తెలంగాణ నాగేటి చాళ్లల్లో ..


Sun,April 7, 2013 12:04 PM

Iruvaluబురద పొలం కాని,చెలక కాని ఒకసారి అడ్డంగా,మరొకసారి నిలువుగా దున్నడాన్ని ’ఇరువాలు’ అంటాము. అంటే రెండుసార్లు అని అర్థం. బురద పొలంలో ఇరువాలు దున్నిన తర్వాత గొర్రుగొట్టి వరినాటు వేస్తాము. వాలు ఎదురువాలు కలిస్తే అది ఇరువాలు చాలు. డాక్టర్ కాసుల లింగాడ్డి తన వ్యాస సంకలనానికి ‘ఇరువాలు’ అని పేరుపెట్టడానికి అదొక్కటే అర్థం కాదు.

ఒకటి రెండు మినహాయింపులతో ఇందులో ఉన్న వ్యాసాలన్నీ తెలంగాణకు సంబంధించినవి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సం బంధించినవి. అన్నీ సాహిత్యంతో, ముఖ్యంగా కవిత్వంతో (అందులోనూ తెలంగాణ సాహిత్యంతో) సంబంధం ఉన్నవే. అయినా అన్నిటికీ ఉద్యమం ప్రాతిపదిక. సామ్రాజ్యవాద వ్యతిరేక అస్తిత్వ దృక్పథం- ఇది కొంచెం ‘ఒక విద్రోహదినం’ వ్యాసంలో ఎక్కువయింది. తెలంగాణ జాతి, తెలుగుజాతి నుంచి కూడా భిన్నమెన లేదా ప్రత్యేకమెన స్వతంవూతజాతిగా చెప్పే దూకుడు కనిపిస్తుంది. అయినా బ్రిటిష్ ఇండియా, హైదరాబాద్ సంస్థానాల్లోని తెలుగు ప్రజల భిన్నమెన రాజకీయ, ఆర్థిక నేపథ్యాలను గుర్తించే దృక్పథం ఉన్నది ఈ వ్యాసంలో. సుంకిడ్డి నారాయణడ్డి సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ చరిత్ర సమీక్ష / పరిచయ వ్యాసం, తెలంగాణ చరివూతను ఉద్యమ నేపథ్యాలను వివరించే వ్యాసాలు అట్లే ఎస్. జగన్ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన జులూస్ (కవితా,చిత్ర, శిల్ప) సంకలనంపై సుదీర్ఘ సమీక్ష /పరిచయ వ్యాసంలో కూడ వివరంగా తెలంగాణ చరివూతను (చరిత్ర అంటే గత వర్తమానాల సంభాషణగా సంఘర్షణ చరివూతను చెప్పడమే), ఉద్యమస్ఫూర్తిని చెప్తాడు. ఒక విద్రోహదినంగా 56 నవంబర్1 గురించి చరిత్ర రాసినా, దానికి తన కవిత్వం నుంచి చరిత్ర నిర్మాణాన్నెంచుకుంటాడు.

