ఆళ్వారు -తెలంగాణ జీవనం


Sun,April 7, 2013 10:21 AM

ఆళ్వారు ఏదో ఒక మనిషి పేరు కాదు, అదో విధానము. విధానమంటే ఏదో ఒక కార్యవిధానము కాదు. అదొక జీవన విధానము’ అన్నాడు వట్టికోట ఆళ్వారు స్వామికి నివాళి అర్పిస్తూ కాళోజీ. ‘అతనిదే సార్థకమైన జీవితం’ అన్నాడు తన ‘అగ్నిధార’ను అంకితం చేస్తూ దాశరథి. అంటే వట్టికోట అళ్వారు స్వామి జీవిత రేఖలలో జీవిత చరివూతను రచించడమంటే ఒక సార్థక జీవన విధానాన్ని ఆవిష్కరించడమన్న మాట. అది ఒక మనిషి పేరు కాక , ఒక కార్యవిధానం కూడా కాక, ఒక సార్థక జీవన విధానమైనపుడు అది ఒక మనిషిది కూడా కాదు. ఒక జాతిది. తెలంగాణ జాతిది. తెలంగాణలోని ఆంధ్ర మహాసభ, గ్రంథాలయోద్యమం, స్టేట్ కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలలోని కార్యవిధానం. ఈ కార్యవిధానం జీవితం నుంచి వేరయింది కాదు. ఉద్యమ కార్యవిధానాల నికషోపలం. కనుక సార్థకమైంది. ఇది తెలంగాణ జీవన విధానంగా అర్థం చేసుకున్నప్పుడు ఇందులో 1915 నుంచి 61 వరకు అది ఆళ్వారుస్వామి ప్రతీకగా వ్యక్తమైంది. ఆళ్వారుస్వామి 1 నవంబర్ 1915న కళ్ళు తెరిచి ఒక తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి ఒక జీవన విధానాన్ని ప్రారంభించినా ఆ శిశువు తనతో కొని తెచ్చిన ప్రాచీన తెలంగాణ స్వప్నాలున్నాయి. అవన్నీ దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణలుగా ఆయన వెలువరించిన పుస్తకాల్లో మనం చూడవచ్చు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడాని కన్నా పూర్వం ఆయన మనకు ‘ప్రజల మనిషి’ నవలలో పరిచయం చేయదలుచుకున్న తెలంగాణ ప్రజా జీవితంలో చూడవచ్చు. నిరంతర మార్పుతో ఆయన సాగించిన జీవన ప్రస్థానమే గత వర్తమానాల సంభాషణగా భవిష్యత్ స్వప్నాల్లోకి సాగిన చరిత్ర కనుక ఆయన 1961లో అకస్మాత్తుగా కన్నుమూయడంతో ముగిసిన జీవన విధానం కూడా కాదది. పొట్లపల్లి రామారావు వలె ఒక నిండు జీవితం జీవించి ఉంటే ఆయన దిమ్మగూడెం గ్రామం ఏ పేరుతోనయితేనేమిటి -ఒక తెలంగాణ పల్లెగా ఎన్ని రూపాలు ఎత్తిందో మనకు చూపి ఉండేవాడు. కాళోజీ వలె ఒక నిండు జీవితం జీవించి ఉంటే ఒక్క తెలంగాణయే స్పార్టకస్ నుంచి ప్యారిస్ కమ్యూన్ వరకు, తన జీవిత విధానంలోనే అనుభవించిన బానిస సంకెళ్ళను, ఆవిష్కరించిన స్వేచ్ఛను మన ముం దుంచేవాడు. ఆళ్వారుస్వామి జన్మించే నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. అంతర్జాతీయంగా యుద్ధ వ్యతిరేక ప్రజాస్వామిక భావజాలం రగుల్కొంటున్నది. దేశంలో జాతీయ కాంగ్రెస్‌లో గాంధీజీ ప్రభావం ప్రారంభమవుతున్నది. తెలుగు సాహిత్యంలో ఫ్రెంచి విప్ల వ ప్రభావంతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రజాస్వామిక భావాలను పురికొల్పిన గురజాడ మరణించాడు- ఇంచుమించు ఆళ్వారుస్వామి వలెనే అర్ధాయుష్కుడుగా. గురజాడ ‘ఆధునిక స్త్రీ రేపటి చరిత్ర రచిస్తుంద’ని భాష్యం చెప్పి మధురవాణిలో, కన్యకలో మనకా భరోసా యిస్తే, తెలంగాణలో ఒక ఐలమ్మగానో,ఒక రాములమ్మగానో, ఒక కమలమ్మగానో , బైరాన్‌పల్లి అక్కా చెల్లెళ్ళ వలెనో అటువంటి చరివూతను అక్షరాలా రచించిన ‘గంగు’ను మనకు పరిచయం చేసీ చేయక ముందే ఆళ్వారు స్వామి అస్తమించాడు.

చరిత్ర చాలా నిష్ఠురమైంది. అది మన పవిత్ర కోరికల ప్రకారం మలుపులు తిరగదు. ‘గంగు’ నవల అసంపూర్తిగా మిగిలిపోవడం, తెలంగాణ సాయుధ పోరాటం సాధించిన విజయాల సాంస్కృతిక ప్రతీకగా గంగు రూపొందాలన్న ఆయన నవలా పథకం ఆయనతోనే ఆగిపోవడం వ్యక్తిగా ఆళ్వారుస్వామి జీవితానికి సంబంధించిన ముగింపయితే, జీవన విధానంగా తెలంగాణ కూడ ఆ విజయాల నుంచి మళ్ళీ విలియం హింటన్ భాషలో చెప్పాలంటే ‘ఫ్యాన్‌షెన్’ నుంచి ‘షెన్‌ఫోన్’లోకి వెళ్ళిపోవడం-‘విముకి’్త నుంచి ‘అవిముకి’్త లోకి ముడుచుకోవడం ఒక విషాదం. 1948 సెప్టెంబర్ 17న పోలీసు చర్య పేరుతో నెహ్రూ, పటేల్ సైన్యాలు హైదరాబాద్ సంస్థానాన్ని ‘విముక్తం’ చేసిన తర్వాత 1947 ఆగస్టు 15ననే కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ చేసి ఉండాల్సింది అని చెప్పిన (కిషన్ డాక్యుమెంటు) రావి నారాయణ రెడ్డి 1951 దాకా ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది? కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం తొలగలేదు కనుక. కమ్యూనిస్టు పార్టీ 1951 నవంబర్ దాకా కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించింది కనుక. ఈ జవాబులు సులభంగానే చరివూతలో లభిస్తాయి. రావి నారాయణ రెడ్డితో పాటే 1951 దాకా కూడా ఆళ్వారు స్వామి కూడ జైలు నుంచి విడుదల కాకపోవడం కూడ అందుకే అని అర్థం చేసుకోవచ్చు. చిరుపొత్తం వంటి ఈ జీవిత రేఖల్లోను పంక్తుల మధ్యన చదివితే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి తెలంగాణలో ఆంధ్ర మహాసభ నుంచి కమ్యూనిస్టు పార్టీగా బయటపడి మరొక ఆరేడు నెలల్లో ఆత్మరక్షణ కోసం సాయుధ పోరాటం ప్రారంభించనున్న (4 జులై 1946) తరుణంలో అంటే కమ్యూనిస్టు పార్టీ వర్గ పోరాటంలో ప్రవేశిస్తున్న పరీక్షా సమయంలో ఆళ్వారుస్వామి తన గురువు కోదాటి నారాయణరావు, ‘అన్న’ కాళోజీ నారాయణరావు, ఆంధ్ర మహాసభలో అంతే ఆప్తుడు కొమరగిరి నారాయణరావులకు తెలిపి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. (నవంబర్ 16, 1945). దొడ్డి కొమురయ్య నాయకత్వంలో సాగిన ఊరేగింపుపై జరిగిన పోలీసు కాల్పులపై నిజనిర్ధారణ జరపడానికి పద్మజా నాయుడును వెంట బెట్టుకుని వెళ్ళిన మొట్టమొదటి పౌర, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త ఆయన. మరి 1951లో జైలు నుంచి బయటికి వచ్చాక కమ్యూనిస్టు పార్టీకి ఎందుకు రాజీనామా ఇచ్చాడు? అగ్రనాయకత్వంతో విభేదాలు వచ్చినందుకా? ఆయన సన్నిహితంగా బద్ధం ఎల్లాడ్డి , ఆరుట్ల దంపతులు మొదలైన తెలంగాణ నాయకత్వం సాయుధ పోరాట విరమణ వైపే ఉన్నారు. ఆయన తెలంగాణ సాయుధ పోరాట విరమణను వ్యతిరేకించాడా? హైదరాబాద్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ ప్రముఖుడై ఉండి, సికింవూదాబాదులో ఏకైక ప్రజా నాయకుడై ఉండి, హైదరాబాదు శాసనసభకు కమ్యూనిస్టు పార్టీ తరఫున సికింవూదాబాదు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగి, ఆ స్థానానికి కాంగ్రెస్ తరఫున నిలబడ్డ కె.ఎస్.నారాయణ దాదాపు విరమించుకున్న దశలో చివరకు ఆళ్వారు స్వామి పోటీ చేయలేదు. ఎందుకో? ఎన్నికల రాజకీయాలు నచ్చకనా? తెలియదు. మన ఇష్టానిష్టాలతోఊహాగానాలు చేయలేము. కానీ ఆయన జీవన విధానంలో, ప్రజాస్వామిక సంస్కృతియే చైతన్యంగానూ, స్వభావంగానూ మారిన పరిణతిలో ఆయన హృదయమెక్కడ ఉందో ఊహించుకోవచ్చును.

దాశరథి రంగాచార్య ‘జీవనయానం’ నుంచి యథాతథంగా ఉటంకిస్తాను: ‘కేరళలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెహ్రూ ప్రభుత్వం కూలదోసింది (1959). అది ప్రగతిశీలురందరికీ ఆగ్రహ కారణం అయింది. ఆ అకార్యంతో నెహ్రూ విషయంలో నాకుండిన అచంచల విశ్వాసం పడిపోయింది. అదే రోజు మామయ్య తోలు సంచీ పట్టుకుని మా ఇంటికి వచ్చి ధుమధుమలాడుతూ కూలబడ్డాడు. ‘చిన్నాయన ఇవ్వాళ శాన గరంగున్నడు’ అని కమల చాయ్ అందించింది. ‘అమ్మడూ! గరంగ ఉన్ననని ఇంకింత గరం చాయ్ ఇస్తున్నావు, చల్లటి నీళ్లియ్యి’ అని తెప్పించుకుని త్రాగారు. వారి ఆక్రోశం సాంతం వెళ్లక్షిగక్కారు. నేనూ అగ్నికి ఆజ్యం పోసాను. ఇద్దరమూ కాస్సేపు కాంగ్రెస్ మీది అక్కసు సాంతం వెళ్లక్షిగక్కాం.
‘రంగన్నా, ఇగో, నువ్వు సరియైన సలహా ఇవ్వాలె. నేను పార్టీ సభ్యత్వం తీసుకుందామనుకుంటున్నా- ఏమంటవు?’ అడిగారు. ‘పార్టీ సభ్యత్వంతో నెహ్రూ సర్కారును కూలగొడ్తవా?’ అని అడిగాను. ‘ఇగో పరాచికం కాదు. నా వ్యక్తిగత అసమ్మతి? నువ్వు వద్దన్నా చేరేదే!’ అని చివాలున లేచి వెళ్ళిపోయారు. కమలా- నేనూ నివ్వెర పోయి చూచాం. తరువాత మామయ్య పార్టీ మెంబరుగా దర్శనం ఇచ్చారు. వారిది సంకల్ప బలం. కమ్యూనిస్టుగానే 06-02 1961న కన్నుమూసారు.’ (జీవనయానం పే.357) ఇటువంటి ప్రతిస్పందనలే ఆళ్వారుస్వామి నవలల్లో మనకు కంఠీరవం పజల మనిషి), నవనీతం (గంగు)లలో కూడ ఎన్నో చోట్ల కనిపిస్తాయి. ఆయన నవలలు తెలంగాణ చరివూతలో భాగమైన స్వీయ కథలని మనకందరికీ తెలుసు కనుక ఆయన విశ్వజనీన శక్తిగా మారిన ప్రత్యేక వ్యక్తి అని గ్రహించవచ్చు. ‘భారత దేశంలో పౌర హక్కుల ఉద్యమాలు ’ అనే ఒక సిద్ధాంత గ్రంథం ఆధారంగా ‘తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరిగినట్టు పత్రికల్లో వార్తలొచ్చినాయి. ఈ కాలంలో ఆంధ్రవూపదేశ్‌లో ఏ పౌరహక్కుల సంఘం లేకపోవడం యాదృచ్ఛికమే’ అని ఒక చోట ‘తెలంగాణలో బలమైన పౌరహక్కుల ఉద్యమ కార్యకలాపాలు లేకపోవడానికి కమ్యూనిస్టు పిడివాదమే కారణమని ఒక ఆరోపణ ఉంది’ అని ఒక చోట రాసిన వ్యాసాన్ని ఇటీవలనే చదివినపుడు డాక్టర్ జయసూర్య, పద్మజానాయుడులు నిర్వహించిన పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమమే నాకు స్పురణకు వచ్చింది గానీ సురవరం ప్రతాపడ్డి మొదలు వట్టికోట ఆళ్వారుస్వామి వరకు తెలంగాణలో 1938 నుంచే ప్రచారం చేసిన, నిర్వహించిన పౌరహక్కుల ఉద్యమం నాకు కూడ గుర్తుకు రాలేదు... దొడ్డి కొమురయ్య హత్యపై నిజ నిర్దారణ చేయడానికి పద్మజానాయుడు నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసి వెళ్ళిన మొట్టమొదటి కార్యకర్త వట్టికోట ఆళ్వారుస్వామి. అంతేకాదు అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడుతున్న ‘మీజాన్’ దినపవూతికలో 1946 జూలై 7న ఆయన ఈ ఉదంతంపై రాసిన వార్త ప్రముఖంగా ప్రచురితమైంది. సాహిత్య కళాపోషణ చేస్తున్నాయని రచయితలందరిచే పొగడ్తలందిన గద్వాల వంటి సంస్థానాలు ప్రజలపై మోపిన అధిక పన్నుల గురించి ఆయన రాసిన రిపోర్టు , రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హైదరాబాదు రాజ్యం ఎదుర్కొంటున్న ఆహార కొరత నివారణ కొరకు అఖిల పక్షాలను ఏకం చేయడానికి ఆయన చేసిన కృషి ఆయన పౌర హక్కుల ఉద్యమానికి ఎంత విస్తృత పరిధి కల్పించాడో ఇపుడు పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ చదివి తీరాలి....ఆరంభంలో చెప్పినట్టుగానే డ్బ్బై ఏళ్ల పూర్వమే ఇంతటి లౌకిక, ప్రజాస్వామిక దృక్పథమే కాదు, చైతన్యం కూడ ఏర్పడడానికి తెలంగాణలో ఒక జీవన విధానం కారణమైంది. ఆళ్వార్ ఒక జీవన విధానం అని కాళోజీ అన్నప్పుడు అది ఒక సూఫీ జీవన విధానం వంటిదనే భావంతోనే అన్నాడు. అందుకే ఆనాటి సంస్థానాల్లో అటు కాశ్మీర్‌లోను, ఇటు హైదరాబాద్‌లోను సగటు మనిషిలో అటువంటి ప్రజాస్వామిక జీవన విధానాన్ని చూస్తాం.

- వరవరరావు
(‘తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి సార్థక జీవనం’
పుస్తకం ముందుమాట సంక్షిప్తంగా..)
(రేపు వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి)

37

VARAVARA RAO

Published: Wed,April 10, 2013 10:31 PM

నుస్రుత్ మొహియుద్దీన్ కోసం.. అల్విదా సాథీ

మూసీనదిలో నీళ్లున్న రోజుల్లో ఆ నది మీద ఇన్ని వంతెనలు లేవు. ప్రేమ ఉన్నచోట జీమూత అంధకారంలోను, వరద బీభత్సంలోను ఎదురీది దాటిన నది. స్న

Published: Sun,April 7, 2013 12:04 PM

తెలంగాణ నాగేటి చాళ్లల్లో ..

బురద పొలం కాని,చెలక కాని ఒకసారి అడ్డంగా,మరొకసారి నిలువుగా దున్నడాన్ని ’ఇరువాలు’ అంటాము. అంటే రెండుసార్లు అని అర్థం. బురద పొలంలో ఇర

Published: Sun,April 7, 2013 11:13 AM

గుండె తెలంగాణ ‘గొంతుకలోన కొట్టాడుతున్నది’

గుండెబోయిన శ్రీనివాస్ స్వశిక్షితుడో, సుశిక్షితుడో గానీ అతనిలో మంచి కాలమి స్టు లక్షణాలున్నాయి. కాలమిస్టు అంటే పత్రికల్లో ‘కప్పెంతో

Published: Sun,April 7, 2013 08:19 AM

జయశంకర్‌తో వొడవని ముచ్చటే

జూన్ 27 బుధవారం ‘చెలిమె’లో జయశంకర్ గారి ‘వొడవని ముచ్చట’ పై సమీక్ష రాస్తూ డాక్టర్ కాసుల లింగాడ్డి నా ప్రస్తావన తెచ్చి నా మీద బాధ్యత

Published: Sun,April 7, 2013 08:13 AM

కత్తి వ్యాసానికి వీవీ వివరణ

శివసాగర్ గురించి, గద్దర్ గురించి రాసిన సందర్భాలలో కత్తి పద్మారావు నాగురించి, విరసం గురించి తనకు తోచిన రీతిలో నిందాపూర్వక ఆరోపణలు చ

Published: Sat,April 6, 2013 08:04 PM

‘మట్టి మనిషి’ జ్ఞాపకం

తెలంగాణ వైతాళికులలో ఒకరు పొట్లపల్లి రామారావుగారు (1917-2001) చనిపోయినపుడు 2001 సెప్టెంబర్ 10న ప్రజాతంవూతలో రాసిన వ్యాసం యిది. దాదా

Featured Articles