వంజెం సోమయ్య జైలుడైరీ...


Fri,March 15, 2013 02:14 AM

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం పట్ల గౌరవంలేని పొలీసుల చర్య కు సంబంధించిన డైరీ. ఇది ఒక వంజెం సోమయ్యదే కానక్కర లేదు. ఇది ఏ ఆదివాసీదైనా కావచ్చు. భద్రాచలం డివిజన్‌లోని ఏ ఆదివాసీదైన కావచ్చు. చర్ల మండలంలోనైతే తప్పకుండా ప్రతి ఆదివాసీది అవుతుంది. ఆదివాసీ కావడమే అతడి నేరమైపోయిం ది. ఆదివాసీ కావడమంటే మావోయిస్టు కావడం. మావోయిస్టు కావడమంటే నేరస్థుడు కావడం. ఒక సంవత్సరంపైగా వంజెం సోమయ్య నిర్బంధం, విడుదల, మళ్లీ నిర్బంధం మళ్లీ విడుదల... అట్లా జరిగితే ఇది సోమయ్య కథ చదివినట్లుగా ఉంటుంది. కానీ స్పష్టంగా చర్ల మండలంలోని ప్రతి ఆదివాసీ కథ ఇట్లాగే ఉంది. మొట్టమొదట వంజెం సోమయ్యను ఫిబ్రవరి 26నాడు చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా 2012లో.

అతడు మావోయిస్టు మిలీషియా కమాండరని గ్రామాస్థులే అతన్ని పట్టుకొని తమకు అప్పగించారని చెప్పి ఫిబ్రవరి 26న అరెస్టు చేసిన పోలీసులు, ఆయనను మార్చి 23న కాని కోర్టులో హాజరు పరచలేదు. అంటే దాదాపు నెల రోజులు. ఈ లోపల పౌరహక్కుల సంఘం వాళ్లు , న్యాయవాదులు ఎస్‌హెచ్‌ఆర్‌సీలో పిటీషన్ వేశారు. హైకోర్టులో హెబిఎస్ కార్బస్ పిటిషన్ వేశారు. ఈ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా 27 రోజలు అతన్ని అక్రమ నిర్బంధంలో చిత్రహింసలకు గురిచేసి ‘కన్ఫేషన్ స్టేట్‌మెంట్’ తీసుకున్నారు. పది నుంచి పన్నెండు నేరాలకు సంబంధించిన కేసుల్లో పాల్గొన్నట్లుగా ఒప్పించి చర్ల పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేసి 23 మార్చి నాడు కోర్టులో హాజరుపరిచారు. 17 ఆగస్టు ఆయనకు బెయిల్ వచ్చి విడుదలై ఇంటికి పోతుంటే కొత్తగూడెం బస్టాండ్‌లో మళ్లీ అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7 తేదీ వరకు ఖమ్మంలోని వేరువేరు పోలీసుస్టేషన్లలో చిత్రహింసలు పెట్టి ఖమ్మం సెషన్ కోర్టులో (జేఎస్‌ఎంలో) హాజరు పరిచా రు. మళ్లీ బెయిల్ తీసుకొని అక్టోబర్ 12న ఖమ్మం జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు.

మళ్లీ ఖమ్మం జైలు ముందే అరెస్టు చేశా రు. ఈ సారి ఏడు రోజులు పోలీసుస్టేషన్‌లో పెట్టుకొని చిత్రహింసలు పెట్టి అక్టోబర్ 19వ తేదీన ఆయనను అరెస్ట్ చేసినట్లు చూపించారు. అరెస్టుచేసిన ఆయనను కలవడానికి వచ్చిన ఆయన తండ్రి ని కూడా అరెస్టు చేశారు. ఈ కొడుకు, తండ్రి కలిసి జైలులో ఉండగానే తమకు చూడటానికి వచ్చిన తండ్రితోటి బయట ఓ వ్యక్తిని హత్య చేయాలని చెప్పాడని బయటకెళ్లిన తర్వాత హత్యకేసుల్లో ఇరికించి తండ్రి, కొడుకులిద్దరిని జైల్లో పెట్టారు. ఆ తరువాత ఇప్పటికి నెల పదిహేను రోజలు క్రితం ఆయన తండ్రి ఎర్రయ్య బెయిల్‌పై విడుదలయ్యాడు. కొడుకు సోమయ్య విడుదల కోసం చాల ప్రయత్నాలు చేసి జమానతులు తెచ్చి, ఆ జమానాతులను తాను తీసుక ఇస్తే మళ్లీ అరెస్ట్ చేస్తారనే భయంతో లాయర్‌తో జమానతుదారులను పంపిస్తే.. ఆ రోజు వరంగల్ జైలు నుంచి బెయిల్ మీదపై విడుదలయ్యాడు. మళ్లీ జైలు ముందే అరెస్ట్ చేశారు. ఈ వార్త వినగానే మీడియా వాళ్లందరికి తెలియజేస్తూ హోంమంత్రి సబితా ఇంవూదాడ్డి దృష్టికి కూడా తీసుకవస్తే ఆమె ఎప్పటిలాగే ఒక ఆనవాయితీ ప్రకారం వివరాలు తెలుసుకొని చెబుతాం అంటూ.. ఈ సోమయ్యనే మళ్లీ మళ్లీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకుంటానన్నారు.

మళ్లీ మళ్లీ అరెస్ట్ చేసిన వాళ్లను న్యాయస్థానం బెయిల్ ఇచ్చి విడుదల చేస్తున్నది. హత్య కేసులు పెట్టినా, ఎన్నో కేసుల్లో ఉన్నట్టు చూపినా కోర్టు విడుదల చేస్తున్నది. కనుక విశ్వసనీయమైనటువంటి కేసులేవి వీళ్ల మీద పెట్టడంలేదనేది స్పష్టం అవుతున్నది. ఎడాదికి పైగా ఒక ఆదివాసీ యువకున్ని ఈ విధంగా అబద్ధపు కేసుల్లో ఇరికించి చిత్రహింసలకు గురిచేసి మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని చెప్పడమనేది ఇది ఒక్క సోమయ్యకు సంబంధించిన విషయం కాదు. వాస్తవానికి ఇవాళ సోమయ్య ఒక నామవాచకం కాదు, అది సర్వనామం. అది భద్రాచలం డివిజన్‌లో కానీ, చర్ల మండలంలో కానీ.. పొరుగున ఉండే బీజాపూర్ జిల్లాలో కానీ మొత్తంగా దండకారణ్యం పరిస్థితి ఇవాళ ఈ విధంగానే ఉన్నదనే విషయాన్ని సభ్యసమాజం గుర్తించాలి. అలా గుర్తించి కదిలితే తప్పా విముక్తి ఉండదు. ఈ విషయాలపై ఎస్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులివ్వడం, వారం పది రోజులదాక వేచి వుండడం, హైకోర్టులో హెబీఎస్‌కార్పస్ వేసినా కూడా పోలీసులు అడిందే ఆటగా, పాడిందే పాటగా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సాగుతున్నటువంటి నిర్బంధం ప్రజలమీద ప్రభుత్వం చేస్తున్న యుద్ధం. ఇది గ్రీన్‌హంట్ ఆపరేషన్‌లో భాగంగా చేస్తున్న యద్ధమనే విషయాన్ని గుర్తించాలి. మనకోసం, మన వనరులు కాపాడుతున్న ఆదివాసుల మీద జరుగుతున్న ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. స్వావలంబన దిశగా అందరూ అడుగులు వేయాలి.

వరవరరావు


35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Featured Articles