అదే చివరి వీడుకోలు..


Sat,October 6, 2012 03:21 PM

maoists talangana patrika telangana culture telangana politics telangana cinema
అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-6
కిషన్‌జీ ప్రపంచానికి పరిచయం చేసింది లాల్‌గఢ్. ఆ లాల్‌గఢ్ ఉద్యమాన్ని ప్రపంచం ముందుంచడానికి ఆయన మీడియాను శక్తివంతంగా ఉపయోగించుకొని తనగళంగా మార్చుకున్నాడు. ఆయన మీడియా వ్యక్తులతో సజీవ సంబంధాల్లో ఉండేవాడు. విప్లవోద్యమ చరివూతలోనే మున్నుపెన్నడు లేని విధంగా ఆయన మీడియాతో వ్యవహారించి పార్టీ వైఖరిని వెంట ప్రజల ముందు ఉంచడానికి చాలా రిస్క్‌తో కూడిన శ్రమ తీసుకున్నాడు. చిదంబరం, జికె పిళ్లై కుట్రలను ఎండగట్టాడు. కిషన్‌జీ మృత శరీరంపై ఉన్న ప్రతి గాయంలో క్రౌర్యం నిండిన వాళ్ల ముఖాలు నగ్నంగా కనిపిం చాయి.కిషన్‌జీ తన విప్లవాచరణలో జరిగిన పొరపాట్లను కూడా నిజాయితీగా ఒప్పుకుని సరిదిద్దుకునే వాడు. ఆత్మవిమర్శతో పునీతుడయ్యేవాడు. కొన్నిసందర్భాల్లో వ్యక్తిగా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని ఆయన చాలా నిజాయితీగా సీసీ ముందు అంగీకరించాడు. లాల్‌గఢ్ ఉద్యమాన్ని సీసీ ఎత్తిపడుతూ ఆయనను అభినందించింది. దేశవ్యాప్తంగా లాల్‌గఢ్‌లను సృష్టించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కొనియాడితే, లాల్‌గఢ్ ఏక్ ప్యారా నామ్ అంటూ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ దాను ఎత్తిపట్టారు. కిషన్‌జీ ఒరవడిని పట్టుకోవడం తేలికైన పని కాదు.

కానీ ఆయన ప్రత్యక్ష శిక్షణలో తర్ఫీదైన ప్రజలు తప్పక ఆ ఒరవడిని కొనసాగిస్తారు.
పార్టీకి అరుదైన నాయకత్వ కేడర్లలో కిషన్‌జీ ఒకరు. ఆయన నిరంతర ఆధ్యయనశీలి. సిద్ధాంతాన్ని ఆచరణకు అన్వయిస్తూ పొందే నూతన అనుభవాలతో దానిని మరింత సంపద్వంతం చేశాడు. ఎత్తుగడలు రూపొందించడంలో మంచి దిట్ట. ఎత్తుగడలంటే ఎడమచేతి వాటంగా ఉండాలంటూ నవ్వేవాడు. ఎత్తుగడల విషయంలో బిగుసుకపోయి ఉండకూడదని చెప్పడమే గాదు చేసి చూపారు. పాలక వర్గాల మధ్య తలెత్తే వైరుధ్యాలను చాకచక్యంగా ఉపయోగించుకోవాలని చెప్పేవాడు. తెలివిగా ఉండాలి తప్ప గుడ్డిగా మోసపోకూడదని హెచ్చరించేవాడు. 190-2010 మధ్య పార్టీ రూపొందించిన మౌలిక విధానాలు, కార్యక్షికమాలన్నింటిలో ఆయన చొరవగా పాల్గొని వాటిని రూపొందించడంలో కృషి చేశాడు. పార్టీ వ్యూహం-ఎత్తుగడలు, కార్యక్షికమం-నిబంధనావళితో పాటు, మహిళాఉద్యమ దృక్పథం, భారతదేశంలో కులసమస్య, అర్బన్ పాలసీ తదితర విధానాల రూపకల్పనలో ఆయన కృషి ఎనలేనిది. పార్టీ కేడర్లను రాజకీయంగా ఎదిగించుకోవడం పైనే విప్లవోద్యమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, నూతన తరాలకు గడిచిన తరాల పోరాట చరివూతను అందించడంతో పాటు వర్తమాన పరిస్థితులలో విధాన నిర్ణాయకులుగా వారిని తీర్చిదిద్దాలని చెప్పేవాడు. పార్టీ క్రమం తప్పకుండా రాజకీయ పాఠశాలలను నడిపించాలనీ కోరుతూ తానెక్కడున్నా అందుకు నిర్ధిష్ట కార్యాచరణకు పూనుకునే వాడు.

రాంజీ పార్టీకి ఒక గురువు అని చెపుతూ మధ్య రీజియన్ రాజకీయ పాఠశాల కామ్రేడ్ గౌతం ఆయన జ్ఞాపకాలు ఉత్తరంలో రాశాడు. ‘అన్నిరంగాలలో రాణించిన రాంజీ అన్ని ప్రాంతాలలో ఉద్యమ బీజాలు నాటాడు. మనుషుల మధ్య సంబంధాలు- కమిట్‌మెంటును ఆచరణలో విప్లవ గాఢతను పెంచి పట్టుదల, విశ్వాసాలను మరింత ఇనుమడింప చేస్తాయి. ఈ రెండూ పంచి ఇచ్చిన మన అమరుడు రాంజీ చిరకాలం గురువు స్థానంలో నిలుస్తాడు’ అని ఆయన రాశారు. రాంజీ జ్ఞాపకాలు, కాంట్రిబ్యూషన్ గురించి చెప్పకోవాలంటే ఒక సుదీర్ఘ విప్లవోద్యమ చరిత్ర గురించి మాట్లాడుకోవాలి. విప్లవోద్యమంలో పాల్గొని అసువులు బాసిన వాళ్ల గురించి చెప్పుకోవడం అంటే వాళ్లు పనిచేసిన కాలాన్ని, ఎ దుర్కొన్న సమస్యలను,సాధించిన ఫలితాలను మరో మాటలో యావ త్తు కృషిని చెప్పుకోవడం. వాటిని విశ్లేషించుకోవడం, వారి త్యాగాలను ఎత్తిపట్టడం.

భవిష్యత్‌లో వాటి వెలుగులో పోరాడటం గురించి మాట్లాడుకోవడం. ఉద్యమంలో కొంతకాలం పనిచేసిన వాళ్ల విషయంలో చెప్పుకోవడం కొంత సులువే. కానీ విప్లవోద్యమ చరిత్ర నిర్మాణంలో తొలినుంచి భాగమై సుదీర్ఘ కాలం పని చేసి, ఆ చరివూతలో ఒక భాగమై, ఆ చరివూతకే అంకితమై ఒక కొత్త చరివూతను అందించి వెళ్లిన వాళ్ల గురించి మాట్లాడుకోవడం అంటే, వాళ్లను ఆవిష్కరించుకోవడం అంటే చాలా కష్టమైన పనే. అది సమష్టి కృషి ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడే చరివూతకు అమరుల త్యాగాలకు న్యాయం జరుగుతుంది. ఆ కృషిలో నా అనుభవాలు ఏ మేరకు తోడ్పడినా సంతోషమే. రాంజీ అంతిమ యాత్రలో పాల్గొన్న గద్దర్ ‘ఎవరైతే తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి నెత్తుటిబొట్టు ఇవ్వగలిగిండ్లో వాళ్లే చరివూతను మార్చినారు.వాళ్లే మారుస్తారు’ అని అన్నారు. ఆ నెత్తుటి చరివూతను సమష్టిగానే ఆవిష్కరించుకోవాలి.

అలాగే రాంజీ దగ్గర తొలి కొరియర్‌గా, పెద్దపల్లి పట్టణంలో పీపుల్స్‌వార్ పార్టీ నిర్మించిన తొలి పార్టీ సెల్ మెంబర్‌గా పనిచేసిన ఠాకూర్ జగన్‌మోహన్‌సింగ్ అమరుడు కిషన్‌జీని చక్కగా వ్యక్తీకరించాడు. ‘కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకోవడం ఒక ఎత్తు, కమ్యూనిస్టుగా జీవించడం ఒక ఎత్తు. చివరకు కమ్యూనిస్టుగా మరణించినవాడే నిజమైన కమ్యూనిస్టు’ అని. ఆయనకు వాళ్ల మామ రాంజీ ( మామా అని సంబోధించేవాడు) చెప్పిన విషయాలను ఉటంకించాడు. అదెంత కఠినమైన కార్యమో రాంజీ తన ఆచరణ ద్వారా ప్రజలకు చెప్పాడని ఆయన అన్నారు. నిజమైన విప్లవకారుడిగా తుది శ్వాస విడిచిన కోటన్నకు మరణం లేదు. ఆయన అజరామరుడు. దండకారణ్యంలో రూపొందుతున్న ప్రజావూపత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను, స్వావలంబన విధానాలను, నాశనం చేయడానికి దిగిన భారత సైన్యాలను కిషన్‌జీ చెప్పినట్టు మనందరం దృఢంగా ఎదుర్కొందాం.

కిషన్‌జీ 2011 ఫిబ్రవరి 11 నాడు మా నుంచి సెలవు తీసుకొని వెళ్తుతున్నపుడు పదుల సంఖ్యలో బారులు తీరి నిల్చున్న తన ప్రియమైన సహచరలందరినీ ఆయన ఆలింగనం చేసుకొని హృదయంతరాలలో నుంచి ఉబికివస్తున్న దుఃఖాన్ని బయటపడనీయకుండా ఆపుకొని బలంగా కరస్పర్శ చేసి శక్తినీ, ఉత్సహాన్ని నింపి వెళ్లాడు.ఆయన వెళుతున్నప్పుడు గుండెలు మరింత బరు మేమంతా ఆయన వెనుకే చాలా దూరం వెళ్లాం. కోసా, సుఖదేవ్, మాసే, మంగ్తూ, సోమా,తారాచంద్ .... ఇంకా చాలా మందిమి ఉన్నాం. మాలోనే ఆయన మనసైన మైనక్క ఉంది. నడుస్త్తూంది. బిగించిన పిడికిప్లూత్తి ఎన్నో సార్లు లాల్‌సలాం! అన్నాం. ఆయన కనుమరుగయ్యాడు. నిశ్శబ్దం ఆవరించింది. ఆ దృశ్యాన్ని మాసేదీది అక్షరాల్లో భద్రపర్చి నాకిచ్చింది. నేను మీతో పంచుకున్నాను.

