అభివృద్ధి కోసమే అప్పులు


Tue,March 28, 2017 12:01 AM

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభ ఆమోదించిన వివిధ శాఖల పద్దుల మేరకు ప్రభుత్వం నిధులను ఉపయోగించేందుకు అవసరమైన ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం లభించింది. మార్చి 10వ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కొనసాగాయి.

మొత్తమ్మీద వృద్ధి, అప్పుల మీద పలుమార్లు ప్రస్తావన రావడం, ప్రతిసారీ సీఎం వివరణతో అవి రాష్ర్టానికి ఏ విధంగా ఉపయోగపడుతాయో సభ్యులకు, సభ ద్వారా ప్రజలకు తెలిసిరావడం ఈ బడ్జెట్ సమావేశాల ప్రత్యేకత.


గవర్నర్ ప్రసంగం మధ్యలో బీఏసీ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించారనే కారణంగా ఇద్దరు టీడీపీ శాసనసభ్యుల సస్పెన్షన్, చివరి రోజుల్లో పోడియంలోకి వెళ్లిన బీజేపీ సభ్యుల సస్పెన్షన్ మినహా మిగతా కార్యకలాపాలన్నీ ఆటంకం లేకుండానే జరిగాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ఈ నాలు గు బడ్జెట్ సమావేశాలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పద్దులన్నీ చివర లో గెలిటిన్ అయ్యాయే కానీ, చర్చ జరిగి ఆమోదించిన సందర్భాలు లేవనే అనాలి. దీనికి ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులందరినీ అభినందించాలి. ద్రవ్య వినియోగ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే ముందర, సీఎం, రాష్ట్ర శాసనసభా కార్యకాలాపాల విషయంలో ఎలా పలువురు హర్షామోదాలు తెలుపుతున్నారో చెప్పి, దానికి సభ్యులందరి కీ ధన్యవాదాలు చెప్పారు. సభాపతి సైతం సభను వాయిదా వేయడాని కి ముందర సభ్యులందరికీ, సభను హుందాగా నడిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

శాసనసభ కార్యకలాపాల్లో ఆద్యంతం ఒకటి రెండు విషయాల మీద అనేక పర్యాయాలు చర్చ జరిగింది. అవే అంశాలను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలోనూ, బడ్జెట్‌పైనా, పద్దుల పైనా చర్చ జరిగే సందర్భంలోనూ, చివరకు ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం తెలుపడానికి జరిగిన చర్చ సందర్భంలోనూ పలువురు గౌరవ సభ్యులు, ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి లేవనెత్తారు. వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు కాగా, మరొకటి రాష్ట్రం చేసిందని పలువు రు ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించిన ప్రభుత్వ అప్పుల సంగతి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో మాట్లాడిన సీఎం కేసీఆ ర్ ఒకానొక రోజుల్లో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ర్టాల్లోనూ, ఒకే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం మాత్రమే రాష్ర్టాలకు అప్పులిచ్చే స్థోమత ఉండేదనీ, అప్పట్లో అలా ఇవ్వగలిగే పరిస్థితులుండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిధులు మనమే వాడుకునే వెసులుబాటు, తెలంగాణ సాధించిన ఆర్థిక అభివృద్ధి వల్ల ప్రజల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, ప్రభుత్వం తమ అవసరాలకు ఏ విధంగానైనా డబ్బు సమకూర్చుకొనగలదనే ధీమా ప్రజలకు కలుగడం, గణనీయమైన గ్రోత్ సాధించడమంటే ప్రభుత్వానికి తగినంత శక్తి సామర్థ్యాలున్నాయ ని నిరూపణ కావడం, గతంలో లేనివిధంగా రాష్ట్ర వనరుల, మానవ వనరుల మ్యాపింగ్.. లాంటి విషయాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో మంచిని మంచనీ, చెడును చెడనీ చెప్పగలిగే విచక్షణ ఉండాలనే అభిప్రాయాన్ని కూడా సీఎం వ్యక్తంచేశారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడి న బీజేపీ శాసనసభ సభ్యుడు కిషన్‌రెడ్డి భారీ బడ్జెట్ కాదిది.. బడాయి బడ్జెట్ అంటూ వృద్ధి రేటు మెరుగైందని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టారు. శాసనసభ సాక్షిగా ప్రజలను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. అంకెల గారడీ అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుకోవడం కోసం లెక్కలన్నీ పెంచి చూపిస్తున్నారన్నారు. అప్పుల ప్రస్తావన తెస్తూ.. ఇది బంగారు తెలంగాణ కాదు, బాకీల తెలంగాణ అన్నారు. గత మూడేండ్లలో అప్పులు విపరీతంగా పెరిగాయనీ, సగటున మనిషి అప్పు పెరిగిందని, వడ్డీ చెల్లింపులు కూడా పెరిగాయనీ, బడ్జెట్ అంతా ఊహాలోకంలో విహరించేదిగా ఉందన్నారు కిషన్‌రెడ్డి. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కూడా ఇదే తరహాలో విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయం ప్రస్తావించిన జానారెడ్డి, అప్పులు చేయడం సరైందా? కాదా? అని ప్రశ్నించి, అప్పులు చేయడానికి అభ్యంతరం ఉండకూడదు కానీ.. అప్పులు-ఆస్తులు బేరీజు వేసుకోకుండా, ఆస్తుల కంటే అప్పులు అధికంగా చేయడం ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందన్నారు. ఎలా కాం గ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పులకంటే ఆస్తులు ఎక్కువగా ఉండేవీ, ఎలా తమ ప్రభుత్వాలు అప్పులు తీర్చుకుంటూ, ఆస్తులు పెంచుకుం టూ పోయిందీ లెక్కలతో సహా వివరించారు. ఎల్లలు దాటిన అభివృద్ధిని రాష్ట్రం సాధించిందనడం తప్పుబట్టిన జానారెడ్డి, బడ్జెట్ సప్త సముద్రా లు దాటిందేమో కానీ అభివృద్ధి ఎక్కడిదక్కడే ఉందన్నారు. మొత్తమ్మీ ద బడ్జెట్ గందరగోళంగా, ప్రజలను భ్రమించేదిగా, ఆశల పల్లకిలో ఊరేగించేదిగా ఉంది కానీ వాస్తవాల మీద లేదని వ్యాఖ్యానించారు.

ద్రవ్య వినియోగ బిల్లు సభ ఆమోదానికి జరిగిన చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మళ్లీ వృద్ధి రేటు అంశాన్ని ప్రస్తావించారు. గ్రోత్‌ను బూస్ట్ చేసి చూపుతున్నారని, బడ్జెట్ అంకెలు కూడా బూస్ట్ చేశారని, అంకెల గారడీ అని, రాష్ట్ర భవిష్యత్‌కు ఇది మం చిది కాదని, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం గ్యారెంటీగా ఉండి చేసే అప్పులు కూడా పెరిగిపోతున్నాయని, ఇది దేనికి సంకేతమని అడిగారు. సమాధానంగా సీఎం తమ ప్రభుత్వం అప్పులు చేస్తున్న మాట వాస్తవేమనీ, అయితే, అప్పులు చేస్తూ, సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి సంవత్సరం విడతలుగా చెల్లించుకుంటూ పోతున్నామన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో అప్పుల చెల్లింపునకు ఇరువై వేల కోట్లు కేటాయించినట్లు కూడా చెప్పారాయన. అప్పులు చేయడమంటే రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి, ఆర్థిక పరిపుష్టికి సంకేతమ ని సీఎం అన్నారు. భగవంతుడి దయవల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత మెరుగ్గా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 15 శాతం వృద్ధి రేటు ఉండి తీరుతుందని ఆయన స్పష్టంచేశారు. గతంలో తక్కువ అప్పులుండేవనీ, ఇప్పుడవి పెరిగాయనీ ప్రతిపక్షాలు చేసిన విమర్శకు సమాధానంగా, సీఎం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉదాహరణ చెప్పారు. ఆ ప్రాజెక్టు మొట్టమొదటి అంచనా రూ.92 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు రూ.92, 000 కోట్లకంటే ఎక్కువ ఉంటుందనీ, అప్పట్లో డబ్బు విలువకు, ఇప్పటి డబ్బు విలువకు చాలా వ్యత్యాసం ఉందనీ, సహజంగానే ఇప్పటి విలువకు అనుగుణంగా అప్పుల మొత్తం అధికంగానే ఉంటుందనీ స్పష్టం చేశారు.

ప్రభుత్వం బడ్జెట్ అంకెలను పెంచి చూపించి అప్పులను చేయడానికి పూనుకుంటున్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శను కూడా సీఎం వ్యతిరేకించారు. ఆర్థికశాస్త్రంలో, అర్థశాస్త్రంలో, ధోరణులు ఎప్పటికప్పు డు ఎలా రూపాంతరం చెందుతున్నాయో చెప్పిన సీఎం, ధనం విలువ మారుతున్నదనీ, అవసరాలు పెరుగుతున్నాయనీ, అవసరాలకనుగుణం గా అప్పులు చేయడం, ఆ చేసిన అప్పుల ఆధారంగా ఆస్తులు సమకూర్చుకోవడం జరుగుతున్నదన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే అప్పు పుడుతుందన్నారు. అత్యంత ధనిక దేశమైన అమెరికా, చైనాలతో సహా, ప్రపంచ ఆర్థికరంగాన్ని శాసించే పలు దేశాలు అప్పులు చేస్తున్నాయని చెప్పారు. పథకాలకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి అప్పు చేయాల్సి వస్తే చేయాల్సిందేనని, డబ్బు ఖర్చు పెట్టగలిగీ పెట్టకపోతే అది నేరమనీ సీఎం స్పష్టంచేశారు. ఆర్థిక విజ్ఞత, వివేచన, వైదుష్యం, వివేకం, జ్ఞానం అనే విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది ఆర్థిక శాస్త్రవేత్తలు, వివిధ కోణాల్లో రూపకల్పన చేశారనీ, ప్రస్తుతం, అమెరిక న్ ఆర్థిక నమూనా అని, అమర్త్యసేన్ ఆర్థిక నమూనా అని, ఇంకా మరికొన్ని నమూనాలున్నాయనీ, ఒక్కొక్కరు ఒక్కోవిధంగా వీటిని అన్వయించుకుంటారనీ అర్థం వచ్చే రీతిలో సీఎం మాట్లాడారు. ఒక్కో దానిలోని మంచిని సంగ్రహించి మిశ్రమ ఆర్థిక నమూనాను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. లెక్కలు బూస్ట్ చేసి చూపించారన్న విమర్శకు దీటుగా సమాధానం ఇస్తూ, బూస్ట్ చేసి చూపించడం మా విధానం అనీ, ఆశావహంగా ఉండాలనుకోవడం తప్పు కాదనీ, తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్నామనీ సీఎం స్పష్టంచేశారు. మొత్తమ్మీద వృద్ధి, అప్పుల మీద పలుమార్లు ప్రస్తావన రావడం, ప్రతిసారీ సీఎం వివరణతో అవి రాష్ర్టానికి ఏవిధంగా ఉపయోగపడుతాయో సభ్యులకు, సభ ద్వారా ప్రజలకు తెలిసిరావడం ఈ బడ్జెట్ సమావేశాల ప్రత్యేకత.
Vanam

1068

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప