అందరినీ వెన్ను తట్టిన ‘అన్న’


Sat,October 6, 2012 03:21 PM

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-5
రాం జీ నక్సల్‌బరీకి పుట్టినిల్లయిన పశ్చిమబెంగాల్‌ను కేంద్రం చేసుకొని విప్లవ కారుల ఐక్యతకు చాలా కృషి చేశాడు.199లో ‘పార్టీయూనిటీ’తో సాధించిన ఐక్యతలో, 2004లో ‘ఎంసీసీఐ’తో ఏర్పడిన ఐక్యతలో రాంజీ పోషించిన పాత్ర కీలకమైనది. ఈ రెండు పార్టీలే కాకుండా బెంగాల్‌లోని సంస్థలు , వ్యక్తులుగా ఉన్న చాలామంది విప్లవకారులతో ఐక్యతను సాధించడంలో కృతకృత్యుడయ్యాడు.ఆయన చేపట్టిన ఐక్యతా కృషి దేశంలోని విప్లవ సంస్థలకే పరిమితం కాలేదు. దశాబ్దాలుగా మన దేశంలో విడిపోయే హక్కుతో సహా స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడుతున్న జాతి విముక్తి పోరాట సంస్థలతోనూ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా కుదిరిన అవగాహనా ఒప్పందాల పై పార్టీ తరఫున ప్రదీప్ పేరుతో సంతకాలు చేశారు. పార్టీ తరఫున చేపట్టిన ఐక్యతా కృషిని మరింత ముందుకు తీసుకొని పోతూ దక్షిణాసియా దేశాల్లోని మావోయిస్టు పార్టీలు, సంస్థలమధ్య భారత విస్తరణ వాదానికి వ్యతిరేకంగా సమైక్య అవగాహనను పెంపొందింపచేసి ‘సీ.కంపోసా’ నిర్మాణానికి పునాదులు వేశారు.

1925-72 మధ్య భారత కమ్యూనిస్టుపార్టీ వివిధ సందర్భాలలో విడిపోయిన చరివూతనే కలిగి ఉంది. 190లో ఆ గుణపాఠాల వెలుగులో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ(మానొ) (పీపుల్స్‌వార్) చరిత్ర మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నాలుగు దశాబ్దాలలో దేశంలోని విప్లవశక్తులను, సంస్థలను, దక్షిణాసియా దేశాల్లోని విప్లవ సంస్థలను సమైక్య పర్చిన చరివూతనే ఎత్తిపడుతున్నది. పార్టీలో సంక్షోభాలు తలెత్తినప్పుడు (194, 1991) వారెంతటి నాయకులైనా వ్యక్తులుగా పార్టీకి దూరమయ్యారే తప్ప పార్టీ చీలిపోలేదు. ఈ క్రెడిబులిటి నల్లా ఆదిడ్డి, ఆజాద్, కిషన్‌జీ లాంటి వాళ్లకే దక్కుతుంది. ప్రపంచ సోషలిస్టు విప్లవ లక్ష్యంతో నిజమైన విప్లవకారుల మధ్య, కృషి చేసి సాధించిన సమైక్యత కచ్చితంగా వారి ఆశయాలను పరిపూర్తి చేసి తీరుతుంది. విప్లవోద్యమంలో మహిళలను సంఘటితం చేయడంపై కిషన్‌జీ లెనినిస్టు పద్ధతికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. పార్టీ కొనసాగిస్తున్న విప్లవకార్యాచరణలో ‘మహిళలకు విడిగా ఒక సంఘం ఉండడం అవసరం’ అంటూ దాని నిర్మాణాన్ని ప్రోత్సహించి దండకారణ్యంలో, గడిచిరోలిలో ‘ఆదివాసీ మహిళాసంఘం’ నిర్మాణానికి బీజాలు వేశారు.

