ఆత్మావలోకనం


Sat,October 6, 2012 03:31 PM

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి, వనర్లలోకి పాతాళలోకమం తా విస్తరించి ఇవ్వాళ సామ్రాజ్యవాద ఆక్టోపస్ అయి భూనభోంతరాళాలను ఆక్రమించుకున్నవి. అయినా అది పరాన్నభుక్కు గనుక దాని కాళ్లు రక్త మాంసాలు, ప్రాణం లేని మట్టివని, దాని పునాదుల్ని కూల్చడం సులభమని మార్క్స్ కార్మికవర్గం శక్తి మీద అపారమైన విశ్వాసంతో చెప్పాడు. లెనిన్ నాయకత్వంలోను, మావో నాయకత్వంలోను కార్మిక వర్గ, రైతాంగ విప్లవాలు ఆ శాస్త్రీయ స్వప్నాన్ని రుజువు చేసాయి. మావో ‘సావూమాజ్యవాదం మనం ఏమరుపాటున ఉండదగని పులి అని చెప్తూనే ‘అంతమావూతాన భయపడవలసింది ఏమీ లేదు అది కాగితపు పులి’ అని తేల్చేసాడు. మావో కాలానికి పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదంగా సమస్త భూగోళాన్ని తన మార్కెటు దాహానికి గురి చేసింది. అది ఎంత సామ్రాజ్యవాద యుగమైందో అంత విప్లవాల యుగంకూడ అయింది. వలసలు విముక్తమయి ఐదింట రెండు వంతుల భూ గోళం సామ్యవాద ఫలాలను చవి చూసింది.

సాహిత్యంలో శ్రీశ్రీ సామ్రాజ్యవాదాన్ని మట్టి పులి అన్నా డు. దూది పులి అన్నాడు.గూగీవాథియాంగో దీనిని ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ అని, ఆఫ్రికా ఖండానికి ఒక చేత ఖడ్గం, మరొ క చేత బైబిల్ పట్టుకొని వచ్చిన సామ్రాజ్యవాద అనుభవంతో చెప్పాడు. ఈ పుస్తకంలో అరుంధతీరాయ్ చెప్పినట్లుగా నల్లజాతి విముక్తి ప్రదాతలనుకున్న కెన్యాట్టా మొదలు నెల్సన్ మండేలా వరకు ‘వాషింగ్టన్ ఏకాభివూపాయానికే’ తలొగ్గారు. ఇప్పు డు తాజాగా అరుంధతీ రాయ్ పెట్టుబడిదారీ విధానాన్ని ‘ప్రేతాత్మ’ (క్యాపిటలిస్ట్ ఘోస్ట్) అంటున్నది. పెట్టుబడిదారీ విధానం, దాని అత్యున్నత రూపమైన సామ్రాజ్యవాదం ఇవ్వాళ ఎంత పెనుభూతంగా విశ్వమంతా విస్తరించి భయవిహ్వలతకు గురి చేస్తు న్నా మార్క్స్ మొదలు అరుంధ తీ రాయ్ వరకు పోరాడే శక్తులకు ఇస్తున్న విశ్వాసం ఏమిటంటే వాటిల్లో మానవసా రం లేదు. ఆత్మలేదు. అవి ప్రేతాత్మలే. ప్రేతాత్మ ఆత్మకు పర్యాయపదం కాజాలదు. మానవసారానికి పెట్టుబడి ప్రత్యామ్నాయం కాజాలదు.

ముంబై అల్టామౌంట్ రోడ్డులో ముఖేష్ అంబానీ 27 అంతస్తుల అంటిల్లా భవనంలోని ధగధగలాడే దీపకాంతులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడే రాత్రిందినాలను రద్దు చేయలేవు. అవి తాత్కాలికంగా ఆ ప్రాంత ప్రజలకు రాత్రిళ్లు లేకుండా చేయగలవు. కాని అది ఎల్లకాలం ఉండబోయే సత్యం కాదు. అది ఒక ఆభాస మాత్రమే. నూతన ఆర్థిక విధానం పేరుతో, అభివృద్ధి పేరుతో, పెరిగిన వృద్ధిరేటు పేరుతో మనముందు ఒక మాయాజాలాన్ని పరచి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజావంచనకు పాల్పడుతున్నది. భూదాహంతో, వనర్ల దాహంతో, ప్రత్యేక ఆర్థిక మండలాలు, గనుల తవ్వకాలు, పవర్ ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారాలు, సమువూదతీర పారిక్షిశామిక, పర్యాటక కారిడార్లు వంటి పేర్లతో మనుషుల కాళ్లకింద నేల మిగలకుండ చేసి బహుళ జాతి కంపెనీలకు, బడా కంపెనీలకు అప్పనంగా అర్పిస్తున్న దళారీ స్వభావం గురించి అరుంధతీరాయ్ ఈ పుస్తకంలో సాధికారికంగా, ప్రామాణికంగా వివరాలతో, విశ్లేషణతో మన కళ్లకు కడుతున్నది. ఒక సృజనాత్మక రచయితగా ఆమె-బుద్ధిజీవులు పెట్టుబడికి కలం కూలీలదశ నుంచి సామ్రాజ్యవాద ప్రలోభానికి లోన య్యే సాంస్కృతిక దళారీలుగా తెలిసీ, తెలియక, సంకల్పపూర్వకంగా, అసంకల్పితంగా ఎట్లా లోనవుతున్నారో కూడా వివరించింది. తెలుగు సమాజం అనుభవంలో కొన్ని చేర్పు లు చేయగలమేమోతప్ప, మనం ఆత్మలోకంలో ఇప్పటికే దివాలా తీసి ఉంటే తప్ప, చదవడం ముగించి ఆత్మన్యూనతాభావంతో గిల్టీగా మిగిలిపోవాల్సిందే. మన అమ్మ జ్ఞాపకాలు, జిఎంఆర్‌లు, మన చరిత్ర, సంస్క ృతి, పర్యావరణం గురించి రాంకీలు, మనసాహిత్య సున్నితత్వాలు సోంపేట కాల్పుల సన్మానాలతో నాగార్జున దళారీ ధర్మానలు(ధర్మం మీద ఒట్టు) గానిర్దేశిస్తున్న వర్తమానంలో ఆత్మావలోకనానికి ఈప్రేతాత్మ ఏమాత్రం ప్రేరణ అయినా బతికిపోతాం.
-వరవరరావు
(‘పెట్టుబడిదారీ విధానం-ఒక ప్రేతాత్మ కథ’ పుస్తకానికి వరవరరావు రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు)

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Featured Articles