దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు


Tue,November 5, 2013 11:56 PM


నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహించలేదు. బహుశా అప్పటి తెలంగాణ రాజకీయ, సాహిత్య వాతావరణం అందుకు దోహదం చేసింది. జాషువా, జంధ్యాల, శ్రీశ్రీలతో కేవలం పుస్తక పరిచయమే.1960 లలో గానీ ఈ ముగ్గురితో పరిచయమేర్పడి, ఈ ముగ్గుర్నీ కృష్ణశాస్త్రినీ నేనే వరంగల్ ఆర్ట్స్ కాలేజీకి తీసుకెళ్లాను. వట్టికోట, దాశరథి, నారాయణడ్డి గార్లతో మా రాగవులన్నయ్యకు ఉత్తర ప్రత్యుత్తరాలుండేవి. అనుకోకుండా ఆళ్వారుస్వామి గారిని ఒకసారి మా ఇంటికి వేస్తే చూసాను కూడ. ఇంక దాశరథి, సినాలను చూడాలనే కోరిక మిగిలిపోయింది.అది డిసెంబర్ నెల. ‘హైదరాబాద్‌లో ఏం చూడాలనుకుంటున్నావు’ అని అడిగాడు మా బావ ఆవంచ వేణుగోపాలరావు. ‘హుసేన్‌సాగర్, నిజాంసాగర్’ అని చెప్పా. ‘దాశరథి, సినాలను’ అని కూడా చెప్పాను. భళ్లున నవ్వాడు. ‘నిజాంసాగర్ ఇక్కడికి నూరు మైళ్ల కన్న ఎక్కువ దూరం. నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది’అన్నాడు. ‘నిజాం కాలేజీలో ఆంధ్రాభ్యుదయోత్సవాలు జరుగుతున్నాయి. ఒకరోజు సాయంకాలం హుసేన్‌సాగర్ చూసి అటుపోతే అక్కడ నారాయణడ్డిని చూడవచ్చు. ఆయనే అక్కడ ఆంధ్రాభ్యుదయోత్సవాల వ్యాఖ్యాత’ అన్నాడు. దాశరథి గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఆ సాయంకాలమే నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగేలా దాశరథి, డి. రామలింగం, మరిపడిగ బలరామాచారి పుత్లీబావ్లీకి మా బావ దగ్గరికి వచ్చారు. నా ఆనందానికి అవధులు లేవు. ఒకరోజు సాయంకాలం హుసేన్‌సాగర్ చూసి, నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో కిక్కిరిసిన జన సందోహంలో ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో వక్తల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యవూకమాలు, నాటకాలు చూసాం. వెనుక నుంచి మైక్‌లో సి. నారాయణడ్డి గారి వ్యాఖ్యానం. అప్పటికింకా ఆయన ఎం.ఎ. విద్యా ర్థి అనుకుంటాను. ‘నవ్వని పువ్వు’ మాత్రం వెలువడిది. ఏ అర్ధరాత్రి దాటాకనో వేదిక వెనుక వైపు వెళ్లాం. నారాయణడ్డిని ప్రత్యక్షంగా చూడడానికి. ఉంగరాల జుట్టు, బక్కపలచని ఆకర్షణీయమైన శరీరం. కోటు వేసుకున్నాడు. అందంగా ఉన్నాడు. సినిమా నటుణ్ని చూడడానికి ఎగబడినట్లుగా విద్యార్థి యువకులు. చూసామనిపించుకొని తిరిగి వచ్చాం. ఇదే మొదటిసారి. ఒకేసారి ఒకటి రెండు రోజుల తేడాలో నేను దాశరథి, సినాలను చూడడం.

