ఫలించిన ప్రహ్లాద్ స్వప్నం...


Sat,October 6, 2012 03:22 PM

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-3
1977-80 మధ్య కిషన్ జీ (అప్పడప్పుడే ప్రహ్లాదయ్యాడు) చాలా కాలంగా లీగల్‌గా, మరికొంత కాలం సెమీ-లీగల్‌గా, చివరికి రహస్య జీవితంలో ఉన్నాడు. ఆ సమయంలో రహస్య పార్టీ కార్యకర్తలతో ఇల్లంతా సందడిగా ఉండేది. బాపులో హేతువాద, నాస్తిక భావాలే అధికం. కాకపోతే ఆర్థిక, రాజకీయ కుటుంబ ఒత్తిళ్ల ఫలితంగా ఆయన 60 వ పడిలో మొక్కుబడిగా సంధ్య వార్చడం మొదలుపెట్టా డు. అమ్మ పిల్లల బాగుకోసం రాళ్లకు మొక్కినా, మొక్కలను పూజించినా, విగ్రహాలను ఆరాధించినా,ముడుపులు కట్టినా, ముడుపులు చెల్లించుకున్నా నవ్వుతూ చూసే వాడే తప్ప అడ్డు చెప్పేవాడు కాదు బాపు. అవి వాళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితంలో ఒకరికొకరు అర్థం చేసుకున్న కుటుంబ సర్దుబాటు వ్యవహారాలుగానే వాళ్ల పిల్లలుగా మేం తెలుసుకున్నాం. కోటన్న తనకిష్టమైన ఏ పని చేసుకున్నా తనకు నచ్చిన ఏ పిల్లతో పెళ్లి (కుల ప్రస్తావన లేకుండానే) చేసుకున్నా, ఇంటి పట్టునే ఉండిపోవాలనీ అమ్మ మధురమ్మ ఎన్నెన్నీ దేవుళ్లకు మొక్కుకుందో ఆమెనే చెప్పాలి.

తన కడుపున పుట్టిన తొలి ముగ్గురు (తొల్చూరు, మల్చూరు, మూడోవాడు) తనకు దక్కకుండా కన్నుమూశాక మిగిలిన ముగ్గురు పిల్లలైనా తనతోనే ఉండాల నీ ఆ తల్లి పేగు ఎంతో ఆరాటపడేది. కానీ కోటన్నను ఏ దేవుడూ ఆపలేకపోయా డు. ఏడ్వకమ్మా- ఏడ్వకు, నీ కొడుకూ ఎటూపోలే, పేదోళ్ల గుండెల్లో పదిలంగా ఉన్నడు. ఏడ్వకమ్మా- ఏడ్వకు. అందరిలో ఆఖరోడు, గోధుమ రంగు చిన్నోడు, చస్తే అగ్గి పెట్టెటోడు, పెళ్లి కాని పడుసోడు, వనవాసం పోయిండని విలపిస్తున్నావా! ఏడ్వకమ్మ- ఏడ్వకు’ అంటూ నేను అల్లం వీరయ్య పాటను ఇంట్లో పాడుతుంటే అమ్మ తట్టుకోలేకపోయేది. కోటన్న నా వైపు చూసి ముసిగా నవ్వుతూ అమ్మ ఏడ్వడాన్ని తట్టుకోలేక తల అడ్డంగా ఊపి నన్ను వారించడం.., ఆయన శవంపై పడి 5 ఏళ్ల అమ్మ గుండె పగిలిపోయేలా రోదిస్తుంటే ఎన్నెన్ని సార్లు గుర్తొస్తుందో! అమ్మ దగ్గర నేను లేని లోటును నా చిన్ననాటి సహచరులు, విప్లవాభిమానులు, విప్లవ ప్రజాసంఘాల కార్యకర్తలు, బంధు-మిత్రులు, వాడకట్టువాళ్లు అందరికన్నా మేము నమ్ముకున్న జనాలు అమ్మను ఓదారుస్తుంటే తన కొడుకు మరణం హిమాలయాలకన్నా ఉన్నతమైందనీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చివరి వరకూ విప్లవోద్యమంలోనే ఉండి మీ రుణం తీర్చుకుంటానని హమీ ఇస్తున్నాను.


చిద్రమైన కన్ను, తెరుచుకున్న నోరు, నుజ్జు నుజ్జుయిన మస్తిష్కం, కాలిన పాదాలు, విరిగిన చూపుడువేలు, తూటాల గాయాలు, ఒంటి మీద బాయ్‌నెట్ రంధ్రాలు.., నాకు ఆ శవపేటిక లోని కోటన్న ‘నేను మృత్యువులో సైతం శత్రువు ను ఓడించాననీ, గర్వంగా ముసి ముసిగా నవ్వుతూ నా కనుకొనుకుల నుంచి ఉబికి వస్తున్న కన్నీటి ధారలని ప్రేమగా తుడుస్తూ మళ్లీ నన్ను ఏడ్వొద్దు అంటూ వారిస్తున్నట్టే ఉన్నాడు. శత్రువు క్రౌర్యానికీ, బీభత్సానికీ, భయానికీ చిహ్నంగా మిగిలిన ఆ మృతజీవి శరీరాన్ని వేలాది మంది ఆయన అభిమానుల మధ్య చూస్తు న్న ఖాకీలకు జనజీవన స్రవంతికి నిజమైన అర్థం తెలిసే ఉంటుంది. నేను అమ్మకు ఒక మాట చెప్పాల్సి ఉంది. కోటన్న నాకు రాసిన చివరి ఉత్తరం (2011-మే 10) లో ఇలా రాశారు.

అమ్మ కోసం ఉత్తరం రాశా. పూర్తి కావడం లేదు. ఎడిట్/రీరైట్ వీలైతే చేయి. బాగా లేదనుకుంటే నీవు మరోటి తప్పక రాయి. ఇది రాయడం వెనుక అమ్మే కాదు. తెలుగు అమ్మలకు విప్లవనాడి అందించాలనే తపనతో ఈ రూపం ప్రారంభించాను. ఎంతమేరకు ఉపయోగమైనా మంచిదే. ఈ ఒరవడి కొనసాగించాలి. కోటన్న అప్పగించి వెళ్ళిన బాధ్యతను పూర్తి చేయడానికి ‘అమ్మ’, అన్న లాంటి వాళ్లే మనకు నిరంతరం స్ఫూర్తి’ అంటూ కామ్రేడ్ మాసేదీది రాసినట్టు.., నేను ఆ స్ఫూర్తితో తప్పక ప్రయత్నిస్తాను.
1980లో కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాల రైతాంగ-ఉద్యమాన్ని మునుముందుకు తీసుకుపోదాం’ (వ్యవహారికంలో గెరిల్లా జోన్ నిర్మాణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది)నిర్ణయానికి ప్రహ్లాద్ రాష్ట్ర కార్యదర్శిగా నడుం బిగించాడు. ఆయన దండకారణ్య ఉద్యమ నిర్మాణం కోసం నాతో సహా వందలాది కేడర్లను అడవికి తరలించాడు. ప్రస్తుత దండకారణ్య కార్యదర్శిని 193లో గౌలిగూడ బస్‌స్టాండ్ వరకు వచ్చి బస్సులో కూచోబెట్టి వెళ్లాడనీ, ఆయనతో గల 27 ఏళ్ల సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకుంటూ సంస్మరణ సభలో చెప్పాడు.

విముక్తి ప్రాంత లక్ష్యంతో ప్రారంభమైన దండకారణ్య విప్లవోద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రజాయుద్ధాన్ని- ప్రజాసైన్యాన్ని అభివృద్ధి చేయడం చివరి వరకూ ఆయన తక్షణ ప్రధాన కర్తవ్యంగానే భావించారు. ఆయన ఎక్కడు న్నా, ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నా ఆయన ఎజెండాలో విముక్తి ప్రాంత నిర్మాణ మే మొదటిస్థానంలో వుండేది. 1980-85 మధ్య ఆయన ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో రైతుకూలీ సంఘం, అఖిల భారత విప్లవ ప్రజాసంఘాలు, కొన్ని ఉనికిలోకి వచ్చాయి. ఆ కాలంలోనే సింగరేణి కార్మికుల దీర్ఘకాల సమ్మె పోరాటంలో నుంచి సింగరేణి కార్మిక సమాఖ్య 1981 లో పుట్టుకొచ్చింది. ‘ట్రేడ్ యూనియన్‌లో మనపని విధానంపై విడుదలైన పార్టీ డాక్యుమెంటును పోరెడ్డి వెంకటడ్డి, అల్లంనారాయణ, బయ్యపు దేవేందర్‌డ్డి, ఠాకూర్ జగన్‌మోహన్‌సింగ్‌లతోపాటు నన్నూ, మరికొంత మందిని జగన్ వాళ్ల మామిడితోటలో కూచోబెట్టి సమగ్ర చర్చ జరిపాడు.మనం కార్మికవర్గంలో ఎలాం టి ట్రేడ్‌యూనియన్‌ల నిర్మాణానికి పూనుకోకూడదనీ, ఉన్న ట్రేడ్ యూనియన్‌లోనే చేరి సమరశీల కార్మిక సంస్థలుగా మలచాలనీ కంక్లూడ్ చేశాడు. కానీ యేడా ది తిరగకముందే సికాస నిర్మాణానికి కోటన్న, ఆదిడ్డితో సహా నాటి ప్రధాన నాయకత్వం నడుం బింగించడం పార్టీకార్యకర్తల్లో కొత్త స్ఫూర్తిని నింపింది.

ఏ పోరాట రూపాలు మనకతీతం కాదు, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ఆర్గనైజర్లకు సవాల్. ఆ ఎసెర్షన్ ఉండాలంటాడు. ‘సికాస’ నిర్మాణంలో గానీ, ఎఐఎల్‌ఆర్‌సి నిర్మాణం వెనుక గానీ, మరిన్ని అఖిల భారత విప్లవ ప్రజాసంఘాల నిర్మాణం వెనుక పార్టీ వ్యూహాత్మక దృష్టి, ఆయన చొరవ, గైడెన్స్ స్పష్టంగా అర్థమవుతాయి.

ఆంధ్రవూపదేశ్‌లోని విప్లవోద్యమ ప్రాంతాలకు 1985లో తొలిసారిగా అర్థ సైనిక బలగాలు దిగాయి. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని రాజ్యం ప్రకటించింది. దానికి గట్టి జవాబుగా కంటికీ రెప్పలా ఉద్యమాన్ని కాపాడుకుందామనీ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకు తగిన ఎత్తుగడలు రూపొందించింది. అందు లో మొదటి చర్యగా రాష్ట్రకమిటీ కుదింపు జరిగింది. వ్యూహాత్మక నాయకత్వం రక్షణ, దండకారణ్య బలగాలకు ప్రత్యక్ష, సన్నిహిత మార్గదర్శకత్వంలో భాగంగా రాష్ట్ర కమిటీ నుంచి ప్రహ్లాద్‌ను దండకారణ్యానికి తరలించారు. 1996 అక్టోబర్ లో తానూ తన జీవన సహచరితో దండకారణ్యానికి చేరుకున్నాడు. (పూర్తి కాలం విప్లవకారిణి మైనక్కతో 1984లో ఆయన పెళ్లి జరిగింది) అప్పటికే పలుమార్లు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల్లో దండకారణ్యానికి వచ్చి ఉండడం, దండకారణ్య కేడర్ల లో అనాటికే మెజారిటీ సభ్యులు తెలుగువారు కావడం, అందులో అనేక మంది తన ద్వారా వచ్చినవారు కావడంతోపాటు ఆయన భవిష్యత్ స్వప్నంగా దండకారణ్య విముక్తి ప్రాంతం ఉండడంతో ఆయనకు దండకారణ్యం రావడం అక్షరాల్లో కి అనువదించలేనంత సంబరంగా ఉండింది. ఆదిలాబాద్ కొమురంభీం పోరాట సన్నిహిత సహచరుడైన రాంజీగోండు స్మృతిలో ప్రహ్లాద్ రాంజీగోండుగా మారా డు. అందుకే ఆయన ‘నేటి దండకారణ్యం’ (2001-11) పుస్తకానికి ముందుమాట రాస్తూ ‘ఫలించిన స్వప్నం దండకారణ్యం’ అన్నాడు.
(మిగతా.. రేపు)

-మల్లోజుల వేణుగోపాల్
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు

35

VENUGOPAL MALLOJULA

Published: Sat,October 6, 2012 03:21 PM

అదే చివరి వీడుకోలు..

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-6 కిషన్‌జీ ప్రపంచానికి పరిచయం చేసింది లాల్‌గఢ్. ఆ లాల్‌గఢ్ ఉద్యమాన్ని ప్రపంచం ముందుంచడానికి ఆయన మ

Published: Sat,October 6, 2012 03:21 PM

అందరినీ వెన్ను తట్టిన ‘అన్న’

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-5 రాం జీ నక్సల్‌బరీకి పుట్టినిల్లయిన పశ్చిమబెంగాల్‌ను కేంద్రం చేసుకొని విప్లవ కారుల ఐక్యతకు చాలా కృష

Published: Sat,October 6, 2012 03:22 PM

ప్రజాసైన్యాన్ని నిర్మించిన సేనాని

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-4 కిషన్‌జీ తన స్వప్నం‘దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా’ చేయడమేనని చెప్పుకున్నారు. ఇందుకోసం ఆయన 196-9

Published: Sat,October 6, 2012 03:23 PM

జైత్రయాత్ర కెరటం ‘కోటి’

కో టన్న ఎమ్జన్సీ చీకటి రోజుల్లో తన ఇంటికన్నా ఎక్కువగా బంధువుల ఇళ్లనూ, మిత్రుల ఇళ్లనూ, వారి మిత్రుల ఇళ్లనూ తనకూ, తన తోటి రహస్యపార్ట

Published: Sat,October 6, 2012 03:23 PM

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు

కిషన్‌జీ జ్ఞాపకాలు 2011 నవంబర్ 24 నుంచి ఇప్పటివరకూ నిరంతరం నాస్మృతిపథంలో మెదులుతూనే ఉన్నాయి. 54 సంవత్సరాల నా జీవితం ఆయన నుంచి ఒక్

Featured Articles