తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది


Wed,June 19, 2013 12:59 AMఅసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా
మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు
పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ
మన చెమటా నెత్తురోడ్చి కట్టిన భవనంలో
కట్టిన పన్నులతో.....
వాళ్లు మా వేలే మా కంట్లో పెట్టే శాసనాలు చేస్తారని
తెలియక కాదు
వాళ్లు మా ఓటేసిన వేలు కృతజ్ఞతతో
ముద్దుపెట్టుకుంటారనే భ్రమలు లేవు
నోటితో కటుక్కున కొరుకుతారనే చేదు అనుభవాలే ఉన్నాయి....
అసెంబ్లీ లేనపుడు రమ్మంటావేమిటి
అసెంబ్లీ లేనపుడు గోడలకు చెప్పుకుంటామా
మా గోడు
వినే పాలకులు లేనపుడు చెట్లకు చెప్పుకోడానికి
ఈ ఆవరణలోకే వస్తున్నాం
కొలనులోని పూలకు, తీగె మీద వాలిన పిట్టలకు
ఆయా వేళ్లల్లో పని కోసం, పని ఉండీ, పని లేకా
వచ్చే మా వంటి మనుషులకు
చెప్పుకుంటూనే ఉన్నాం....
ప్రజలు చరిత్ర నిర్మాతలు
పదవి కోసం పాదయావూతలు చేసి చర్చల్ని రక్తసిక్తం చేసి
స్టేట్‌ను సెజ్‌ల ఎస్టేట్‌గా మార్చి
వెయ్యి శవాలను తిన్న రాబందు..
సుడిగాలికి కూలిపోతే
ముసలినక్కకు దక్కిన బొక్కను..
కాజేసిన కామందువి నీవు
మనుషులు మనుషుల్ని కలవడానికి వస్తారు
మనుషులతో చెప్పుకోవడానికి వస్తారు
మనుషుల్నించి వినడానికి వస్తారు
మనుషులకు వినిపించడానికి వస్తారు
ప్రజలు గదా..
ప్రజావూపతినిధుల దగ్గరికి వస్తారు
ప్రజావూపతినిధులు ప్రజల దగ్గరికి
ఎన్నికలపుడు తప్ప రాకపోతే,
ఎక్కడ దాక్కున్నారో వెతకడానికి..
వచ్చి తీరుతారు
మహమ్మదు దగ్గరికి కొండ రాకపోతే
కొండ దగ్గరికి మహమ్మదు రాక తప్పదు గదా!
నువు తోవలో బండలేసి బ్యారికేడ్లు గట్టి
ముళ్లకంచెలేసి రాపిడ్ యాక్షన్ ఫోర్సులు పెట్టి
బాష్పవాయు గోళాలు విసిరి
మార్గాలన్నీ దుర్గమం చేస్తే.. నీ దుర్భేద్య దుర్గాన్ని
చుట్టుముట్టి కూల్చే..
చీమలదండయి ప్రజలు వస్తారు
అసెంబ్లీ లేనపుడు రమ్మంటున్నావు
అందులో ఏం మతలబు లేదు కదా
అసెంబ్లీ లేనపుడు వస్తే..
అపుడక్కడ నువ్వుంటావా?
మంద మీద పడే తోడేళ్లుంటాయా?
చలనంలో అసెంబ్లీ లేనపుడు చలో అని
నువ్వన్నావో లేదో
నీ వందిమాగధులు..
నీ కుడి ఎడమల భుజకీర్తులూ
చీప్ విప్పులూ,
తెప్పలుగ చెరువు నిండినపుడు చేరి..
బెకబెకమనే కప్పలూ
నీ సెల్‌లోని చిలుక పలుకుల మీడియా చిప్పులూ
అసెంబ్లీ లేనపుడు వస్తేనే
అది చలో అసెంబ్లీ అవుతుందంటున్నారు!
ఎంత చోద్యం
మరెంత ఔచిత్యం!
పార్లమెంటరీ ప్రొప్రైయిటీ అంటే ఇదేనేమో
శాసనసభ సంప్రదాయం అంటే ఇదేనేమో....
1967లో
ఈ అసెంబ్లీలోనే చెప్పాడు
సెసపూైన ప్రతిపక్ష నాయకుడు
శాసనసభ సాలెగూడుగా మారిందని
ఇపుడిది బాతఖానీ క్లబ్బుగా కూడ మిగలలేదు
వాకవుట్ల రుబ్బుగా మారింది
ఇపుడిది పందులదొడ్డిగా కూడ మిగలలేదు
పందేరాల పంపకాల అడ్డాగా మారింది
మహాభారతంలోని సభాపర్వంగా
పరస్పర ఆరోపణల సత్యావిష్కరణలు చేస్తున్నది
అయినా మీకేదో చెప్పుకోవాలని
మీరేదో చేస్తారని కాదు
మేం చలనంలో ఉండే ప్రజలం గనక
చలో అసెంబ్లీ అని వచ్చాం
మేం ఉద్యమించకుండా ఉండలేని
ప్రజలం గనక ఉద్యమాల బాటలో వచ్చాం
ఉద్యానవనానికి వచ్చాం
పూలు కాకపోతే..
ముళ్లయినా ఏరుకునే తిరిగిపోతాం
కన్నీళ్లయినా కలబోసుకునే తిరిగిపోతాం
నీ మీద రాళ్లయినా విసిరి పోతాం
నీ బాష్పవాయు గోళాలు..
నీ మీద తిప్పి కొట్టిపోతాం
నిన్ను బోనులో నేరస్తునిగా నిలబెట్టిపోతాం...
కొసమెరుపు:
వాయిదాల వెంటిలేటర్లపై
అసెంబ్లీ కొసఊపిరితో..
కొట్టుమిట్టాడుతున్నప్పుడు
ఒక తల్లి గర్భంలోని
నూతన శిశువుకు
స్వాగతం చెప్పే ఒకే ఒక్క
సృజనాత్మక క్రియ
మహిళా ఎంఎల్‌ఎలు చేపట్టారు
అది కూడా అసెంబ్లీలో కాదు
అసెంబ్లీ క్యాంటీన్‌లో!

-వరవరరావు
(‘తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది- చేరనివ్వని చలో గెలిచింది’ దీర్ఘ కవిత నుంచి కొన్ని భాగాలు )

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