దీనికోసం ఆయన చేసిన కృషికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పరంపరను ఆయన 2007లో నందిక్షిగాంలో ‘మతాంగి మహిళాసంఘటన్’ను , 2010లో లాల్‌గఢ్‌లో ‘నారీ ఇజ్జత్ బచావో కమిటీ’ని నిర్మించడం వరకు కొనసాగించారు. దండకారణ్య మహిళా పోరాటాలను ఎత్తిపడుతూ 1993లో పాట్నా సెమినార్‌కు పత్రం రాసి పంపారు. అణగారిన మహిళల విషయంలో పాలక వర్గాల మహిళా కమిషన్‌లు అవలంబిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ లాల్‌గఢ్ మహిళల పక్షాన నిలిచి బెంగాల్ మహిళా కమిషన్‌కు రాసిన లేఖ ఆయన చివరి రచనలో ఒకటి. గ్రామీణ పీడిత మహిళలను సంఘటితం చేయడమే గాకుండా వారిని సాయుధం చేయడం, గెరిల్లా వీరవనితలను యుద్ధంలో ప్రోత్సహించడం , ప్రజా మిలీషియా నిర్మాణాల్లోకి తీసుకరావడం, వారికి బాధ్యతలు ఇచ్చే విషయంలో పురుషులతో పోటీ పనికి రాదంటూ ఒక విధానాన్ని పార్టీకి అందివ్వడం లాంటి చేశాడు. వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపడం, సాహితీవూపియులైన మహిళలను రచనలకు ప్రోత్సహించడం , ప్రజాయుద్ధంలో తమ జీవిత సహచరులను కోల్పోయిన మహిళలకు అండగా నిల్చి ధైర్యాన్నివ్వడం, ఆదివాసీ మహిళా కామ్రేడ్స్‌ను అన్ని రంగాలలో ప్రోత్సహించి వెన్ను తట్టి ముందు నిలపడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవలసిందే.

గతంలో విప్లవోద్యమాలు విజయవంతం అయిన ఏ దేశంలోనూ అక్కడి ప్రజాసైన్యాలలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు లేరన్నది ఒక వాస్తవం. లాంగ్‌మార్చ్ నాటికి చైనాలో వేళ్లమీద లెక్కించే సంఖ్యలోనే మహిళలున్నారు. సార్వవూతిక తిరుగుబాటు జరిపిన రష్యాలో కూడా అంతే. ఎర్రసైన్య నిర్మాణం చైనాలో జరిగిందానికి భిన్నంగా మనం నిర్మించుకుంటున్న సైన్యంలో మహిళలు పెద్ద ఎత్తున భాగం అవుతున్నారు. ‘పీఎల్‌జీఏ’లో పెద్ద ఎత్తున మహిళలు భాగస్తులు కావడం, నిర్దిష్టంగా దండకారణ్యంలో 40 శాతం మహిళలు పీఎల్‌జీఏలో ఉండడం పురుషస్వామ్యం అనే అదనపు కాడిని భరిస్తున్న ఆకాశంలో సగం విముక్తికి చాలా మంచి పరిణామమనీ గ్రహించిన రాంజీ, వారిని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ వారి అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొన్నారు. ఆయన అమరత్వం తర్వాత ‘క్రాంతికారి ఆదివాసీ మహిళాసంఘటన’ అధ్యక్షురాలు నర్మదక్క ఆయన జ్ఞాపకాలతో నాకు రాసిన ఉత్తరంలో ‘మనల్ని ఓదార్చే మన అన్న వెళ్లిపోయాడుగా! దుఃఖంతో చిన్నబోతూ పడుకుంటే చేయిపట్టి లేపి ధైర్యానిచ్చే మన అన్న లేడుగా! మలేరియా వస్తే కలలో వచ్చి పలకరించే అన్న నిజంగానే కల అయిపోయిండుగా! అన్న అందించిన చేయి ఊతంతో, విశ్వాసంతో సూర్జాగఢ్ నుంచి జంగల్‌మహల్ వరకు అర్ధాంతరంగా ఆగిపోయిన వారధిని నిర్మించడానికి ఆయన ఆశయాలను పరిపూర్తి చేయడానికి ప్రతినబూనుదాం’ అంటూ కర్తవ్యాన్ని ప్రకటించింది.

ప్రజాయుద్ధంపై నేను చదివిన కొన్ని పుస్తకాలు గానీ, ఆ తర్వాత చదివిన మహిళా ఉద్యమ అధ్యయన సామాగ్రి గానీ, రాంజీ, శ్యాంలు వివిధ గ్రంథాలయాల నుంచి, ఇతర మార్గాల నుంచి ఎంతో శ్రమపడి సంపాదించి నాకు అందచేయడం ద్వారానే సాధ్యమైంది. వారి నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని నా ఆచరణ నన్నెప్పుడూ కోరుతుంది. శ్యాం, రాంజీలు ఆదివాసీ జీవితాలపై, యుద్ధంపై, మహిళలపై మార్కెట్లో లభ్యంగానీ అరుదైన సాహిత్యాన్ని కూడా అడవుల్లో ఉన్న నాకూ, నా లాంటి సహచరులకు అందించడానికి చాలా శ్రమపడేవారు. ఆ శ్రద్ధ మళ్లీ నాకు మా ‘సుమిత్ దా’ లోనే అగుపడింది. అయితే నా ప్రియమైన ఆ సహచరులు శ్యాం, రాంజీలు అమరులు కాగా, సుమిత్ దా శత్రునిర్బంధంలో యావజ్జీవ కారాగార శిక్షతో యాతనలు భరిస్తున్నారు. అయితే వారు సంపాదించి పెట్టిన విప్లవ వనరులు ఎన్నటికీ వట్టిపోవు. సూర్జాగఢ్ నుంచి లాల్‌గఢ్ వరకు, అలాగే ఇంకా అనేక ప్రాంతాల్లో విప్లవిస్తున్న సహచరుల అవసరాలను దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విప్లవాభిమానులు తప్పక తీరుస్తారు.

అసిధార(కిషన్‌జీ) కు కలం పేర్లు అనేకం. విప్లవ జీవితంలో నుంచీ, విప్లవ కార్యాచరణలో నుంచీ ఆయన కవితలు, రచనలు పుట్టుకొచ్చేవి. ఆయన కవితలు, రచనలకు వస్తువు విప్లవోద్యమమే. ఆయన రచనల్లో కవితల్లో మాట్లాడే వాళ్లు ప్రాణమున్న మనుషులు. మనసున్న తన ప్రియమైన కామ్రేడ్లూ. ఆయన రచనలకు, భావాలకు మూలం ఆయన నమ్మిన భావజాలం మార్క్సిజమే. ఏ కవికైనా,రచయితకైనా,కథకుడినైనా, వ్యాసకర్తనైనా నడిపేది వాళ్లకున్న భావజాలమే. ‘ఏ భావజాలానికి బందీలం కాము, ఏ భావజాలం మా మెదళ్లపై స్వారీ చేయకూడద’నీ భావించేవాళ్లు ఉత్త అమాయకులనే చెప్పుకోవాలి. కిషన్‌జీ పలకరింపు ఎంత ప్రేమగా ఉండేదో, అసిధార కవిత అంతే స్ఫూర్తిని అనుభూతిని ఇచ్చేది. ఆయన కరస్పర్శ ఎంతటి శక్తిని ఇచ్చేదో, ఆయన రాసి పంపిన కవితా చరణాలు అంతే బలాన్నిచ్చేవి. ఆయన చెప్పిన మాటలు సమస్యల్లో ఉన్న వారికి ఎంతటి ధైర్యాన్నిచ్చేవో ఆయన రాసి పంపిన ఉత్తరాలు పది కాలాల పాటు పదిలపరచుకొని మనసు చిన్నబోయి కూర్చున్నప్పుడు మళ్లీ మళ్లీ చదువుకొని ఉత్తేజాన్ని నింపుకునే కామ్రేడ్స్ ఎందరో! శాంతక్కకు కోటన్న రాసిన ఉత్తరాన్ని ఆయన అమరత్వం తర్వాత నాకు ఆమె పంపింది. ‘ శాంతక్కా ! మన బిడ్డలు దూరంగా ఉన్నా, మనం తయారు చేసిన బిడ్డలు ఎదుగుతున్నారు. అడవిలో ఆదివాసీల మధ్య జీవిస్తూ.. నూతన తరాలకు నీవు అందిస్తున్న విద్యాబుద్ధులు కొత్త తరానికి, కొత్త దారులు చూపుతున్నాయి ’ అంటూ ఎప్పుడో రాసిన ఉత్తరం ఇన్నాళ్లు ఆమె తన నాప్‌సాక్‌లో దాన్ని భద్రంగా దాచుకుంది. ఆయన ప్రోత్సాహం ఆమె హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆయన 2011 ఫిబ్రవరిలో డీకే నుంచి వెళుతూ మూడు దశాబ్దాలుగా తనకు ప్రియమైన, అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కామ్రేడ్ కోసాకూ (దండకారణ్యానికి చేరుకున్న మొదటి బ్యాచ్‌లో ఒకరు) ఆయన సహచరికి మా నేస్తమా అంటూ ఇలా రాశాడు.

మా నేస్తమా/మా నేస్తమా.. కోసదాద,
దీర్ఘకాల బంధం మనది/అనుబంధమే బంధమై
విప్లవోద్యమంలో సాగివచ్చాం/సెలయేళ్లు దాటాం
పర్వతాలను ముద్దాడాం/అడవి బిడ్డల చెంత చేరాం
జీవం వారేనని జీవితం వారిదేనని నడిచాం/కోసదాద, అక్కా రాధక్క!
విప్లవం కుట్ర కాదన్నాం/అయినవాళ్లంటే వెంటసాగినోళ్లని చెప్పాం
జంటగా నడిచాం/మీరు మేమై-మేము మీరై నడిచాం
మనం కలిస్తే వెన్నెలైంది/మనం సాగితే ప్రజలు ఎదురొచ్చి నిలిచారు
పంట మనదే-ఫలం మనదే/యువత మనదే-యుద్ధమూ మనదే
భవిష్యత్ మనదే/మనం-జనం బిడ్డలం
పోరు బిడ్డలం/పోరాటమే మన ఊపిరి
సెలవ్-మివూతులారా!
-మీ రాంజీ
24-2-2011
అలాగే ఆయన మాడ్-ఉత్తర బస్తర్ సంయుక్త డివిజన్ కార్యదర్శి రాజమన్‌కు రాసిన ఉత్తరం ఎదుగుతున్న కొత్త తరానికి ఆశా, విశ్వాసం నింపుతుంది. ఆయన నాలుగేళ్లుగా దాన్ని ఎంతో అపురూపంగా భద్రపరుచుకున్నాడు. దండకారణ్య రచయితల్లో ‘ఫీనిక్స్’ ఒక మంచి కవి. రచయిత ఫీనిక్స్‌కు, అసిధారకు అన్యోన్యం ఎక్కువ. అసిధార చొరవ, ముందుచూపు, విశాలత్వం, కామ్రేడ్లీ తత్వం ఫీనిక్స్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు. ‘అసిధార’ డీకే చివరి పర్యటనలో (అదే చివరి పర్యటనగా ఎవరమూ అనుకోలేదు!) ఫీనిక్స్‌ను కలవలేకపోయాడు. కానీ, తన మనసులోని మాటను ఫీనిక్స్‌కూ, అతని సహచరికి నాలుగు కవితా పంక్తుల్లో కూర్చి చేర్చాడని, ఫీనిక్స్ నాకు అందించిన కవిత ద్వారా తెలుసుకున్నాను.

అసిధార బాయిగా, అన్నగా, గోదావరిగా, ఒక కొడుకుగా దండకారణ్య రచయితలకు తెలుసు. దండకారణ్య రచయితల్లో ఆయన అగ్రగణ్యుడు. దండకారణ్య రచయితలను ప్రోత్సహించి వారిని తెలుగు పాఠకుల వద్దకు తీసుకెళ్లడానికి చేసిన కృషి, అందుకు విరసం, సృజన, అరుణతారలు అందించిన తోడ్పాటు ప్రతిరచయిత మధ్య పెనవేసుకుపోయిన అనుబంధాన్ని ఎత్తిపడుతుంది. అసిధారకు తోడుగా రాగోను ప్రపంచానికి పరిచయం చేసిన విరసం మణిపూస ప్రకాశ్ మాస్టర్ కృషి దండకారణ్య రచయితల ఎదుగుదలపై చెరగని ముద్రవేసింది.

ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు కోటేశ్వర్లు ప్రచార రంగంపై ప్రత్యేక శద్ధ్ర కనబర్చేవాడు. ప్రచారంలో పత్రికలు ఒక ముఖ్య సాధనం. ‘పవూతిక ఒక ఆర్గనైజర్’ అన్న లెనిన్ మాటల స్ఫూర్తితో ఆయన ‘ఉద్యమ ప్రచార కమిటీ’ (ఏపీసీ) బాధ్యత వహించాడు. కమిటీ అధికార పత్రిక ‘క్రాంతి’ పీరియాడిసిటి తగ్గించి క్రమం తప్పకుండా వెలువరించడానికి వ్యాసకర్తలను ప్రోత్సహిస్తూ తాను పత్రికలకు రాస్తూ వచ్చాడు. తాను దండకారణ్యానికి బదిలీ అయిన తర్వాత మధ్య భారతంలో విప్లవ విస్తరణ ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ హిందీలో ‘ప్రభాత్’ పత్రికను తీసుకరావడానికి పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. దండకారణ్యంలో పెంపొందుతూ ప్రజాయుద్ధం ముందుకుపోతున్న క్రమంలో యుద్ధ పత్రికలను ప్రారంభించాలన్న నిర్ణయంలో తాను చొరవగా భాగస్తుడై ‘జంగ్’ ను నడిపించాడు. దండకారణ్యంలో మహిళా ఉద్యమం సంఘటితమై సమర రంగాన నడుం బిగించి వీరవనితలుగా నిలిచినపుడు ‘దక్తరే మిల్లత్’ తో పోలుస్తూ కెఎఎమ్‌ఎస్ మహిళల పోరాటాలను, వారి శక్తిని బయటి ప్రపంచానికి తెలుపడానికి ‘సంఘర్ష్ రథ్’ తేవడానికి చాలా ప్రోత్సహించాడు. 2000 చివర్లో జరిగిన దండకారణ్య పార్టీ మూడవ మహాసభల వేదిక వద్ద ఉద్యమ నాయకత్వ కామ్రేడ్స్‌తో కబుర్లు చెప్పుతూ ఎక్కడికక్కడే స్థానిక భాషలో పత్రికలు తేవలసిన అవసరం పెరిగిందని చెప్పారు. ఎలాంటి భారీ హంగులు లేకుండా ‘మొబైల్ ప్రెస్’ నిర్వహణతో పత్రికల నిర్వహణకు పూనుకోవాలని కోరాడు.

అఖిల భారత స్థాయిలో విప్లవ పత్రికను వెలువడకుండా శత్రువు ఎన్ని ఆటంకాలు ఏర్పరుస్తున్నప్పటికీ అమరుడు ఆజాద్‌తో కలిసి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు ఎన్నుకుంటూ ‘వ్యాన్‌గార్డ్’, ‘పీపుల్స్‌మార్చ్’ పత్రికలను తీసుకరావడానికి ఎనలేని కృషి చేశారు. హిందీ, బెంగాలీలో వాటి అనువాదాలు తేవడానికి చాలా కాలం సొంత బాధ్యత తీసుకున్నాడు. కలకత్తా కేంద్రంగా ఆ పత్రికలు రావడం పాఠకులకు తెలియనిది కాదు. కలకత్తా నుంచి వెలువడే ‘డాన్’ పత్రిక సంపాదకున్ని పోలీసులు తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టుచేసి జైళ్లో సీఐఏపీఐ చట్టం కింద బంధించి హత్య చేయడాన్ని ఆయన త్రీవంగా ఖండిస్తూ, ఆ అమరుని స్మృతిలో మాతో పంచుకున్న జ్ఞాపకాలు మేమెన్నటికీ మర్చిపోలేం.కిషన్‌జీగా కోటేశ్వర్లు పశ్చిమబెంగాల్ వెళ్లాక కలకత్తాలోని షహీదా గ్రౌండ్స్‌లో జరిగిన సభలు, సమావేశాలన్నింటి వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.

‘తిరిగి తిరిగి వచ్చింది నక్సల్‌బరీ’ అనే విప్లవ సందేశాన్నిస్తూ పశ్చిమబెంగాల్, కలకత్తా ప్రజానీకంలో మునుపటి విప్లవ చేవను, ఉత్సాహాన్ని నిలపడానికి ఎంతో ఆరాటపడేవాడు. కలకత్తా మహానగరంలో ‘విక్షిశాంతి వర్గంలో చేరిపోయిన పాత తరం విప్లవకారులను ప్రగతిశీల, ప్రజాస్వామ్య భావాలు కలవాళ్లను కలవడానికి ఆయన కాలికి బలపం కట్టుకొని తిరిగాడు. వారి సేవలను విప్లవోద్యమానికి, విస్తరణకు పూర్తిగా వినియోగించుకోవాలని చేసిన అనేక ప్రయత్నాల్లో ఆయన పూర్తిగా సఫలమైనాడు. సోషల్ ఫాసిస్టులకు నిలయంగా మారిన కలకత్తా మహానగరంలో నక్సల్‌బరీ నాటి వైభవాన్ని తిరిగి ప్రతిష్టించగలిగాడు. నక్సల్‌బరీ తర్వాతి తరం నాయకుడాయన. కలకత్తా-నందిక్షిగాం-లాల్‌గఢ్‌ల మధ్య పోరాటానుబంధాన్ని నెలకొల్పిన ప్రచారకుడు, ఉద్యమకారుడు, విప్లవకారుడు మన తరం కిషన్‌జీ. లాల్‌గఢ్ సంతాల్‌లను కలకత్తా వీధుల్లో మార్చింగ్ చేయించిన సాహసి ఆయన. కలకత్తా రైటర్స్ బిల్డింగ్‌లో ప్రకంపనలు సృష్టించిన విప్లవ సేనాని ఆయన. ఆ పరంపరను ముందుకు తీసుకెళ్లడమనే బాధ్యత మనపై మిగిలిఉంది.

-మల్లోజుల వేణుగోపాల్
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు


(మిగతా.. రేపు)

35

VENUGOPAL MALLOJULA

Published: Sat,October 6, 2012 03:21 PM

అదే చివరి వీడుకోలు..

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-6 కిషన్‌జీ ప్రపంచానికి పరిచయం చేసింది లాల్‌గఢ్. ఆ లాల్‌గఢ్ ఉద్యమాన్ని ప్రపంచం ముందుంచడానికి ఆయన మ

Published: Sat,October 6, 2012 03:22 PM

ప్రజాసైన్యాన్ని నిర్మించిన సేనాని

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-4 కిషన్‌జీ తన స్వప్నం‘దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా’ చేయడమేనని చెప్పుకున్నారు. ఇందుకోసం ఆయన 196-9

Published: Sat,October 6, 2012 03:22 PM

ఫలించిన ప్రహ్లాద్ స్వప్నం...

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-3 1977-80 మధ్య కిషన్ జీ (అప్పడప్పుడే ప్రహ్లాదయ్యాడు) చాలా కాలంగా లీగల్‌గా, మరికొంత కాలం సెమీ-లీగల్‌గా

Published: Sat,October 6, 2012 03:23 PM

జైత్రయాత్ర కెరటం ‘కోటి’

కో టన్న ఎమ్జన్సీ చీకటి రోజుల్లో తన ఇంటికన్నా ఎక్కువగా బంధువుల ఇళ్లనూ, మిత్రుల ఇళ్లనూ, వారి మిత్రుల ఇళ్లనూ తనకూ, తన తోటి రహస్యపార్ట

Published: Sat,October 6, 2012 03:23 PM

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు

కిషన్‌జీ జ్ఞాపకాలు 2011 నవంబర్ 24 నుంచి ఇప్పటివరకూ నిరంతరం నాస్మృతిపథంలో మెదులుతూనే ఉన్నాయి. 54 సంవత్సరాల నా జీవితం ఆయన నుంచి ఒక్

Featured Articles