సమ్మె కర్తవ్యం ప్రతిఘటన


Sat,October 6, 2012 04:08 PM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలక ఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ సాగుతున్న వేరువేరు పోరాట రూపాల కొనసాగింపూ..,ఉన్నతీకరణా..ఈ సకల జనుల సమ్మె. తెలంగాణ ప్రజల పోరాట శీలాన్నీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష బలాన్నీ ప్రదర్శించ గల ఉజ్వల ఉద్యమ ఘట్టం ఇది. చరివూతాత్మక సందర్భం ఇది.

ఇరవై నెలల పోరాట క్రమంలో వెలికివచ్చిన వివిధ పోరాట రూపాల గురించీ, వాటి జయాపజయాల గురించీ, అవి సాధించిన, సాధించలేకపోయిన అంశాల గురించీ చర్చించడానికి ఇది ఒక సందర్భం. ఆ సమీక్ష సకల జనుల సమ్మెలో అనుసరించవలసిన మార్గాల గురించి మన అవగాహన మెరుగుపడడానికి వీలు కల్పిస్తుంది. విభిన్న వర్గాల జేఏసీల ఏర్పాటు, విద్యాసంస్థల బంద్, తెలంగాణ వ్యాప్త బంద్, ప్రజాజీవన స్తంభన, విభిన్న ఉద్యోగ, కార్మిక వర్గాల సమ్మెలు, ఉద్యోగుల పెన్‌డౌన్, సహాయనిరాకరణ, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వ బోర్డుల మార్పు, రాస్తారోకో, ధర్నా, నిరాహారదీక్ష, ఊరేగింపు, సభ, ధూమ్ ధామ్, ఆటాపాటా, బోనాలు, కళావూపదర్శనలు, వంటావార్పూ, రహదారుల మీద ఆటలు, బతుకమ్మ, ప్రజావూపతినిధులను నిలదీయడం, ప్రభుత్వ కార్యక్షికమాలను అడ్డుకోవడం, దిష్టిబొమ్మల దహనాలు, పిండవూపదానాలు, ఆత్మహత్యలు వంటి అనేక నిరసన రూపాలు ఈ ఇరవై నెలల్లో తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమయ్యాయి. వాటి మంచి చెడులను చర్చించవచ్చు గానీ, మొట్టమొదట గుర్తించవలసిన అంశం ఇవన్నీ తెలంగాణ ప్రజల నిరసన ప్రకటనలు, ఆగ్రహ వ్యక్తీకరణలు. ప్రజా సంఘటితత్వానికీ, సంఘీభావానికీ, ఐక్యతకూ, ఆకాంక్షకూ చిహ్నాలు.

తెలంగాణ ప్రజల ఐక్యతనూ, ఆకాంక్షనూ ప్రకటించినంత బలంగా తెలంగాణ ప్రత్యర్థుల మీద ప్రభావం వేశాయా! ఆలోచించవలసి ఉంది. ఏదయినా ఒక నిరసన రూపం నిరసన తెలుపుతున్న ప్రజల ఐక్యతనూ, ఆకాంక్షనూ ఎంతగా ప్రకటిస్తుందో, ఎవరి మీద ఆ నిరసన వ్యక్తమవుతున్నదో వారి మీద అంతగా ప్రభావం వేయాలి. యథాస్థితి కొనసాగించడం కుదరదనీ, నిరసనకారుల ఆకాంక్షను గుర్తించి పరిస్థితిలో తగిన మార్పులు చేయక తప్పదనీ వారు గుర్తించేలా చేయాలి. ఇరవై నెలల్లో ప్రదర్శించిన అన్నిరకాల నిరసన రూపాలు నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షను తిరుగులేని విధంగా ప్రకటించాయి. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైనా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటు న్న పిడికెడు మంది కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు ఇసుమంత కూడా కదిలినట్టు కనబడడం లేదు. పైగా మొత్తం పరిస్థి తి డిసెంబర్ 9 కన్న ముందరి స్థితికి దిగజారినట్టు అనుమానం కలుగుతున్నది. అంటే తెలంగాణ ప్రజలు వేరువేరు స్థాయి ల్లో తమ శక్తికొద్దీ చేసిన త్యాగాలు, నిరసన ప్రకటనలు ఏ ఫలితమూ సాధించలేదా అని నిరాశ తలెత్తుతున్నది.

అందువల్ల ఈ ఇరవై నెలల నిరసన రూపాలను పునస్సమీక్షించవలసి ఉంది. పునస్సమీక్షించడమంటే ఆ రూపాలను తిరస్కరించడం కాదు. గౌరవించకపోవడం కాదు. సగౌరవంగానే వాటిని అంచనా వేసి వాటి సాఫల్య వైఫల్యాలను ముదింపు వేయాలి. వాటి ప్రయోజనాన్నీ, నష్టాన్నీ బేరీజు వేయాలి. ఉదాహరణకు ఈ ఇరవై నెలల నిరసన రూపాలలో ఆత్మహత్య అనే రూపం ఎంతమాత్రం అంగీకరించడానికి వీలులేనిది. దాదాపు ఏడు వందలమంది యువతీయువకుల విలువైన ప్రాణాలు ఇలా బలి అయిపోయాయి. ఏ తెలంగాణ సాధన తమ జీవిత లక్ష్యమని వారు అనుకున్నారో, ఆ తెలంగాణ సాకారం కాకుండానే వారు మన మధ్య లేకుండాపోయారు. సామాజిక స్థాయిలో మాత్రం ఆత్మహత్యకు అర్థం లేదు. ఎందుకంటే సమాజానికి గత్యంతరం లేకపోవడం, దిక్కుతోచకపోవడం ఉండవు. సామాజిక పరిణామాలు ఎంత వైవిధ్యభరితమైనవంటే ఎన్ని దారులు మూసుకుపోయినా మరొక దారి మిగిలే ఉంటుంది.

ఎక్కడా ఇక ముగింపు అని చెప్పవలసిన పరిస్థితి రాదు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ఇంకా అన్ని దారులూ ప్రయత్నించనే లేదు. అప్పుడే దారులు మూసుకుపోయాయని నిరాశ చెంద డం, ఆత్మహత్యకు పూనుకోవడం నిస్సందేహంగా తప్పుడు చర్యే. అలాగే ఈ ఇరవై నెలల పోరాట రూపాలలో పిండ ప్రదానం వంటి బ్రాహ్మణీయ, మూఢనమ్మక చర్యలు, శవదహనం, దిష్టిబొమ్మల దహనం వంటి సాంకేతిక, తంత్రశాస్త్ర, చేతబడి వంటి చర్యలూ వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఆకాంక్ష వంటి ఉదాత్తమైన ఆకాంక్షతో ఇవి సరిపోవు. ఇవేవీ ప్రత్యర్థి మీద నిజంగా ప్రభావం వేసే చర్యలు కావు.

ఇక సరైన పోరాట రూపాలు చేపట్టినప్పుడు కూడా అవి ప్రత్యర్థుల మీద ప్రభావం చూపేంత బలంగా జరగలేదు. ‘మీ నిరాహారదీక్షల వల్ల మీ కడుపే మాడుతుంది. మీ రాస్తారోకోల వల్ల మీ ప్రజల ప్రయాణానికే ఇబ్బంది కలుగుతుంది. మీ బంద్‌ల వల్ల మీ ప్రజాజీవనమే స్తంభించిపోతుంది. మీ విద్యాసంస్థల బంద్ వల్ల మీ పిల్లల చదువే చెడిపోతుంది’ అని ప్రత్యర్థులు పరిహాసమాడే స్థితి వచ్చింది. నిరాహారదీక్ష నైతిక ఒత్తిడి తేగల చర్యే గాని ఇవాళ తెలంగాణ ప్రత్యర్థులు ఎంత నీతి లేని వారంటే నిరాహారదీక్ష వంటి రూపం వారిమీద ఎటువంటి ప్రభావమూ వేయదు. ఇక మిగిలిన రూపాలు ఏకకాలంలో ప్రజాజీవనాన్ని, ప్రభుత్వ పాలననూ స్తంభింపజేసే శక్తిగలవి. కాని ఈ ఇరవై నెలల్లో అవి ప్రజా జీవనాన్ని స్తంభించినంతగా, ప్రభుత్వాన్ని, పాలకవర్గాలను కదలించగలిగాయా ఆలోచించవలసే ఉంది.

