గ్రామ పునర్నిర్మాణం దిశగా..


Sun,November 12, 2017 12:41 AM

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన తరుణం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ అంటున్నారు.దీనికి కార్యోన్ముఖులై రంగంలోకి దిగాలని సీఎం ప్రజలకు పిలుపిచ్చారు. పారదర్శకత, బాధ్యతాయుత,నిబద్ధత పొందుపరిచే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి, స్థానిక స్వపరిపాలనా ప్రతినిధులను,గ్రామస్థాయి అధికారులను గ్రామాభివృద్ధికి సిద్ధం చేయాలని ఆయన అంటున్నారు.

స్థానిక స్వపరిపాలనా ప్రజాప్రతినిధులు 1,04,000 మంది, పంచాయతీరాజ్ సిబ్బంది 16 వేల మంది, సఫాయీ కర్మచారులు 30 వేల మందితో 12,000 కోట్ల రూపా యల భారీ బడ్జెట్ కేటాయింపులున్న పంచాయతీరాజ్ వ్యవస్థ, ప్రజలకు అందిస్తున్న సేవలేమిటని ప్రశ్నించుకుంటే దొరికే జవాబు అస్పష్టంగా ఉంటుంది. గ్రామాభి వృద్ధి దిశగా ఆచరణాత్మక, సామాజిక బాధ్యతే ధ్యేయం గా, క్రియాత్మకమైన పంచాయతీరాజ్ చట్టం రూపొందించుకొని, స్థానిక స్వపరిపాలనను పటిష్ఠం చేసుకోవలసిన అవసరం వంద శాతం ఉన్నది. ఇందుకోసం మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థలోనే సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన తరుణం ఆసన్నమైంది.
తొలి పంచాయతీరాజ్-సహకారశాఖల మంత్రి స్వర్గీయ ఎస్.కె.డే సేవ లు, ఆయన నేతృత్వంలో జరిగిన కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు స్వతంత్ర భారతావనిలో మరుపురాని మధురఘట్టాలు. ప్రజాస్వామ్యం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితమైంది కాదనీ, దాని ఫలాలు గ్రామీణ స్థాయి ప్రజలకు చేరువ కావాలని ఎస్.కె.డే ప్రగాఢంగా నమ్మాడు.

ఆయన ప్రగాఢ విశ్వాసం నాటి ప్రధాని నెహ్రూను ప్రభావితం చేసింది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న ఆయన్ను స్వదేశానికి రప్పించాడు. నవభారత నిర్మాణంలో భాగంగా గ్రామీణాభివృద్ధిశాఖ పగ్గాలు ఆయనకు అప్పగించారు. నెహ్రూ మరణానంతరం మంత్రి పదవికి డే రాజీనామా చేసి తన విశ్రాంత సమయాన్ని దేశంలో పంచాయతీరాజ్ సంస్థల నిర్మాణానికి, అభి వృద్ధికి ఉపయోగించారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమం ద్వారా ప్రజలను ప్రభావితం చేయసాగారు. ఎవరో, ఏదో ఉద్ధరిస్తారనే ఎదురుచూపులు చూడకుండా, ప్రజలు స్వయంప్రతిపత్తితో సామాజికాభివృద్ధి జరుపుకునేలా చర్యలు తీసుకోవడానికి ఇది మూలకారణమైంది. కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ను మూడంచెలుగా చేపట్టాలన్నది డే రూపకల్పన చేసి ఆచరణలో పెట్టిన విధానం. స్థానిక ప్రాంతాల అభివృద్ధి, సమన్వయ పరిపాలన, వ్యక్తిగతంగా, సామాజికపరంగా ప్రతివారూ అభివృద్ధి సాధించడం, ఆయన వ్యూహంలో ప్రధానాంగాలు.

ఆదిలో కమ్యూనిటీ డెవలప్మెంట్‌గా రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ వ్యవస్థ, కాలక్రమంలో రాజకీయాలకు నిలయమై, ముక్కలు చెక్కలుగా విడిపోయింది. కమ్యూనిటీ రేడియో సెట్ల ద్వారా, గ్రామ సర్పంచ్‌లు, ఒకానొక రోజుల్లో, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించే పద్ధతికి చెల్లుచీటి పలుకడం జరిగింది.