‘నడుద్దాం! చివర వరకూ నడుద్దాం. రాంజీ ఆశయాల వెలుతుర్లలో, ఆయన వదిలి ఎర్రెపూరని దారుల్లో భారత సైన్యాలతో తలపడుతూ ముందుకు పోదాం!’
కోటన్న చెప్పి వెళ్లిన ముగింపు మాటలతో నా జ్ఞాపకాలను మీలో భద్రపరచుకుంటాను ‘ ‘మనం భారత సైన్యాన్ని ఎదుర్కొనబోతున్నాం. మనం భారత సైన్యాన్ని ఓడించాలి. మనం సైన్యంతో తలపడకుండా దండకారణ్యాన్ని సం పూర్ణ విముక్తి ప్రాంతంగా నిలబెట్టుకోలేం. మన జనతన రాజ్యం నిలబడదు. అది నిలబడాలంటే భారత సైన్యాన్ని ఓడించాలి’. ఆ మహానాయకుడి జ్ఞాపకాలు మా అందరిలో ఇంకా తాజాగానే ఉన్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిని అలింగనం చేసుకున్నపుడు వాళ్లిద్దరి కళ్లల్లో నిండిన ఆనంద భాష్పాల్లో నాకు అగుపించిన కాంతిరేఖలు నా స్మృతి పథంలో భద్రంగా ఉన్నాయి. వరుసల్లో నిలబడ్డ అందరిలాగే వెక్కి వెక్కి ఎడుస్తున్న మోతీని తన గుండెలకద్దుకొని ఓదారుస్తుంటే ఆయన్నెరుగని ఆయన కన్నకూతురు ఆ క్షణంలో తళుక్కున గుర్తొచ్చి నా కనుల్లో కన్నీరు నిండింది. ఆ కన్నీటితో మసకబారిన చూపులోంచి మసక మసకగా కనిపించి మా అందరికి వీడ్కోలు పలికి ప్రయాణమయ్యాడు కిషన్‌జీ. కర్తవ్య నిర్వహణ కోసం బయలు దేరిన ఆయన మరెప్పుడూ కానరాకుండా పోతాడని అనుకోలేదు.

అయినా.. కిషన్‌జీ మన నుంచి దూరం కాలేదు. విప్లవాకాశంలో ధృవతారై.. మార్గం చూపుతూనే ఉన్నాడు. కిషన్ జీ భారత విప్లవోద్యమానికి వేగు చుక్క. ఆ నక్షత్రం చూపుతున్న బాటలోనే మనమంతా కదులుదాం. మిత్రులారా! సహచరులారా! కిషన్‌జీ స్ఫూర్తిగా మరింత బోల్షివిక్ స్పిరిట్‌తో, ఉక్కు క్రమశిక్షణతో విప్లవాచరణలో ముందుకు పోదాం. కిషన్‌జీ ఆశయాలను నెరవేర్చుదాం. ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

-మల్లోజుల వేణుగోపాల్
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు

35

VENUGOPAL MALLOJULA

Published: Sat,October 6, 2012 03:21 PM

అందరినీ వెన్ను తట్టిన ‘అన్న’

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-5 రాం జీ నక్సల్‌బరీకి పుట్టినిల్లయిన పశ్చిమబెంగాల్‌ను కేంద్రం చేసుకొని విప్లవ కారుల ఐక్యతకు చాలా కృష

Published: Sat,October 6, 2012 03:22 PM

ప్రజాసైన్యాన్ని నిర్మించిన సేనాని

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-4 కిషన్‌జీ తన స్వప్నం‘దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా’ చేయడమేనని చెప్పుకున్నారు. ఇందుకోసం ఆయన 196-9

Published: Sat,October 6, 2012 03:22 PM

ఫలించిన ప్రహ్లాద్ స్వప్నం...

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-3 1977-80 మధ్య కిషన్ జీ (అప్పడప్పుడే ప్రహ్లాదయ్యాడు) చాలా కాలంగా లీగల్‌గా, మరికొంత కాలం సెమీ-లీగల్‌గా

Published: Sat,October 6, 2012 03:23 PM

జైత్రయాత్ర కెరటం ‘కోటి’

కో టన్న ఎమ్జన్సీ చీకటి రోజుల్లో తన ఇంటికన్నా ఎక్కువగా బంధువుల ఇళ్లనూ, మిత్రుల ఇళ్లనూ, వారి మిత్రుల ఇళ్లనూ తనకూ, తన తోటి రహస్యపార్ట

Published: Sat,October 6, 2012 03:23 PM

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు

కిషన్‌జీ జ్ఞాపకాలు 2011 నవంబర్ 24 నుంచి ఇప్పటివరకూ నిరంతరం నాస్మృతిపథంలో మెదులుతూనే ఉన్నాయి. 54 సంవత్సరాల నా జీవితం ఆయన నుంచి ఒక్

Featured Articles