వ్యాపారం చేయడమే నేరమా?


Wed,October 4, 2017 12:56 AM

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద ఉభయ రాష్ర్టాల్లోని వైశ్యులు సహజంగానే తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలియజేశారు.

వారికి మద్దతుగా పరిపూర్ణానందస్వామి లాంటివారు సహితం బాహాటంగానే మాట్లాడమే కాకుండా ఆ పుస్తకంలోని అంశాలు మొత్తం హిందూ సమాజాన్ని కించపరిచేవిగా ఉన్నాయన్నారు.
ఇవ్వాళ వ్యాపారం చేయని కులమేదీ లేదు. వ్యాపారం చేసిన కోమట్లు స్మగ్లర్లయితే అందరినీ స్మగ్లర్లుగానే ఆ రచయిత భావిస్తున్నాడా? దీనికి ఆయన వద్ద సమాధానం ఉందని నేనుకోను.

ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో తాను రాసిన అంశాలను సరై న రీతిలో, శాస్త్రీయంగా సమర్థించలేని పుస్తక రచయిత మొత్తం చర్చను పక్కదారి పట్టించడం, అర్థంపర్థం లేని వాదన లేవదీయడం గమనించిన వారికి ఆ రచయితకు ప్రాచుర్యం పొం దాలనే జిజ్ఞాస తప్ప, విషయాన్ని కూలంకషంగా పదిమందికి తెలియజెప్పాలనే భావన ఉన్నట్లు గోచరించలేదు. అసలాయన రాసిన ఇతర పుస్తకాలు కాని, వ్యాసాలు కానీ, ఎవరిమీదో ఒకరిమీద గుడ్డకాల్చి పడేసే వ్యవహారమే తప్పా మేధావిత్వంతో కూడుకున్నవి కానే కావు.

వైశ్యులు సామాజిక స్మగ్లర్లు అనడం వెనుక ఉద్దేశం బహుశా వ్యాపారం చేసేవాళ్ళంతా దొంగరవాణా చేసేవారు అనీ, దొంగలనీ అర్థం కావ చ్చు. ఒకనాడు కేవలం వైశ్యులే సాధారణంగా వ్యాపారం చేసేవారు. అయితే చాలామంది వైశ్యులు చేసే వ్యాపారం ఆ రోజుల్లో, బహుశా ఇప్పటికీ, సమాజానికి నిత్యం దైనందిన జీవనానికి అవసరమైన చిల్లరదుకాణం వ్యాపారమే! ప్రతిగ్రామంలో ఉండే ఒకటో-రెండో కోమటి కుటుంబాలు ఆ గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా చిల్లర దుకా ణం వ్యాపారం చేసేవారు. నెలంతా గ్రామస్థులకు కావలసిన సరుకులు అప్పుగానో, నగదుగానో ఇచ్చేవారు. అదొక సామాజిక ఆవశ్యకత. వాళ్లే అలా చేయకపోతే గ్రామస్థుల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్ట మే. ఇందులో దొంగ రవాణాకు ఆస్కారం ఎక్కడ ఉందో ఆ రచయితే విడమర్చి తెలియజెప్పాలి.

రోజులు మారాయి. కాలానుగుణంగా ఒక్క కోమట్లే కాకుండా చిల్లర దుకాణాలను నడుపడానికి వీరూ, వారూ అనే తేడా లేకుండా అన్ని కులాల వాళ్లూ ముందుకు వచ్చారు. నేడు ఏ గ్రామానికి పోయినా కనిపించని వ్యాపారం ఉండదు. ఒక్క కిరాణా దుకాణాలే కాకుండా, టీ-దుకాణాల దగ్గరి నుంచి మద్యం అమ్మే దుకాణాల దాకా, హోటళ్లు నడు పడం దగ్గరి నుంచి ఎరువుల అమ్మకందాకా, పాలమ్మడం దగ్గరి నుంచి పూలు, కూరగాయలు అమ్మడందాకా, కాంట్రాక్టు పనుల దగ్గరి నుంచి రాజకీయ వ్యాపారం దాకా.. ఇదీ, అదీ అనే తేడా లేకుండా అన్నిరకాల కులాలు వారు వారికి తోచిన వ్యాపారం తమ స్థాయిని బట్టి చేస్తూనే ఉన్నారు. గొల్లలు గొర్రెల వ్యాపారం, బెస్తలు చేపల వ్యాపారం, చేనేతవారు గుడ్డల వ్యాపారం, దాసరి వారి సరుకులమ్మే వ్యాపారం, వ్యవసాయదారులు కూరలమ్మే వ్యాపారం, మేదరవాళ్ళు బట్టలు కుట్టే వ్యాపారం, గౌడ్లు కల్లు వ్యాపారం.. వైశ్యులతో సహా అందరూ, అన్ని కులాల వాళ్లూ ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉన్నారు. వైశ్యులు సామాజిక స్మగ్లర్లయితే ఈ కులాల వారందరూ అలాగేనా? ఆ రచయిత ఒక్క సారి పునరాలోచన చేస్తే మంచిదేమో!

