మతి తప్పిన తలకిందుల మేధో మథనం


Sat,October 6, 2012 04:07 PM

-ఎన్. వేణుగోపాల్కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏ ఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి ఉండేది. మనకు తెలియనిది లేనిది అనుకోవడం మన ఆత్మసంతృప్తికి ఉపయోగపడు తుందేమో గాని, రచయితా, మేధావీ కాదలుచుకున్న వారికి శోభించదు. తాను వ్యాఖ్యానించదలుచుకున్న విషయం మీద కనీస పరిజ్ఞానమైనా ఉండాలి.

గడ్డిబొమ్మను తయారుచేసి దాన్ని విరగ్గొట్టి గెలిచానని భ్రమపడడం ఒక బాల్య చేష్ట. పిల్లల్లో అది అమాయకత్వం కావచ్చు గానీ, వయసు ముదిరినా వదలకపోతే అది మానసిక వికారం. ప్రత్యర్థి ఆలోచనలను ఉన్నవి ఉన్నట్టుగా కాక, తాను అనుకున్నట్టుగా చిత్రించి , వాటిని ఓడించానని మురిసిపోవడం ఈ మానసిక వికారంలో ప్రధానం.

తెలుగులో జాహ్నవి (మంచి నదిపేరు పెట్టుకున్నారు గాని ఆ ప్రవాహ స్వభావం, స్వచ్ఛత లేకపోగా, ఆజ్ఞానం, బుకాయింపు వెరసి వర్థిల్లుతున్న రచయిత-ఎబివిఆర్ గా మిగిలిపోయారు ) అనే ఒక అజ్ఞాత రచయిత ఈ మానసిక వికారాన్ని ప్రదర్శిస్తూ దాదాపు రెండు సంవత్సరాలుగా చాలా హాస్యాన్ని సృష్టిస్తున్నారు. అయిన్ రాండ్ వంటి రచయితలను మక్కీకి మక్కీ తెలుగులో దంచు తూ సోషలిజం, ప్రభుత్వం, ప్రగతిశీల భావజాలం, సామాజిక బాధ్యతవంటి భావనలకు తాను తయారుచేసుకున్న గడ్డిబొమ్మలను తానే బద్దలు కొట్టి ‘చూశారా! ఎవరూ చేయని ఎంత గొప్ప పని చేశానో’ అని విర్రవీగుతున్నారు.

సోషలిజం మీద, ఇతర అంశాల మీద ప్రదర్శిస్తున్న ఆ అజ్ఞానమూ బుకాయింపులూ అలా ఉండగా, ఇప్పుడాయన తెలంగాణ మీద తన అమూల్యాభివూపాయాలను (అమూల్య అంటే వెలకట్టలేని, విలువైన అని కాదు, విలువ లేని చెత్తసరుకు అని ) ప్రకటించారు. నిండా వందవాక్యాలు లేని ఈ వ్యాసం అనబడే వంటకంలో రెందువందల అబద్దాలనుకూర్చి బుకాయించడం అయనకే చెల్లింది. ‘తాత్విక కోణంలో తెలంగాణ’అని గంభీరమైన శీర్షిక ఇచ్చుకున్న ఈ రచనలో అసలు బండి మొదటినుంచీ గాడితప్పి నడిచింది. నిజాలు రాయాలనే నియమం పెట్టుకోకపోవడం వల్ల కూడా అబద్దాలూ, బుకాయింపులూ మొదలయ్యాయి. ‘వాస్తవిక ఆధార హేతుబద్ధ స్వేచ్ఛా తాత్వికత’ (జాహ్నవి దృష్టిలో అది పెట్టుబడిదారీ ఆలోచనా విధానం కావచ్చు )వాస్తవ భౌతిక ప్రపంచాన్ని ప్రాథమికమని నమ్ముతుందట.

మనిషి స్పృహ, చైతన్యం, వాస్తవ ప్రపంచానికి సంబంధించే ఉంటాయని నమ్ముతుందట. కానీ‘ సమసమాజ సమతావాదం’ ‘సమ సమాజ తాత్వికత’. ‘సోషలిస్టు భావజాలం’ మాత్రం మనిషి చైతన్యమే ప్రాథమికమని అనుకుంటుందట. సృష్టిని మనిషి నిజమనుకుంటే నిజం, మాయ అనుకుంటే మాయ అని ఈ తాత్వికత అనుకుంటుందట. ఇంతటి అబద్ధాలనూ బుకాయింపులనూ రాస్తే ఎవరైనా నవ్విపోతారని కూడా ఈ రచయితకు అనిపించినట్టు లేదు. తత్వశాస్త్రంలో భావవాదం, భౌతికవాదం అని రెండు శాఖలున్నాయనీ, సమసమాజ తాత్వికత మౌలికంగా భౌతికవాదమనీ, అంటే ఆ తాత్వికత భౌతిక ప్రపంచం మీద ఆధారపడిందనీ, దాని మీద అభివృద్ధి చెందిన గతి తార్కిక భౌతికవాదం పదార్థాన్ని ప్రాథమికంగా గుర్తిస్తూనే, చైతన్యానికి తగిన స్థానం ఇస్తుందనీ, తత్వశాస్త్రం మీద ఏ ప్రాథమిక పుస్తకం చదివినా తెలిసిపోయే విషయాన్ని తలకిందులుగా చదవగల నేరు జాహ్నవిది.

ఆ నేర్పుతో, అంటే ఉన్నది లేనట్టూ, లేనిదీ ఉన్నట్టూ భావించగల, రాయగల నేర్పుతో తెలంగాణ మీద, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల మీద అవాకులూ చెవాకులూ రాయడానికి జాహ్నవి సాహసించారు. అడ్డదిడ్డమైన వాదనలు, అవాస్తవాలను వాస్తవాలుగా భ్రమింపజేయడానికి ప్రయత్నించడం, కనీస వాస్తవ స్పహ లేకపోవడం వంటి ఎన్నో సర్కస్ ఫీట్లతో సాగిన ఈ వ్యాసాన్ని తాగుబోతుల ప్రార్థనతో ప్రారంభించడం గొప్ప కవితా న్యాయం. వ్యాసం ఏమి చెప్పబోతున్నదో రచయిత ముందే చాలా సముచితంగా చెప్పారన్నమాట. కావాలంటే పాఠకులు ‘ఎమితిని సెపితివి కపితము, బెమపడి ఎర్రి పుచ్చకాయ మరి తిని సెపి తో, ఉమెతకాయ తిని సెపితో’ అని తెనాలి రామకృష్ణుడిని కూడా పిలుచుకోవచ్చు. ఈ వ్యాసంలో ప్రతి వాక్యమూ ఒక అబద్ధమో, బుకాయింపో గనుక ప్రతి వాక్యానికీ ఖండన, సవరణ, వివరణ అవసరమవుతాయి. ఇక్కడ ప్రధానమైన వాదనలకు మాత్రమే పరిమితమవుతాను.

‘భౌగోళికంగా కృష్ణా, గోదావరి డెల్టాలు వేరు, పీఠభూమయిన తెలంగాణ వేరు. ఇదెవరూ మార్చలేని వాస్తవం. పండించగలిగే పంటలు వేరు, భూమి స్వభావం వేరు’ అని,‘గోదావరికి కాలడ్డం పెట్టి సాగునీరు పారిస్తామని డాంబికాలు పలికారని’ అంటూ మొత్తం మీద తెలంగాణ సమస్య భౌగోళికమైనదని, అందువల్ల ఎవరూ ఏమీ చేయలేరని జాహ్నవి తేల్చారు. ఈ అబద్ధానికి ఎన్నో స్థాయిలలో జవాబు చెప్పవచ్చు. తెలంగాణ మొత్తం ఒకే తలంగా పీఠభూమిగా లేదు. సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తు నుంచి 1200 అడుగుల ఎత్తు వరకూ ఉన్న స్థలాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ భూభాగం నుంచే కృష్ణకూ, గోదారికికీ ఎన్నో ఉపనదులు ప్రవహిస్తున్నాయి. ఈ పరీవాహక ప్రాంతంలోని ఉపనదుల మీదనైనా, కృష్ణ, గోదావరి నదుల మీదనైనా వాటా అడిగే అధికారం, హక్కు తెలంగాణకు సంపూర్ణంగా ఉంది. అన్నిచోట్లా భూమ్యాకర్షణతో పల్లానికే ప్రవహించే అవకాశం లేకపోతే, ఎటువంటి సాంకేతిక విధానాన్ని ఉపయోగించాలో ఆలోచించవచ్చు. కాని ఇది భౌగోళికం కనుక చేయలేం అని ఊరుకోదలుచుకుంటే అసలు నాగరికతే ముందుకు సాగేది కాదు.

ఇక జాహ్నవి సహజంగా అవకాశాలు ఉన్నాయని నమ్మింపజూస్తున్న కృష్ణా, గోదావరి డెల్టాలు 1950కి ముందు ధవళేశ్వరం, బెజవాడ ఆనకట్టలు కట్టకముందు ఎలా ఉన్నాయో, సరిగ్గా అప్పుడు హైదరాబాద్ రాజ్యంలో నీటి పారుదల సౌకర్యాలు, వ్యవసాయ సౌభాగ్యం ఎలా ఉన్నాయో, ఒక్కసారి ఆర్థర్ కాటన్ రాసిన ఉత్తరాలు, వ్యాసాలు చూస్తే తెలుస్తుంది. కనుక జాహ్నవి అన్నట్టు ‘అది ఎవరూ మార్చలేని వాస్తవం’ కాదు. సామాజిక న్యాయ భావనలు, సుపరిపాల న విధానాలు, న్యాయమైన జలవనరుల పంపిణీ విధానాలు, నీటిపారుదల విధానాలు, పంటల పద్ధతులు ఉంటే తెలంగాణ రాజనాలు పండే మాగాణం. కాకతీయుల నాటి నుంచి ఇరవయో శతాబ్ది తొలి రోజుల వరకూ కనీసం ఏడువందల సంవత్సరాల రుజువయిన వాస్తవమది.

ఇక తెలంగాణ ప్రాంతంలో శతాబ్దాలపాటు ఆధునిక విద్యావ్యవస్థ, స్వేచ్ఛల్లేని నిజాం పాలన ఉందని, ‘సీమాంధ్ర’ ప్రాంతాలు వంద సంవత్సరాలు బ్రిటిష్ విద్యావ్యవస్థ, చట్టబద్ధ పాలనలో ఉన్నాయని, అవి ‘విస్మరించజాలని వాస్తవాలని’ని జాహ్నవి అంటున్నారు. ఇందులో ఒక కుటిల వాదన వంద సంవత్సరాల ‘సీమాంవూధ’ను శతాబ్దాల తెలంగాణను పోల్చడం. ఈ రెంటికీ పోలిక లేదు. ఇక ఆ వంద సంవత్సరాలలో హైదరాబాద్ రాజ్యంలో కూడా బ్రిటిషిండియాలో వచ్చిన విద్యా, వైద్య, తంతి, తపాలా, రైల్వే, ప్రజారవాణా, పాలన వ్యవస్థలన్నీ తరతమ భేదాలతో వచ్చాయి. హైదరాబాద్ ఆధునిక నగరంగా అప్పుడే అభివృద్ధి చెందింది. కాకపోతే ఇక్కడ పాలన రాచరికం గనుక, ఆ రాచరికం భూస్వామ్యం మీద ఆధారపడింది గనుక గ్రామీణ ప్రాంతాలలో ఆధునికత ప్రవేశించడానికి ఆటంకాలుండేవి.

సరే, ఆ చరివూతను అలా ఉంచినా, ఇవాళ మాట్లాడుతున్నది ఆ ఆధునిక పూర్వపాలన అయిపోయిన అరవై సంవత్సరాల తర్వాత. ఈ అరవై సంవత్సరాలలో ఆ చారివూతక అసమానతను సరిదిద్దడానికి ఏం చేశారు?విస్మరించజాలని వాస్తవం ఎన్ని దశాబ్దాల ‘ప్రజా పాలన’లోనైనా అలాగే విస్మరించజాలకుండా ఉండిపోతే ఏం మారినట్టు? పాలకులు ఏం బాధ్యత పడినట్టు?ఇక పెద్దమనుషుల ఒప్పందం గురించి, ‘ఒకే పార్టీలోని పెద్దమనుషులు తమ లో తాము రాసుకున్న ఒప్పందం’ అని జాహ్నవి అంటున్నారు. చరిత్ర తెలియని ఈ పెద్దమనిషి అభేద్యమైన అజ్ఞానానికి ఏం జవాబు చెప్పగలం? ఫజల్ అలీ కమిషన్ సమైక్య రాష్ట్రం గురించి తెలంగాణలో ఉన్న భయ సందేహాలను ప్రస్తావించి, స్కాట్లండ్‌కు ఇంగ్లండ్ ఇచ్చిన లాంటి హామీ కూడా ఇక్కడ ఉపయోగపడదని కూడా చెప్పిన తర్వాత, నిజంగానే ‘ఒక పార్టీలోని పెద్దమనుషులే’ కుట్రపూరితంగాఈ పెద్దమనుషుల ఒప్పందం రాశారనుకుందాం.

కాని అది ఆ పెద్దమనుషులకే పరిమితమైపోలేదు. అది పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. దాని ఆధారంగా చట్టాలు, వ్యవస్థలు, పద్ధతులు తయారయ్యాయి. ఇప్పుడడుగుతున్న ప్రశ్న ఆ చట్టాలను, వ్యవస్థలనూ, పద్ధతులను ఉల్లంఘించినవావరు? ఆ ఉల్లంఘనలకు పరిహారం ఏమిటి? ఆ ఉల్లంఘనలను ఈ యాభైనాలుగు ఏళ్లలో కనీసం డజనుసార్లు ఎత్తిచూపితే, ప్రతిసారీ మరొక కొత్త వాగ్దానం వచ్చి, అదీ ఉల్లంఘన జరిగింది గదా! ఇక మరొక వాగ్దానం వద్దు, విడిపోక తప్పదు అని తెలంగాణ సమాజం నినదిస్తుంటే, ఆ వాగ్దానాలను ఉల్లంఘించిన వారిని జాహ్నవి తప్పుపట్టడం లేదు. ఆయనకు కనీస న్యాయభావన ఉన్నదా లేదా?

నిజానికి ఆ వాగ్దానాలన్నీ ‘రక్షణ కోసం చూపే విచక్షణాధికారాలు’ అంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు పని చేసిన తాత్వికత. అవి తప్పనిసరిగా అమలులోకి రావలసింది. దాన్ని తూట్లు పొడిచినది ఆరు దశాబ్దాల ఆంధ్రవూపదేశ్ పాలకవర్గాలు, అందులో కోస్తా, రాయలసీమ పాలకవర్గాలతో పాటు, వారికి దళారీలుగా మారిన తెలంగాణ పాలకులు కూడా ఉన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం వారి మీద కూడా విమర్శ ఎక్కుపెడుతూనే ఉన్నది.
ఉద్యోగాల దోపిడీ? అదేమన్నా బంగారమా దోచుకోవడానికి’ అని వెటకరిస్తున్నారు జాహ్నవి. ఆయనే తన అవసరం కోసం ఊటంకించిన తెలంగాణ వెనుకబాటుతనం వల్ల, తెలంగాణ ప్రజలను ఇతరులు మోసం చేయకుండా ఉండడానికి ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్‌గా, ఇన్నాళ్లూ అవకాశాలు నిరాకరించబడిన వాళ్లకు అవకాశాలు కల్పించే చర్యగా, స్వయంపాలన ఆదర్శంగా (ఈ ఆదర్శంతోనే మద్రా సు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది) స్థానికులకు ఉద్యోగాలు అనే ఆలోచన వచ్చింది.

స్థానికులకు ప్రత్యేకించబడిన ఉద్యోగాలను స్థానికేతరులు కబ్జా చేస్తే అది కచ్చితంగా దోపిడీనే. ఎంత తాత్విక కోణంలో చూసినా దోపిడీ, దోపిడీ కాకుండా పోదు. ‘వాస్తవం’, ‘వాస్తవం’ అంటూ జాహ్నవి ఒక ఇరవయ్యో ముప్ఫయో చిట్టా రాశారు. అవన్నీ కళ్లముందరి చరివూతకు తప్పుడు వ్యాఖ్యానాలు. బహుశా వాటి ముందర ‘అ’ చేర్చాలని మరిచిపోయినట్టున్నారు. లేదా అవే వాస్తవాలనే భ్రమలో ఉన్నట్టున్నారు. మచ్చుకు ఆ వాస్తవాలు ఒకటి రెండు చూద్దాం.

2004 ఎన్నికల ఒప్పందంలో రెండో ఎస్సార్సీకి ఒప్పుకుని ఇరుపక్షాలు సంతకాలు పెట్టాయట. అబద్ధాలు ఆడడానికైనా ఒక పరిమితి ఉంటుంది. ఎవరికీ దొరకని ఈ ఒప్పందమేదో జాహ్నవి బయటపెడితే బాగుండును. ఇతరులకు ఇప్పటికి 2004 ఎన్నికల పొత్తుకు సంబంధించి తెలిసినవి మూడే మూడు అక్షరబద్ధమైన విషయాలు- 2004 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక, 2004 యుపిఎ కనీస ఉమ్మడి కార్యక్షికమం, 2004 పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం. ఈ మూడు పత్రాలలోనూ తెలంగాణ గురించి ఉన్న విషయాలలో వాక్యాలు ఎంత డొంక తిరుగుడుగానైనా ఉండవచ్చు గాని, జాహ్నవి చెపుతున్న రెండో ఎస్సార్సీ ఊసే ఎక్కడా లేదు.

‘అసలీ డిమాండ్‌ను పదిహేనేళ్ల క్రితం అందరికంటే ముందుగా మావోయిస్టు లు తెరపైకి తెచ్చారన్నది వాస్తవం. వాళ్ల భయానికి ఎవరూ వ్యతిరేకించడానికి నోరెత్తలేదన్నది వాస్తవం’ అని సహజమైన పోలీసుబుద్ధితో మావోయిస్టు బూచిని పైకితెచ్చి, అసలు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి జాహ్నవి ప్రయత్నించారు. ఈ డిమాండ్ మొదటిసారి 1952లో వచ్చింది. 1954-55ల్లో ఫజల్ అలీ కమిషన్ ముందు వచ్చింది. 1958-68 దాకా ఆంధ్రవూపదేశ్ రీజినల్ కమిటీ (దాని పేరు తెలంగాణ రీజినల్ కౌన్సిల్ కావలసింది, 1956లోనే జరిగిన కుట్రల వల్ల దాని పేరే మారిపోయింది!) వందలాది అభ్యంతరాలలో, వార్షిక నివేదికలలో వచ్చింది. 1969 ‘రక్షణల అమలు’ నినాదంతో వచ్చింది. 1969 జై తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. భయంకరమైన అణచివేత తర్వాత, విద్రో హం తర్వాత కూడా ఆరని ఆ నిప్పుకణిక మళ్లీ 1996 నుంచీ రగుల్కొంటూనే ఉంది.