తన ప్రసంగవ్యాసాలకు కవిత్వ ఉదాహరణ తెచ్చుకుంటాడు. అట్లా చూసినపుడు మూడు వ్యాసాలు (తెలంగాణ చరిత్ర, ఎల్లమ్మ, ఇతర కథలు కాసులవూపతాప్‌డ్డి కథలు,’వొడువని ముచ్చట’ ప్రొ. జయశంకర్ ఆత్మకథ) మినహా అన్నీ కవిత్వంతో పునర్నిర్మాణం చేసిన ఉద్యమ వ్యాసాలు. మూడువ్యాసాలు (ఆధునిక వచనకవిత్వంలో వస్తు శిల్పాలు, ఉద్విగ్న మానస సంభాషణ, శివసాగర్‌కు నివాళి) తెలంగాణకే పరిమితమెన సాహిత్య వ్యాసాలు కాదు. అతి స్వల్పమెన మినహాయింపులతో సర్వత్రా ఉన్న ఉద్యమనేపథ్య స్వభావం వల్ల భూమి, వ్యవసాయంతో ఉన్న అనుబంధం వల్ల ఈ వ్యాసాలు సార్థకమైన ఇరువాలు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇప్పటికి రెండుమార్లు వచ్చింది. 1953లో వచ్చిన నాన్‌ముల్కీ ఉద్యమంను అట్లా ఉంచితే, 1968-69లో వచ్చిన ఉజ్వలమెన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మల్లా 1996లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. రెండు ఉద్యమాలకు విప్లవోద్యమ నేపథ్యం ఉన్నది. అంటే దాని అర్థం విప్లవోద్యమాన్ని అణచివేసే భూస్వామ్య పెట్టుబడిదారీ దళారీ వర్గాల వ్యతిరేక నేపథ్యం ఉన్నది. మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నక్సల్బరీ పంథాలో సాగిన శ్రీకాకుళ రైతాంగ పోరాట నేపథ్యం ఉంది. రెండింటినీ సమదృష్టితోనే బ్రహ్మానందడ్డి, వెంగళరావు ప్రభుత్వం నెత్తుటిఏర్లలో ముంచింది. అక్రమంలో కూడా ఒక క్రమం ఉంటుం ది అని కెవిఆర్ కొన్ని దశాబ్దాల క్రితమే ఒక గతితార్కిక కవితా వాక్యంలో చెప్పినట్లుగా..రెండు చోట్లా 370 మంది చొప్పున పోలీస్ కాల్పుల్లో అమరులయ్యారు.

శ్రీకాకుళంలో వాళ్లు విప్లవకారులు, సానుభూతిపరులు కావచ్చు. తెలంగాణలో వాళ్లు ముఖ్యంగా విద్యార్థులు, యువకులు కావచ్చు. వాళ్లంతా తమకు, తమ నేలకు స్వేచ్ఛ కోరినవాళు,్ల తమ శ్రమకు దోపిడి నుంచి విముక్తి కోరినవాళ్లు. శ్రీకాకుళంలో ఆదివాసులు కోస్తా ప్రాంతం నుంచి, మైదాన ప్రాంతం నుంచి వలస వచ్చిన భూస్వాములు, వడ్డీ వ్యాపారుల నుంచి స్వేచ్ఛ కోరినవాళ్లు. తెలంగాణలో స్థానికులు వలసవచ్చిన దళారీ పాలకుల నుంచి స్వేచ్ఛ కోరినవాళ్లు.
రెండుచోట్లా- అణచివేత దోపిడీల నుంచి స్వేచ్ఛా కాంక్ష ఉన్నది. వలస ఆధిపత్యం నుంచి స్వేచ్ఛాకాంక్ష ఉన్నది. ఇది రెండు సార్లు వ్యక్తమయ్యింది. ఎందుకంటే అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రజాస్వామిక పోరాటం కనుక, ఈ పోరాట క్రమాన్నంతా రచయిత శ్రమదోపిడీ దృష్టి నుంచి చూసాడు. వలస విముక్తి దృష్టి నుంచి చూసా డు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై వచ్చిన వ్యాసాలలో ఇది ఒక ప్రత్యేక దృష్టి.

ఆంధ్రా వలస పాలన అనే మాట తెలంగాణ రాష్ట్రం కోరుతున్న ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. గానీ ఒక స్పష్టమెన వర్గ విభజన లేకుండా సీమాంధ్ర అనే మాట వాడుతున్నారు. ఈ రచయిత కూడా సీమాంధ్ర అనేమాట అలవాటు చొప్పున వాడుతున్నాడు గానీ వ్యాసాల్లోని దృక్పథాన్ని విశ్లేషిస్తే ఆయన అదనపు విలువపై గుత్తాధిపత్యం పొందిన దళారులైన కోస్తా జిల్లాల, 2004 నుం చయితే రాయలసీమ జిల్లాల అగ్రవర్గ, వర్ణ సంపన్నుల దోపిడీ గురించే మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. ఈ పోరాటాలను ప్రత్యక్ష, పరోక్ష విప్లవోద్యమ ప్రభావాన్ని కూడా మనం ఊహించుకోగల, విశ్లేషించుకోగల నేపథ్యం, ప్రతిపాదన ఈ వ్యాసాల్లో ఉంది.

పోలీసు చర్య పేరుతో జరిగిన సైనిక దాడి ఒక్క దుష్ట సంప్రదాయాన్నే కాదు,ఎన్నో దుష్ట సంప్రదాయాలను ప్రవేశపెట్టింది. కె.ఎం. మున్షీలు, ఎం.కె. వెల్లొడీలు, జె.ఎన్. చౌదరీలు మనల్ని పరిపాలించడమే కాదు, పళనియప్పన్‌లు, సంజప్పలు మిలిటరీ క్యాంపులు పెట్టి మన బిడ్డలను కాల్చి, మన అక్క చెల్లెళ్ళను చెరచడమే కాదు మన పరిపాలనా నియంవూతణకు మద్రాసు ప్రావిన్సు నుంచి బ్యూరాక్షికాట్లను దింపారు. ‘దున్నే వారికి భూమి’ నినాదంతో మూడువేల గ్రామాలను విముక్తం చేసి పది లక్షల ఎకరాల భూమిలో ప్రజలకు ఎర్రరాజ్యం చవిచూపిన కమ్యూనిస్టులు నెహ్రూ పాదాల చెంత పోరాట ఫలితాలను భూమి, ఆయుధాలతో సహా అర్పణం చేసిన 1951 సాయుధ పోరాట విరమణ నేపథ్యంలో గానీ 1953 నాన్ ముల్కీ ఉద్యమాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వ్యాసాల్లో ప్రత్యక్షంగా ఈ గతితార్కిక సంబంధాన్ని తడమకున్నా ఈ అవగాహన పరుచుకుని ఉన్నది.

1968-69 ఉద్యమం ఇరువాలు ఉద్యమం. విద్యార్థులు, ఉద్యోగులు, బుద్ధిజీవులు విప్లవోద్యమంతో ప్రభావితులై మిలిటెంటుగా కోస్తా వలస పాలనను ప్రతిఘటించారు. సమైక్యత పేరుతో దాడిచేసిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను ప్రతిఘటించారు. వాటి అధికారంతో, అండతో సాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రతిఘటించారు. 71 ఎన్నికల్లో, మొదటి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు సాధించిన విజయానికన్న ఘనమెన విజయాన్ని సాధించి ఇరువాలుగా ప్రజాకాంక్షను ప్రకటించారు. తాత్కాలిక మోసానికి గురయ్యారు.
కుట్ర కేంద్రం చేస్తుంది. మోసం నా యకత్వం చేస్తుంది. అది సాయుధ పోరాటమైనా, సాధారణ ఎన్నికలైనా వంచితులు ప్రజలు, స్థానికులు.
అట్లాగే కాడి దించకుండా పోరాడేది వాళ్లే.
ప్రకృతి వంచించినా, పెట్టుబడి వంచించినా రైతు మళ్లీ సేద్యం చేస్తాడు. 1996 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడ అదే నేపథ్యం.

ఏ ప్రయోజనాల కోసమైతే కోస్తా దళారీపాలకవర్గం ఎన్టీఆర్‌ను రెండోసారి అధికారంలోకి తెచ్చిందో, ఆయన ఎన్నికల వాగ్దానాలు ఆ ప్రయోజనాలకు అవరోధాలయ్యాయి. రెండు రూపాయల కిలోబియ్యం, సారా నిషేధం, సబ్సిడీలు పీపుల్స్‌వార్ పై నిషేధం ఎత్తివేత ఈ దళారీలకే కాదు ప్రపంచబ్యాంకుకూ పడని విషయాలు. అందుకే, వెస్రాయి హోటల్ కుట్ర. ఈ సంక్షేమ పథకాలు ఒంటికి పడని ఆర్ధికమంత్రి చంద్రబాబును ప్రపంచబ్యాంకు ముఖ్యమంవూతిని చేసింది.
ఎన్టీఆర్ యిచ్చిన రాయితీలన్ని రద్దుచేసి, పీపుల్స్‌వార్‌పై ప్రజాసంఘాలపై మళ్లీ నిషేధాన్ని విధించి చంద్రబాబు తెలంగాణను ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనాకు ఒక ప్రయోగశాలగా మార్చాడు. ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనాకు ప్రయోగశాలగా మార్చడమంటే లాటిన్ అమెరికా దేశాల్లో వలె రాజ్యహింసతో రక్తపు పారించడం. తెలంగాణలో అభివృద్ధి పేరిట విధ్వంస రచన ప్రారంభమెంది.
చక్రంలో నాగలిగుర్తు గల పచ్చజెండా, ఎర్ర జెండా సహకారంతో తెలంగాణ రైతు జీవితానికి, కార్మిక జీవితానికి ఏకకాలంలో ఎర్రజెండా చూపింది. నూతన వ్యవసాయ విధానం పేరుతో వ్యవసాయం దండగ అన్నది. కాలం చెల్లిన రైతు జీవితం అన్నది. పరిక్షిశమలను మూసేసింది లేదా ప్రైవేటు పరం చేసింది.

పీపుల్స్‌వార్ దండకారణ్యంతో పాటు తెలంగాణలో ప్రత్యామ్నాయ ప్రజా అభివృద్ధి నమూనాను ప్రవేశపెట్టింది. గ్రామ రాజ్యకమిటీలు ఏర్పాటుచేసి భూస్వాధీనం సాగుతాగునీరు విధానం, విత్తనాలు, ఎరువులు, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యాలను శ్రమ, సహకారం ప్రాతిపదికగా అమలుచేసింది. తీవ్రమెన అణచివేతను రుచిచూసింది.
ఈ నేపథ్యంలో వచ్చిందే మలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. 97 డిసెంబర్‌లో వరంగల్‌లో జరిగిన ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు, బహిరంగ సభ, వరంగల్ డిక్లరేషన్-తెలంగాణ జనసభ, 2001లో తెరాస ఏర్పడిన తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గానీ 2004లో సాధారణ ఎన్నికల్లో గానీ వ్యక్తమయిన ఆకాంక్షలు- చంద్రబాబు భాషలోనే చెప్పాలంటే- ’ఇందుకోసం జరిగిన రిఫండమ్’ 1. ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా పట్ల, 2 నకలైట్లను శాంతిభవూదతల సమస్యగా చూడడం పట్ల, 3. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల అది రెఫండమ్.ఆ రెఫండమ్‌లో చంద్రబాబు ఓడిపోయాడు.

ఆ రెఫండమ్‌లో తెరాస నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని ప్రకటించి పాల్గొన్నది. అటువంటి తెరాసతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది. కనుక తర్వాత చరిత్ర అంతా ఈ నేపథ్యంలో విశ్లేషించాలిందే. అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి కావచ్చు. అది కూడా తమ ఎజెండాలో ఉన్న నక్సలైట్లతో చర్చల సందర్భం కావ చ్చు. చర్చలలో సిపిఐ (ఎంఎల్ )జనశక్తి ప్రతినిధి రియాజ్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపినపుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం నుంచి రాజీనామా చేసిన తెరాస మంత్రులు ఇపుడీ విషయాన్ని విస్మరించినట్లు నటించవచ్చు. కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం భూమి, వనర్లపై వలసాధిపత్యం తొలగి ప్రజల ప్రజాస్వామిక అధికారాన్ని సాధించడానికి సాగుతున్న ఉద్యమం. మిలియన్ మార్చ్ అయినా, సకల జనుల చారివూతక సమ్మె అయినా, సెప్టెంబర్ 30న తలపెట్టిన మార్చ్ అయినా ఈ అవగాహనలో సాగుతున్నవే. డాక్టర్ కాసుల లింగాడ్డి వ్యాసాల ప్రాతిపదిక ఇది.

రెండు వ్యాసాలు- ఒకటి ప్రొఫెసర్ జయశంకర్‌పై రాసింది, సహజంగానే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై రాసిన వ్యాసమే అవుతుంది. రెండవది శివసాగర్‌పై రాసింది. ఇది విప్లవ కవిత్వోద్యమంపై రాసింది మాత్రమే కాదు, శివసాగర్ కూడ 1968 నుంచీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచినవాడే కాబట్టి, అది కూడా ఇందులో ఇముడుతుంది. అయితే ఈ రెండు వ్యాసాలకున్న పరిమితి- సుంకిడ్డి నారాయణడ్డి రాసిన తెలంగాణ చరివూతను (‘ఆధునిక అనంతరవాదం సుంకిడ్డి చేతికి వేసిన సంకెళ్లు’ ముస్లిం అస్తిత్వవాదాన్ని, ‘అసఫ్‌జాహి ప్రజోపయోగ చర్యలకు ఘనంగా కీర్తించవలసిన’ పని పెట్టాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి కూడా బందగీతో ప్రారంభించి రాయవచ్చు. రచయిత సూచించినట్లుగా ‘1947 ఆగష్టు 15 నుంచి రచన మొదలుపెడితే’ 48 సెప్టెంబర్ 11న రావి నారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌లు చేసిన సాయుధ పోరాట ప్రకటన ఉండనే ఉన్న ది. అందులో అన్ని అస్తిత్వాలు వస్తాయి- తెలంగాణ, బ్రాహ్మణేతర, ముస్లిం.

వాస్తవానికి కామ్రేడ్స్ అసోసియేషన్ మొదలు తెలంగాణలో కార్యరంగాన్ని, సాంస్కృతిక కళారంగాలను ప్రోక్షిగెసివ్ రైటర్స్ అసోసియేషన్, ఇప్టా -కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన ఆద్యుల్లో మఖ్దూం ప్రముఖుడు), కాసుల ప్రతాపడ్డి కథా సంకలనాలను విశ్లేషించినపుడు తన మీద ఉన్న ఇద్దరి ప్రభావాలను, వారి పట్ల తనకున్న అపార గౌరవాన్ని కూడా వ్యక్తం చేస్తూనే.. వాళ్ళు ’వినిర్మాణ’వాదం వదల లేకున్నారని సున్నితంగా పరిశీలిస్తాడు గానీ జయశంకర్ విషయంలో గానీ, శివసాగర్ విషయంలో గానీ పారవశ్యమే.
‘ప్రపంచీకరణ- స్థానికీకరణ- సాహిత్య ఉద్యమా’ల్లో, ‘కవిత్వానికి దండం పెడతా’లో, ‘ఆధునిక వచన కవిత్వంలో వస్తు, శిల్పా’ల్లో, ‘ప్రజలే చరిత్ర నిర్మాతలు’ సాహిత్య వ్యాసాల్లో మార్కిస్టు దృక్పథం నుంచి సాహిత్య విశ్లేషణ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. వస్తు, శిల్పాల్లో సంస్కృత అలంకార శాస్త్రంతో సమన్వయం చేసే ప్రయత్నం కనిపించినా తిపురనేని మధుసూదన్ రావు కేతవరపు రామకోటి శాస్త్రితో ఈ విషయంలోనే పేచిపడ్డాడని డాక్టర్ లింగాడ్డి దృష్టికి వచ్చినట్లు లేదు) అన్ని సాహిత్య వ్యాసాల్లోనూ ఆయనకున్న విస్తృత అధ్యయనం వల్ల ఆయన కృతకృత్యుడయ్యాడు.

జయశంకర్ 53 నుంచి.. కన్నుమూసే దాకా నాన్‌ముల్కీ మొదలుకొని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం దాకా స్థానిక అధికారం రాజకీయాల నుంచి మొదలుకొని వనర్లు, ఉపాధి దాకా ప్రతిపాదించినా- ఆయనకు తెలంగాణాయే పరిమితి, పరమం అనే అంశాన్ని రచయిత ప్రస్తావించలేదు. (నా విషయంలో రచయిత కోరిన వివరణ ఇప్పటికే ఇరువాలు ఇచ్చి ఉన్నాను, గనుక మళ్లా ప్రస్తావించను) అట్లే శివసాగర్ విప్లవ దృక్పథం, వర్గం నుంచి దళితవాదంలోకి మారిన వైనాన్ని ఒకే పారవశ్యంలో ప్రశంసిస్తాడు.

వేరు వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలు, చేసిన ప్రసంగాలు ఒకేచోటికి వచ్చినపుడు కొంత పునరుక్తి తప్పదు. కాని ఒక అవగాహన, దృక్పథాన్ని ముఖ్యంగా అది ఆరోగ్యకరమెంది అయినపుడు చెప్పేవాడు వైద్యుడయినపుడు, ముఖ్యంగా పిల్లల వెద్యుడయినపుడు అటువంటి సత్యం నిత్యం నిర్దేశించవలసిందే. డాక్టర్‌గా అటువంటి సాహిత్య, ఉద్యమ, తెలంగాణ ఉద్యమ చికిత్సకు, అవసరమైతే శస్త్ర చికిత్సకు (చికిత్స, శస్త్ర చికిత్స కూడా ఇరువాలే) పూనుకున్న కాసుల లింగాడ్డి వ్యవసాయ కృషి ఇంకా ఇరువాలుగా కొనసాగాలని ఆశిస్తూ, అభినందిస్తూ...

-వరవరరావు
(‘ఇరువాలు’ పుస్తకానికి వరవరరావు రాసిన
ముందుమాటలోని కొన్ని భాగాలు)

37

VARAVARA RAO

Published: Wed,April 10, 2013 10:31 PM

నుస్రుత్ మొహియుద్దీన్ కోసం.. అల్విదా సాథీ

మూసీనదిలో నీళ్లున్న రోజుల్లో ఆ నది మీద ఇన్ని వంతెనలు లేవు. ప్రేమ ఉన్నచోట జీమూత అంధకారంలోను, వరద బీభత్సంలోను ఎదురీది దాటిన నది. స్న

Published: Sun,April 7, 2013 11:13 AM

గుండె తెలంగాణ ‘గొంతుకలోన కొట్టాడుతున్నది’

గుండెబోయిన శ్రీనివాస్ స్వశిక్షితుడో, సుశిక్షితుడో గానీ అతనిలో మంచి కాలమి స్టు లక్షణాలున్నాయి. కాలమిస్టు అంటే పత్రికల్లో ‘కప్పెంతో

Published: Sun,April 7, 2013 10:21 AM

ఆళ్వారు -తెలంగాణ జీవనం

ఆళ్వారు ఏదో ఒక మనిషి పేరు కాదు, అదో విధానము. విధానమంటే ఏదో ఒక కార్యవిధానము కాదు. అదొక జీవన విధానము’ అన్నాడు వట్టికోట ఆళ్వారు స్వామ

Published: Sun,April 7, 2013 08:19 AM

జయశంకర్‌తో వొడవని ముచ్చటే

జూన్ 27 బుధవారం ‘చెలిమె’లో జయశంకర్ గారి ‘వొడవని ముచ్చట’ పై సమీక్ష రాస్తూ డాక్టర్ కాసుల లింగాడ్డి నా ప్రస్తావన తెచ్చి నా మీద బాధ్యత

Published: Sun,April 7, 2013 08:13 AM

కత్తి వ్యాసానికి వీవీ వివరణ

శివసాగర్ గురించి, గద్దర్ గురించి రాసిన సందర్భాలలో కత్తి పద్మారావు నాగురించి, విరసం గురించి తనకు తోచిన రీతిలో నిందాపూర్వక ఆరోపణలు చ

Published: Sat,April 6, 2013 08:04 PM

‘మట్టి మనిషి’ జ్ఞాపకం

తెలంగాణ వైతాళికులలో ఒకరు పొట్లపల్లి రామారావుగారు (1917-2001) చనిపోయినపుడు 2001 సెప్టెంబర్ 10న ప్రజాతంవూతలో రాసిన వ్యాసం యిది. దాదా