ఈ నిరసన రూపాలు ఎంత గొప్పగా, విస్తృతమైన ప్రజా మద్దతుతో, ప్రజా భాగస్వామ్యంతో జరిగినప్పటికీ, అవి ప్రత్యర్థుల మీద ప్రభావం చూపకపోవడానికి ప్రధాన కారణం, అవి నిరసనగా మాత్రమే మిగిలిపోవడంపతిఘటనగా ఎదగకపోవడం. తమ వనరులను దోచుకోవడం ఆగిపోవాలంటే ఆ వనరుల దోపిడీని ఎక్కడికక్కడ ప్రతిఘటించక తప్పదు. నిధుల కేటాయింపులో, నీళ్ల పంపిణీలో నియామకాల్లో సాగుతున్న అన్యాయాలను ఎక్కడికక్కడ ప్రతిఘటించక తప్పదు. ఈ అసమానతకు,దోపిడీకి, వివక్షకు కారణమైన పాలనను ప్రతిఘటించక తప్పదు. కాని దురదృష్టవశాత్తూ ఈ ప్రతిఘటనలేవీ జరగలేదు, ప్రారంభమైనవి కూడా ముందుకు సాగలేదు.

సకల జనుల సమ్మె ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ప్రతిఘటన. దోపిడీని, పీడనను, ప్రతిఘటించడం. ప్రతి ఒక్కరూ చేయవలసినది, చేయగలిగినది. వ్యక్తిగతస్థాయి నుంచి సామాజిక స్థాయి వరకు ఎన్ని రూపాలలోనయినా ప్రతిఘటన ఉండవచ్చు.ఈ ప్రతిఘటన కోస్తా నుంచి, రాయలసీమ నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన సాధారణ ప్రజల మీద కానక్కరలేదు. ప్రజల మధ్య విద్వేషాలూ, ఘర్షణలూ అవసరం లేదు. తెలంగాణ ఫిర్యాదు పాలకుల మీద, పాలక విధానాల మీద, తెలంగాణలో పుట్టి కూడా ఆ పాలకులలో భాగమైనవారి మీద మాత్రమే గాని, ఇతర ప్రాంతాల సాధారణ ప్రజల మీద కాదు.
నేడు జరుగవలసిన ముఖ్యమైన ప్రతిఘటన తెలంగాణ ప్రత్యర్థుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల మీద. ఆ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు నెరవేరకుండా ప్రతిఘటించడం ఇవాళ్టి అవసరం.

ఈ ఇరవై నెల ల్లో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిం చే రాజకీయవాదుల, వ్యాపారుల ప్రయోజనాలు తెలంగాణ గడ్డమీద యథావిధిగా సాగిపోయాయి. తెలంగాణను వ్యతిరేకించే, పైకి సమర్థిస్తున్నట్టు కనబడి లోపల వ్యతిరేకించే, కపటపు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు చీమ తలకాయంత నష్టం కూడా జరగలేదని భావించే పరిస్థితి ఉంది. చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాము వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటించిన పార్టీ లు కూడా తెలంగాణ గడ్డమీద సజావుగా తిరుగుతున్నాయి. ఉత్తుత్తి రాజీనామాలు చేసి, తెలంగా ణ వ్యతిరేకుల అంటకాగుతున్న నాయకులు తెలంగాణలో మామూలుగా తిరుగుతున్నారు. తెలంగాణ సమాజం ముక్తకం ప్రకటిస్తున్న ఆకాంక్షను వ్యతిరేకిస్తున్న వారి రాజకీయ ప్రయోజనాలు తెలంగాణలో దెబ్బతినక తప్పదని ప్రకటిస్తే తప్ప, వారిని ప్రతిఘటిస్తే తప్ప రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరికి అడ్డుకట్ట పడదు. అలా రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని అర్థమైనప్పుడు మాత్రమే ఆ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తెలంగాణను వ్యతిరేకించి తమ ఉనికిని కోల్పోవడమూ, తెలంగాణ సాధన కృషిలో భాగం కావడమూ తేల్చుకోక తప్పని స్థితి వస్తుంది. ఆ స్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపు దారి తీస్తుంది.

ఇవాళ రాజకీయాలంటే వ్యాపారమే. కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిక్షిశామికవేత్తలు రాజకీయాల్లో చేరి తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. తెలంగాణ ను వ్యతిరేకిస్తున్నదీ ఈ వ్యాపార-రాజకీ య వర్గమే. తెలంగాణను వ్యతిరేకిస్తూనే తెలంగాణలో వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న ఈ వర్గపు ఆర్థిక ప్రయోజనాలను ప్రతిఘటించనంత వరకూ, వారి ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టనంతవరకూ వారు తెలంగాణను వ్యతిరేకిస్తూనే ఉంటా రు. ఈ డబ్బు సంచులే పట్టుకుని ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉంటారు. ఇలాంటి వారు డజన్లకొద్దీ ఉన్నారు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, తెలంగాణ ప్రథమ శత్రువుగా తనను తాను ప్రకటించుకున్న రాజకీయ వ్యాపారికి చెందిన విద్యుత్ కర్మాగారం సింగరేణి బొగ్గుతోనే నడుస్తున్నది. అది ఈ ఇరవై నెలల్లో ఒక్కరోజు కూడా బొగ్గు కొరతను ఎదుర్కోలేదు. ఈ ఇరవై నెలల్లో కూడా వందలకోట్ల రూపాయల లాభాలు సంపాదించింది.

కనుక ఈ సకల జనుల సమ్మె సందర్భంగానైనా తెలంగాణ వ్యతిరేక శక్తుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ప్రతిఘటిస్తామని శపథం చేయవలసి ఉంది. అరణ్యవాసమూ, అజ్ఞాతవాసమూ అయిపోయి, రాయబారం కూడా విఫలమై, ఇక యుద్ధం తప్పదని తెలిసిన ఈ క్షణాన జమ్మిచెట్టు మీంచి ఆయుధాలు దించక తప్పదు. సకల జనుల సమ్మె ఆ యుద్ధానికి నాంది కావాలి.

-ఎన్.వేణుగోపాల్

35

VENUGOPAL N

Published: Fri,January 31, 2014 12:29 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆఖరిరోజు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్రప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాద

Published: Fri,August 2, 2013 01:12 AM

ఆనందం, అయినా అనుమానాలు

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజా ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ప్రజలు అపూర్వమైన, అసాధారణమైన విజయం సాధించారు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ అ

Published: Thu,June 27, 2013 11:44 PM

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు

Published: Wed,October 10, 2012 06:04 PM

మహాజనాద్భుతం సాగరహారం

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల స

Published: Wed,October 10, 2012 06:51 PM

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవ

Published: Sat,October 6, 2012 04:04 PM

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ ప్రబోధం

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వివి గిరికి వేయమని కాంగ్

Published: Sat,October 6, 2012 04:04 PM

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి

Published: Sat,October 6, 2012 04:10 PM

సమ్మె నేర్పుతున్న పాఠాలు

తెలంగాణ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో నలభై రెండు రోజులుగా చరివూతాత్మకంగా, విశిష్టంగా, అసాధారణంగా సకల జనుల సమ్మె జరుగుతున్నది. నాలుగు

Published: Sat,October 6, 2012 04:09 PM

సకల జనులకు నీరాజనం

సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న

Published: Sat,October 6, 2012 04:09 PM

ధవంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా?

పది సంవత్సరాలకు పైగా అరుంధతీరాయ్ ఈ దేశపు శక్తిమంతమైన మేధో ప్రతిపక్షంగా ఉన్నారు. అంతకుముందు ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలతో బుకర్ ప

Published: Sat,October 6, 2012 04:07 PM

మతి తప్పిన తలకిందుల మేధో మథనం

-ఎన్. వేణుగోపాల్ కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏ ఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి

Published: Sat,October 6, 2012 04:05 PM

మరుపురాని తెలంగాణ బిడ్డ..

- ఎన్ వేణుగోపాల్ జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్

Featured Articles