స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఒక కొత్త రకమైన ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఆవిర్భవించారు. వీరిలో కేవలం కోమట్లే కాదు, అన్ని కులాల వారున్నారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సమసమాజం ఏర్పాటు కోసం స్వాతంత్య్రానంతరం అనేకరకాల చట్టాలు వచ్చాయి. రాజ్యాంగం కూడా సెక్యులర్-ప్రజాస్వామిక వ్యవస్థ దిశగా అనేక ప్రకరణలను పొందుపరిచింది. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుం చి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకోవడం మొదలవడంతో కులమతాలకు అతీతంగా ఒక ఆధునిక వ్యాపారరంగ వర్గం ఆవిర్భవించింది. అనాదిగా, వంశపారంపర్యంగా ఆచరిస్తూ వస్తున్న వృత్తులకు స్వస్తిపలికి వ్యాపారాన్నే వృత్తిగా చేపట్టిన వారు అనేకమంది ఉన్నారు. 1991లో ఆర్థిక సరళీకరణ విధానాలు రూపుదిద్దుకోవడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రకరకాల వ్యాపారాలు ప్రారంభించడానికి తలుపులు తెరుచుకున్నాయి. వాస్తవానికి అంతకుముందే ప్రముఖ యాజమాన్య శిక్షణా సంస్థలైన ఐఐఎమ్ లాంటివి పెద్దమొత్తంలో ఎంబీయేలను తయారు చేయడంతో వారంతా ఉద్యోగ రీత్యా, వ్యక్తిగతంగా వ్యాపారవేత్తలు కాసాగారు. ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థ రూపుదిద్దుకోవడంతో నైపు ణ్యమున్న ప్రతివాడూ వ్యాపారం చేయసాగాడు. క్రమేపీ మన దేశ వ్యాపారవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకోవడం మొదలైంది. అలా తెచ్చుకున్నవారిలో కోమట్లే కాకుండా అన్నికులాల వారున్నారు. కోమట్లను అన్నట్లే వీరందరినీ సామాజిక స్మగర్లని అందామా? ఆ రచయితే చెప్పాలి సమాధానం.

కాకపోతే ఇక్కడో విషయం చెప్పుకోవడంలో, అంగీకరించడంలో తప్పు అని కానీ, సిగ్గుపడాల్సిన అవసరం కానీ లేదు. కార్ల్ మార్క్స్ చెప్పినట్లు సామాజిక వ్యవస్థ తీరుతెన్నులు ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. అలనాటి ఆర్థిక వ్యవస్థలో సామాజికంగా ఒక వర్గంవారు, ఒక కులం వారు వ్యాపారంగంలో కేంద్రీకరించడం సహజంగా జరిగిన పరిణామం. వ్యక్తిగత సంపద పెరుగడానికి, తద్వారా దేశ సంపద పెరుగడానికి వారే కారణభూతులు. అలనాటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న చాతుర్వర్ణ వ్యవస్థలో వైశ్యులకు వ్యాపార లావాదేవీలు అప్పగించడం జరిగింది. అదేదో అన్నింటికన్నా గౌరవప్రదమైన వ్యాపకమని కాదుకాని, అలా జరుగడం ఒక సామాజిక అవసరం గా జరిగింది. అలాగే బ్రాహ్మణుల విషయానికొస్తే, వారిని సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి ఉపయోగించుకుంది అలనాటి వ్యవస్థ.

ఆధునిక నవ భారతదేశంలో కులాలు, వ్యాపారాలు, పరిశ్రమలు ఎలా రూపాంతరం చెందాయనే విషయం ప్రధానాంశంగా, నందన్ నీలేకని ఉపోద్ఘాతంతో, ప్రఖ్యాత పాత్రికేయుడు హరీశ్ దామోదరన్ రాసిన ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్స్ అనే ఆంగ్ల పుస్తకంలో, కోమట్లతో సహా అనేక కులాలు ఎలా వ్యాపార రంగంలోకి దిగి, పెద్దపెద్ద సంస్థలను స్థాపించి, కోట్లకు పడుగలెత్తారో వివరణాత్మకంగా చెప్పారు. కోమట్లను సామాజిక స్మగ్లర్లగా అభివర్ణించిన మహాశయులు ఒక్కసారి ఈ పుస్తకా న్ని చదివితే మన దేశ వ్యాపారరంగం అభివృద్ధి గురించి అవగతమవు తుంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో గణనీయమైన మార్పులు వ్యాపార రంగంలో ఎలా చోటుచేసుకున్నాయో కూడా ఇది చదివితే అర్థ మవుతుంది. జౌళి, చక్కర, ఇనుము, ఉక్కు, రసాయనాలు, ప్లాస్టికులు, ఫార్మా, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఇలా వివిధ రంగాల్లో ఈ కులం, ఆ కులం అనే తేడా లేకుండా వ్యాపారవేత్తలు పుట్టుకొచ్చారు. ఇవేవీ గమనించకుండా, పరిగణనలోకి తీసుకోకుండా ఒక్క వైశ్యులే వ్యాపారం చేశారనీ, వాళ్లను సామాజిక స్మగ్లర్లుగా నింద వేయ డం భావ్యం కాదు. పార్సీలు, గుజరాతీ బనియాలు, జైనులు, మార్వాడీలు, సింధీలు, చెట్టియార్లు, ఖోజాలు, బోహరాలు లాంటి వైశ్య కులా లు ఒకప్పుడు వ్యాపారవేత్తలే, కాదనలేం. కాలక్రమేణా, కొత్త వ్యాపార వర్గాల్లో యాదవులు, కమ్మవారు, రెడ్డివారు, రాజులు, వెలమలు, నాయుడ్లు, గౌండర్లు, నాడార్లు, మరాఠాలు, హిందూ-సిఖ్ జాట్లు.. ఇలా అందరూ చేరారు. వీరితో పాటు బ్రాహ్మణ, క్షత్రియ, కాయస్థ లాం టి మిగతా కులాల వారు కూడా వ్యాపారులయ్యారు.

narasimha
1965 సంవత్సరపు మొనోపలీ విచారణ కమిషన్ రూపొందించిన 75 ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో కేవలం రెండు మాత్రమే ఖత్రీలకు చెందగా, ఐదు మాత్రమే బ్రాహ్మణులకు చెంది ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో వారు కూడా గణనీయమైన వృద్ధి సాధించారు. ఇన్ఫోసిస్ సంస్థ అలా వచ్చిందే!కమ్మ, రెడ్డి, రాజుల, వెలమ కులాలకు చెందినవారు వ్యాపార రం గంలో ఎవరూ ఊహించని విజయాలు సాధించారు. దీని వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ, దామోదరన్, సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల పుణ్యమాని, కమ్మ కులానికి చెందిన వ్యవసాయదారులు పంటలు సమృద్ధిగా పండించుకొని అలా వచ్చిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించారని రాశాడు. వరి, మిరప, పసుపు, పత్తి, పొగాకు పంటల్లో లాభాలెక్కువగా వచ్చాయి. కొందరు ధాన్యం వ్యాపారం చేస్తే, మరికొందరు పొగాకు వ్యాపారం చేశారు. వీరెవరూ వ్యాపారంలో స్మగ్లింగ్ చేయలేదే! అలాగే సినిమారంగంలో మరికొందరు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేశారు. లాభాలు గడించారు. మరికొందరు పరిశ్రమలు స్థాపించారు. ఉదాహరణకు ఆం ధ్రా సైంటిఫిక్ కంపెనీ, ఉయ్యూరు సహకార చక్కర కర్మాగారం, కేసీపీ, ఆంధ్రా షుగర్స్, సర్వారాయ నూలు మిల్లు లాంటివి ఉన్నాయి. అలాగే రెడ్డివారు మైనింగ్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టారు. సినిమారంగంలో కూడా దిగారు. కాంట్రాక్టులు కూడా చేశారు. ప్రాజెక్టులు కట్టారు. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సత్యం కంప్యూటర్స్ గురించి అందరికీ తెలిసిందే. దానిని స్థాపించిన వ్యక్తి రాజుల కులానికి చెందిన వారు. రియల్ ఎస్టేట్ రంగంలో కొందరు వెలమలు దూసుకుపోతున్నారు కదా!ఇవ్వాళ వ్యాపారం చేయని కులమేదీ లేదు. వ్యాపారం చేసిన కోమ ట్లు స్మగ్లర్లయితే అందరినీ స్మగ్లర్లుగానే ఆ రచయిత భావిస్తున్నాడా? దీని కి ఆయన వద్ద సమాధానం ఉందని నేనుకోను.

1240

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles