‘తెలంగాణ మార్చ్’యే జవాబు


Wed,October 10, 2012 08:11 PM

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే మీడియా సమావేశంలో ఓ విలేఖరి తనకు కావాల్సిన జవాబు రాబట్టుకోవడానికి అడిగిన ప్రశ్ననే కావచ్చు. జవాబు చెప్పడంలో సుశీల్‌కుమార్ షిండే చాలా తడబడ్డాడు. మొదలు తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించాను కాబట్టి తనకు తెలంగాణ సమస్యపై అవగాహన లేదన్నాడు. రెండుపార్టీలు రెండు వాదనలు వినిపిస్తున్నాయి అన్నాడు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే నక్సలైట్లు బలపడతారని ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల ఉదాహరణ ఇచ్చాడు. షిండే ఎటువంటి సందర్భంలో మాట్లాడినా కేంద్ర హోం మంత్రిగా మాట్లాడిన మాటలకు ఉండే ప్రభావం ఉండనే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా పోలీసు మంత్రుల వైఖరే పోలీసుల చేతుల్లో ఉంటుంది. కనుక అది ఆచరణలోకి తర్జుమా అవుతుంటుంది. తెలంగాణకు సంబంధించినంత వరకు 1930 నుంచి ఇప్పటి దాకా ఎనభై ఏళ్ల కమ్యూనిస్టు పోరాట సంప్రదాయం ఉన్నది. ఈ పోరాట సంప్రదాయంలో నక్సలైట్లు, ఇప్పుడు అయితే సీపీఐ కూడా తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించడం ఒక దశ. న్యాయమైన సందర్భం.

ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, ఇంటలిజెన్స్ వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే 1968-69 ఉద్యమ కాలంలో.. 1972లో తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చింది ఒక్క నక్సలైట్ పార్టీ మాత్రమే. అది కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఉన్న పార్టీ. వరంగల్‌లో తప్ప నాడు అది అంత బలమైన పార్టీ అని కూడా చెప్పలేం. 1996 నాటికి నిషేధానికి గురయ్యేనాటికి సి.పి.ఐ.(ఎం.ఎల్) పీపుల్స్‌వార్ తెలంగాణలో చాలా బలంగా ఉన్నది. అది అఖిల భారత పార్టీ అయ్యింది. దాని కేంద్ర-రాష్ట్ర కమిటీలు చాలా స్పష్టంగానూ, నిర్మాణాత్మకంగానూ ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచాయి. తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి సామ్రాజ్యవాద ప్రపంచీకరణను అమ లు చేయదలుచుకున్న చంద్రబాబు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ మార్గంగా స్వావలంబనను ముందుకు తెచ్చాయి. అప్పటికిది ఒక్కటే విప్లవపార్టీ తెలంగాణ డిమాండ్‌ను బలపరిచింది. 2001 నాటికి తెలంగాణ కోసమే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడటమే కాదు, ఆ పార్టీ 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ నక్సల్స్ ఎజెండాయే... తన ఎజెండాగా ప్రకటించింది. అప్పటికి నక్సల్ ఎజెండా అంటే పీపుల్స్‌వార్ ఎజెండానే! అది తెలంగాణ విషయంలో కావచ్చు, భూమి, వనరులు, కొలువులు, చదువులు మొదలైన వాటి విషయంలో స్థానికులకు న్యాయం, స్వావలంబన విషయంలో కావచ్చు.

ఇవాళ హోంమంత్రి మళ్లీ నక్సలైట్ల ప్రస్తావన తెచ్చేనాటికి మావోయిస్టు పార్టీ మాత్రమే కాకుండా మరో రెండు నక్సలైట్ పార్టీలు తెలంగాణ ఉద్యమంలో బహిరంగంగా పాల్గొంటున్నాయి. అందులో ఒకటి పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో కలిసి పనిచేస్తున్నది. మరొకటి చాలా తెలంగాణవాద సంఘాలతో కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసింది.1968-69, 72లలో తెలంగాణవాదులపై దాడులకు దిగిన సీపీఐ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం స్వతంవూతంగా ఉద్యమమే చేస్తున్నది. ఈ మొత్తం క్రమంలో నిషేధింపబడిన మావోయిస్టుపార్టీ కావచ్చు, ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తున్న మార్క్సిస్టునొనినిస్టు పార్టీలు కావొచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ప్రతిపాదించిన, ఎంచుకున్న మార్గమేమిటి? తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకక్షిగీవంగా తీర్మానం చేసినా అది శాసనసభలో కానీ, పార్లమెంట్‌లో కానీ మెజార్టీ కాదు. కనుక ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా కేంద్రా న్ని ప్రభావితంచేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో బిల్లుపెట్టాలనే ప్రతిపాదన. అంటే రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని మావోయిస్టు పార్టీ సహా నక్సలైట్ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ప్రచారం చేస్తున్నాయి. 1997లో తెలంగాణ జనసభ ఏర్పడిన నాటి నుంచి ఇటీవల మిలియన్ మార్చ్‌లో న్యూడెమోక్షికసీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన దగ్గరి నుంచి డాక్టర్ చెరుకు సుధాకర్ అరెస్టు,సాంబశివుడు హత్య దాకా ప్రభుత్వం ప్రజాస్వామ్య ఆచరణను కాకుండా నక్సలైట్ల ముద్రతో ఉద్యమం పట్ల కక్ష చూపుతున్నది స్పష్టమే. ముఖ్యంగా ఏప్రిల్ 9తారీఖు నుంచి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణను జైళ్లో పెట్టి అక్రమ కేసుల్లో ఇరికించారు. తెలంగాణ ప్రజావూఫంట్‌పైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తున్న ఆర్.డి.ఎఫ్ వంటి అఖిల భారత సంస్థ మొదలు రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రజా సంఘాల దాక ప్రభుత్వం ఈ వివక్షే, అణచి వేతనే చూపుతున్నది. అంటే ప్రభుత్వానికి ప్రజాస్వామిక ఆచరణనే నక్సలిజంగా కనిపిస్తున్నది. అంటే తెలంగాణ డిమాండ్‌లోని ఒక స్థానిక స్వపరిపాలన, భావ ప్రకటన స్వేచ్ఛనే చూసి దళారీ పాలక వర్గాలు బెంబేపూత్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రస్తావన తెచ్చిన కేంద్ర హోంమంత్రి నక్సలైట్లు అన్నాడు కాబట్టి ఆయన మనస్సులో ఉన్నదీ మావోయిస్టుపార్టీ అని అందరికీ అర్థమైంది. మావోయిస్టు పార్టీ నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం వ్యవసాయిక విప్లవాన్ని ఎంచుకుని సాయుధ పోరాటం ప్రధాన పోరాట రూపంగా దేశవ్యాప్తంగా ఒక విము క్తి పోరాటాన్ని చేస్తున్నది. ఒడుదొడుకులతో, ఆటుపోట్లతో సాగుతున్న ఆ పోరాటం లో దండకారణ్యంలో ,జార్ఖండ్‌లో సరండా వంటి చోట్ల క్రాంతికారీ జనతన సర్కార్లు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రజాభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 1996-97లో తెలంగాణలో కూడా కొన్ని వందల గ్రామాల్లో గ్రామరాజ్య కమిటీల నాయకత్వంలో అటువంటి గ్రామాభివృద్ధి, స్వావలంబన కమిటీలను నిర్వహించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మావోయి స్టు పార్టీ ప్రజల ముందు ఈ పరిష్కార మార్గాన్ని పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలనే డిమాండ్ విషయంలో తెలంగాణ వాదులందరితో ఆ పార్టీకి ఏకీభావం ఉన్నది. అది ప్రజాపోరాటాల వల్ల, ఉద్యమం వల్ల మిలిటెంట్ రూపంలోనే సాధ్యమౌతుందని ఆ పార్టీ అవగాహన, ప్రతిపాదన. అవి సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, ఆర్థిక దిగ్బంధం, క్విట్ తెలంగాణ వంటి రూపాల్లో ఉండవచ్చు. రాస్తారోకో, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి రూపాలయినా కావచ్చు అన్నింటికీ మావోయిస్టుపార్టీ మద్దతు ప్రకటించింది. ఈ పోరాట రూపాలేవీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా ఉద్దేశించినవి కావు. కేవలం దళారీ పాలకులకు, బహుళజాతి తొత్తులైన బడా కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్దేశించినవి మాత్రమే. భౌగోళిక తెలంగాణ కోరుతున్న వాళ్లు కూడా తెలంగాణ భూములు, వనరులు, కొలువులు, చదువులు కోల్పోవడం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో స్వపరిపాలన భావన స్పష్టంగా వ్యక్తం అవుతున్నది. హోంమంవూతికే కాదు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు మింగుడు పడని విషయమిదే. దళారీ పాలకుపూవరికైనా మింగుడుపడని విషయం ఇది.

1947 ఆగస్టు 15న అధికారంలోకి వచ్చిన నెహ్రూ, పటేల్ ప్రభుత్వం, అంతకు ముందరి వలసపాలకుల కన్నా దేశంలోని సంస్థానాలను అనుమానంతోనూ, భయంతోనూ చూసింది. ఇండియన్ యూనియన్ బలం చూసి దాదాపు అన్ని సంస్థానాలు విలీనమైపోయాయి. కానీ స్వతంవూతించ చూసిన సంస్థానాలను సంభాషణ, సామరస్యమేమీ లేకుండా ఏకంగా దాడికి పూనుకున్నది. ఇంకా రాజ్యాంగం, రిపబ్లిక్, పార్లమెంట్ ఏర్పడక పూర్వమే, అంటే ఏ రాజ్యాంగబద్ధ, ప్రజాస్వామ్య ఆమోదం లేకుండానే ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై సైనిక దురాక్షికమణ జరిపింది.
ఢిల్లీకి భయాలు, కారణాలు చెప్పేవాళ్లకు అప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న బూచి ఒక్కటే. అది కమ్యూనిస్టులు, ఇవాళ వాళ్లు నక్సలైట్లు అనవచ్చు, మావోయిస్టులు అనవచ్చు, ముస్లింలు అనవచ్చు. షిండే ఈ సామాజిక బృందం పేరు తీసుకోలేదు కానీ తెలంగాణను వ్యతిరేకించే దళారీ భావజాలంలో ఈ భయాలు లేకపోలేదు. ఆనాడు రజాకార్ బూచి చూపడం సులభమైంది. ఇవాళ ఎం.ఐ.ఎం సాకు చూపెట్టవచ్చు. జాతీయోద్యమ కాలంలో దేశంలోని చప్పన్నారు జాతులు తమ భాష, జాతి, సంస్కృతి, ప్రత్యేకతలను కాపాడుకునే ఒక భారత సమాఖ్య కావాలని కోరుకున్నారు. అందుకే భారత గణతంత్రం ఒక సమాఖ్య, భాషా రాష్ట్రాల లక్ష్యంతో రచించబడింది.

1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత, ‘విశాలాంవూధలో ప్రజారాజ్యం’ కనుగొ ని తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, పలనాడు ప్రజల పాలిట ఆంధ్ర సంపన్నవర్గాలే కేంద్ర ప్రభుత్వమైపోయాయి. దళారీ పాలన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మారింది. తెలంగాణ నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యం గా హైదరాబాదీయులయిన పేద ముస్లింలు, దళితులు, బస్తీవాసులు, బడుగు వర్గాలకు పరాయికరించి చంద్రబాబు కాలానికి హైదరాబాద్‌పై సైబరాబాద్ పెత్తనం వచ్చింది. ఈ వలస ఆధిపత్యం రాజకీయార్థిక రంగాల్లోనే కాదు, భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ కొనసాగుతున్నది. చివరకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులు కూడా ‘బానిసకొక బానిస’ అయ్యారు. తెలంగాణ టీడీపీ నాయకులు, సీపీఎం నాయకులు ఆంధ్ర నాయకత్వానికి ‘బానిస’ లయ్యారు. నక్సలైటు ఉద్యమం వల్ల ప్రజలు బానిస సంకెళ్లు తెంచుకున్నరు. ‘నీ బాంచెన్ దొర’ అని ఇవ్వాళ ఏ ఆత్మగౌరవం గల సాధారణ తెలంగాణ ప్రజలు అనరు. కానీ అన్ని రాజకీయపార్టీల నాయకులు, ముఖ్యంగా తెలంగాణ వాళ్లు ‘జీ హుజూర్’ సంస్కృతికి దాసోహమయ్యారు.

ఇవ్వాళ సీపీఎం తప్ప ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించే పార్టీ లేదు. సీపీఎం కూడా ఇవ్వదలచుకుంటే మేం అడ్డంకాదు, ఇవ్వదలుచుకోకపోతే మా భుజం మీద పెట్టి తుపాకీ కాల్చవద్దు అంటున్నది. అయినా ఇవ్వాళ ఏచూరి సీతారామ్ భుజం మీద మన్‌మోహన్ తుపాకీ ఆధారపడలేదు. రాఘవులు భుజం మీది నుంచి వైఎస్‌ఆర్ కాలంలోనే కాంగ్రెస్ తుపాకీని వెనక్కుతీసుకున్నది.కనుక తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అన్ని రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాలే, అవకాశవాదమే, దళారీ పాలకులకు దాసోహమే(దళారీలు ఇపుడు కేంద్రాన్ని, రాష్ట్రాన్ని నియంవూతిస్తున్న సామ్రాజ్యవాద తైనాతీలయిన పెట్టుబడిదారులు, భూస్వాములు అన్నది స్పష్టమే). ఏ హోంమంత్రి అయినా..దేశీయ వ్యవహారాల మంత్రిగా కాకుం డా పోలీసు మంత్రిగా మాట్లాడుతాడు. ‘అవును మేం తెలంగాణకు అడ్డుపడుతున్నాం’ అని లగడపాటి అనగలడు, 2009, డిసెంబర్9న తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు చేస్తామని ప్రకటన పార్లమెంటులో కూడా చెప్పిన హోంమంవూతిని ఆ మాట వెన క్కు తీసుకునేట్లు లగడపాటి వంటి వాళ్లు చేయగలరు. అవగాహన లేని కొత్త కేంద్ర హోంమంవూతితో నక్సలైటు బూచి చూపించగలరు. తెలంగాణ వచ్చినా అది ఉభయ ప్రాంతాల దళారీల ప్రయోజనాలు నెరవేర్చేదిగా పాలన కొనసాగితే హోంమంత్రి భయపడుతున్నట్లుగా, భయపెడుతున్నట్లుగా నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుంది. అది రేపటి సంగతి. ఏర్పడబోయే తెలంగాణ నాయకత్వాన్ని ప్రజలు నియంవూతించుకునే చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. కానీ తెలంగాణ ఇవ్వకపోతే మాత్రం 68-69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచే దేశవ్యాప్త విప్లవోద్యమ నాయకత్వం వచ్చినట్లుగా గాయపడిన తెలంగాణలో విప్లవోద్యమం వెల్లు అప్పుడు పార్లమెంటులో బిల్లు గురించి బజార్లో తేల్చుకోవల్సివస్తుంది. అటువంటి సెప్టెంబర్ 30 ‘తెలంగాణ మార్చ్’ను ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి, ప్రతి మనిషి ఒక జెండాగా తెలంగాణ గ్రామాలు, ప్రాంతాలు మొదలు కదలివచ్చే ఒక వెల్లువను నీరుగార్చడానికి చాలా సిగ్నల్స్ ప్రచారమౌతున్న సమయంలో తెలిసో తెలియకనో కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన భ్రమలను తొలగించే మేలు చేసింది. ఇక సెప్టెంబర్ 30 సంబు రం కాదు. సమరమే! విజయోత్సవం కాదు, విజృంభణే! అందుకు అయినవాళ్లు, కాని వాళ్లు ఎవరు అడ్డుపడినా వాళ్లు ప్రజావూపవాహంలో కొట్టుకుపోతారు!

-వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