1957-58 నాటికి ‘సోషలిస్టు చంద్రుడు’ (57) ‘భల్లున తెల్లవారునింక భయం లేదు’ (1958) కవితలతో నేనూ కవిననిపించుకున్నాను. కనుక దాశరథి, సినాలకు నేనింక కవి ‘రాజశ్రీ’ రాగవులన్నయ్య తమ్మునిగా మాత్రమే మిగిలిన పరిచయం కాదు. 1958-59 అకడమిక్ సంవత్సరం నేను బి.ఎ. రెండవ సంవత్సరంలో ఉండగా మేం వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ నుంచి కశ్మీర్‌కు ఎక్స్‌కర్షన్‌కు పోయాం.తర్వాత కాలం (1960-61)లో శ్రీశ్రీ,స్టీఫెన్ స్పెండర్‌లో పోల్చిన నెల్లుట్ల మురళిమోహన్ అనే కవి విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఢిల్లీలో మేం రాష్ర్టపతి రాజేంవూదవూపసాద్, ఉపరాష్ర్టపతి రాధకృష్ణన్, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను కలి సాం. మా వరంగల్ ఎంపి ఇటిక్యాల మధుసూదన్. మేమంతా ఢిల్లీలో ఆయన క్వార్టర్‌లో దిగాం.మేం ఉపరాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను కలవడానికి వెళ్లిన సాయంత్రం, దాశరథి కూడా అక్కడికి వచ్చాడు. ‘అమృతాభిషేకం’ కవితా సంపుటి ఆవిష్కరణ చేయమని కోరడానికి వచ్చినట్లున్నాడు. ‘నన్నెందుకు రమ్మంటున్నారు’ అని ఆయన అడిగాడు. ‘ఆలంపురం సభల పరిచయంతో’ ననీ, ‘ఈ పుస్తకం బెజవాడ గోపాలడ్డికి అంకితం చేస్తున్నా’నని చెప్పాడు. ఎందుకో రాధాకృష్ణన్ అంత సుముఖంగా కనిపించలేదు. ‘You poets sing songs of the rising sun’ (మీరు కవులు ఉదయిస్తున్న సూర్యుని గురించి గీతాలు పాడుతారు) అని నోట్లో నాలుక మడచి (tung incheek) చెప్పినట్లు నాకనిపించింది. దాశరథి చిన్నబోయాడు. (ఆ దృశ్యం నాకిప్పటికీ మనసు మీద ముద్రపడి ఉంది). మా విద్యార్థులతో పాటే ఆకాసేపు అక్కడ కూర్చొని మాతోపాటే ఇటిక్యాల మధుసూదన్ క్వార్టర్‌కు వచ్చాడు. మా విద్యార్థులందరికీ, ముఖ్యంగా నాకూ, మురళీమోహన్‌కూ రాధాకృష్ణన్‌ను చూసిన దానికన్నా, దాశరథిని అక్కడ కలవడం, మాతోపాటు ఆయన మేమున్న చోటికే రావడం ఎంతో ఆనందమేసింది.

ఇంక 1960లో ఉస్మానియా క్యాంపస్‌కు వచ్చాక ఎం.ఎ.లో మా అధ్యాపకులు పల్లా దుర్గయ్య గారు (మహావూపస్థానం, పెనుగొండ లక్ష్మి చెప్పేవారు) బి. రామరాజు గారు నారాయణగూడ, చిక్కడపల్లిలోనే ఉండేవాళ్లు గదా. ఇద్దరిదీ మడికొండ గనుక (రామరాజు గారిది మడికొండ దగ్గర దేవనూరు) మాకు కుటుంబ పరిచయమే. 1962లో మర్లెన్ మన్రో చనిపోయినప్పుడు నేను ‘అకవితా వస్తువు’ అనే కవిత రాసి బెజవాడ నుంచి వెలువడే జ్యోతికి పంపాను. ఆ కవితకు బొమ్మ వేయడమే కాకుండా బాపు ఒక ఉత్తరం రాసాడు. ‘మీ కవిత మాకందరికీ బాగా నచ్చింది-మేం దాశరథి ‘గాలిబ్ గీతాలు’ అనువాదం అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం చేసే సభకు హైదరాబాద్‌కు వస్తున్నాం-అబిడ్స్ తాజ్‌మహల్‌లో ఉంటాం. వీలయితే వచ్చి కలవండి. మిమ్మల్ని చూడాలని ఉంది’ అని. (మేం అంటే బాపు, వెంకటరమణ, నండూరి రామమోహనరావు, జ్యోతి సంపాదకుడు రాఘవయ్యగారన్న మాట.) అట్లాగే ఆ ఉదయం వెళ్లి వాళ్లను కలిసాను. బహుశా ఆ తర్వాత దాశరథి మద్రాసుకు రేడియోకు,సినిమాకు మారాడేమో. మా కలయికలు బాగా తగ్గినవి.
దాశరథితో ఉన్నవన్నీ మధుర జ్ఞాపకాలే కావు. అయితే కాళోజీ దాశరథిల స్నేహంలో వచ్చినటువంటి ‘సృష్టిలో తీయని ‘స్నేహం’ కొన్ని చేదు రుచులు చూసిందీ కాదు. రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన సాహిత్య వ్యక్తీకరణలు, ఎదురుబడి చెప్పుకోకున్నా మా మధ్య ఎడం తెచ్చినవి. అక్కడ కూడ అది వ్యక్తిగతం కాదు. నేను, కొందరు ‘సాహితీ మిత్రులు’తో కలిసి సృజన ప్రారంభించడం 68 నాటికి, అంటే 1960లో వదిలిన వరంగల్‌కు మళ్లీ చేరే నాటికి ,కేవలం సాహిత్యజీవిగా కాకుండా నక్సల్బరీ వసంత మేఘంతో తనవితీరా తడిసిన వాణ్ని కావడం, నా మొగ్గు శ్రీకాకుళం నుంచి ములుగు అడవుల దాకా సుడిగాలిలో వడివడిగా అడుగులేసింది. ఇంక తెలుగు కవిత్వ వివాద చర్చల్లో విషాద ఘట్టం శ్రీశ్రీ దాశరథి పరస్పర దాడి గీతాలు-అది విరసం ఆవిర్భావ కాలంలో వెలుగుకన్నా వేడికెక్కువ దారి తీసింది.

దాశరథి 1968 నుంచి మరణించే 87 దాకా ‘ముక్కోటి ఆంధ్రులు ఒక్కటై ఉండాలనీ’ ‘మహాంవూదోదయ’ వాడిగానే ఉండిపోయాడు. ఆయన తెలంగాణ అభిమానం, అభినివేశం అంతా మహాంవూదోదయంలో సమైక్యమైంది. కాళోజీ ఎట్లా 69-72 ప్రత్యేక తెలంగాణను బలపరుస్తూ గేయాలు రాసాడో, దాశరథి అట్లా వ్యతిరేకిస్తూ రాసాడు. నాకేమో ’69 ఏప్రిల్‌లోనే ‘ప్రత్యేక తెలంగాణ ప్రజా పోరాటంలో లెనిన్’ కనపడ్డాడు. కాళోజీ, నేను ఇద్దరం వరంగల్ ఉద్యమంలో భాగమైపోయాం. అది ఒక కారణమైతే ఇంక నక్సలైట్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ తిట్లు రాసేంత అసహనానికి దాశరథి గురయ్యాడు. ‘ఆలోచనాలోచనాలు’ కవితా సంపుటిని జలగం వెంగళరావు ‘కళ్లల్లో ఆలోచనామృతాలు కనిపిస్తున్నాయ’ని అంకితం చేసాడు. అట్లా వెంగళరావు కాలం నుంచి చెన్నాడ్డి కాలం దాకా శ్రీకాకుళం నుంచి ‘జగిత్యాల జైత్రయాత్ర’ దాకా అటూ ఇటూ కల్లోల కాలమే. మళ్లీ టంగుటూరి అంజయ్య భాషను, ఆయన ముఖ్యమంత్రి అయినా సరే ‘ఈనాడు’ ఆధిపత్య భాష వెక్కిరించినపుడు నాలో దాశరథి పలికాడు. ‘అంజయ్య భాషే తెలుగు భాష’ అని తెగేసి చెప్పాడు. గజ్జెల మల్లాడ్డి దాశరథి భాషను కూడా వెక్కిరిస్తే.. అంజయ్య, దాశరథి, గజ్జెల మల్లాడ్డి భాషల వైవిధ్యమే తెలుగు భాష బలమని భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు చెప్పాల్సి వచ్చింది. ‘ఛెయ్యానా కూలీ’ (అంజయ్య) భాషే తెలుగు భాష అన్న దాశరథిని, అవతార పురుషడు, కృష్ణదేవరాయల వంటి తెలుగు వల్లభుడు నందమూరి తారకరాముడు ‘ఆస్థాన కవి’గా ఎట్లా ఆదరిస్తాడు? అందుకే తాను ముఖ్యమంత్రి కాగానే తొలగించాడు. దాశరథి హైకోర్టులో సవాల్ చేస్తే జస్టిస్ పి.ఎ.చౌదరి ‘ప్రజాస్వామ్యంలో ఆస్థాన పదవులేమిటి?’ అని కొట్టివేసాడు.


ఎనభైలలోనే చాలాకాలం ఇంటర్మీడియెట్ తెలుగు పాఠ్య గ్రంథం కావ్య విభాగంలో దాశరథి ‘ఏది విప్లవం’ గేయం నేనే చెప్పేవాణ్ని. ఆ పాఠం చెప్పినంత కాలం తెలంగాణ సాయుధ పోరాటం, దాశరథి, విప్లవం గురించి చెప్పే అవకాశం వల్ల విద్యార్థులతోనే కాదు దాశరథితో కూడ అన్ని రోజులూ సంభాషణ, చర్చ జరుపుతున్నట్లే అనిపించేది. దాశరథి కవిత్వం గురించి గాక, జ్ఞాపకాలు రాస్తున్నాను గనుక కాసేపు నాకెంతో ఇష్టమైన ఆయన ఎన్నో పద్యాలు, గేయాలు,సినిమా పాటలు, కవితల ప్రస్తావనా పారవశ్యంలోకి వెళ్లకుండా ఒక మూడేళ్లు నా మనసులో మార్మోగిన భావోద్వేగాలకు కవితా రూపమివ్వడం, ముగియగానే శీర్షికగా నాకు తట్టిన పేరు ‘ఏడుపాయల నది ఏమన్నది?’
ఎవ్వరే యెదురొచ్చి ఏడు పాయలు చేసి
రవ్వల వీణపై రాగమొత్తిరి నిన్ను
ఏడుపాయల దుర్గ యేమన్నదే నిన్ను?
యేమన్నదే నిన్ను యేడుపాయల దుర్గ?
(మంజీరా మౌనభంగం)
ఏడుపాయల దుర్గ ఎదురుగా వచ్చింది
పాడుకొమ్మన్నది పరుగులిడమన్నది
స్వరమొక్క పాయగా సాగిపొమ్మన్నది
బంగారు పండిచి ప్రజలకిమ్మన్నది...
దాశరథి మంజీర నదిపై రాసిన పద్యాలు ఎంత హృద్యమైనవో.
‘ఎవరి కజ్జల బాష్ప ధారవే నీవు మంజీర
ఎవరి గజ్జల రవళివే నీవు మంజీర’ అని ఆ నదిపై కట్టిన నిజాంసాగర్ ప్రాజెక్టు గురించి, ఇక్షుఖండాలు పండిచే పంట పొలాల గురించి దాశరథి ఎంత పరవశమై రాస్తాడో. ఆ నిజాంసాగర్‌లో ఇసుక మేటవేసి, చెరుకు పంట ‘పందికొక్కుల’ పాలై, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మొదలు నిజామాబాద్, మెదక్ జిల్లాలోని చక్కెర మిల్లులన్నీ సంపన్నాంధ్ర దళారీల వశమై, ఆ ప్రాజెక్టు కింది భూములన్నీ వలసాంధ్ర సంపన్నుల హక్కు భుక్తమై, చివరకు ఏడుపాయల దుర్గ సాక్షిగా సింగూరు నీళ్లు ఆ ప్రాజెక్టు కింది రైతు దూడల నోళ్లు కట్టేసి, మహా నగరానికి మంచినీళ్లయి, ‘స్వరమొక్క పాయగా సాగిపోయి బంగారు పంట పండిచి ప్రజలకిమ్మన్న’ సందేశానికి ఏ క్షతి కలిగిందో ఇపుడు దాశరథి చూడగలిగితే ‘మహాంవూదోదయం’ పాడేవాడేనా? (ఒక తెలంగాణ వైతాళికుడు తొలి తెలంగాణ వైతాళికుడయిన సురవరం ప్రతాపడ్డికి అంకితంగా).

ఇంతకూ ఈ పద్యానికీ నా మానసికతకూ సంబంధమేమిటి?
ఇపుడు తెలుగు సమాజానికి కొంచెం వివరంగానే తెలిసిన ఇంద్ర మారణకాండ (20 ఏప్రిల్ 1981) తర్వాత 1985 దాకా కూడా ఎన్నో విధాల, ఎన్నో రూపాల్లో ఆ అమరులైన, గాయపడిన ఆదివాసుల కోసం, కుటుంబాల కోసం ఏదో చేయాలని తపన చెందాం, ప్రయత్నించాం. కవి చేయగలిగిన కనీస సహాయం తన హృదయానికైన గాయాన్ని పంచుకోవడం. దానికొక రూపం రావడానికి కూడ మూడేళ్లు పట్టింది. తాను కూడా ఏమీ రాయలేకపోతున్నానని ‘మనం పేరు లేని వీరుల గురించి రాయడం ఇంకా ప్రజా పంథాలో నేర్చుకోవాల్సే ఉంది’ అని శివసాగర్ అన్నాడు. విచివూతమేమిటంటే ఆదిలాబాద్ ఆదివాసులేమో తమ వాళ్ల మృతదేహాల వలెనే, గాయపడిన వారిని కూడా శత్రువు చేతుల్లో పెట్టకుండా లోతట్టు అడవుల్లోకి తీసుకొని పోయారు. అమరుపూైన వాళ్లు మళ్లీ పునరుత్థానం చెందారు. గాయపడిన వాళ్లు పులుల వలె ఆ గాయాలను తడుముకొని లంఘించారు. ఇవ్వాళ మనం చూస్తున్న దండకారణ్యం, సరండా, జంగల్ మహల్, నారాయణపట్నా ఉద్యమాల నిర్మాణానికి తమ రక్తంతో దారులేసారు.

1984 మార్చ్ నెల నాటికి ఆదిలాబాద్ జిల్లాలోనే ‘సాత్‌నాలా’ (ఏడు ప్రవాహాలు) అనే చోట ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టే ప్రయత్నం చేసింది. చాల ఎత్తయిన కొండల మధ్యన ఏడు పాయలు కలిసే ప్రవాహం మీద. అది నిర్మాణమైతే ఎన్నో ఆదివాసీ గ్రామాలు మునిగిపోతాయి. ఆదివాసులు దానిని ప్రతిఘటిస్తూ ఆ నిర్మాణానికి ఇనుము, సిమెంట్ వంటి సరుకులు తెచ్చే లారీలను అడ్డగించడానికి అడవిలో చెట్లు కొట్టి అడ్డంగా పడేసారు.
‘నగరాల్లోకి అడవులను తరలిస్తున్న లారీలను
వాళ్లు చాలా కాలంగా చూస్తున్నారు.
లారీల కడ్డంగా చెట్లు వేసి ఆపడం
వాళ్లిపుడే నేర్చుకుంటున్నారు.’
డాక్టర్ రామనాథం నాయకత్వంలో మేం నిజనిర్ధారణకు వెళ్లినపుడు ఆ దృశ్యాన్ని చూసినపుడు గానీ నేను ఇంద్ర 83 జనవరిలో ప్రారంభించిన కవిత పూర్తి కాలేదు.
‘వాళ్లపైవూపభుత్వాల ప్రేమకు
ఇంద్ర స్థూపం సాక్ష్యం
గడ్చిరోలి బాటలు సాక్ష్యం
సాత్నాల ప్రాజెక్టు సాక్ష్యం
ఇంద్ర నుంచి సాత్నాల దాకా
సూర్యుడూ చంద్రుడూ చుట్టమై రాంగ
కాళ్లకు నీళ్లిచ్చి కన్నీళ్లు పెట్టిన
కన్నతల్లి సాక్ష్యం’ ఆ కన్నతల్లి ఏడుపాయల నదుల జడలల్లుకున్న పార్వతి కావచ్చు. అడవిగా, ప్రకృతిగా. మనిషిగా పెద్ది శంకర్ తల్లి కావచ్చు. అందుకే ఆ కవితకు నాకు వెంటనే స్ఫురించిన శీర్షిక ‘ఏడుపాయల నది ఏమన్నది?’ దాశరథి ‘ఏడు పాయల దుర్గ ఏమన్నది?’ లోంచి వచ్చిందే. దాశరథి ‘మంజీర’ నుంచి,సినారె ‘నాగార్జున సాగరం’ (1956) దాకా భారీ ప్రాజెక్టులకు స్వాగతం చెప్పిన కవిసమయం ఇపుడెంత మారిపోయింది?!
‘ఎవరి నుంచి నేర్చుకున్నామో వాళ్లను క్షమించడం కష్టం’ అని దాశరథియే అన్నట్లున్నాడు.
-వరవరరావు

192

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