ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆఖరిరోజు


Fri,January 31, 2014 12:29 AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్రప్రభుత్వానికి
పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్‌ల వంటి
వారు అరచెయ్యిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.

గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలు తెలంగాణ ప్రజలలో కొత్త అనుమానాలను రేకెత్తించాయి. బిల్లు తిరస్కర ణ తీర్మానం మూజువాణీ వోటుతో గెలిచిందనే తప్పుడు నిర్ధారణ ప్రచారంలోకి వచ్చి అసలు అది జరగవచ్చునా, జరిగినదేమిటి, దాని పర్యవసానాలేమిటనే ప్రశ్నలు తలెత్తాయి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013పై చర్చ ముగియకుండానే, ఆ బిల్లుపై అభిప్రాయ సేకరణ జరిగిందని, రాష్ట్రపతి కోరినట్టుగా ఆ అభిప్రాయాలను పంపుతామని స్పీకర్ ప్రకటించారు. ప్రభు త్వ తీర్మానాన్ని సభ మూజువాణి వోటుతో ఆమో దించిందని ప్రకటించారు. ఆ రెండు వాక్యాల తర్వా త సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నానని ప్రకటించారు.అప్పటికే రెండుసార్లు వాయిదాపడిన సభ లో హఠాత్తుగా ఈ మూడు ప్రకటనలూ చేసి సభను అర్ధాంతరంగా, నిరంకుశంగా ముగించారు. ఇటువం టి ముగింపు ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజ్యాంగ వ్యతిరేకంగా, శాసనసభా సంప్రదాయాల కు భిన్నంగా వ్యవహరించారు. ఈ ముగింపు వల్ల, ముఖ్యంగా బిల్లును తిరస్కరిస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రభుత్వ తీర్మానంగా అభివర్ణించి దాన్ని సభ మూజువాణీ వోటుతో ఆమోదించిందని అనడం వల్ల తెలంగాణ సమాజంలో మళ్లీ భయసందేహాలు వ్యాపిస్తున్నాయి. నిజంగానే సభకు ఆ అధికారం ఉందా, ఇక్కడ బిల్లు తిరస్కరణ జరిగితే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ప్రక్రియకు ఏమవుతుం ది? తెలంగాణ వస్తుందా రాదా? ఆ అనుమానాలు నివత్తి చేయాలి. మొదటి విషయం: రాష్ర్టాల ఏర్పా టు అధికారాన్ని రాజ్యాంగం పూర్తిగా పార్లమెంటుకు మాత్రమే ఇచ్చింది. సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లు మీద అభిప్రాయం చెప్పే అవకాశమే ఉంది. ఆ బిల్లును ఆమోదించడానికి గాని, తిరస్కరించడానికి గాని అధికారం లేదు. అందువల్ల బిల్లును తిరస్కరిస్తున్నామని శాసనసభ మూజువాణీ వోటుతో తీర్మానం చేసినా ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వం, పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరమే లేదు.

ఈ తీర్మానానికి సంబంధించి కొన్ని వివాదాస్పద సాంకేతిక అంశాలు కూడా ఉన్నాయి. స్పీకర్ దాన్ని ప్రభుత్వ తీర్మానమని ప్రకటించారు. అది తప్పు. అబద్ధం. ప్రభుత్వ తీర్మానం అన్నప్పుడు అది ప్రభుత్వాధికారంలో ఉన్న ఒకానొక వ్యక్తి తీర్మానం కాదు, మంత్రివర్గపు తీర్మానం కావలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అనేదేదీ లేదు. ఉన్నా రెండు ప్రత్యర్థి శిబిరాలుగా ఉంది. అందువల్ల దాన్ని కిరణ్ కుమార్‌రెడ్డి అనే వ్యక్తి ప్రవేశపెట్టిన తీర్మానం అనో, ఆయన నాయకుడుగా ఉన్న మంత్రివర్గంలో కొద్దిమంది ప్రవేశపెట్టిన తీర్మానం అనో అనడం సరైనది. అంటే ఆయన తన మంత్రివర్గ విశ్వాసాన్ని, సభా విశ్వాసాన్ని కోల్పోయానని ముందుగా అంగీకరించవలసి ఉంటుంది. అప్పుడు ఆ తీర్మానానికి విలువే ఉండదు. శాసనసభా సంప్రదాయాల ప్రకారం అటువంటి తీర్మానం ఏపద్ధతిలో తయారు కావాలో, దాన్ని ఎన్ని రోజుల ముందు సమర్పించాలో నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నీ ఉల్లంఘనకు గురయ్యాయి. కనుక ఆ తీర్మానమూ, దాన్ని అనుమతించడమూ, దాన్ని ఆమోదించడమూ అన్నీ కుట్రలో భాగమే. అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక అబద్ధంతో, కుట్రతో, ఉల్లంఘనతో, శాసనసభను, సమాజాన్ని తప్పుదారి పట్టించడంతో ముగిసింది.
ఈ తిరస్కరణ తీర్మానానికి ఏమైనా ప్రభావం, ఫలితం ఉంటాయా? రాజ్యాంగ అధికరణం3 ప్రకా రం ఉనికిలో ఉన్న రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్రం ఏర్పా టు, ఒక రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం, తగ్గించడం, సరిహద్దులను మార్చడం పూర్తిగా పార్లమెంటు పరిధిలో ని అంశాలు. అందులో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం లేదు. అందువల్ల శాసనసభ ఈ తీర్మానాన్ని ఒకవేళ పద్ధతి ప్రకారం చేసి ఉన్నా పార్లమెంటులో పెట్టబోయే తీర్మానానికి ఆటంకం కాదు. ఇక పద్ధతి తప్పి అక్రమంగా తయారైన ఈ తీర్మానం దాని సహజ గమ్యమైన చెత్తబుట్టను చేరుతుంది. రాజ్యాంగ అధికరణం 3 సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు తెలుసుకోవాలని చెపుతుంది గాని ఆ శాసనసభ సమ్మతినో, అసమ్మతినో బట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పదు.1953నుంచి ఇప్ప టికి మొత్తం పదకొండు సందర్భాలలో కొత్త రాష్ర్టాల ఏర్పాటు జరిగింది. వాటిలో కూడ పాత రాష్ర్టాలను విభజించి కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేసిన సందర్భాలు ఆరు మాత్రమే.ఆ ఆరు సందర్భాలలో కూడ సంబంధిత శాసనసభలు విభజనకు సమ్మతిస్తూ తీర్మానం చేసిన సందర్భం ఒకే ఒక్కటి.

ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరిణామాల నేపథ్యంలో గతంలోని రెండు రాష్ట్ర విభజనల సందర్భంలో సంబంధిత రాష్ట్ర శాసనసభలలో ఏం జరిగిందో, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు ఎలా స్పం దించాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది.
మొదటి ఉదాహరణ-1956 నాటి బొంబాయి రాష్ట్ర ఏర్పాటు సందర్భంలోనిది. మొదట బొంబా యి రాష్ర్టాన్ని మహారాష్ట్ర, గుజరాత్ అనే రెండు రాష్ర్టాలుగా, బొంబాయి అనే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని బిల్లు తయారు చేసి బొంబాయి రాష్ట్ర శాసనసభకు పంపించారు. ఆ శాసనసభ చర్చిం చి, తన మార్పులు, చేర్పులు, సూచనలతో రాష్ట్రపతి కి తిప్పి పంపింది. నాటి కేంద్ర ప్రభుత్వం అలా తిరిగి వచ్చిన బిల్లును పక్కన పడేసి, సంయుక్త మహారాష్ట్ర అనే ఒకే రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనతో కొత్త బిల్లును తయారు చేసి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అది అన్యాయమనీ, నిరంకుశమనీ, తమకు ఒక బిల్లు చూపించి, మరొక బిల్లు అమలు చేయడమనీ బాబూలాల్ పరాటే కేంద్ర ప్రభుత్వం మీద వ్యాజ్యం వేశాడు. సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం1959 ఆగస్ట్ 28న ఇచ్చిన తీర్పులో, ఆ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అన్యాయమో, నిరంకుశత్వమో కాదనీ, అధికరణం 3 ప్రకారం రాజ్యాంగబద్ధమనీ ప్రకటించింది. బిల్లులో మార్పులు చేసినప్పుడల్లా సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు తీసుకోనవసరం లేదని చెప్పిం ది. అంటే ఇవాళ రాష్ట్ర శాసనసభకు పంపించిన బిల్లు కు సవరణలు చేసినా, పూర్తిగా మార్చినా, అసలు ఈ బిల్లును పక్కన పడేసి కొత్త బిల్లును ప్రవేశ పెట్టినా అది కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన అధికారమే.

రెండో ఉదాహరణ- పంజాబ్ రాష్ర్టాన్ని విభజించి పంజాబ్ హర్యానా రాష్ర్టాలను ఏర్పాటు చేయడానికి సంబంధించినది. పంజాబీ సుబా, హర్యానా ప్రాంత్ లను వేరు చేయాలని సుదీర్ఘ ఆందోళనలు జరిగాక, ఏయే ప్రాంతాలను ఏ రాష్ట్రంలో చేర్చాలనే విషయం లో రెండు చోట్లా హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఆ వాతావరణంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సంబంధిత శాసనసభ అభిప్రాయాలను సక్రమంగా సేకరించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం 1966 జూన్ 13న పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించి, శాసనసభను తాత్కాలిక రద్దు స్థితిలో ఉం చింది. బిల్లును శాసనసభకు పంపకుండానే 1966 సెప్టెంబర్ 18న ఆమోదించి, కొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాకనే నవంబర్ 1న రాష్ట్రపతి పాలన ఎత్తివేసింది. అంటే రాష్ట్ర విభజనలో సంబంధిత రాష్ట్ర శాసనసభల అభిప్రాయం అసలు తీసుకోకుండానే రాష్ర్టాలు ఏర్పాటయిన చరిత్ర కూడ ఉందన్నమాట.

ఈ రాజ్యాంగ, చారిత్రక, రాజకీయ పూర్వ రంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్‌ల వంటి వారు అరచెయ్యిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.

448

VENUGOPAL N

Published: Fri,August 2, 2013 01:12 AM

ఆనందం, అయినా అనుమానాలు

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజా ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ప్రజలు అపూర్వమైన, అసాధారణమైన విజయం సాధించారు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ అ

Published: Thu,June 27, 2013 11:44 PM

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు

Published: Wed,October 10, 2012 06:04 PM

మహాజనాద్భుతం సాగరహారం

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల స

Published: Wed,October 10, 2012 06:51 PM

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవ

Published: Sat,October 6, 2012 04:04 PM

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ ప్రబోధం

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వివి గిరికి వేయమని కాంగ్

Published: Sat,October 6, 2012 04:04 PM

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి

Published: Sat,October 6, 2012 04:10 PM

సమ్మె నేర్పుతున్న పాఠాలు

తెలంగాణ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో నలభై రెండు రోజులుగా చరివూతాత్మకంగా, విశిష్టంగా, అసాధారణంగా సకల జనుల సమ్మె జరుగుతున్నది. నాలుగు

Published: Sat,October 6, 2012 04:09 PM

సకల జనులకు నీరాజనం

సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న

Published: Sat,October 6, 2012 04:09 PM

ధవంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా?

పది సంవత్సరాలకు పైగా అరుంధతీరాయ్ ఈ దేశపు శక్తిమంతమైన మేధో ప్రతిపక్షంగా ఉన్నారు. అంతకుముందు ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలతో బుకర్ ప

Published: Sat,October 6, 2012 04:08 PM

సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలక ఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ స

Published: Sat,October 6, 2012 04:07 PM

మతి తప్పిన తలకిందుల మేధో మథనం

-ఎన్. వేణుగోపాల్ కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏ ఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి

Published: Sat,October 6, 2012 04:05 PM

మరుపురాని తెలంగాణ బిడ్డ..

- ఎన్ వేణుగోపాల్ జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్

Featured Articles