ధవంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా?


Sat,October 6, 2012 04:09 PM

పది సంవత్సరాలకు పైగా అరుంధతీరాయ్ ఈ దేశపు శక్తిమంతమైన మేధో ప్రతిపక్షంగా ఉన్నారు. అంతకుముందు ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలతో బుకర్ ప్రైజ్ గెలుచుకుని, ఆ నవలలో భాషతో, ఊహాశక్తితో తన అసాధారణ ప్రజ్ఞను నిరూపించుకుని ప్రశంసలూ విమర్శలూ దండిగా మూటగట్టుకున్నారు. ఆ తర్వాత సృజనకర్తగా తన శక్తి సామాజిక సమస్యల మీద రచనలకు వినియోగించుకోవాలనీ సామాజిక కార్యకర్త కావాలనీ నిర్ణయించుకున్నారు. ఈ పది సంవత్సరాలలో కాశ్మీర్ మీద, భారత అణ్వాయుధ కార్యక్షికమం మీద , ‘పార్లమెంటు పై దాడి’ అనే అబద్దం మీద, గుజరాత్ మారణకాండ మీద, అమెరికా సామ్రాజ్య వాద దురహంకారం మీద, భారత రాజకీయ నాయకత్వం దివాళాకోరుతనం మీద, మీడియా కట్టుకథల మీద ఆమె రచనలు ప్రపంచ వ్యాప్తంగా ఆలోచనల సుడిగుండాలు సృష్టించాయి.

ఆ క్రమంలోనే ఇటీవల ‘ఔట్ లుక్’ వార పత్రికలో ఆమె రాసిన మూడు వ్యాసాలు- మిస్టర్ చిదంబరమ్స్ వార్ ( అక్టోంబర్2009), వాకింగ్ విత్ ది కామ్రేడ్స్ ( మార్చి 2010), ట్రికిల్ డౌన్ రెవల్యూషన్ ( సెప్టెంబర్ 2010) మరొక సంచలనాత్మక చర్చకు దారితీశాయి. ఆ మూడు వ్యాసాలను పెంగ్విన్ బుక్స్ కు చెందిన హామిష్ హామిల్టన్ ప్రచురణ సంస్థ 2011 ఫిబ్రవరిలో ‘బ్రోకెన్ రిపబ్లిక్’ పేరుతో ప్రచురించింది. ఆ పుస్తకానికి తెలుగు అనువాదం ‘మలుపు’ ప్రచురణగా ‘ధ్వంసమైన స్వప్నం పేరుతో వెలువడింది.
ఈ మూడు వ్యాసాలు ధ్వంసమైన రిపబ్లిక్, ధ్వంసమైన స్వప్నానికి మూడు కోణాల్ని చూపుతాయి.

నిజానికి రిపబ్లిక్ (గణతంత్రం) అనేదే ప్రజాసమూహం తనను తాను పాలించుకోవడం, స్వయంపాలన, స్వయం నిర్ణయాధికారం అనే స్వప్నం. మనుషులు వర్గాలుగా చీలిపోక ముందు మొత్తంగా సమూహమంతా తమ వనరుల మీద, తమ అనుభవం మీద, తమ జీవితాల మీద సమష్టిగా పాలనా నిర్ణయాలు తీసుకున్న ఆదిమ జ్ఞాపకాన్ని ఉన్నతీకరించిన అవగాహనే గణతంత్రం. వనరుల మీద అధికారంలోనూ, వనరుల వినియోగంలోనూ, అవకాశాలలోనూ అసమానతలూ వివక్షలూ అన్యాయాలు లేని ఆదర్శరాజ్యం గణతంత్రం. కాని వేల ఏళ్లు గడిచి వచ్చినా మానవ సమాజానికి ఆ స్వప్నం సాకారం కానేలేదు. ధ్వంసమైన స్వప్నంగానే మిగిలిపోయింది.

భారత సమాజం విషయానికి వస్తే, బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమకాలంలో వలసపాలన దుర్మార్గం లేని, పరాయి పాలన లేని, అసమానతలు లేని, అందరికీ సమానావకాశాలు ఉండే గణతంవూతాన్ని నిర్మించుకోవాలని భారత ప్రజలు కలగన్నారు. ఆ స్వప్నం నిజం చేసుకోవడానికి దశాబ్దాల పాటు వీరోచిత పోరాటం సాగించారు. చివరికి వలసవాదులు వెళ్లిపోయారని భ్రమపడి, భారత ప్రజలమైన మాకు మేము ఒక సర్వసత్తాక, ప్రజాస్వామిక, సామ్యవాద గణతంవూతాన్ని ఇచ్చుకుంటున్నాము, అని రాజ్యాంగ రచన చేసుకున్నారు. కాని ఆ భ్రమ త్వరలోనే తేలిపోయింది. ఆ స్వప్నం భగ్నమైపోయింది. మన గణతంవూతానికి కలలుగన్న సర్వసత్తాక అధికారం లేదు. సామ్యవాదం లేదు. అసలిది గణతంవూతమే కాదు. ప్రజల రాజ్యమే కాదు. దేశదేశాల దోపిడీ దొంగల రాజ్యం. అలా భారత ప్రజల స్వప్నం ధ్వంసమయిపోయిందనే గుర్తింపు 1960 ల నాటికి కొందరికే వచ్చిందేమో, కాని ఇవాళ ఆ గుర్తింపు రానివాళ్లు లేరు.

వలస వ్యతిరేక ప్రజా ఉద్యమ ఆదర్శాలు, రాజ్యాంగ లక్ష్యాలు ధ్వంసమైపోయాయనే వాస్తవం తెలియని వాళ్లు ఇవాళ ఎవరూ లేరు. పెసం మీది నుంచి ‘పొయి’లో పడ్డట్టుగా భారతదేశం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి రవి అస్తమించని బహుళజాతి సంస్థల సామ్రాజ్యంలో పడింది. ఆ బహుళజాతి సంస్థల, దేశదేశాల సంపన్నుల తీరని ఖనిజ దాహం కోసం, బకాసుర మార్కెట్ ఆకలి కోసం, భారత ప్రజల స్వప్నాలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ స్వప్న విధ్వంసం జరిగిన ఆరుదశాబ్దాల చరివూతను, మరీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల చరివూతను, ఆర్థిక ప్రయోజనాలు తీర్చే పోలీసు మంత్రిగా , ఆర్థిక వ్యాపారిగా చిదంబరం సాగిస్తున్న యుద్ధాన్ని అరుంధతీరాయ్ మొదటి వ్యాసం ‘చిదంబర రహస్యం’ వివరించింది. ఒడిశాలోని నియమగిరి కొండల్లో డొంగ్రియా ఖోండు ఆదివాసీల నేల కింద బాకై్సట్ ఉన్న పాపానికి ఆ ఆదివాసులను అక్కడినుంచి పెకలించి ఆ నేలను బహుళజాతి సంస్థల చేతుల్లో పెట్టడానికి చిదంబరం సాగిస్తున్న యుద్ధాన్ని ఈ వ్యాసం వివరించింది.

ఖనిజ మాఫియాయే, మన సహజవనరుల దొంగలే, దళారీలే ఎలా ప్రభుత్వ విధానాలను తయారు చేస్తున్నారో , ఈ బందిపోటులో వారికి దక్కుతున్న అపారమైన సంపద ఏమిటో ఈ వ్యాసం విస్పష్టంగా చూపింది. ఈ దేశ సహజవనరులను ఇలా అక్రమిస్తున్న కొల్లగొడుతున్న పాలక బహుళజాతి వ్యాపార మాఫియా ముఠాలను నిజంగా ప్రతిఘటిస్తున్నది. ఆదివాసులు మాత్రమేనని, వారికి నిజమైన అండగా ఉన్నది మావోయిస్టులు మాత్రమేనని అరుంధతీరాయ్ ఈ వ్యాసంలో వివరించారు. ఈ వ్యాసం మొదట ‘ఔట్ లుక్’ పత్రికలో ప్రచురితమైనప్పుడు, దిస్ లాండ్ ఈజ్ మైన్’ అనే మరో శీర్షిక కూడ ఉండింది. ‘మైన్’ అనే ఇంగ్లీషు పదానికి నాది, గని, పాతర లనే మూడు అర్థాలు ఉన్నాయి. ఈ దేశం ఒక గని, ఈ దేశం ఒక మందుపాతర, ఈ దేశం ఒక నాది అనే మూడు అర్థాలలోనూ ఈ వ్యాసం అరుంధతీరాయ్ భాషా పాటవానికి మాత్రమే కాదు. ప్రజానుకూల విశ్లేషణాశక్తి కీ ఉదాహరణంగా నిలుస్తుంది. రెండో వ్యాసం, వాకింగ్ విత్ ది కామ్రేడ్స్’ (కారడవిలో కామ్రేడ్స్‌తో) లో ఆమె ఆ ప్రతిఘటన సాగిస్తున్న మావోయిస్టులు, వారు పనిచేస్తున్న ఆదివాసి సమాజం, వారి జీవనసరళి ఎలా ఉన్నాయో వివరించడానికి ప్రయత్నించారు.

మావోయిస్టుల గురించి ఉన్న పాలకులూ పోలీసులూ చెప్పే కట్టుకథలను, భయానక, బీభత్స, అజ్ఞాన కథనాలనుదాటి వారితో కలిసి నడిచిన ప్రపంచ ప్రఖ్యాత రచయిత అనుభవాలను ఆమె అక్షరీకరించారు. బ్రిటిష్ వలసవాదుల సహజ వనరుల దోపిడీని ఎదిరిస్తూ దండకారణ్య ఆదివాసులు జరిపిన భూంకాల్ తిరుగుబాటు శతజయంతి సందర్భంగా ఆమె దండకారణ్యంలోకి వెళ్ళి అక్కడ మావోయిస్టు గెరిల్లాలతో కలిసి గడిపి వారి దైనందిన జీవితాన్ని పరిశీలించి పాఠకుల కళ్లకు కట్టారు. ఆ క్రమంలో ఆదివాసుల జీవితాలనూ, వారి పోరాటాలనూ, దండకారణ్యవిప్లవోద్యమ చరివూతనూ, విప్లవకారులు ప్రకటిస్తున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనానూ, ప్రత్యామ్నాయ ఆలోచనలనూ వివరించడానికి ప్రయత్నించారు. మూడో వ్యాసం ‘ట్రికిల్ డౌన్ రెవల్యూషన్’ (మానవ జాతి మనుగడ కోసం విప్లవం) తన రెండో వ్యాసానికి కొనసాగింపుగానూ, ఆజాద్ హత్యానంతరం మొత్తంగా సామాజిక, రాజకీయార్థిక, తాత్విక రంగాలలో తన ఆలోచనలను పంచుకోవడానికి, భారత ప్రభుత్వ రాజకీయార్థిక విధానాల అసంబద్ద పర్యవసానాలను వివరించడానికీ ఆమె రాశారు.

ఒకరకంగా మొదటి వ్యాసం ‘ధ్వంసమైన స్వప్నాన్ని’ వివరిస్తే , రెండో వ్యాసం ఆ స్వప్న పునర్నిర్మాణాన్ని ఆచరణాత్మకంగానూ, మూడో వ్యాసం ఆలోచనాత్మకంగానూ చర్చిస్తాయి. పదిహేను సంవత్సరాలుగా అరుంధతీరాయ్ భాషా పాటవాన్నీ, శైలినీ ఊహాశక్తినీ అభిమానిస్తున్న పాఠకులకు ప్రత్యేకంగా ఈ మూడు వ్యాసాలలోని శైలి గురించీ, మాటలను పదునైన ఆయుధాలుగా మార్చే ఆమె నేర్పు గురించీ చెప్పనక్కరలేదు. కాని కొన్ని వాదనలు, కొన్ని పదాలనూ, వాక్యాలనూ ఆమె ప్రయోగించే పద్ధతి, చాల సాధారణమైన ఘటనల నుంచీ, సందర్భాల నుంచీ కూడ ఆమె తీసి అసాధారణ నిర్ధారణలు ఆమె నిశిత దృష్టికి, ఆమె సామాజికి దృక్పథానికీ సూచికలుగా నిలుస్తాయి. ఈ మూడు వ్యాసాలలో కూడ అటువంటి ఉదాహరణలు కోకొల్లలు.