మధ్యలో 610 జీవో రూపంలో వచ్చింది. 2001లో ప్రధాన స్రవంతి రాజకీయాలలో చేరి, 2009 నాటికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి డిసెంబర్ 9 ప్రకటనను సాధించింది. ఈ చరివూతనంతా మరిచిపోయినట్టు నటిస్తూ, పదిహేనేళ్లకిందనే మావోయిస్టుల వల్లనే ఈ డిమాండ్ వచ్చిందనడం బేహద్బీ. జాహ్నవికి ఈ చరిత్ర జ్ఞానం లేకపోయి అయినా ఉండాలి. తెలిసినా మాయ చేయగల ధూర్తత్వమైనా ఉండాలి.‘ఇన్నాళ్లూ వెనుకబడినతనం కారణం చూపి డిమాండు పెట్టారన్నది వాస్తవం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు తర్వాత ఆత్మగౌరవ ప్రతిపాదననను ముందుకు తెచ్చారన్నదీ వాస్తవం’ అని మరొక రెండు పెద్ద అబద్ధాలను వాస్తవాలుగా చెప్పడం జాహ్నవి వ్యక్తిత్వానికి సహజమే. 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నప్పుడే. నాన్‌ముల్కీ గోబ్యాక్ అన్నప్పుడే అందులో వెనుకబడినతనం నుంచి అభివృద్ధి చెందాలనే ఆకాంక్షా ఉంది. మా వనరుల మీద మాకే అధికారం అనే సహజ న్యాయసూవూతమూ ఉంది.

మా నేల మీద మా స్వతంత్ర వ్యక్తిత్వంతో, ఆత్మగౌరవంతో బతుకుతాం అనే ఆత్మగౌరవ నినాదమూ ఉంది. ఆ ఆకాంక్షలే ఈ అరవై సంవత్సరాల ఉద్యమంలో అడుగడుగునా ఉన్నాయి. కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏ ఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి ఉండేది. మనకు తెలియనిది లేనిది అనుకోవడం మన ఆత్మసంతృప్తికి ఉపయోగపడుతుందేమో గాని, రచయితా, మేధావీ కాదలుచుకున్న వారికి శోభించదు. తాను వ్యాఖ్యానించదలుచుకున్న విషయం మీద కనీస పరిజ్ఞానమైనా ఉండాలి.

‘ఉద్యమం పేరిట వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని తుంగలో తొక్కడం వాస్తవం’ అని మరొక ఉవాచ. అవేమిటో తెలుసా? ‘ఆంధ్ర మెస్‌ల పట్ల వ్యతిరేకత, థియేటర్లు పగులగొట్టడం, షూటింగులు భగ్నం చేయడం, ఇళ్ల మీద దాడులు, వాహనాల దహనం, నాలుక కోస్తాం, జాగో భాగోలన్నీ లక్షలాది మంది భయ విహ్వలతకు, కోట్లాది మంది అభవూదతా భావానికి దారితీశాయన్నది వాస్తవం’. ఒక ప్రాంతపు ప్రజలందరి ప్రాథమిక హక్కులు ఆరు దశాబ్దాల పాటు కొల్లగొట్టబడడం జాహ్నవికి కనబడలేదు. రెండు తరాలు తమ చదువులు కోల్పోయాయి. ఉద్యోగాలు కోల్పోయాయి, నీళ్లు కోల్పోయాయి, పంటలు కోల్పోయాయి, పరిక్షిశమలు కోల్పోయాయి, అభివృద్ధి కోల్పోయాయి. ఈ ప్రాథమిక హక్కులను ఇక తుంగలో తొక్కడానికి వీల్లేదు అని ప్రశ్నిస్తే అది మాత్రం కనబడి అభ్యంతరకరమవుతోంది.

రెండు తరాల జీవితాన్ని ధ్వంసం చేస్తే కనబడలేదు. ఇవాళ చెయ్యి అడ్డం పెడితే, ఆ విధ్వంసానికి కారణమైన వారి భయవిహ్వలత, అభవూదత కనబడుతున్నాయి. ఆకలి అంటే, హక్కులు అంటే, ఆత్మగౌరవం అంటే, న్యాయం అంటే శాంతి భద్రతల సమస్యగా కనబడే పోలీసు దృక్పథం ఇది. ‘సంస్కృతి అన్న మాట వినబడితే నా చెయ్యి రివాల్వర్ మీదికి పోతుంది’ అని హిట్లర్ దగ్గర పోలీసుమంవూతిగా పనిచేసిన గోరింగ్ అనేవాడంటారు. జాహ్నవి సరిగ్గా అలాగే ఉన్నట్టున్నారు. ఇంతకూ ఆయన ఇచ్చిన జాబితా ఇళ్లమీద దాడులు, వాహనాల దహనం ఎక్కడో ఒకచోట చాలా చిన్నస్థాయిలో జరిగినవి మాత్రమే. థియేటర్లు పగలగొట్టడం ఎక్కడా జరగలేదు. ఎక్కడైనా రాళ్లు విసరడం జరిగిందేమో. నాలుక కోస్తాం, జాగో భాగో ఒక ఉద్యమంలో ఉద్రేక, ఉద్వేగాల వల్ల వచ్చిన నినాదాలే గాని, అది ఎక్కడా అమలయిందీ లేదు, అమలు కావాలనుకున్నదీ లేదు.

ఇక ఆంధ్ర శబ్దం మీద వ్యతిరేకత గురించి మాత్రం కొంచెం చెప్పాలి. నిజానికి హైదరాబాద్ రాజ్యంలో తెలుగుభాషా సంస్కృతుల వికాసం కోసం జరిగిన ప్రయత్నాలన్నిటిలో తెలంగాణ వైతాళికులందరూ ‘ఆంధ్ర’ శబ్దాన్ని చాలా గౌరవంతో, ఇష్టంతో వాడారు. కాని 1956 తర్వాత కోస్తాంధ్ర పాలకుల విధానాల వల్ల ఆ మాటే తిట్టు మాట అయిపోయింది. అంటే ఈ మాటను అగౌరవానికి గురిచేసినవారు కోస్తాంధ్ర పాలకులే తప్ప తెలంగాణవాదులు కాదు. ఇంతకీ ఆంధ్ర శబ్దాన్ని తిడుతున్నప్పుడు, అది సగటు ఆంధ్ర ప్రజల మీద వ్యతిరేకత కాదు. పాలకుల మీద, పాలక విధానాల మీద వ్యతిరేకత మాత్రమే.ఒక ఉదాహరణ చెప్పాలంటే, భారత స్వాతంవూతోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం, బ్రిటిష్ పాలకులు, బ్రిటిష్ దుర్నీతి వంటి మాటపూన్నో వాడాం.

అది బ్రిటన్ ప్రజలందరినీ ఉద్దేశించినదని ఎవరూ అనలేదు, అనుకోలేదు. అది కేవలం పాలకులను, వలస దుర్మార్గాన్ని ప్రదర్శించినవారిని ఉద్దేశించినది మాత్రమే. ఆ మాటకొస్తే, అసలు ఆ వలస దుర్మార్గంతో ఏ సంబంధం లేకపోయినా, మొత్తంగా ‘తెల్లవారు’ అని శ్వేతజాతీయులందరినీ తిట్టిన సంప్రదాయం ఉంది.తెలంగాణవాదాన్ని సమర్థిస్తున్న వారికి జాహ్నవి కొన్ని లక్షణాలు అంటగట్టారు. అవి ‘తాత్విక శూన్యత, అహేతుక ఆత్మాక్షిశయవాదం (సబ్జెక్టివిటీ). ‘వాస్తవాపూలా ఉన్నా సరే, నేనడిగింది ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే నేను కావాలనుకుంటున్నాను గనుక’. ఇంతమంది చెబుతున్నారు కాబట్టి నిజమే అయ్యిండాలి. ఇంతమంది కోరుతున్నారు కాబట్టి న్యాయమే అయ్యింటుది’ అనే ఉద్వేగపూరిత గొర్రెదాటు మనస్తత్వం’. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఉన్న వారికి ఈ లక్షణాలు ఉన్నా యో లేదో గాని, జాహ్నవికి మాత్రం ఈ లక్షణాలన్నీ ఉన్నట్టున్నాయి.

