జయశంకర్‌తో వొడవని ముచ్చటే


Sun,April 7, 2013 08:19 AM

జూన్ 27 బుధవారం ‘చెలిమె’లో జయశంకర్ గారి ‘వొడవని ముచ్చట’ పై సమీక్ష రాస్తూ డాక్టర్ కాసుల లింగాడ్డి నా ప్రస్తావన తెచ్చి నా మీద బాధ్యత కూడా పెట్టారు. వాస్తవానికి ఆయన, తెలంగాణ ప్రజలు నా నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్న విషయాలు ఇదివరకు ఎన్నోమార్లు నేను చెప్పినవే. జయశంకర్ మరణించిన రోజు ‘నమస్తే తెలంగాణ’లో రాసినవి, అదే రోజు హనుమకొండ ఏకశిల పార్కులో ఆయన సంస్మరణలో మాట్లాడినవి కూడా. సీకేఎం కాలేజీ ఏర్పడినప్పటి నుంచి దాదాపు ఆరేళ్ళపాటు ప్రిన్సిపల్ కాకతీయ యూనివర్సిటీ నుంచో ప్రభుత్వం నుంచో వచ్చే ఓ సంప్రదాయమేననండి, లేకపోతే ఒక పరిస్థితి ఏర్పడింది. యూనివర్సిటీలో వచ్చే సంప్రదాయంలో మొదలై నేను సీనియర్ మాత్రమే కాకుండా 1970లో విరసంలో చేరినందున బహుశా ఆ పరిస్థితి ఏర్పడింది.

యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇద్దరు ప్రిన్సిపల్స్ వెనక్కు తిరిగి పోయిన తరువాత 72లో నేను ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ నయ్యాను. ప్రిన్సిపల్ పోస్టు కోసం ప్రకటన ఇచ్చి మళ్లీ యూనివర్సిటీ నుంచే పేర్వారం జగన్నాథం గారు ప్రిన్సిపల్‌గా వచ్చేదాక ఏడు నెలలపాటు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా కొనసాగాను. సృజన, విరసం కార్యకలాపాల వల్ల నేనే స్వచ్ఛందంగా ప్రిన్సిపల్ పదవి ఆశించలేదు. అందుకని అప్లై చేయలేదు. వాస్తవానికి పేర్వారం జగన్నాథం ప్రిన్సిపల్‌గా వచ్చిన తర్వాత మూడు నెలలకు వరంగల్‌లో విరసం సాహిత్య పాఠశాల జరిగిన తర్వాత నేను మొదటిసారి ఎంటీ ఖాన్, చెరబండరాజుతో (1973, అక్టోబర్)లో మీసా కిందా అరెస్టు అయ్యాను. కనుక కాసుల లింగాడ్డి గారు రాసినట్లుగా (నన్ను) ప్రిన్సిపల్ కావలసిన సమయంలో ఎమ్జన్సీ కారణంగా వెంగళరావు గవర్నమెంట్ అరెస్టు చేసి జైల్లో పెట్టిందనేది నిజం కాదు.

సామెత చెప్పినట్లుగా ఎమ్జన్సీ నాటికి వంతెన కింద చాల నిర్బంధ, నిషేధాలు ప్రవహించాయి. మీసా నుంచి విడుదలై నేను మళ్లీ ఉద్యోగంలో చేరాను. అది ప్రభుత్వానికి ఇష్టం లేదు. వెంగళరావు ప్రభుత్వానికి కావలిలో కె.వి. రమణాడ్డి, వరంగల్‌లో నేను కాలేజీ టీచర్లుగా ఉండటం ఇష్టం లేదు. మా మేనేజ్‌మెంట్‌లో వ్యాపారరంగంలో ఉన్నటువంటి భూపతి కృష్ణమూర్తి, రామిని మృత్యుంజయలింగం వంటి వాళ్లు మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పెండ్యాల రామానుజరావుతోపాటు నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నవాళ్లు. కాలేజీ కమిటీ చైర్మన్ కలెక్టర్ ఆ రోజుల్లో కాకి మాధవరావుగారు. ఆయన సంతకంతోనే వెలువడిన ఉత్తర్వులతో నేను మీసా కింద అరెస్టైనప్పటికీ హైకోర్టు మమ్ములను నిర్దోషులుగా ప్రకటించినందున మళ్లీ ఆయన పూనికతోటే ఉద్యోగంలో చేరాను.

ఈకాలమంతా వెంగళరావు కావలిలో కె.వి.ఆర్‌ను ఇక్కడ నన్ను ఉద్యోగాల్లోంచి తొలగించకపోతే నిధులివ్వనని మేనేజ్‌మెంట్ మీద ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నవి. ఏమైతేనేం 74 మే నెలలో సికింవూదాబాద్ కుట్ర కేసులో మమ్ములను అరెస్టు చేసి మేము ఇద్దరమే కాదు తిరుపతిలో త్రిపురనేని మధుసూదనరావు హైదరాబాద్‌లో చెరబండరాజు,ఎం.టి ఖాన్‌లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసే కుట్రలో వెంగళరావు విజయం సాధించాడు. సికింవూదాబాద్ కుట్ర కేసు (74-89) లో మేము సస్పెండ్ అయి ఉండగానే 75 జూన్ 26న ఎమ్జన్సీ వచ్చింది. ఎమ్జన్సీలో మేమంతా జైల్లో ఉన్న రోజుల్లో జయశంకర్‌గారు సి.కె.ఎం కాలేజీ ప్రిన్సిపల్‌గా ప్రభుత్వం నుంచి డిప్యు మీద వచ్చినట్లుగా విన్నాం.

నేను 75 మే నెల లో బెయిల్ మీద విడుదలై హైదరాబాద్ లో ఉన్నప్పుడు రెడ్డి మహిళా కళాశాల దగ్గర అనుకోకుండా జయశంకర్‌గారు ఎదురుపడ్డారు. మీ కాలేజీకి ప్రిన్సిపల్‌గా డిప్యు మీద రమ్మని మేనేజ్‌మెంట్ కోరుతున్నది. మీ అభివూపాయం తెలుసుకోకుండా నేను ఆమోదం తెలుపాలనుకోవడం లేదు. అదృష్టవశాత్తు మీరు బయటకు వచ్చారు. మనం కలుసుకోగలిగామన్నాడు. ‘అంతకంటే కావల్సిందేముంది. నేను 72 లోనే ప్రిన్సిపల్ పదవి వద్దనుకొనే వదలివేశాను. పైగా ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్నకదా! ఈ కుట్ర కేసు ఎన్నటికి వొడిచేను అని అన్నాను. ఆయన ఎంతో స్నేహపూర్వకంగా నవ్వి గట్టిగా చెయ్యి కలిపి వీడ్కోలు తీసుకున్నాడు. అప్పటికి మా ఇద్దరికి తెలియదు కొద్దిరోజుల్లోనే ఎమ్జన్సీ రాబోతుందని. 77 మార్చి 23న ఎమ్జన్సీ ఎత్తివేసి డిటెన్యూలనందరిని విడుదల చేసిన తరువాత నన్ను మళ్లీ ‘మీసా’ కింద అరెస్టు చేసి వరంగల్ జైల్లోపెట్టారు. పార్లమెంట్ మీసాను కూడారద్దు చేసిన తర్వాత 77 మార్చి 31 న నేను విడుదలయ్యాను.

మరునాడు ఏప్రిల్ 1న స్నేహపూర్వకంగా కలసి జయశంకర్‌గారిని అభినందించడానికి సి.కె.ఎం కాలేజీకి వెళ్ళాను. ఆలింగనాలు, ఆత్మీయ పలకరింపులు అయిపోయాక నా చేతికి తెల్లకాగితం ఇచ్చి జాయినింగ్ రిపోర్టు ఇవ్వండని అన్నాడు. ఎమ్జన్సీ తొలగి, మీసా తొలగి నేను విడుదలయ్యానే కానీ సికింవూదాబాద్ కుట్రకేసులో ఇంకా సస్పెన్షన్‌లోనే ఉన్నాను కదా నేను జాయిన్ కావాలని, మీరు చేసుకుంటారని ఆశించి రాలేదన్నాను. అవన్నీ మీకు ఎందుకు? మీరిద్దురూ అన్నాడు. జాయిన్ అవుతున్నట్లు రాసిచ్చాను, జాయినయ్యాను. కొద్ది కాలానికి 74 మే నెల 77 మార్చి ఎరియర్స్ కూడా వచ్చాయి. అప్పుడు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న సుబ్బరాజు గారితో మాట్లాడినట్లు ఆయన చెప్పాడు.

జయశంకర్ గారు తీసుకున్న ఈ సాహసిక నిర్ణయం ఒక్క నాకే కాదు నన్ను ఉదాహరణగా చూపి కావలి కాలేజీలో కేవీఆర్, తిరుపతి వెంక ఒరియంటల్ కాలేజీలో మధుసూదనరావు, హైదరాబాద్‌లో ధర్మవంతి కాలేజీలో ఎం.టి. ఖాన్‌లను మేనేజ్‌మెంట్లు ఉద్యోగంలోకి తీసుకోవడానికి దారి చూపింది. అది జయశంకర్‌గారి, నేర్పరితనం, చేసిన ఉపకారం. అయితే దానికి ఎమ్జన్సీ తొలగిన ప్రజాస్వామిక వాతావరణం కూడా ఎంతో దోహదం చేసింది. అప్పుడు వీస్తున్న గాలి ఎంత బలంగా ఉందంటే ఈ ఊపులో చాదర్‌ఘాట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న బద్ధం భాస్కరడ్డి (చెరబండరాజు)కి కూడా డిఇవో ఉద్యోగం ఇచ్చేశారు. అప్పుడు డి.ఐ.జి ఇంటెలిజెన్స్‌గా ఉన్న విజయరామారావు సికింవూదాబాద్ కుట్ర కేసులో ముద్దాయిగా సస్పెండ్ అయిన భాస్కరడ్డి (చెరబండరాజు)ని ఉద్యోగంలోకి ఎట్లా తీసుకున్నారని లేఖ రాయడంతో భయపడి ఉత్తర్వులు మళ్లీ వెనక్కు తీసుకున్నారు. ప్రభుత్వ విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులిచ్చే అధికారం డి.ఐ.జి ఇంటెలిజెన్స్‌కు ఎక్కడిదని కన్నబీరన్ హైకోర్టులో సవాల్ చేశారు.

కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక పోయినట్లుగా దాంతో 1980లో చెరబండరాజు, లోచన్‌లను ప్రభుత్వం 311-2 (సీ) గవర్నర్‌కుండే ప్రత్యేక అధికారాల కింద దాతు ఫిర్యాదు లేని ఉత్తర్వులతో ఉద్యోగాలు తీసేసింది. హైకోర్టుకు వెళ్లితే మళ్లీ ఉద్యోగా లు వచ్చాయి. కానీ అప్పటికే చెరబండరాజు మెదడుకు శస్త్ర చికిత్స జరిగి అనారోగ్యం పాలైనాడు. చెరబండరాజు అమరుడై ఈ జులై-2 కు ముప్ఫై సంవత్సరాలు. ఈ తరం తెలుసుకోవలసిన ఒక సుదీర్ఘపోరాట చరిత్ర ఆయనది అది వేరే కథ!అట్లా 77 ఎప్రిల్1 నుంచి జయశంకర్ గారు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా వెళ్ళే దాక ఎంత సన్నిహితంగా మేము సి.కె.ఎం కాలేజీలో పనిచేశామో. అక్కడ లెఫ్ట్, రైట్‌వింగ్స్ మధ్య భావసంఘర్షణే కానీ ఆధిపత్య పోరు నడవలేదు. భావ సంఘర్షణలు భౌతిక దాడులకు దారి తీయకుండా పరిస్థితులను చక్కదిద్దిన సమర్థుడుగా మాత్రం జయశంకర్ తన, నేర్పరితనాన్ని నిరూపించుకున్నాడు. ఆయన పదవీ విరమణ రోజు కాలేజీ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ తివారిగారు అదే మాట చెప్పారు. నాకు ఈ కాలేజీ లెప్ట్, రైట్ ఘర్షణల గురించి పోలీసులు ఎంతో భయపెట్టే రిపోర్టులిచ్చారు. జయశంకర్ నాయకత్వంలో ఇక్కడ రాజకీయ విశ్వాసాల మధ్య ఘర్షణే కానీ విలువల విషయంలో ఈ కళాశాల ఉన్నత ప్రమాణాలు సాధించిందని ఈ మూడేళ్ల అనుభవంతో తెలుసుకున్నానన్నారు.

-వరవరరావు

37

VARAVARA RAO

Published: Wed,April 10, 2013 10:31 PM

నుస్రుత్ మొహియుద్దీన్ కోసం.. అల్విదా సాథీ

మూసీనదిలో నీళ్లున్న రోజుల్లో ఆ నది మీద ఇన్ని వంతెనలు లేవు. ప్రేమ ఉన్నచోట జీమూత అంధకారంలోను, వరద బీభత్సంలోను ఎదురీది దాటిన నది. స్న

Published: Sun,April 7, 2013 12:04 PM

తెలంగాణ నాగేటి చాళ్లల్లో ..

బురద పొలం కాని,చెలక కాని ఒకసారి అడ్డంగా,మరొకసారి నిలువుగా దున్నడాన్ని ’ఇరువాలు’ అంటాము. అంటే రెండుసార్లు అని అర్థం. బురద పొలంలో ఇర

Published: Sun,April 7, 2013 11:13 AM

గుండె తెలంగాణ ‘గొంతుకలోన కొట్టాడుతున్నది’

గుండెబోయిన శ్రీనివాస్ స్వశిక్షితుడో, సుశిక్షితుడో గానీ అతనిలో మంచి కాలమి స్టు లక్షణాలున్నాయి. కాలమిస్టు అంటే పత్రికల్లో ‘కప్పెంతో

Published: Sun,April 7, 2013 10:21 AM

ఆళ్వారు -తెలంగాణ జీవనం

ఆళ్వారు ఏదో ఒక మనిషి పేరు కాదు, అదో విధానము. విధానమంటే ఏదో ఒక కార్యవిధానము కాదు. అదొక జీవన విధానము’ అన్నాడు వట్టికోట ఆళ్వారు స్వామ

Published: Sun,April 7, 2013 08:13 AM

కత్తి వ్యాసానికి వీవీ వివరణ

శివసాగర్ గురించి, గద్దర్ గురించి రాసిన సందర్భాలలో కత్తి పద్మారావు నాగురించి, విరసం గురించి తనకు తోచిన రీతిలో నిందాపూర్వక ఆరోపణలు చ

Published: Sat,April 6, 2013 08:04 PM

‘మట్టి మనిషి’ జ్ఞాపకం

తెలంగాణ వైతాళికులలో ఒకరు పొట్లపల్లి రామారావుగారు (1917-2001) చనిపోయినపుడు 2001 సెప్టెంబర్ 10న ప్రజాతంవూతలో రాసిన వ్యాసం యిది. దాదా

Featured Articles