నుస్రుత్ మొహియుద్దీన్ కోసం.. అల్విదా సాథీ


Wed,April 10, 2013 10:31 PM

మూసీనదిలో నీళ్లున్న రోజుల్లో ఆ నది మీద ఇన్ని వంతెనలు లేవు. ప్రేమ ఉన్నచోట జీమూత అంధకారంలోను, వరద బీభత్సంలోను ఎదురీది దాటిన నది. స్నేహం ఉన్నచోట అడ్డంపడి ఈదిన నది. జననాంతర సౌహృదాలను గుర్తు చేసుకోవడానికి పురానాపూల్ చాలు. ఆలంఖుంద్ మీరీ, రాజబహదూర్ గౌర్ మొదలు మొగ్దూం మొహియుద్దీన్ వరకు కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ఏ వంతెనెలూ అవసరం రాలేదు. అప్పుడు మూసీ ప్రవాహం ఒరిసిపారి రెండు ఒడ్డులను కలిపిందేమో. ఇపుడు ఎండిపోయిన మూసీలో మనుషుల మురికి, మకిలి, విశ్వాసాలు, అవిశ్వాస ద్వేషాలుగా మారి చిందిన నెత్తుటి మరకలు. ఇమ్లిబన్ మహాత్మాగాంధీ బస్‌స్టాండ్‌గా మారినా అక్కడ చింత తోపుల గాలి కాదు కదా దురావూకమణలతో నిర్వాసితులైన శంకర్‌నగర్, కమలానగర్ బస్తీ ప్రజల చింతలు, ఆక్రందనలు భజరంగ్ భళీ విస్తరణ గణగణ మోతల్లో ఏ జనం చెవికీ ఎక్కవు.

అయినా మనుషుల సంచారానికే కాదు మనసుల సంభాషణకు ఇక్కడ ‘కొత్త వంతెనలు’ కట్టే కృషి కవులు, లౌకిక, ప్రజాస్వామ్య వాదులు ఇప్పటికీ చేయకపోలేదు. కాని ‘పాత వంతెన’ రాజబహదూర్ గౌర్ ఇంకా మన స్మృతిపథంలోంచి తొలగిపోనేలేదు, ఆయన కళ్ల ముందే మజహర్ మెహిదీ అరవై ఏళ్లయినా నిండక ముందే పోయాడు. రాజబహదూర్ గౌర్ నుంచి తర్ఫీదు పొందిన మనిషి, నుస్రుత్ మొహియుద్దీన్ ఏప్రిల్ 3న తన అరవైలలోనే అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. నుస్రుత్ మొహియుద్దీన్ మొగ్దూం మొహియుద్దీన్ కొడుకనే కాదు, తనకు తానుగా తండ్రి వలె ఒక ట్రేడ్ యూనియనిస్టుగా, ఒక కామ్రేడ్‌గా, ఒక లౌకిక ప్రజాస్వామ్యవాదిగా హైదరాబాదు ప్రజా జీవితంలో నలభై ఏళ్లకు పైగా ఒక స్థానాన్ని సం పాదించుకున్నాడు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగిగా బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యకర్తగా పనిచేస్తూ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ఒత్తిడితో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. రాజబహదూర్ గౌర్ బతికున్నంత కాలం ఆయన మార్గదర్శకత్వంలో, అజీజ్‌పాషా సాహచర్యంలో ఆయన పాతబస్తీలోనూ, నగరమంతటా వివిధ ప్రజాహిత కార్యవూకమాలలో పాల్గొన్నాడు. అంజుమన్ తరఖీ, ఇన్సాఫ్ వంటి సంస్థల బాధ్యతలు నిర్వహించాడు.మగ్దూమ్ ముందు మరొకరిని కవి అంటే పోల్చుకోవడం కష్టం గానీ, పైగా కొడుకయినందు వల్ల పడే గొడుగు నీడ చాలా దూరం పరచుకుంటుంది గానీ నుస్రుత్ స్వయంగా భావుకుడయిన కవి. ఉర్దూలో ఆయన కవితా సంకలనం కూడా వెలువడింది. ప్రొగ్రెసివ్ రైటర్స్ ఉద్యమంలో ఆయన అఖిల భారత స్థాయిలో కార్యదర్శిగా కూడా పనిచేసా డు. కమ్యూనిస్టు భావజాలాన్ని సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో వ్యాప్తి చేసే క్రమంలోనే నాకు ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది.

బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత హిందుత్వశక్తుల విజృంభణకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామికశక్తుల విశాల కార్యాచరణ, 1993 డిసెంబర్ 1994 మార్చ్ జైలు పోరాటం, ఐక్యతా సందర్భాలే కాకుం డా 1991లో బాగ్దాద్ నగరంపై అమెరికా బాంబు దాడి మొదలు అఫ్ఘనిస్తాన్, ఇరాక్ దురావూకమణల వరకు అమెరికా సామ్రాజ్యవాదం ఫాసిస్టు నగ్న రూపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు హైదరాబాద్‌లో అరసం, విరసం ఇతర లౌకిక ప్రజాస్వామికశక్తులతో కలిసి కవులు, కళాకారులతో విశాలమైన ఐక్య నిరసన స్వరాలు వినిపించారు. ఇటు గుజరాత్ మారణకాండ, అటు ఇరాక్ దురావూకమణ, ఇక్కడ హిందుత్వ ఫాసి జం అక్కడ అమెరికా ఫాసిజం ఇంటా బయటా పెను ప్రమాదాలుగా ముంచుకొచ్చినప్పుడు మతతత్వ వ్యతిరేక వేదిక నిర్మాణం చేసి ముఖ్యంగా గుజరాత్ మారణకాండపై రాష్ట్రవ్యాప్తంగా ఖండన, నిరసన కార్యవూకమాలు ఏడాదిపైగా నిర్వహించడమే కాకుండా ఇరవై మందికి పైగా కవులు, రచయితలు స్వయంగా గుజరాత్ పర్యటించి వచ్చి తెలుగు, ఉర్దూలలో కవితలు, కథలు ఎంతో సాహిత్యాన్ని వెలువరించారు. ఈ క్రమమంతా నుస్రుత్ క్రియాశీలంగా పాల్గొన్నాడు. ఇరాక్‌పై అమెరికా దాడిచేసిన రోజుల్లోనే హైదరాబాద్‌లో ప్రొగ్రెసివ్ రైటర్స్ అరవయ్యేళ్ల మహాసభలు ఫాసిస్టు వ్యతిరేక మహాసభలుగా జరిగాయి. ఇది నుస్రుత్ మాతృ సంస్థ కనుక సహజంగానే ఇందులో క్రియాశీల కార్యకర్తగా పాల్గొన్నాడు. ఇవన్నీ సాహిత్య సంస్థలుగా మేం కలిసి పనిచేసిన సందర్భాలు. అరమరికలు లేకుం డా అభివూపాయ భేదాలు చర్చించుకున్న సందర్భాలు కూడా.నుస్రుత్‌తో నాకు ప్రత్యేకించి కొన్ని ఆత్మీయమైన అనుబంధాలు, సందర్భాలు ఉన్నాయి. మగ్దూం మొహియుద్దీన్ కవిత్వం మొత్తం సమక్షిగంగా రాజబహదూర్ గౌర్ విపులమైన ముందుమాటతో వెలువడినపుడు ఉర్దూ హాల్‌లో మగ్దూం గురించి మాట్లాడడానికి పిలిచాడు. శశినారాయణ్ స్వాధీన్‌తో కలిసి నా కవితలు కొన్ని ఎంచుకొని హిందీలోకి అనువదించాడు. ‘అదే సాహస గాథ’ పేరుతో వాణీ ప్రకాశన్, ఢిల్లీ ద్వారా 2006లో వెలువడింది. 2008లో వాణీ ప్రకాశన్, ఢిల్లీ వాళ్లే ప్రచురించిన నా ‘సహచరులు’ (జైలు లేఖలు) కూడా శశి నారాయణ్ ‘స్వాధీన్’తో కలిసి నుస్రుత్‌యే అనువదించాడు.

ఇదంతా ఒక ఎత్తు. మగ్దూం శతజయంతి సందర్భంగా ఇందోర్ (మధ్యవూపదేశ్) ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఆహ్వానంపై నేను, నా సహచరి హేమలత, నుస్రుత్, స్వాధీన్ వెళ్లాం. ప్రయాణం, ఇందోర్‌లో సభలు, సమావేశాలు, మిత్రులతో సాహిత్య చర్చలు, తిరుగు ప్రయాణంలో భోపాల్‌లో ఒక రాత్రి ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ప్రముఖ రచయితలతో సమావేశం అంతా ఒక వారం రోజులు ఎంత సన్నిహితంగా, అర్థవంతంగా గడిచిందో. అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకొని ఆ యూనివర్సిటీకి మగ్దూం వెళ్లినపుడు చూసి, విన్న వాళ్లంతా ఇపుడు దేశంలో, విదేశాల్లో ఎక్కడెక్కడో ఉండవచ్చు కానీ ఇందోర్‌లోను, పరిసరాల్లోను ఉన్న అలీఘడ్ యూనివర్సిటీ ఆలూమ్నీ (పూర్వ విద్యార్థులు) కలిసి ఒక మగ్దూం సంస్మరణ సభ నిర్వహించి మా ఇద్దర్నీ మాట్లాడమని అడిగినపుడు, నుస్రుత్ విషయంలో సహజమైనదే కాని నాకు చాలా అసాధారమైన గౌరవమనిపించింది. ఆతర్వాత కశ్మీరు ప్రజల స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడడానికి నన్ను, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గిలానీని అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘం పిలిచినపుడు ఈ అరుదయి న గౌరవం గురించి అక్కడ మళ్లీ జ్ఞాపకం చేసుకున్నాను.

ఆఖరి సారిగా ఒక అరుదయిన సభలో నుస్రుత్ కలిసాడు. హసన్ నాసిర్ అనే హైదరాబాద్‌కు చెందిన కార్యకర్తను పాకిస్థాన్‌లో (రావల్పిండిలో), ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పార్టీ నిర్మాణం చేయడానికి 1950లలో కమ్యూనిస్టు పార్టీ పంపించిందట. అప్పటికే అక్కడ కమ్యూనిస్టు పార్టీ మీద, ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మీద కూడా నిషేధం ఉంది. అట్లా నిషేధానికి గురయి చెల్లాచెదురయిన రచయితలందరినీ వేరు వేరు పేర్లతో సంఘటితం చేసినవాడు హసన్ నాసిర్. పాకిస్థాన్ ప్రభుత్వం ఆయనను చాలాకాలం జైల్లో పెట్టింది. విడుదలై హైదరాబాద్ వచ్చి మళ్లీ పాకిస్థాన్‌కే పార్టీ నిర్మాణం చేయడానికి పోతే చంపివేసింది. ఆయన తల్లికి రాసిన ఉత్తరాలు, ఆయన గురించిన అరుదయిన సమాచారం సేకరించి వేసిన ఉర్దూ పుస్తకం దీపావళి (నవంబర్ 2012) రోజు ‘సియాసత్’ పత్రిక కార్యాలయంలో ఆవిష్కరింపబడింది.ఆ సభకు ఎంటి ఖాన్ అధ్యక్షత వహించాడు. ‘సియాసత్’ సంపాదకుడు జాహిదలీఖాన్ కూడా పాల్గొన్నాడు. ఆ సభలో కలిసినపుడు నుస్రుత్ తన దగ్గరున్న నా మొబైల్ నెంబర్ పలకడం లేదని నా కొత్త నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ చేసి ఇంటికి వస్తానని వీడ్కోలు చెప్పాడు. ఇవాళ ఆయనకు ఆఖరి వీడ్కోలు చెప్పడాని కి వెళ్లాల్సి వస్తుందని ఆనాడు కాదు కదా మొన్నటి దాకా కలలో కూడా ఊహించలేదు.

-వరవరరావు

119

VARAVARA RAO

Published: Sun,April 7, 2013 12:04 PM

తెలంగాణ నాగేటి చాళ్లల్లో ..

బురద పొలం కాని,చెలక కాని ఒకసారి అడ్డంగా,మరొకసారి నిలువుగా దున్నడాన్ని ’ఇరువాలు’ అంటాము. అంటే రెండుసార్లు అని అర్థం. బురద పొలంలో ఇర

Published: Sun,April 7, 2013 11:13 AM

గుండె తెలంగాణ ‘గొంతుకలోన కొట్టాడుతున్నది’

గుండెబోయిన శ్రీనివాస్ స్వశిక్షితుడో, సుశిక్షితుడో గానీ అతనిలో మంచి కాలమి స్టు లక్షణాలున్నాయి. కాలమిస్టు అంటే పత్రికల్లో ‘కప్పెంతో

Published: Sun,April 7, 2013 10:21 AM

ఆళ్వారు -తెలంగాణ జీవనం

ఆళ్వారు ఏదో ఒక మనిషి పేరు కాదు, అదో విధానము. విధానమంటే ఏదో ఒక కార్యవిధానము కాదు. అదొక జీవన విధానము’ అన్నాడు వట్టికోట ఆళ్వారు స్వామ

Published: Sun,April 7, 2013 08:19 AM

జయశంకర్‌తో వొడవని ముచ్చటే

జూన్ 27 బుధవారం ‘చెలిమె’లో జయశంకర్ గారి ‘వొడవని ముచ్చట’ పై సమీక్ష రాస్తూ డాక్టర్ కాసుల లింగాడ్డి నా ప్రస్తావన తెచ్చి నా మీద బాధ్యత

Published: Sun,April 7, 2013 08:13 AM

కత్తి వ్యాసానికి వీవీ వివరణ

శివసాగర్ గురించి, గద్దర్ గురించి రాసిన సందర్భాలలో కత్తి పద్మారావు నాగురించి, విరసం గురించి తనకు తోచిన రీతిలో నిందాపూర్వక ఆరోపణలు చ

Published: Sat,April 6, 2013 08:04 PM

‘మట్టి మనిషి’ జ్ఞాపకం

తెలంగాణ వైతాళికులలో ఒకరు పొట్లపల్లి రామారావుగారు (1917-2001) చనిపోయినపుడు 2001 సెప్టెంబర్ 10న ప్రజాతంవూతలో రాసిన వ్యాసం యిది. దాదా

Featured Articles