మావోయిస్టుల ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం నిజమైన ప్రజాసైన్యమే అని చూపడానికి భూంకాల్ సభ దగ్గర ఆదివాసుల నృత్యంలో సైనికులు కలిసినప్పుడు దృశ్యాన్ని తన సహజమైన కవితాత్మక శైలిలో ‘ఇక ఆలివ్ గ్రీన్ సుడులు తిరుగుతున్న చీరెలు, పువ్వులు, డోళ్లు ,తలపాగాల మధ్య పంపకమవుతుంది’’ అని వర్ణిస్తారు. ఆ సభలో స్థూపం మీద పార్టీ జెండా పైన జనతన సర్కార్ జెండా ఉందన్న చిన్న విషయాన్ని కూడ ఆమె నిశితంగా గుర్తించడం మాత్రమే కాదు. ‘ప్రాధాన్యతా క్రమం సరిగ్గా ఉంది’ అని ప్రజలే, ప్రజల స్వయం నిర్ణయాధికార స్వప్నమే ప్రధానం అని చెప్పకనే చెపుతారు. గెరిల్లాలకు వీడ్కోలు చెప్పి వస్తున్నప్పుడు, మిగతా ప్రపంచమంతా పీడకలలో బతుకుతుంటే , వీళ్లు భవిష్యత్ స్వప్నాలతో బతికేవాళ్లు’ అంటారు. అట్లాగే వ్యంగ్యానికీ, మాట విరుపుకూ, పరిహాసానికి, ఆలోచనాత్మకమైన వేళాకోళానికి ఆమె పెట్టింది పేరు.

గెరిల్లాలను కలవడానికి వెళ్లినప్పటి ఉదంతం గురించి గాని, వస్తువులను వృధా చేయకపోవడంలో మావోయిస్టు గెరిల్లాలు ఎంతగా గాంధీవాదులుగా ఉన్నారనే విషయంగాని, కాల్పులు మొదలయితే ఏం చెస్తారు అని ప్రశ్నిస్తే ‘ఆమరణ నిరాహార దీక్షకు కూచుంటాను’, అని వేళాకోళం చేయడంలోగాని, అడవిలో నేల మీద తన పడక గురించి వెయ్యి నక్షవూతాల హోటల్ గది అని అభివర్ణించడంలోగాని, మావోయిస్టులు ఎన్నికల్లో ఎందుకు నిలబడరు అనే అమాయకపు, అతితెలివి ప్రశ్నలకు జవాబు చెప్పడంలో గాని ఆమెలోని గొప్ప కాల్పనిక రచనాశక్తీ, వ్యంగ్యం, ప్రజల పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల ప్రేమ అద్భుతంగా బయటపడతాయి. ఈ వ్యాసాల మొత్తం స్ఫూర్తిని, రచయిత ఆలోచన దోరణిని సమర్థిస్తూనే, మూడు నాలుగు చిన్న విమర్శలు కూడా ముఖ్యంగా తెలుగు పాఠకుల దృష్టికి తేవలసి ఉంది. కమ్యూనిజం కాపిటలిజం రెంటినీ దాటిన ఆదర్శ ఆలోచనా స్థలం ఏదో ఉందని ఆమె అనడం కాస్త అమాయకత్వం అనిపిస్తుంది.

అలాగే మార్క్సిస్టు పాలనలలో సాగిన ‘హింస’ గురించి, ముఖ్యంగా స్టాలిన్, మావో, ఖ్మేర్‌రూజ్ పాలనల గురించి ఆమె చేసిన విమర్శలు, చారుమజుందార్ , గణపతి ఆలోచనల్లో హింస గురించి ఆమె వ్యాఖ్యలు వాస్తవాల మీద, హింసాహింసల పట్ల సరియైన దృక్పథం మీద ఆధారపడినవి కావు. ఇక అరుంధతీరాయ్ లాంటి సునిశిత మేధావి కూడ ‘పిడబ్ల్యుజి’ అని చాలసార్లు ప్రసావించడం ఆశ్చర్యకరం. ‘పిడబ్ల్యుజి’ అనే నామవాచకం ఎక్కడాలేదు. ఒక పార్టీ పేరుకు గ్రూప్ అనే తోక తగిలించి, అది పార్టీ కాదని, చిన్న గ్రూపు, ముఠా మాత్రమేనని చిన్న బుచ్చడానికి పోలీసులు ఆ పదవూపయోగం చేశారు. మీడియా అనాలోచితంగా దాన్ని స్వీకరించింది. కాని ఒకరి పేరును మార్చే హక్కు మరొకరికి లేదు. అందులోనూ వాస్తవాల పట్ల శ్రద్ధ ఉన్నవారికి అసలే లేదు.

తెలుగు అనువాదంలో తప్పులూ పొరపాట్లూ చాల ఉన్నాయి. అచ్చు తప్పులు సరేసరి, ఇంత విలువైన పుస్తకాన్ని మరికొంత జాగ్రత్తగా ప్రచురిస్తే బాగుండేది. ఈ విమర్శలు ఎలా ఉన్నా, అరుంధతీరాయ్ ఈ మూడు వ్యాసాల ద్వారా భారత సమాజానికీ, ఆలోచనాపరులకూ, భారత విప్లవోద్యమానికి అందించిన కానుకలు అద్భుతమైనవి. భారత ప్రజలుగా మనకు మనం ఇచ్చుకున్న రిపబ్లిక్ ఎలా ఎవరి వల్ల ధ్వంసమైపోయిందో, మనం కన్న కల ఎలా భగ్నమైపోయిందో, ఆ స్వప్నాన్ని దండకారణ్య ఆదివాసులూ, వారికి నాయకత్వం అందిస్తున్న మావోయిస్టులూ ఎలా పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారో ఈ మూడు వ్యాసాలూ హృదయానికి హత్తుకునేలా వివరిస్తాయి. దండకారణ్య ఆదివాసి విప్లవోద్యమం ఇవాళ మన సహకారాన్నీ, సృజనాత్మకతనూ కోరుతున్నదనీ, ‘దానికి వైద్యులు, ఉపాధ్యాయులు, రైతులు అవసరం, దానికి యుద్ధం అవసరం లేదు, అనీ ఆమె చిదంబరం యుద్ధాన్ని వ్యతిరేకించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పుతున్నారు. సమకాలీన భారత సమాజాన్ని అర్థం చేసుకోదలచిన వారందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకమిది.
-ఎన్. వేణుగోపాల్

35

VENUGOPAL N

Published: Fri,January 31, 2014 12:29 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆఖరిరోజు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్రప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాద

Published: Fri,August 2, 2013 01:12 AM

ఆనందం, అయినా అనుమానాలు

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజా ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ప్రజలు అపూర్వమైన, అసాధారణమైన విజయం సాధించారు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ అ

Published: Thu,June 27, 2013 11:44 PM

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు

Published: Wed,October 10, 2012 06:04 PM

మహాజనాద్భుతం సాగరహారం

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల స

Published: Wed,October 10, 2012 06:51 PM

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవ

Published: Sat,October 6, 2012 04:04 PM

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ ప్రబోధం

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వివి గిరికి వేయమని కాంగ్

Published: Sat,October 6, 2012 04:04 PM

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి

Published: Sat,October 6, 2012 04:10 PM

సమ్మె నేర్పుతున్న పాఠాలు

తెలంగాణ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో నలభై రెండు రోజులుగా చరివూతాత్మకంగా, విశిష్టంగా, అసాధారణంగా సకల జనుల సమ్మె జరుగుతున్నది. నాలుగు

Published: Sat,October 6, 2012 04:09 PM

సకల జనులకు నీరాజనం

సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న

Published: Sat,October 6, 2012 04:08 PM

సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలక ఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ స

Published: Sat,October 6, 2012 04:07 PM

మతి తప్పిన తలకిందుల మేధో మథనం

-ఎన్. వేణుగోపాల్ కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏ ఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి

Published: Sat,October 6, 2012 04:05 PM

మరుపురాని తెలంగాణ బిడ్డ..

- ఎన్ వేణుగోపాల్ జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్

Featured Articles