకపోయినా ఇక్కడి చిన్నారులు కూడా లేత ఎముకల ను కష్టపెడుతూనే ఉన్నారు. సరైన పోషకాహారం లేకు న్నా సమరానికి సిద్ధమవుతు న్నారు.. మద్యాన్ని ఎంఆర్పీ రేట్లకు అమ్మడంలో శ్రద్ధ చూపిస్తున్న సర్కార్ పిల్లలకు రోజూ ఓ పావుసేరు పాలుపోస్తే మనమూ విశ్వ విజేతలమవుతాం.

-గటిక విజయ్‌కుమార్
ప్రిన్సిపల్ కరస్పాండెంట్, టీ న్యూస

35

VIJAYKUMAR GATIKA

Published: Sun,February 2, 2014 01:56 AM

పెద్దల సభ స్ఫూర్తి...?

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన్మోహన్‌సింగ్, లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సుజనా చౌదరి, కనిమొళి, సుబ్బిరామిరెడ్డి, సీఎం రమేష్, హరిక

Published: Sun,October 6, 2013 01:48 AM

మన సాంస్కృతిక ప్రతీక

పెళ్లినాడు తద్దినం మంత్రమేంది’ అని విసుక్కోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తరు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు మనం

Published: Thu,February 14, 2013 03:55 PM

నూటొక్క అబద్ధాలు.. ఓ పిచ్చి వాదన

‘తెలంగాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ పేరుతో సీమాంవూధులు ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు

Published: Thu,January 3, 2013 01:44 PM

ఓరుగల్లు ఎందుకు?

ఉరుములేని మెరుపులా వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాకతీ

Published: Thu,November 8, 2012 02:22 AM

కాకతీయ ఉత్సవాలుపభుత్వ కుట్ర

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం... ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహి స్తాం. అంతర్జాతీయ స్థాయిలో సదస్సు

Published: Sat,October 6, 2012 03:18 PM

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట

సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరా

Published: Sat,October 6, 2012 03:19 PM

ఈ చైతన్యం కనబడదా?

సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి సరికొత్త పోరాట రూపాలను అందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు విలువను, పవివూతతను క

Published: Sat,October 6, 2012 03:19 PM

మేడారం నేర్పిన పాఠం

ఏదైనా కార్యం కోసం ఓ భారీ జన సమూహం ఒక్కచోట చేరితే.. వచ్చిన జనాల సంఖ్యను బట్టి అది విజయవంతమైందని చెప్పాలా? లేక వచ్చినజనం వెళ్లేటప్పు