వీటికి తోడు ఆయనకు మరి రెండు లక్షణాలు కూడా ఉన్నాయనిపిస్తున్నది. తెలంగాణవాదులు అడుగుతున్నది చాలా సాధారణమైన, మౌలికమైన, సహజ న్యాయసూవూతాలకు అనుగుణమైన, ప్రజాస్వామికమైన ప్రశ్న. ఒక రాష్ట్రంలో మొత్తం అవకాశాలలో, సౌకర్యాలలో, పాలనలో, మా ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి మా జనాభాను బట్టి, మా దగ్గర ఉన్న వనరులను బట్టి మా వాటా ఉంటుందా, ఉండదా అనే ప్రశ్న అది. ఆ ప్రశ్నను తోసివేయడం మనిషయిన వాడికి సాధ్యం కాగూడదు. అలాగే, ఈ సమాజంలోని చారివూతక, ప్రాంతీయ, కుల, మత, స్త్రీపురుష, భాషా అంతరాలను బట్టి కొన్ని సామాజిక బృందాలకు రక్షణలు, హెచ్చు అవకాశాలు, హామీలు ఇవ్వాలని రాజ్యాంగస్ఫూర్తి నిర్దేశించింది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక స్వభావం ఉన్న ఎవరికైనా ఆ పునాదిపై తెలంగాణను వ్యతిరేకించడం కుదరదు.

అంటేమనిషి అయినా, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వాది అయినా తెలంగాణ ఆకాంక్ష అర్థమవుతుంది. సమర్థించవలసి వస్తుంది. మరి జాహ్నవి ఏమిటో తెలియదు. అసలే ఏదైనా శాంతిభవూదతల కళ్లద్దాలలోంచి తప్ప మరోరకంగా కనబడదు. అందులోనూ ఆలోచన మతితప్పి తలకిందులుగా సాగుతోంది. ఇక ఆ మేధను మథిస్తే వెలువడేది ఇటువంటి కాలకూట విషం మాత్రమే.

40

VENUGOPAL N

Published: Fri,January 31, 2014 12:29 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆఖరిరోజు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్రప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాద

Published: Fri,August 2, 2013 01:12 AM

ఆనందం, అయినా అనుమానాలు

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజా ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ప్రజలు అపూర్వమైన, అసాధారణమైన విజయం సాధించారు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ అ

Published: Thu,June 27, 2013 11:44 PM

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు

Published: Wed,October 10, 2012 06:04 PM

మహాజనాద్భుతం సాగరహారం

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల స

Published: Wed,October 10, 2012 06:51 PM

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవ

Published: Sat,October 6, 2012 04:04 PM

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ ప్రబోధం

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వివి గిరికి వేయమని కాంగ్

Published: Sat,October 6, 2012 04:04 PM

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి

Published: Sat,October 6, 2012 04:10 PM

సమ్మె నేర్పుతున్న పాఠాలు

తెలంగాణ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో నలభై రెండు రోజులుగా చరివూతాత్మకంగా, విశిష్టంగా, అసాధారణంగా సకల జనుల సమ్మె జరుగుతున్నది. నాలుగు

Published: Sat,October 6, 2012 04:09 PM

సకల జనులకు నీరాజనం

సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న

Published: Sat,October 6, 2012 04:09 PM

ధవంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా?

పది సంవత్సరాలకు పైగా అరుంధతీరాయ్ ఈ దేశపు శక్తిమంతమైన మేధో ప్రతిపక్షంగా ఉన్నారు. అంతకుముందు ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలతో బుకర్ ప

Published: Sat,October 6, 2012 04:08 PM

సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలక ఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ స

Published: Sat,October 6, 2012 04:05 PM

మరుపురాని తెలంగాణ బిడ్డ..

- ఎన్ వేణుగోపాల్ జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్

Featured Articles