నాటి క్రమశిక్షణతో కూడుకున్న పటిష్ఠ పంచాయతీరాజ్-కమ్యూనిటీ డెవలప్‌మెంట్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలన్న ఆకాంక్ష, తపన ముఖ్యమంత్రి కేసీఆర్‌లో కనిపిస్తున్నది. ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటున్నారు. క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకా రం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన తరుణం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ అంటున్నారు. దీనికి కార్యోన్ముఖులై రంగంలోకి దిగాలని సీఎం ప్రజలకు పిలుపిచ్చారు. పారదర్శకత, బాధ్యతాయుత, నిబద్ధత పొందుపరిచే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి, స్థానిక స్వపరిపాలనా ప్రతినిధులను, గ్రామస్థాయి అధికారులను గ్రామాభివృద్ధికి సిద్ధం చేయాలని ఆయన అంటున్నారు.

గ్రామీణ స్థాయిలో కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలంటే సర్పంచ్‌లు ముఖ్యభూమిక పోషించాలి. కానీ కాలక్రమంలో స్థానిక స్వపరిపాలానా ప్రభుత్వం అసలు లేదమోనన్న పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీ సమావేశం జరుపడం కానీ, గ్రామసభలు నిర్వహించ డం కానీ లేకుండాపోయింది. ఇవి రాజ్యాంగబద్ధంగా, యథావిథిగా కొనసాగాల్సిన ఆవశ్యకత ఉన్నదనే సత్యాన్ని సర్పంచ్‌లు విస్మరించటం జరిగిం ది. గ్రామీణస్థాయిలో లోకాల్ ఫండ్ ఆడిట్ లెక్కలు పరిశీలించటం, ఏయే పనులు ఎలా జరిగాయి, ఎంతస్థాయిలో జరిగాయి, వాటికైన ఖర్చులు, జమ ఇత్యాది వివరాలు పరిశీలించటం అన్నది జరిగిన పాపానపోలేదు. గ్రామమంతా మురికివాడలుగా, చెత్తకుప్పలుగా తయారవటం, వాటిని పట్టించుకునే వారు లేకపోవడం పరిపాటిగా మారింది. సర్పంచ్‌లు స్థానిక పలుకుబడులకు, సొంత వ్యాపారాలకు, కాంట్రాక్టులకు, చిన్నచిన్న వ్యాపార లావాదేవీలకు ఆసక్తి చూపటం జరుగుతున్నది. ప్రజాసేవ-గ్రామీణ సేవ పట్ల ఆసక్తి కరువై జరుగాల్సిన పనులకు సమయం కేటాయించే ధ్యాస పోయింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీ లు అదే కోవలో సర్పంచ్‌లను ఆదర్శంగా తీసుకొని పనిచేయడం మానేశారు. గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థ దరిమిలా నిర్వీర్యమైపోయింది.

ఈ మధ్యకాలంలో ఒక అడుగు ముందుకువేసి సర్పంచ్‌లు తమ బాధ్యతలను ఆసాంతం ఎమ్యెల్యేలు చేపడతారంటూ తాము చేయాల్సిన పనులను వారి మీదకు నెట్టి అక్కడ ముట్టచెప్తే కానీ పని జరుగదనే స్థాయికి తీసుకువచ్చారు. మా గ్రామానికి మీరేం చేశారంటూ సర్పంచ్‌లు ఎమ్మెల్యేలను ప్రశ్నించే స్థాయికి పరిస్థితి దిగజారింది. హరితహారం అమలు జరుగుతున్నా, చెట్లు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్‌లు, గ్రామపంచాయతీలు పూర్తిగా విస్మరించడం తెలిసిందే. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలన్న లక్ష్యాన్ని కానీ, నర్సరీలు అందుబాటులో ఉన్నాయన్న విషయం కానీ సర్పంచ్‌లకు అవగాహనే లేదు. గ్రామాల్లో కావాల్సినన్ని డంపింగ్ యార్డులు కానీ, శ్మశానవాటికలు కానీ, పటిష్ఠమైన పారిశుద్ధ్య వ్యవస్థగానీ లేకుండాపోయింది. ఇంటి పన్నులు గ్రామాల్లో చెల్లించడం పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా యావత్ పంచాయతీ వ్యవస్థ కుప్పకూలింది. కాబట్టే మూలాల నుంచి ప్రక్షాళన చేపట్టాలన్నది ప్రభుత్వం తక్షణ చర్యగా భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు 2018, జూలై 31కి ముందుగా, సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయ్యేలోపు ఎన్నికలు నిర్వహించాలని, దానికంటే ముందే అదనంగా 4000 నుంచి 5000 వరకు పంచాయితీలను కొత్తగా ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. తండాలను, కోయగూడాలను, చెంచుగూడాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది. గ్రామపంచాయతీల పరిధిని బట్టి ఒక్కో గ్రామానికి రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకు నిధులు కేటాయించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఇతరత్రా మార్గాల ద్వారా స్వయంగా నిధులు సమకూర్చుకునే విధంగా గ్రామ పంచాయతీలను రూపొందించాలని సంకల్పించింది. ఏ ఆర్థిక కమిషన్ అయినా స్థానిక సంస్థల అభ్యున్నతికి పెద్దపీట వేయడం ఖాయం. కాబట్టి వచ్చే కమిషన్ తగువిధంగా నిధులను స్థానిక సంస్థలకు, పంచాయతీలకు తప్పక కేటాయిస్తుందని, సహృదయంతో స్పందిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.
narasimha

దీనంతటికి కార్యరూపం కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టాన్ని సమగ్ర రూపంతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. చట్టం పరిధిలో పనితీరు సరిగా లేని పక్షంలో సంబంధిత సర్పంచ్‌లను విధుల నుంచి తప్పించేవిధంగా ప్రభుత్వానికి ఆస్కారం ఉండేలా చట్టం రూపొందనున్నది. తద్వారా క్రియాశీలకంగా పనిచేయగలిగే పంచాయతీరాజ్ వ్యవస్థ రూపొందించి సర్పంచ్ పనిచేయాలి లేదా వైదొలుగాలన్న విధానం రాబోతున్నది. 2019 శాసనస భ ఎన్నికల నాటికి పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి, పనిచేసే పంచాయతీ వ్యవస్థను రూపొందించి, మారుమూల ప్రాంతాల్లో మార్పు తీసుకురావాలని కృతనిశ్చయంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఎన్నికైన సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్ ల కు, సమగ్ర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి పదవీ బాధ్యతలు చేపట్టే లోపు వారిని గ్రామీణాభివృద్ధికి సర్వం సన్నద్ధం చేయాలని సంకల్పించింది. బాధ్యతలు చేపట్టే లోపు లక్ష్యాలు వారి ముందుంచి పటిష్ఠ పంచాయతీ వ్యవస్థకు పునరంకితమయ్యే విధంగా వారిని తీర్చిదిద్దాలని పూనుకున్నది. పారదర్శకంగా ఉంటూ, ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమవుతూ, పటి ష్ఠంగా పనిచేసే వ్యవస్థకు, ప్రతిపనికి పారదర్శకంగా ఉండే పద్ధతికి పూనుకోవాలని, తదనుగుణంగా తగు చట్టం తీసుకురావాలనే దిశగా రాష్ట్ర ప్రభు త్వం ముందుకుపోతున్నది. గ్రామాల, గ్రామీణ ప్రజల అవసరాలను వారి హక్కులుగా రూపొందించి, వాటికి సర్పంచులు కట్టుబడి విధులు నిర్వర్తించేలా చట్టం తయారుచేసి, గ్రామాల పరిపూర్ణాభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకోవడం హర్షణీయం.

757

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles