కత్తి వ్యాసానికి వీవీ వివరణ


Sun,April 7, 2013 08:13 AM

శివసాగర్ గురించి, గద్దర్ గురించి రాసిన సందర్భాలలో కత్తి పద్మారావు నాగురించి, విరసం గురించి తనకు తోచిన రీతిలో నిందాపూర్వక ఆరోపణలు చేశారు. ఈ రెండు సందర్భాలలో 2007లో వెలువడిన వరవరరావు కవిత్వం (1957-2007) ముందుమాట ప్రస్తావన తెచ్చి అందులో నామీద ‘బ్రాహ్మణ కవుల ప్రస్తావన ఉన్నది. కానీ దళిత కవుల ప్రస్తావన లేదని ఎద్దేవా చేస్తున్నాడు. వచన కవి గా శ్రీశ్రీ, తిలక్ తర్వాత విప్లవకవిగా నేను తీవ్రంగా ప్రభావితమైంది శివసాగర్‌తోనే. భావజాలం విషయంలో 1968కి పూర్వం నా మీద చలం ప్రభావమెంతో, ఆ తరువాత శివసాగర్ ప్రభావం అంత ఉన్నది. బతికి ఉన్న వ్యక్తులకు రెండు సందర్భాలలోనే నేను నా కవిత్వం అంకితం చేశాను. ఒకరు చలం (1968 చలినెగళ్ళు), మరొకరు కె.జి. సత్యమూర్తి ‘ఊరేగింపు’ (1974 జనవరి). పైగా ‘చలి నెగళ్ళు అయిన గుడిపాటి వెంకట చలానికి’ అని మాత్రం రాసి అంకితమిచ్చాను. కానీ కామ్రేడ్ కె.జి. సత్యమూర్తికి అంకితం ఇట్ల రాశాను.

To find Heroes in the grand Manner
we must look rather in present
-MAO TSE-TUNG
కసితో స్వార్థం శిరస్సు గండ్ర గొడ్డలితో/ నరక గల్గినవాడే నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటు కాసి / ట్రిగ్గర్ నొక్కగల్గినవాడే ద్రష్ట
ప్రజలను సాయుధం చేస్తున్న/వల్యూషనరీ నేడు కవి
మార్కిస్టు-పూనినిస్టు నాయకుడు కామ్రేడ్. కె. జి. సత్యమూర్తికి అంకితం.
ఆయన మార్కిస్టు-పూనినిస్టు పంథా నుంచి వైదొలగిన తరువాత రాజకీయ విశ్వాసాల వల్ల మా మధ్య విభేదాలు రావచ్చు. కానీ కవిగా శివసాగర్ పట్ల నా హృదయంలో సమున్నతమైన గౌరవం, కవిగా ఆయన ప్రభావం ఎన్నటికీ చెరిగిపోనిదే. 1968-85 దాక శివసాగర్ రాసిన ప్రతి కవిత సృజనలో అచ్చయింది. జైలు నుంచి పంపిన ఆయన ప్రతి ప్రకటన సృజనలో అచ్చయింది. శివసాగర్ ‘గెరి ల్లా విప్లవ గీతాలు’ (1972), ‘జనం ఊపిరితో’ (1974),‘ ఉద్యమం నెలబాలుడు’ (1973) కవితా సంకలనాలుగా నా ముందు మాటలతో సృజన ప్రచురణలుగా వెలువడినవి.

ఆయన జైలు డైరీ ‘శతృ శిబిరంలో’ (1985) కూడా సృజన ప్రచురణగా వెలువడింది. అట్లే 1972లో అంజలీ టాకీస్ దగ్గర గద్దర్ కార్యక్షికమం ఒక బహిరంగసభలో విన్న దగ్గరి నుంచి కవిగా, కళాకారుడిగా ఆయనకు నేను అభిమానిని అయ్యాను. అంజలి టాకీసు ప్రోగ్రాం తరువాత శ్రీపతి ఇంట్లో ఒక రాత్రి ఆయన పాటలు విని, అన్నీ ఒకేసారి 16 పాటలుగా సృజనలో ప్రచురణలుగా గద్దర్ పాటలు వెలువరించాము. కవిగా, కళాకారుడిగా గద్దర్ ఒక లెజెండ్ అని నా నిశ్చిత అభివూపాయం. ఈ విషయం చాలాచోట్ల రాశాను, చెప్పాను కూడా. ముఖ్యంగా 1985-89 లలో జైల్లో ఉన్నప్పుడు విస్తృతంగా ఆఫ్రికా సాహిత్యం, లాటిన్ అమెరికా సాహిత్యం చదివినప్పుడు ఆ రచయితలు తమ మైథాలజీని సామ్రాజ్యవాద వ్యతిరేక మ్యాజిక్ రియలిజమ్‌లా సాహిత్యంలో ఎంత అద్భుతంగా మలిచారో అర్థమైనప్పుడు విప్లవ భావ ప్రచారాలకు గద్దర్ వాడుకున్న స్థానిక (నేటివ్) రూపాలు ఎంత అర్ధవంతమో అర్థమైంది. అంకురం సినిమా, గద్దర్ పాటలు అల్వాల్‌ను, వెంకటాపురాన్ని, కంటోన్మెంట్‌ని, అక్కడి కల్లు దుఖానాలు, రిక్షావాలాలతో పాటు ప్రపంచ పటంలో సాంస్కృతికంగా సజీవంగా పోరాట సంస్కృతిలో భాగం చేసి నిలబెట్టారని అర్థమైంది. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మలు, వడ్డెరోళ్లు, గ్యాంగుమెన్లు తమ రక్తమాంసాలతో చెమటైన నెత్తురుతో శ్రమ జీవులు గా విప్లవంలో భాగమయ్యారు. ‘చిలీ’ పోరాట సాంస్కృతిక యోధుడు విక్టర్‌యారో జీవితం, పాటలు సాంస్కృతిక పోరాటం చదివిన సందర్భంగా నేను జైలు నుంచి రాసిన నా సహచరుల్లో ఈ ప్రస్తావన తెచ్చాను. ఎందుకైనా మంచిదని రెండు సందర్భాల్లోను కత్తి పద్మారావు మళ్లీ మళ్లీ రాస్తున్నాడని, మళ్లీ నా ముందు మాట చూశాను. బాల్యంలో నా మీద ప్రభావాల గురించి రాస్తూ.. ‘మా రాఘవులు అన్నయ్య శ్రావ్య స్వరంలో జాషువా, దాశరథి, కాళోజి, కృష్ణశాస్త్రి, శ్రీశీ పద్యాలు, గీతాలలోకి నా ప్రయాణం మొదలైం ది’ అని రాశాను. నక్సల్‌బరీ, శ్రీకాకుళ ఉద్యమాల ప్రభావం గురించి రాస్తూ 1968 నుంచి నాలో వచ్చిన మార్పు గురించి రాశాను.

సృజన ముఖచివూతంపై మా విద్యార్థి చంద్రం 1967లో జడ్చర్ల కాలేజీ బీఏ విద్యార్థి రాసిన కవిత ‘రక్తచలన సంగీత శృతి’ నాలోని మార్పును ప్రతి ధ్వనించింది. 1968 అక్టోబర్ నుంచి స్పష్టంగా ‘ట్రిగ్గర్ మీద వేళ్లతో రా’ (లోచన్) అని నక్సల్‌బరీ పంథాను సృజన బలపరుస్తూ రాయడం కావచ్చు, మేమంతా తిరగబడు కవులుగా రావడం కావచ్చు. ‘నిన్న విడిచిన పోరాటం నేడు అందుకోక తప్పదు’ అని గ్రహించడం వల్ల కావచ్చు. ‘ప్రజలను సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేడు కవి’ (ఇప్పుడు ఇది శివసాగర్‌ది అని అందరికి తెలుసు) అని మార్చి కవులకు ఏర్పడిన స్పష్టత కావచ్చు, విరసం ఆవిర్భావం కావచ్చు. లోచన్, శివసాగర్ కవిత్వ ప్రభావాలు అని చెప్పాను.ముగింపులో ఓ చాపల్యం గురించి చెప్పాలె ‘‘పిల్లలార తల్లి వంటి విప్లవాన్ని పాడండి’’. పాట తరువాత ముప్ఫై యేళ్లకు ప్రజాస్వామిక తెలంగాణపై మళ్లీ పాటలు రాయడానికి ప్రయత్నించాను. ప్రత్యేక ఆర్థిక మండలాలపై కూడా పాటలు రాశాను. నా ప్రయత్నం గురించి పంజాబీ రచయిత, మిత్రుడు సత్నాంతో ప్రస్తావిస్తే పాష్ కూడా పాటలు రాశాడు. కానీ సంత్ రాం ఉదాస్ కాలేకపోయాడన్నాడని అని కూడా నా ముందు మాటలో రాశాను. అంటే నా మిత్రుడు నర్మగర్భంగా నాకు చెప్పదలుచుకున్నదేమంటే.. నేను పాటలు రాసే ప్రయత్నం చేసినా గద్దర్ వలే ప్రజా కవిని కాలేనని. అది నాకు కూడా తెలుసు. కత్తి పద్మారావుకు తెలిసినట్లు లేదు.

-వరవరరావు (విరసం)

37

VARAVARA RAO

Published: Wed,April 10, 2013 10:31 PM

నుస్రుత్ మొహియుద్దీన్ కోసం.. అల్విదా సాథీ

మూసీనదిలో నీళ్లున్న రోజుల్లో ఆ నది మీద ఇన్ని వంతెనలు లేవు. ప్రేమ ఉన్నచోట జీమూత అంధకారంలోను, వరద బీభత్సంలోను ఎదురీది దాటిన నది. స్న

Published: Sun,April 7, 2013 12:04 PM

తెలంగాణ నాగేటి చాళ్లల్లో ..

బురద పొలం కాని,చెలక కాని ఒకసారి అడ్డంగా,మరొకసారి నిలువుగా దున్నడాన్ని ’ఇరువాలు’ అంటాము. అంటే రెండుసార్లు అని అర్థం. బురద పొలంలో ఇర

Published: Sun,April 7, 2013 11:13 AM

గుండె తెలంగాణ ‘గొంతుకలోన కొట్టాడుతున్నది’

గుండెబోయిన శ్రీనివాస్ స్వశిక్షితుడో, సుశిక్షితుడో గానీ అతనిలో మంచి కాలమి స్టు లక్షణాలున్నాయి. కాలమిస్టు అంటే పత్రికల్లో ‘కప్పెంతో

Published: Sun,April 7, 2013 10:21 AM

ఆళ్వారు -తెలంగాణ జీవనం

ఆళ్వారు ఏదో ఒక మనిషి పేరు కాదు, అదో విధానము. విధానమంటే ఏదో ఒక కార్యవిధానము కాదు. అదొక జీవన విధానము’ అన్నాడు వట్టికోట ఆళ్వారు స్వామ

Published: Sun,April 7, 2013 08:19 AM

జయశంకర్‌తో వొడవని ముచ్చటే

జూన్ 27 బుధవారం ‘చెలిమె’లో జయశంకర్ గారి ‘వొడవని ముచ్చట’ పై సమీక్ష రాస్తూ డాక్టర్ కాసుల లింగాడ్డి నా ప్రస్తావన తెచ్చి నా మీద బాధ్యత

Published: Sat,April 6, 2013 08:04 PM

‘మట్టి మనిషి’ జ్ఞాపకం

తెలంగాణ వైతాళికులలో ఒకరు పొట్లపల్లి రామారావుగారు (1917-2001) చనిపోయినపుడు 2001 సెప్టెంబర్ 10న ప్రజాతంవూతలో రాసిన వ్యాసం యిది. దాదా

Featured Articles