ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే


Tue,November 21, 2017 11:20 PM

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి, మన రాష్ట్రం నుంచి, పొరుగు తెలుగు రాష్ట్రం నుంచి, వేలాదిమంది సాహిత్యాభిమానులు రానున్నారు ఈ మహాసభలకు. యావత్ భారతదేశానికే గుండెకాయ లాంటి చారిత్రాత్మక హైదరాబాద్-భాగ్యనగరం ఈ సభలకు వేదిక కాబోతున్నది. తోరణాలతో, స్వాగత ద్వారాలతో పండుగ వాతావరణం చూడబోతున్నాం.

తెలంగాణ ప్రభుత్వం కనుక పూర్తిస్థాయిలో సహకారమందిస్తే భారతదేశానికి హైదరాబాద్ సినీహబ్ అవుతుంది. ఈ నేపథ్యంలో, తెలుగు సినీరంగానికి సంబంధించిన అంశాలు తెలుగు మహాసభల్లో చోటుచేసుకోవాలి. ఒక సినీ నైట్ కాని, సినీ సంగీత విభావరి కాని ఏర్పాటుచేస్తే మంచిది. ఈ కార్యక్రమంలో ఎవర్నీ కించపరిచే విధంగా కాకుండా ఆ రంగం ప్రాముఖ్యం ప్రధాన అంశంగా నిర్వహణ జరుగాలి.

రాష్ట్ర ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం ఉన్నందున అన్ని సంబంధిత శాఖల సమన్వయంతో పనులన్నీ ఏ లోటు లేకుండా చురుగ్గా జరుగుతున్నాయి. ఇదొక మరిచిపోలేని మధురానుభూతిగా ఉండబోతున్నది. తెలుగు మహాసభల ముద్ర హైదరాబాద్ మీద బలంగా పడుతుందనడంలో అతిశయోక్తి లేదే మో! భాగ్యనగరం భాసిల్లుతున్నదన్న అనుభూతి మిగులుతున్నది.

అంగరంగ వైభోగంగా, నభూతో-నభవిష్యత్ అనే రీతిలో, రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరుగనున్న సభల పూర్వరంగంలో బహువిధ సమీక్షా సమావేశాలు, సన్నాహక సమావేశాలు నిరంతరం జరుగుతున్నాయి. సాహిత్యాభిలాష అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా కొన్ని సన్నాహక సమావేశాలను నిర్వహించడం ఒక ప్రత్యేకత అనాలి. దాదాపు రోజువారీగా, సీఎం, మహాసభల ఏర్పాట్లను సమీక్షించడం అంటే, ప్రతి అంశాన్ని ఆయన కూలంకషంగా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా భావించాలి. ఎక్కడా ఏ తప్పు జరుగకుండా, ఎవరూ నిర్వాహకులను వేలెత్తి చూపకుండా, సమావేశాలకు హాజరైన వారందరూ ఎల్లకాలం గుర్తుంచుకునేలా సభలు జరుగబోతున్నాయనడానికి ఇవన్నీ తార్కాణం. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న సమావేశం, నవంబర్ 20న ప్రగతిభవన్‌లో, తెలంగాణలో తెలు గు సాహిత్యాన్ని అధ్యయనం చేసి-ఔపోసన పట్టిన ఉద్ధండులైన అరువై మందికి పైగా ప్రముఖులతో జరిపిన సమావేశం అనాలి. రాష్ట్రం నలుమూలల నుంచి, తమదైన శైలిలో, ఒక్కో సాహిత్య ప్రక్రియలో నిష్ణాతులైన పలువురు, ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో సీఎం చెప్పి న విషయాలు అక్షర లక్షలు.

ఈ మహాసభలు జరుపడానికి ప్రేరణ.. సమైక్య రాష్ట్రంలో మన భాషను-యాసనూ వెక్కిరించి, హేళనచేసి, వెకిలిగా విమర్శించి, మన ప్రతి భా పాటవాలను వెలుగులోకి రాకుండా చేసిన నేపథ్యమే! ఇప్పుడు మన రాష్ట్రం మనకొచ్చింది. ఈ రాష్ట్రంలో జరిగే అనేక కార్యక్రమాల ప్రాతిపదికగా స్వాభిమాన నిర్మాణం జరుగుతున్న క్రమం ఇది. సాహిత్య సేవ ఏండ్ల తరబడిగా, తెలంగాణ ఎంత గొప్పగా చేస్తున్నదో ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం ఇది. ఈ రాష్ట్రంలో అనాదిగా, అద్భుతమైన సాహిత్యాన్ని వెలువరించే గొప్పవాళ్లున్నారని తెలియజేయబోతున్నాం. ఈ సభలు అచ్చంగా, తెలంగాణ తెలుగులో వెల్లివిరిసిన సాహితీ సంపదను ప్రపంచానికి వివరించడానికి జరుగుతున్నాయనేది అందరికీ అర్థం కాబోతున్నది. భాష సుసంపన్నంగా పరిణామం చెందుతున్న క్రమం లో, సామాజిక పరిణామానికి అనుగుణంగా సాహిత్య పరిణామం చెం దుతున్న క్రమంలో, జరుగనున్న ఈ సమావేశాలు, అన్నిరకాల సాహిత్యాన్ని పరిపుష్టంగా విశదీకరించడానికి ఒక వేదిక కానున్నది.

బమ్మెర పోతన, పాల్కుర్కి సోమనాథుడి నుంచి, నేటివరకు, పద్య-గద్య కావ్యాల, స్వేచ్ఛా వచన రచనల విశిష్టత చర్చకు రానున్నది. పండితులు, అవధానులు చేసిన సుసంపన్నమైన సాహితీ ప్రక్రియలు చర్చకు వస్తాయి. ఆధునిక యుగంలో జరిగిన గేయకవితా ప్రక్రియల మీద, జనం వేనోళ్ల పాడిన పాటల మీద, సినీగేయాల మీద, అనేకానేక సాహితీ ప్రక్రియల ఆధారంగా వెలువడిన గ్రంథాల మీద చర్చ జరుగుతుంది. తెలంగాణ వాళ్లు తెలుగు మహాసభలు చాలా ఘనంగా జరిపారన్న పేరు వచ్చితీరుతుంది. సాహితీపరంగా తెలంగాణ తెలుగువారి ఐక్యత ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇదొక మహత్తర అవకాశం. అనేకమంది తెలంగాణ పండితుల, కవుల, రచయితల, పాత్రికేయుల, వైతాళికుల అముద్రిత గ్రంథాలను ముద్రించి, విస్మరించిన తెలంగాణ సాహిత్యాన్ని వెలికితీయడానికి మహాసభలు దోహదపడుతాయి. కేవలం మహాసభలతోనే ఈ ప్రక్రియ ఆగకుండా ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ కూడా అయి తే మంచిది.

ప్రపంచ తెలుగు మహాసభల పూర్వరంగంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం, ప్రాథమిక తరగతి నుంచిఇంటర్మీడియేట్ (12వ తరగతి) వరకు తెలు గు భాష అధ్యయనం విధిగా ఉండాలని చేయడం. ఉర్దూ మాధ్యమం ఉన్న పాఠశాలల్లో కూడా ఇంటర్ వరకూ తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి. తెలంగాణ వారికి తెలుగు సరిగా రాదని హేళనకు గురిచేసినవాళ్లకు ధీటైన సమాధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మన తెలుగు సంవత్సరాల పేర్లు, పండుగల పేర్లు, మాసాల పేర్లు మర్చిపోయిన నేపథ్యంలో, నమస్కారం మన సంస్కారం అని మర్చిపోయిన నేపథ్యంలో, తెలుగు మహాసభల పుణ్యమాని తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్‌లో ఎంతో మేలు చేస్తుంది. పెద్ద బాలశిక్ష లాంటి పాతకాలపు పుస్తకాలకు దీటుగా అలాంటి విద్యనందించే పుస్తకాలు ఎలా ఉంటే బాగుంటుందో తెలుగు మహాసభల్లో చర్చకురావాలి. విలువల గురించి తెలుగులో విద్యాబోధన చేసే పద్ధతులను కూడా మహాసభలు చర్చించాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే బాధ్యతను నెత్తిన వేసుకుంది మొదలు తెలంగాణ నే. భాషకు ఎవరూ యజమాని లేరు... నేర్చుకున్నవారే భాషాధిపతు లు. తెలంగాణ తర్వాత తెలుగు మాట్లాడే మరో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అక్కడినుంచి కూడా అనేకమంది వస్తారు. ఆ ప్రాంతం నుంచి కూడా ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలూ ఉన్నారు. గుర్రం జాషువా, జంధ్యాల పాపయ్యశాస్త్రి లాంటివారి రచనల మీద కూడా చర్చ జరుగవచ్చు. అలాకాకుండా, తమను పిలిచి అవమానించారన్న అపవాదు రాకూడదు. కాకపొతే వాళ్ళను కూర్చోబెట్టి మన ప్రతిభ ఏంటో చెప్పాలి. సభల నిర్వహణలో ఆంధ్రావారి పట్ల సహనం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరేం మాట్లాడినా, తెలంగాణతో పాటు ఆం ధ్రావాళ్ళూ మాట్లాడేది తెలుగే! అందుకే సభల నిర్వహణలో ఒకవైపు మన సంస్కారం కోల్పోకుండా, మరోవైపు వాళ్లకు ఏ విధమైన నిర్వహ ణా బాధ్యతలు, ఆధిక్యత అప్పచెప్పకుండా ఉండే రీతిలో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ మహాసభల ఆధ్వర్యం, అధ్యక్షత మనదేనన్న రీతిలో నిర్వహణ ఉండాలి. వందకు వందశాతం తెలంగా ణ ప్రాశస్త్యం మాత్రమే చాటాలి. ప్రతిభాపాటవాలు మనవేనని నిరూపించాలి. ఒకవైపు మన ప్రతిభను చాటుకుంటూనే, మరోవైపు, సంకుచిత్వం లేకుండా, సుహృద్భావం-సౌజన్యంతో వ్యవహరించి, మరెక్క డా జరుగని కృషి తెలుగు నుడికారంలో తెలంగాణలో జరిగిందని తెలియజేయాలి. పొరుగు రాష్ట్రం వారిని గౌరవించడంలో మాత్రం లోపం జరుగరాదు. అలాగే వారిపట్ల మన ఔన్నత్యం మర్యాదగా తెలియజేయాలి.
narasimha
ఇదిలా వుండగా, తెలుగు సాహితీరంగాన్ని ప్రభావితం చేసిన వాటి లో, అంతో-ఇంతో పాత్ర పోషిస్తున్న సినిమా రంగాన్ని గురించిన వివరమైన చర్చ కూడా మహాసభల సందర్భంగా జరుగడం మంచిది. ఈ రంగం కొంచెం వివాదాస్పదమైనది అయినప్పటికీ, ప్రతిభావంతమైనదనేది నిర్వివాదాంశం. ఒకనాటి సినీరంగ కేంద్రం అయిన చెన్నైలో (నాటి మద్రాస్) అవకాశాలు బాగా లభించిన ఆంధ్రా ప్రాంతం వారు రాణించారు. అప్పట్లో తెలంగాణవాళ్లకు ఎక్కువగా అవకాశాలు రాలేదు, రానివ్వలేదు. దరిమిలా హైదరాబాద్‌కు పరిశ్రమ తరలివచ్చింది. అక్కడక్కడ తప్ప, తెలుగు సినీరంగమంతా ఆంధ్రావాళ్ళ ఆధిక్యతలోనే ఉందనాలి. ఇప్పుడిప్పుడే తెలంగాణవాళ్లు కొంచెం పేరుతెచ్చుకుంటున్నా రు. స్టూడియోల సంఖ్య, వసతుల మోతాదు పెరుగడంతో, భారతదేశంలో అత్యధికంగా సినిమాలు తీసే రాష్ట్రం తెలంగాణ అయింది. దీనికి కారణం స్టూడియోలున్న హైదరాబాద్ నగర వాతావరణం, దేశంలోని వివిధ నగరాలకు దాని సామీప్యం. అనేక కారణాల వల్ల హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమను తరలించే ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం కనుక పూర్తిస్థాయిలో సహకారమందిస్తే భారతదేశానికి హైదరాబాద్ సినీహబ్ అవుతుంది. ఈ నేపథ్యంలో, తెలుగు సినీరంగానికి సంబంధించిన అంశాలు తెలుగు మహాసభల్లో చోటుచేసుకోవాలి. ఒక సినీ నైట్ కాని, సినీ సంగీత విభావరి కాని ఏర్పాటుచేస్తే మంచిది. ఈ కార్యక్రమంలో ఎవర్నీ కించపరిచే విధంగా కాకుండా ఆ రంగం ప్రాముఖ్యం ప్రధాన అంశంగా నిర్వహణ జరుగాలి.

సాహితీపరమైన, సంగీతపరమైన కార్యక్రమాల సమన్వయంతో; అద్భుతమైన కళాప్రదర్శనలతో; జనరంజకంగా ఉండే సినీగీతాల ఆలాపనలతో; తెలంగాణ చేసిన సాహితీ సృజన బయటి ప్రపంచానికి చాటి చెప్పే ప్రక్రియలతో; తెలుగుతోపాటు సంస్కృత పండితుల రచనలపై చర్చలతో.. ఇదొక భాషా-సాంస్కృతిక-సాహిత్యాల కలయికగా, కుటుంబాలకు కుటుంబాలే తరలివచ్చి ఈ పండుగలో పాల్గొనే విధం గా, ప్రపంచ తెలంగాణ తెలుగు మహాసభలు జరుగనున్నాయి.

760

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప