అద్దంలో ‘విద్యార్థి ’ మాట


Sat,October 6, 2012 03:33 PM

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రులు ‘సృష్టిలో తీయనిది స్నేహ మే’ అని నేర్పిన వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాల విలువలు నేర్పినవాళ్ళు ఉన్నారు. అందులో సాహిత్యం మీద ప్రేమ ఒకానొక పార్శ్యం మాత్రమే. ‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రులు కాళోజీ, వేనరె ఇచ్చిన మిత్రులు అని కూడా అనవచ్చునేమో. అటువంటి మిత్రుడు రాములు. ఇంటిపేరు లేదు. తోకా లేదు. ఇంకెవ్వరూ జ్ఞాపకం రారు. దేవుడు అనే భ్రమా మిధ్యా వంచనాపూర్వక వెతుకులాటతో సహా, ఆయనే ఆ నేరేడుపండు రంగు మొహంలోంచి నిర్మలంగానూ, ఆర్ద్రంగానూ కనిపించే విశాల నేత్రాలతో సుతిమెత్తని పలకరింపు ఇచ్చే స్నేహమయినా, పంచుకునే ఆవేదనయినా.

వి.ఆర్ విద్యార్థిగా ఆయన సాహిత్యాభిమానులకెందరికో తెలుగు నేల మీదనే కాదు. తెలుగు తెలిసి న భూగోళమంతటా తెలుసు. ఒకే ఒక్క ‘అపరిచితులు’ కవితతో కాళోజీ మొదలు కవిత్వాభిమానుల్నే కాదు. మనుషులందరి హృదయాలను సున్నితంగా స్పృశించిన కవి ఆయన. మనిషి ఆయన. ఆ మనిషి రాములు. విపరీతమైన పరిస్థితుల నుంచి నేలమీంచి నింగికెగసి ఎంతో ఘర్షణపడి, ఒక జీవన సమరమే చేసి తనదయిన ప్రత్యేక స్థానానికి చేరుకున్న స్థానిక విశ్వమానవుడాయన.

ఆకాశ వాయుయానంలో కూడ ఆపదలుంటాయి. ఉంటాయి గదా? బాలగోపాల్ అనేవాడు- నాకు విమానం ఎక్కాలంటే భయం. ఇంకేవాహనమైనా కింద భూమి ఆధారం ఉందనే భరోసా ఉంటుంది. గాలిలో ప్రాణం గాలి లో దీపమే కదా అని. అయితే ఏటికి ఎదురీదినట్టే గాలికి ఎదురీదాలని మనిషికుంటుంది కదా? అది ఒక సాహసంలో ‘గాలిలో ఈదేటి గడుసుదయ్యా లు’ ఎదురవుతే అదొక క్షోభ.

వేనరె ఇంట్లో కలుసుకునే ‘మివూతమండలి’లో ఎప్పుడయినా తన ఊరికి వచ్చినప్పుడు కలుస్తుండేవాడు రాములు. తనకు తానుగా చాల రాసుకునేవాడనుకుంటాను. వాటిలోంచి ఒక సున్నితమైన, ఎక్క డో వేదన ధ్వనించే గుండెల్ని తాకే కవిత చదివేవాడు. అది ఒక పల్లెటూరి మనిషి పట్టుతప్పి తనకు తెలియని ప్రపంచంలో ప్రవేశించి దారి వెతుక్కుంటూ చేసే ఆలాపనలా ఉండేది. ఆయన జానెడుపొట్ట కోసం ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాడు. ఎక్కడో ఉత్తరాన సుదూరవూపాంతాల్లో. అక్కడ త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది. అసలాయనకు స్వర్గం సరదాయే లేదు. గవిచెర్లకు రావాలి. ‘మివూతమండలి’ కావాలి. ఇంకేమీ వద్దు. జీవి క కావాలి. అంతే. ఎప్పుడో వచ్చే ‘మివూతమండలి’ సమావేశాల్లో పొగొట్టుకున్న సామీప్యాన్నంతా పొగేసుకొని మళ్ళీ వచ్చేదాకా అవసరమైన స్నేహగానంతో వెళ్లిపోయేవాడు. అయినా తృప్తిలేదు. తృప్తి కోసం కాదు. తపన జీవన త త్వం. ఉత్తరాలు రాసేవాడు.

ఇప్పుడిక్కడ రాశాను గానీ ఆయనది గవిచెర్ల గ్రామం అని నాకు చాల ఆలస్యంగా తెలిసింది. అట్లా తెలిసినాక విచ్చుకునే మానవ, సాహిత్య రహస్యాలు కొన్ని ఉంటాయి. అందరికీ ఉంటాయని కాదు. అదృష్టవశాత్తు రాములుకు అబ్బాయి. గవిచెర్ల కాళోజీ అత్తగారి ఊరు. కనుక బాల్యం నుంచీ ఆయనకు కాళోజీ తెలుసు. కాళోజీకి ఆయన తెలుసు. వయస్సు అంతరం అంత ఉన్నా వాళ్లిద్దరూ మిత్రులు. సాహిత్యం వాళ్లను కవితాగోష్ఠులలో మరింత కలిపింది. కాళోజీతో నాకున్న పెద్దన్నయ్య సంబంధం వంటిది కాదాయనది. అత్తగారింటి ప్రత్యేకత, చనువు వంటివి ఉంటాయి గదా.

ఇంక వేనరె. సాహిత్యంలోనే కాదు నిత్యజీవితంలోనూ ప్రపంచ బాధ ఆయన బాధ. ఆయన బుద్ధి ష్టు. బుద్ధుడు రాజకుమారుడై రాజవూపసాదం నుంచి బయటికి వస్తే రోగం, దుఃఖం, మరణం కనిపించాయేమో కాని వేనరె అటువంటి బాధా తప్త మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్లేవాడు. రాములు మొదలుకొని నాదాకా మాకు స్వాస్థ్యం కూర్చే స్వస్థానాల్లో మమ్ములను నిలపాలని, నేలనూడ్చే ఆయన రెక్కంచు ధోతీకింద చెప్పులు అరిగేలా తిరిగిన మనిషాయన. అట్లా కాళోజీ, వేనరె ప్రయత్నాల వల్ల రాములు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ ఫిజిక్సు డిపార్ట్‌మెంటులో వచ్చిపడ్డాడు. ప్రొఫెసర్ వెంక గారి సహకారంతో, బహుశా దగ్గరగా అక్కడ తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఉంటాడు. మా కలయికలు రెగ్యులర్ అవుతున్న కాలంలో మా అన్నయ్యల మిత్రుడు. నాకు సీనియర్ పార్శి వెంక ద్వారా తెలిసింది. రాములు జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీతో ప్రభావితమయ్యాడని.

మార్కెటుకు కండీషన్ అవుతున్న జీవితాల్లో , మనసును ఏ వ్యామోహనికి కట్టుబడకుండా తామరాకు మీద నీటిచుక్కవలె నిర్మలంగా కాపాడుకోవడం మంచిదేనేమో కానీ , అంతకన్నా మార్కెటు ను ధ్వంసం చేసే మార్గం ఏదైనా వెతుక్కుంటే ‘మివూతమండలి’లో ఆ రోజుల్లో ఆ ఆలోచనలు- ముఖ్యంగా 67 నుంచే జనాంతికంగా నాతో చేయమొదలుపెట్టిన వాడు లోచన్. ‘మివూతమండలి’ కి ఎక్కువ రాకు న్నా మా ఇంటికీ, లోచన్ ఇంటికీ తరచుగా వచ్చి రెచ్చగొట్టే పెండ్యాల కిషన్, పెండ్యాల రాఘవరావు- కమ్యూనిస్టు కొడుకు. అప్పటికే కమ్యూనిస్టు నిర్మాణాలతో- రామనర్సయ్యతో సంబంధాలు ఉన్న మనిషి. విచివూతంగా ఈ రెండూ ఉన్న మా పొరుగింటి సాహితీ మిత్రుడు అట్లూరి రంగారావు. ఆయన చండ్ర పుల్లాడ్డి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నా జిడ్డు కృష్ణమూర్తి అభిమాని. అయితే రాములు అట్లూరి రంగారావు అంతగా జిడ్డు కృష్ణమూర్తికి కండిషన్ కాలేదనుకుంటాను. ఎందుకంటే పార్శి వెంక దగ్గరో (ముఖ్యంగా మా దామోదర్‌రావు అన్నయ్య చనిపోయినప్పుడు ఆయన చేసిన ప్రసంగంలో) అట్లూరి రంగారావు దగ్గరో కలిగిన ఇబ్బంది నాకెప్పుడూ కలగలేదు. బహుశా అన్నీ వదులుకొని కాళోజీ పౌండేషన్‌లో; మిత్రమండలి’ లో కాళ్లూనడం వల్ల ప్రహ్లాదుడు ఉగ్రనరసింహుణ్ని ప్రేమించినట్టుగా వి.ఆర్.

విద్యార్థికి నా విప్లవాభినివేశం కూడ నచ్చి ఉంటుంది. అక్కడికి మళ్లీ వద్దాం గానీ ‘మివూతమండలి’ కేవలం సాహిత్య సంస్థకాదు. అక్కడ రచనలు చదువుకునే వాళ్లం. కాళోజీ సోదరులు ఏర్పరచిన వాతావరణం వల్ల చిన్నా పెద్దా లేకుండ చర్చించుకునేవాళ్లం. మంచి చెడ్డలు చెప్పుకునేవాళ్లం. విమర్శించుకునేవాళ్లం. ఆ సాహిత్యానుబంధం అక్కడే ఆగేది కాదు. వేనరె ఇల్లు మాకొక సత్రం చలివేందిర- అట్లా ఒకరి జీవితాల్లోకి ఒకరం ప్రవేశించాం. వరంగల్ కోటలో రాములు పెళ్లి అయితే (రత్నమాలది వరంగల్ కోట అనుకుంటాను) రాత్రంతా అక్కడ గడిపి - వాగులూ వంకలూ దాటి గవిచెర్లకు వెళ్లి- అట్లా ఆ వేడుకలో ఆద్యంతాలూ పాల్గొనవలసిందే. తెల్లవార్లూ కోటలో ఆకాశం కింద కూర్చొని సాహిత్యం, సినిమాలు, స్నేహలు మాట్లాడుకోవల్సిందే. మనుషులకు స్వర్గాల కోసం పరుగెత్తని ఒక స్నేహ తీరిక. అవసరాలు కాకుండా అభిరుచులు మాట్లాడుకునే స్నేహసందర్భం. షికాయతులు, ఈర్ష్యాసూయలు కాకుండా చిక్కని స్నేహాన్ని , ప్రేమను వాటర్‌లో కాకుండా మట్టిధాతువులతో ఉన్న మంచినీళ్లతో కలిపి అస్వాదించిన రోజులు.
మళ్లీ ఆ రోజులు వస్తాయా? ఆ రోజులు ఎట్లాగూ రావు. ఆ రోజుల విలువలు రావాలి. ప్రేమలో పరిచయం అయిన వాళ్లు దాంపత్యంలో అపరిచితులయ్యే విషాదం రాకూడదు. ‘మివూతమండలి’లో కలుసుకున్నవాళ్లు మెట్టెక్కే పోటీల్లో పక్కవాణ్ని తోసేసే మానసికస్థితి రాగూడదు. అందుకే కాళోజీ రామేశ్వరరావు అనేవారు- ఆర్గనైజేషన్- నిర్మాణం- సృజనాత్మక శక్తిని దెబ్బతీస్తుంది. ఎస్టాబ్లిష్‌మెంటు అవుతుంది. అందుకే సమావేశాలకు పిలిచే కన్వీనర్ తప్ప మరింకే నిర్మాణ రూపం ఉండొద్దు. ఆఫీసు వద్దు. ఎవరు పిలిస్తే వారింట్లో, చాయ్ కాకపోతే మంచినీళ్లు, సంస్థను రిజిష్టర్ చేయవద్దు.

సాహిత్య అకాడమీ సభ్యత్వ లాలసత్వం వస్తుంది. ‘మివూతమండలి’ కెరీరిజాన్ని అసహ్యించుకోవడం నేర్పింది. ఇచ్చకాలకు ఇబ్బందిపడడం నేర్పింది. నిర్భయత్వాన్ని నేర్పింది. ఇటువంటి సంబంధాలు లేనిచోట మిగిలేది స్నేహమే. మరి అందరం అట్లాగే ఉన్నామా? ఉండడం సాధ్యమా? రాములు వి.ఆర్ విద్యార్థి అయ్యాడు. గవిచెర్ల, కోట, మిత్రమండలి, ఆర్‌ఈసీ ప్రపంచం నుంచి ‘విపులా చ పృథ్వీ చూశాడు. హిమాలయా ల్లో కురిసిన మంచువర్ణనలతో ప్రారంభించి అమెరికాలో ఆకురాలు కాలం దాకా వర్ణించే కవిత్వం రాశా డు. అయితే పూసలోదారం వలె- వేదనా సూత్రం వలె పరాయికరణతో పరితపించే మానవ హృదయా న్ని పరిచాడు. నేనేమో ఈ పరాయికరణకు మూలాలు వెతికే వ్యవస్థ మీద యుద్ధంలో కూరుకుపోయి సాహి త్యం ఒక సాధనమే అనుకునే విరామ స్నేహాలకు తీరికలేని ఒక ప్రపంచాన్ని ఎంచుకున్నాను. అయినా మనసుకంటిన స్నేహం మాసిపోదు.

పైగా ‘మివూతమండలి’ యే మరొక మారాకు వేసి ‘సాహితీ మిత్రులు’ అయింది. దానికి ‘మివూతమండలి’ కి లేని ఒక ప్రాపంచిక దృక్పథం అలవడింది. ఇంకొక రూపంలో అది రాము లు జీవితంలో నాకన్నా గాఢంగా ప్రవేశించింది. ఎందుకంటే 1967లోనే పొట్లపల్లి రామారావు గారు చెప్పినట్లుగా నక్సల్బరీ తర్వాత గ్రామాలు గ్రామాలుగా లేవు. శ్రీశ్రీ భాషలో విప్లవ కుగ్రామాలయ్యాయి. సంగ్రామాలయ్యాయి. ముఖ్యంగా ఎమ్జన్సీ తొలగిన తర్వాత గ్రామీణ వరంగల్ అంతటా జన్నుచిన్నా లు, మామిడాల హరిభూషణ్ వంటి వాళ్ల నాయకత్వంలో రాడికల్ గాలులు వీచినవి. సీకేఎం కాలేజీ, దేశాయిపేట, పైడిపెల్లి, గవిచెర్ల- అటు నర్సంపేట, నల్లబెల్లి నుంచి ఇటు ములుగు ఏటూరునాగారం దాకా మైదానాలు మండినవి. గవిచెర్లలో భూస్వాముల దురాక్షికమణలో ఉన్న ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించి జరిగిన ఘర్షణల్లో, భూస్వాముల గుండాలకు తోడుగా వచ్చి పోలీసులు చేసిన లాఠీచార్జిలో రక్తసిక్తమయిన బట్టలతో హరిభూషణ్ మా కాలేజీ స్టాఫ్‌రూంకు తుపాను వలె రావడం నాకిప్పటికీ కళ్లల్లో ఒక సంభ్రమదృశ్యాన్ని నిలుపుతున్నది. ‘అక్కడ జీవితాలు మండిపోతున్నాయి. గుడిసెలు కూలిపోతున్నాయి. మీరిక్కడ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారా? అని కస్సుమన్నాడు. ఒక క్లాసుకు మరొక క్లాసుకు మధ్యన నేను లాంగ్వేజెస్ స్టాఫ్‌రూంలో కాఫీ తాగుతున్నాను. నాకెట్లా తెలుస్తున్నది. ఎందుకీ ప్రస్తావనంటే మామిడాల హరిభూషణ్ నాయకత్వంలోని రాడికల్ యువజన సంఘానికి గవిచెర్లలో నాయకుడు స్వయానా రాములు సోదరుడే. ఆ గ్రామంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత అకాల మరణం పాలయ్యాడు. విప్లవం నీ ఇంట్లోకి వచ్చాక నీ మనసులోకి రాకుండా ఉంటుందా. విప్లవం చైతన్యం మాత్రమే కాదు. అణగారిన సామాజిక వర్గాలకు రక్తబంధం కూడ.

కాళోజీ వల్ల మా స్నేహాబంధం గాఢమైంది. కాళోజీ బతికున్నంత కాలం మేం కలుసుకున్న ఎక్కువ సందర్భాలు కాళోజీ దగ్గరే. క్రమంగా అది వి.ఆర్ విద్యార్థి ఇంటికి వెళ్లడం, నా రాజకీయ కష్టాలు ఆయన పంచుకోవడం, ఆయన సాహిత్య ఇష్టాలు నేను తెలుసుకోవడం- తెలంగాణ అభినివేశం- సెలఏరు చెలిమి ఇప్పుడు ఎప్పుడూ తోడుకునే చెలిమె అయింది. ఆయన నా కవిత్వాన్ని ఒక గంట వీడియో క్యాసెటు చేశాడు. నేను నిర్బంధానికి గురయితే నా మీద అవ్యాజమైన అభిమానంతో రాశాడు. అటువంటి ఎవరికీ నేను స్నేహం తప్ప ఏమీ ఇవ్వలేదు.

పుస్తకాలు దులుపుకునే అలవాటు కూడ లేదు. వ్యాపకాలు దులుపుకుని జ్ఞాపకాలు నిలుపుకునే ఇష్టం ఉంది. హనుమకొండకు పోతే తెలుసుకుని, స్నేహపూర్వకంగా డిమాండ్ చేసి కలుసుకునే మిత్రు డు రామశాస్త్రి. అయితే స్వభావంలో గుంజుకుని తీసుకునే చొరవలేని విద్యార్థి కలుసుకునేవాళ్లలో ఒకసారి కాకున్నా ఒకసారి ఉంటూనే ఉంటాడు. జ్ఞాపకాలు రాసి మరచిపోకుండా ఉండడం కోసం ఎప్పటికీ రాయకుండా దాచుకునే స్నేహం వి.ఆర్ విద్యార్థిగా పరిణతి చెందిన గవిచెర్ల రాములుది.

- వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Featured Articles