అన్యాయానికి సజీవసాక్ష్యం


Sun,September 18, 2016 12:57 AM

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరిగింది.ఎడమ కాల్వ ద్వారా నీటిని నల్గొండ, ఖమ్మం జిల్లాలకే పరిమితం చేయాల్సి ఉండగా, ఆనాటి ఆంధ్రా ఇంజినీర్లు, నాయకులు కలిసి కోదాడ దగ్గరి నుంచి ఎడమ కాలువ నీళ్లను కృష్ణా జిల్లాకు మళ్లిం చారు. ఇరువైపులా ఏర్పాటు చేయాల్సిన హెడ్ రెగ్యులేటర్ల విషయంలో కూడా అన్యాయం జరిగింది.

vanam
ఐదు దశాబ్దాల క్రితం 1966 ఆగస్టు 3న నాగార్జునసాగర్ డ్యాం ద్వారా వ్యవసాయానికి సాగు నీటి ని విడుదల చేయడం జరిగింది. నందికొండగా ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది మీద నిర్మించారు. ప్రపంచంలో రాతి ఇటుక, ఇతర భవన నిర్మా ణ సామగ్రితో కట్టబడిన అతిపెద్ద ఆనకట్టగా, భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దీనికి పేరుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రధాన కాలువల ను నదికిరువైపులా నిర్మించటం జరిగింది. వీటినే నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలుగా పిలుస్తున్నారు. కుడి కాలువ ద్వారా పారే నీటితో ఆంధ్రప్రదే శ్‌కు చెందిన గుంటూరు, ప్రకాశం జిల్లాలలో సుమా రు 11.74 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా తెలంగాణ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాం తాలకు చెందిన దాదాపు 10.40 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది ప్రణాళిక. తెలంగాణలో ప్రాజె క్టు ప్రణాళిక ప్రకారం నల్గొండ జిల్లాలో 3.73 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.29 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలి. కాకపోతే, గత యాభై ఏండ్ల రికార్డులను, గణాంకాలను పరిశీలించి చూస్తే, రెండు జిల్లాలలో కలిపి 6 లక్షల ఎకరాలు సాగులోకి రావా ల్సి ఉండగా, కేవలం 3.5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు లభ్యమైంది.

నందికొండ ఆనకట్టను మాచర్ల వద్ద కృష్ణానదిపై నిర్మించాలన్న నిర్ణయం ప్రథమ పంచవర్ష ప్రణాళికలో రూపుదిద్దుకున్న ఆలోచన. 1955 ఫిబ్రవరి 24న ఢిల్లీ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ప్రణాళికా సం ఘం సభ్యులతో సహా, ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. నాటి ఆంధ్ర గవర్నర్ త్రివేది, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుల సమక్షంలో నిర్ణయించారు.

నిజాం పాలకులు తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేదనీ, వారు నిరంకుశులనీ, నేటి తరానికి కావాల్సిన పనులేవీ చేయలేదనే అపవాదు వారిపై ఉన్నది. అది అర్థరహితమని చెప్పడానికి, నిజాం మెహబూబ్ అలీఖాన్, ఆయన తర్వాత పాలకుడిగా ఉన్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేపట్టిన అనేక జలవనరుల-ఇతర ప్రణాళికలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కాకతీయ రాజులు చేపట్టిన అనేక మంచి పనులను వారి హయాంలో కూడా కొనసాగించారు. నిజాం దగ్గర ప్రధానిగా పనిచేసిన సాలార్జంగ్ సంస్కరణలు చాలావరకు నేటికీ అజరామరంగా ఉన్నాయి. మహబూబ్ అలీ పాషా హిందూ ముస్లింలను సమానంగా చూసుకునేవారనడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి విరాళం ఇవ్వమని ఆయనను కోరినప్పుడు తనకు హిందూ ముస్లింలు సమానమే అంటూ వారికివ్వడంతో పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీకి కూడా విరాళం ఇచ్చాడట.
వరదలకు మూలమైన కృష్ణానదీ పరీవాహక ప్రాం తంలో రిజర్వాయర్ల నిర్మాణానికి నిజాం పాలకుల హయాంలోనే కృషి జరిగింది. హాలియా, మూసీ, పాలేరు, వైరా రిజర్వాయర్లు ఆ విధంగా రూపుదిద్దుకున్నవే. అలాగే నాటి నిజాముల ఆలోచనా ధోరణికి అనుగుణంగానే నందికొండ డ్యాం తొలుత రూపుదిద్దుకున్నది.

హైదరాబాద్ నిజాం హయాంలో 1903 లోనే బ్రిటిష్ ఇంజినీర్లను నియమించి తెలంగాణ సాగునీటి అవసరాలకు రిజర్వాయర్ల నిర్మాణం ఆలోచన కూడా జరిగింది. అప్పట్లోనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఆనాటి చీఫ్ ఇంజినీర్‌గా హైదరాబా ద్ నిజాం హయాంలో పగ్గాలు చేపట్టి ముఖ్యమైన సాగునీటి పనులను సమీక్షించటంతో పాటుగా, బిల్డింగులు, బ్రిడ్జిల నిర్మాణాలను, హైదరాబాద్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. వీటిలో ఉస్మాన్‌సాగర్, నిజామ్ సాగర్, హిమాయత్ సాగర్, నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ రిజర్వాయర్ ప్రధానంగా పేర్కొనవచ్చు. అలాగే హైదరాబాద్ రాష్ట్రంలో నందికొండ ప్రాజెక్టు గురించిన తొలి సర్వే ఆయన ద్వారా నిర్వహించటం కూడా జరిగింది. అప్పట్లోనే నాటి మద్రాస్ ప్రభు త్వం, నాటి హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కృష్ణా న దీ జలాల పంపకాల విషయంలో, నందికొండ ప్రాజె క్టు నిర్మాణం విషయంలో, నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఒప్పందం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినం జూలై 11వ తేదీని తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నది.

కృష్ణానది రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్ దగ్గ ర తుంగభద్రతో కలిసి తెలంగాణలో ప్రవేశిస్తుంది. వాస్తవానికి, ప్రకాశం బారేజీ నిర్మాణ నేపథ్యంలో, నిజాం ప్రతిపాదించిన నందికొండ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చినప్పుడు, ఆనాటి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొందరు నందికొండను పందికొండగా వ్యాఖ్యానించారని ప్రొఫెసర్ మారంరాజు సత్యనారాయణరావు అలనాటి విషయాలను గుర్తుచేసుకుం టూ అన్నారు. నిజాం రాష్ర్టాధికారులు నందికొండ ప్రాజెక్టుకు సర్వే చేయడానికి ప్రయత్నిస్తుండగా అస లు నందికొండ ఎక్కడున్నదని వారు ప్రశ్నించారని అంటారు మారంరాజు గారు. దరిమిలా అప్పటి ఆం ధ్ర ప్రభుత్వం మేల్కొని ఈ ప్రాజెక్టు ఉభయ రాష్ర్టాల కూ ఉపయోగపడేదిగా నిర్మించే ప్రతిపాదనలను ముందుకు తీసుకురావటం జరిగింది.

ఆ తర్వాత కృష్ణా జలాల సమగ్ర, సమర్థవంతమైన వినియోగానికి ప్రతిపాదనలను రూపొందించాల్సింది గా ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీని ఏర్పాటు చేసిం ది. ఖోస్లా కమిటీ ఆ ప్రాంతాలను పరిశీలించి, ప్రాజెక్టును నిర్మించడానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించిం ది. ఈ కమిటీ నివేదికలను ప్రణాళికా సంఘం 1952 డిసెంబర్ మాసంలో ఆమోదించింది. నందికొండ డ్యాంను కృష్ణానదిపై నిర్మించాలనీ, నదికిరువైపులా కాల్వల నిర్మాణం జరుగాలనీ నిర్ణయం జరిగింది. 281 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. 1954లో ప్రాజెక్టు నిర్మాణం గురించి ప్రకటన విడుదలైంది.1955 డిసెంబర్ 10న నెహ్రూ చేతుల మీదు గా శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన తర్వాత ఒక కొత్త వాదన లేవదీయడం జరిగింది. రిజర్వాయర్ ప్రతిపాదించిన స్థలంలో చారిత్రక కట్టడాలున్న నాగార్జున కొండ మునిగిపోతున్నదని, ప్రత్యామ్నాయంగా వేరే స్థలం చూడాలన్నారు. ఆ విధంగా నందికొండ పేరు మారి నాగార్జునసాగర్ అయింది. ఇది డాక్టర్ కేఎల్ రావుగారి ఆలోచన. అంగీకరించింది నెహ్రూగారు! నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.

గేట్ల ఏర్పా టు, స్పిల్ వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరిగింది. ఎడమ కాల్వ ద్వారా నీటిని నల్గొండ, ఖమ్మం జిల్లాలకే పరిమితం చేయాల్సి ఉండగా, ఆనా టి ఆంధ్రా ఇంజినీర్లు, నాయకులు కలిసి కోదాడ దగ్గరి నుంచి ఎడమ కాలువ నీళ్లను కృష్ణా జిల్లాకు మళ్లిం చారు. ఇరువైపులా ఏర్పాటు చేయాల్సిన హెడ్ రెగ్యులేటర్ల విషయంలో కూడా అన్యాయం జరిగింది. కుడి కాలువ వైపు ఎక్కువ సామర్థ్యంతో వెలువడే విధంగా ఎడమ వైపు తక్కువ సామర్థ్యంతో నీరు విడుదలయ్యే విధంగా ఏర్పాటు చేశారు. సాగర్ కుడి, ఎడమ కాలువల మీద లిఫ్టులున్నాయి. కుడి కాలువ మీద ఉన్న లిఫ్టులను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే నిర్వహించి కరెంటు బిల్లులను కూడా చెల్లించేది. ఉమ్మడి రాష్ట్రం లో చాలాకాలం వరకు ఎడమ కాలువల మీద ఉండే లిఫ్టులకు మాత్రం తెలంగాణ రైతాంగం మీద వేసే వివక్ష కొనసాగేది. ఇవన్నీ తెలిసి జరిగిన వివక్షలు.. తెలియకుండా జరిగినవి ఇంకెన్నో?

1347

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles