ఆనందం, అయినా అనుమానాలు


Fri,August 2, 2013 01:12 AM


అరవై ఏళ్ల తెలంగాణ ప్రజా ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ప్రజలు అపూర్వమైన, అసాధారణమైన విజయం సాధించారు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ అని నినదించి అసువులు బాసిన ఏడుగురు విద్యార్థి అమరవీరులు, 1969లో జై తెలంగాణ అని తుపాకి తూటాలకు ఒరిగిపోయిన 370 మంది విద్యార్థి యువజనులు, 2009 నుంచి ఇప్పటిదాకా ప్రాణత్యాగం చేసిన పదకొండు వందల మంది యువతీ యువకులు, బి. జనార్దన్‌రావు, కాళో జీ, బెల్లిలలిత, ఐలయ్య, సుదర్శన్, నల్లా వసంత్, ప్రొఫెసర్ జయశంకర్ వంటి తెలంగాణ ముద్దుబిడ్డలు జీవితాంతం తపించిన, పోరాడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించబోతున్నది. నాలుగు సంవత్సరాలుగా పదకొండువేల గ్రామాలలో కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, వయో భేదం లేకుండా సబ్బండవర్ణాలు ఐక్యంగా పోరాడిన తెలంగాణ ఇవాళ స్వరాష్ట్రంలో సుపరిపాలన కోసం లేచినిలుస్తున్నది.ఈ అపూర్వమైన విజయంసాధించిన తెలంగాణ ప్రజానీకానికి, ఉద్యమంలో తమవంతు పాత్ర నిర్వహించిన బుద్ధిజీవులకు,నాయకత్వం వహించిన ప్రజాసంఘాలకు, రాజకీయపక్షాలకు అభినందనలు,ధన్యవాదాలు.

ఈ ఆనందమయ శుభవేళ అనుమానాలు వ్యక్తం చేయడం సమంజసంకాదు. కాని తెలంగాణ ప్రజల పట్ల ఎన్నో దశాబ్దాలుగా వంచన లు, నమ్మక ద్రోహాలు చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ చరివూతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అనుమానించక తప్పడంలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను ఇంత సులభంగా అంగీకరించిందంటే నమ్మశక్యం కావడం లేదు. మళ్లీ ఏ కుంటి సాకులతో ఈ నిర్ణయాన్ని పక్కదారి పట్టిస్తుందో, ఏ లొసుగులతో ఈ నిర్ణయాన్ని పలచబారుస్తుందో అనే అనుమానం కలుగుతున్నది.
మంగళవారం రాత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత పత్రికా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ రెండు పేజీల నోట్ ఇచ్చారు. అందులో ఒక పేజీ తెలంగాణ మీద తమ నిర్ణయానికి దారితీసిన పరిణామాల క్రమం. రెండో పేజీ వర్కింగ్ కమిటీ తీర్మానం. ఆ తీర్మానం లో అనుమానానికి, భిన్నమైన వ్యాఖ్యానానికి తావిచ్చే మూడు అస్పష్ట అంశాలున్నాయి. వాటి మీద ఇప్పుడే స్పష్టత తెచ్చుకోకపోతే, జాగరూకంగా ఉండకపోతే ఆ అంశాలు బహుశా మరొకసారి తెలంగాణ అన్యాయనికి గురికావడానికి ఆస్కారమిస్తాయి.

మొదటిది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని స్థాపించడానికి రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకొమ్మని వర్కింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది అన్నారు గాని దానికి కాలవ్యవధి లేదు. అదే తీర్మానంలో ఆంధ్ర, రాయలసీమ ప్రజల ఆందోళనలను పరిష్కరించడాని కి నిర్ణీత కాలవ్యవధిలో యంత్రాంగా న్ని ఏర్పాటు చేయాలి అని రాసినవారు రాష్ట్ర స్థాపన కోసం నిర్ణీత కాలవ్యవధి సూచించకపోవడం ప్రస్తుత పరిస్థితిలో ఆశ్చర్యకరమే. పత్రికా సమావేశంలో వచ్చిన ప్రశ్నకు జవాబుగా దిగ్విజయ్ సింగ్ నాలుగైదు నెలలు అని సమాధానం ఇచ్చారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే రాష్ట్ర ఏర్పాటుకు ఇంత కాలం కూడ పట్టనవసరంలేదు. అంతేకాదు, ఈ మాత్రం ప్రకటనే అయితే 2009 డిసెంబ ర్ 9న కూడా వచ్చినదే. కనుక కేంద్ర మంత్రివర్గ నిర్ణయంలోగాని, మంత్రుల బృందం నిర్ణయంలో గాని కచ్చితంగా నిర్ణీత కాలవ్యవధిని ప్రకటించాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేయవలసి ఉన్నది.ఇక రెండో అంశం: హైదరాబాద్‌ను పది సంవత్సరాల కోసం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వాన్ని వర్కింగ్ కమిటీ కోరడం, ఈ పది సంవత్సరాలలోపు తమ కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి అవశిష్ట రాష్ట్రానికి సహకరించాలని కూడ వర్కింగ్ కమిటీ కేంద్రాన్ని కోరింది. ఉమ్మడి రాజధాని వ్యవహారంలో రావలసిన స్పష్టత చాలా ఉంది. చరివూతలో రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సందర్భాలలో, ఇటువంటి సంప్రదాయం ఎప్పుడూ పాటించలేదు. కర్నూలు, రాంచి, రాయపూర్ వంటి చిన్న నగరాలనయినా రాజధానులుగా వెంటనే ప్రకటించారు. అక్కడికి పూర్తి రాజధానులు తరలి ఒకటి రెండు సంవత్సరాలు పట్టడం వేరే విషయం.ఉమ్మడి రాజధాని అనే సంప్రదాయం చండీగఢ్ వంటి ప్రత్యేక సందర్భంలో మినహా మరెప్పుడూ లేదు.

హైదరాబాద్ నుంచే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తాయంటున్నారు గాని,ఉమ్మడి రాజధాని మీద రెండు రాష్ట్రాలకూ అధికారం ఉంటుందా, తెలంగాణకు మాత్రమే ఉంటుందా స్పష్టత లేదు. హైదరాబాద్ మాకు దక్కకపోతే మీకూ దక్కడానికి వీల్లేదు అని పట్టుబడుతున్న కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు, రాజకీయ నాయకులు ఈ పది సంవత్సరాలలో హైదరాబాద్‌లో ఎలా ఉంటారు? హైదరాబాద్‌తో ఎలా వ్యవహరిస్తారు? తమ పాత కబ్జాకోరు, దోపిడీ విధానాలనే అవలంబిస్తారా? ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ రూపురేఖ లు మార్చి, హైదరాబాద్‌ను తెలంగాణకు దూరం చేయడానికి ప్రయత్నించి, అప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చమని అడగడానికి ప్రయత్నిస్తారా? అన్నీ సందేహాలే. సీడబ్ల్యుసీ తీర్మానంలో స్పష్టత లేదు. ఇంతకూ ఉమ్మడి రాజధాని మీద అధికారం యథాతథంగా ఉం డడం హైదరాబాదులో ఆస్తులు, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులకు అవసరంగాని ఆ ప్రాంత సాధారణ ప్రజానీకానికి ఇంత దూరపు రాజధాని అనవసర భారం. అక్కడి ప్రజలు ఏ చిన్నపని కోసమైనా రాజధానికి రావాలంటే మరొక రాష్ట్రంలో రెండు వందల కిలోమీటరు ప్రయాణించవలసి ఉంటుంది. కనుక ఎలా చూసినా ఉమ్మడి రాజధాని ఆలోచన విరమించుకోవాలని తెలంగాణ సమాజం కోరాలి. అక్కడి రాజధానిని వెంటనే నిర్ణయించి, అక్కడికి రాజధానిని మార్చడానికి హేతుబద్ధంగా ఎంత వ్యవధి అవసరమో అంత వ్యవధి మాత్రం హైదరాబాదులో కార్యాలయాలు ఉం చి, అక్కడ నిర్మాణాలు పూర్తి చేయమని అడగాలి.

మూడవది పోలవరం సమస్య.పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి,దాని నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించమని కేంద్ర ప్రభుత్వాన్ని వర్కింగ్ కమిటీ కోరింది. పోలవరం ప్రాజెక్టు మీద తెలంగాణ ఉద్యమం ఇప్పటికే ఎన్నో సాంకేతిక, న్యాయపర, నైతిక, రాజకీయార్థిక అభ్యంతరాలు ప్రకటించి ఉంది. మూడు వందల గ్రామాలను ముంచి, మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసే పోలవరం ప్రాజెక్టు గోదావరి జలాల లో తెలంగాణ వాటా కొల్లగొట్టడానికి వేసిన ఎత్తుగడ మాత్రమే. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్ విద్యాసాగర్‌రావు, ఎం కోదండరాం, శ్రీధర్ దేశపాండే వంటి ఎందరో ఈ ప్రాజెక్టు ఎట్లా తెలంగాణకు వ్యతిరేకమో ఎన్నోసార్లు రాశారు. ఇది ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడల మధ్య ఏర్పాటు చేయబోతున్న ఇండవూస్టియల్ కారిడార్ లో బహుళజాతి సంస్థల కోసం వస్తు న్న ప్రాజెక్టు, గోదావరి నుంచి కృష్ణకు నీటిని మళ్లించి కృష్ణా, గుంటూరు జిల్లాలలో మూడో పంటకు నీరు అందించే ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే లోగా గోదావరిపై ఆంధ్ర ప్రాజెక్టులు పూర్తవ్వాలి. అపుడు రాష్ట్ర విభజన జరిగినా గోదావరిపై తమ హక్కు ను క్లెయిమ్ చేసుకునే వీలుంది. రాష్ట్ర విభజన రోజురోజుకి అనివార్యమవుతున్నకీలక దశలో పోలవరం పనులు శరవేగంతో జరుగుతుండడంతో ఇమి డి ఉన్న రహస్యం లేదా కుట్ర ఇదే అని శ్రీధర్ దేశపాండే 2005లోనే రాశా రు. గోదావరి జలాలను వాడుకోవడానికి ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు వీలు ఉన్నప్పటికీ కొత్త రాష్ట్రంగా తెలంగాణ దగ్గర ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులు ఉండవు. ఈలోగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం పూర్తయిపోయి, న్యాయమైన వాటా లేకపోయినా అక్రమంగా ఆర్జించుకున్న వాటా ఉంటుంది. మిగిలిన జలాలనే తెలంగాణ ఆమోదించవలసి వస్తుంది.తెలంగాణ రాష్ట్ర విజయ సాధన ఉత్సవాలు జరుపుకుంటూనే కేంద్ర, ఆంధ్రవూపదేశ్ పాలకవర్గాల కుట్రల పట్ల జాగరూకంగా ఉండడం ఇవాళ తెలంగాణ ప్రజల, బుద్ధిజీవుల బాధ్యత. ఈ కోణాలు చూపుతున్నామంటే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల న్యాయమైన ఆకాంక్షల ను, భయసందేహాలను తొక్కిపడుతున్నామని కాదు. తెలంగాణ ప్రజా ఉద్యమం ఎప్పుడూ పాలక విధానాలకు వ్యతిరేకంగా మాత్రమే గాని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు వ్యతిరేకంకాదు. అందువల్ల ఆ ప్రజ ల భయాందోళనలను గుర్తిస్తూనే, న్యాయాన్యాయ విచక్షణతో వారికి జవాబు చెపుతూనే, వారి పట్ల అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే,తెలంగాణకు అన్యాయం జరగకుండా, అన్యాయం జరిగే వీలులేకుండా అప్రమత్తంగా ఉండడం, తెలంగాణ పునర్నిర్మాణానికి తగిన ప్రాతిపదికలు నిర్మించడం ఇవాళ్టి అవసరం.

-ఎన్. వేణుగోపాల్

75

VENUGOPAL N

Published: Fri,January 31, 2014 12:29 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆఖరిరోజు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్రప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాద

Published: Thu,June 27, 2013 11:44 PM

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు

Published: Wed,October 10, 2012 06:04 PM

మహాజనాద్భుతం సాగరహారం

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల స

Published: Wed,October 10, 2012 06:51 PM

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవ

Published: Sat,October 6, 2012 04:04 PM

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ ప్రబోధం

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వివి గిరికి వేయమని కాంగ్

Published: Sat,October 6, 2012 04:04 PM

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి

Published: Sat,October 6, 2012 04:10 PM

సమ్మె నేర్పుతున్న పాఠాలు

తెలంగాణ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో నలభై రెండు రోజులుగా చరివూతాత్మకంగా, విశిష్టంగా, అసాధారణంగా సకల జనుల సమ్మె జరుగుతున్నది. నాలుగు

Published: Sat,October 6, 2012 04:09 PM

సకల జనులకు నీరాజనం

సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న

Published: Sat,October 6, 2012 04:09 PM

ధవంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా?

పది సంవత్సరాలకు పైగా అరుంధతీరాయ్ ఈ దేశపు శక్తిమంతమైన మేధో ప్రతిపక్షంగా ఉన్నారు. అంతకుముందు ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలతో బుకర్ ప

Published: Sat,October 6, 2012 04:08 PM

సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలక ఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ స

Published: Sat,October 6, 2012 04:07 PM

మతి తప్పిన తలకిందుల మేధో మథనం

-ఎన్. వేణుగోపాల్ కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏ ఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి

Published: Sat,October 6, 2012 04:05 PM

మరుపురాని తెలంగాణ బిడ్డ..

- ఎన్ వేణుగోపాల్ జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్