నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం


Wed,August 19, 2015 12:09 AM

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అదీ చాలకపోతే ఇరుగుపొరుగువారి వద్ద పెంట ఖరీదు చేసి పొలాలకు తోలేవారు. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణా జరిగేవి తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో, దంతెలతో దున్నడం జరిగేది.

గ్రామజ్యోతి పథకంతో గ్రామాల అభివృద్ధికి, వ్యవసాయానికి పూర్వ వైభవం తేవడానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారు. సమష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి ఎలా చేసుకోవాలో చెప్పారు. గ్రామీణ జీవితం వ్యవసాయంతో ముడిప డి ఉందని, అనుకున్న రీతిలో వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదని సీఎం అంటున్నారు. ఈ నేపథ్యంలో నాటి వ్యవసాయాన్ని గుర్తుచేసుకుందాం!

నాటి రోజుల్లో గ్రామీణ వాతావరణం, అందులో అగ్రగామిగా ఉండే వ్యవసాయం, దానికి అనుబం ధంగా ఉండే పనిముట్లు, నైపుణ్యంతో వ్యవసాయానికి అవసరమైన పనులను చక్కదిద్దే వ్యక్తులు, అనుభవంతో ఏ పంట ఎప్పుడు వేస్తే లాభదాయకమో తెలియచెప్పే కొందరు గ్రామస్తులు.. ప్రతిరోజు ఇంటి ముందు సంప్రదాయబద్ధమైన పనులతో భూతల స్వర్గంలా అలరారుతుండేవి గ్రామాలు.

vanam

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అదీ చాలకపోతే ఇరుగుపొరుగువారి వద్ద పెంట ఖరీదు చేసి పొలాలకు తోలేవారు. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణా జరిగేవి తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు వేసే వాళ్లు. చెరువులకు నీళ్లు వస్తే వరి నాట్లు వేసే వారు. ఆ తరువాత జొన్న పంట వేసేవారు. వరి నాట్లు వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా వరి నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్ల రోజుల్లో భోజనం పొలం దగ్గరే తిని, అక్కడే చెరువు నీళ్లే తాగేవారు.

నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలు గు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమ యం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పు డు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇం టికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిద్రపోయేవారు. నాటు కూలీ, కోత కూలీ, ఇతర కూలీ అం తా ధాన్యం రూపేణా. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా ఉండేది. రేట్లు పెంచమని అడపాదడపా కూలీలు ఆందోళన చేసే వాళ్లు కూడా. నాట్ల సీజన్లో, కోతల సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు వచ్చేవారు.
ఇక వేరు శనగ పంట వ్యవహారం మరో విధంగా ఉండేది.

విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. క్రితం సంవత్సరం పండిన వేరు శన గ కాయల నుంచి విత్తులను వేరు చేసేవారు. మోతుబరి రైతులు కూలీ ఇచ్చి ఆ పని చేయించేవారు. కూలీ లు వాళ్ల వాళ్ల సామర్థ్యాన్ని పట్టి కుండెడో-రెండు కుం డలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం రూపేణా ముట్టేది. విత్తులు తీసేటప్పు డు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో శనగ నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వారు. వర్షాలు పడగానే, భూమిని దున్ని అదనుచూసి ఎద పెట్టే వారు. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత కా దు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్ధతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది.

ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగిపోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. మూడు నెల ల తరువాత కూలీ వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లు. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా ఇంటికి చేర్చేవారు. ఇక మరో పంట జొన్న. నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చిన తరువాత జొన్న పంట దాదాపు ఎవరూ వేయడం లేదు. దీనికి కూడా ఎద పెట్టడం ఉంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వారు. కూలీ కిం ద కట్టలనే ఇచ్చే వారు. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది.

ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పా ర బట్టడం, ధాన్యాన్ని ఇంటికి, మార్కెట్‌కు చేర్చడం జరిగేది. ఈ పంటలకు తోడు మిరప తోటలు కూడా వేసేవారు.కొందరు దినుసు గడ్డలు, ఉల్లి గడ్డలు కూడా సాగు చేసేవారు. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించేవారు. ఇక మామిడి తోట సరేసరి. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, మంచెపైకెక్కి కూచుని తినేవారు చాలామంది. జొన్న ఊస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినేవారు. చేనులో దొరికే పెసలు తినేవారు. కల్లాలు పూర్తయిన తర్వాత ఎడ్లబండ్లలో, బోరాలలో నింపుకుని పుట్లకు పుట్లు ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందపడేవారు గ్రామీణ ప్రజలు.

ఎడ్లబండిపైన బోరెం వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, పాతరలో కానీ గుమ్మిలో కాని, ధాన్యం కొట్టెలలో కానీ భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవా రు. ఆశ్చర్యకరమైన విషయం.. పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి ఉండేది. రాజకీయ కొట్లాటలున్న గ్రామాలలో తప్ప, మిగతా చోట్ల ఏ రైతుకు కూడా అభధ్రతా భావం ఉండకపోయేది.
వ్యవసాయానికి ఎక్కువగా రైతులు కూలీలనే ఉపయోగించుకునేవారు.

వారు చాలా గ్రామాలలో దోపిడీకి గురయ్యేవారు కూడా. గ్రామాలలో వ్యవసాయ కూలీ పోరాటాలు జరుగుతుండేవి. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ రేట్లు లభించాలనేదే ఆ పోరాటాల లక్ష్యం. ఉదాహరణకు.. గ్రామాలలో వేరు శనగ ముఖ్యమైన పంట. వేరుశనగ కాపుకొచ్చాక కూలీలతో పీకించి కొట్టిస్తారు. తయారైన కాయను డబ్బా లతో కొలిచి కూలీ నిర్ణయించేవారు. డబ్బాకు 16 మానికలు. మానికంటే రెండు శేర్లు. డబ్బా కాయ కొట్టినవారికి మూడు సోలల నుంచి ఒక మానిక వర కు జొన్నలు కొలిచి కూలీగా ఇచ్చేవారు. సోల అంటే అర్ధ శేరు. అయితే వేరు శనగ కొలిచే డబ్బాలు, జొన్న లు కొలిచి కూలీ ఇచ్చే మానికలు అన్నీ తప్పుడివే.

16 మానికలు ఉండాల్సిన డబ్బాలు వాస్తవానికి 20, 22 మానికలు పట్టేవరకుండేవి. మానికకు నాలుగు సోలలుండాలి కానీ మూడున్నర ఉండేవి. అలా రెండు వైపులా తప్పుడు కొలతలతో కూలీలకు ముట్టచెప్పేవారు భూస్వాములు. ఒకవైపు కూలీ తక్కువ.. మరోవైపు తప్పుడు కొలతలు.. ఇలా రెండు విధాలుగా మోసం జరిగేది. అదో రకం దోపిడీ అనా లి. ఆ పిచ్చి కొలతలకు, తక్కువ కూలీకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగేది. కొన్నిచోట్ల ఫలితముండేది.. కొన్ని చోట్ల ఉండకపోయేది.

భూస్వాములు మరొక రకమైన వింత దోపిడీ చేసేవారు. కూలీలు పోగు చేసుకునే పెంట కుప్పలను వారు కారు చౌకగా కాజేయడం చేసేవారు. అదంతా ఒక ప్రణాళికా బద్ధంగా చేసేవారు దోపిడీదారులు. కరవు కాలంలో కూలీలకు ఐదు-పది మానికలు ధాన్యం అప్పుగా ఇచ్చేవారు. అప్పిచ్చేటప్పుడు ఒక షరతు విధించేవారు. అప్పు పుచ్చుకున్న కూలీలు తమ పెంట కుప్పలను అప్పిచ్చినవారికే అమ్మాలని షరతు. పెంట కుప్పలను వారికిష్టమైన రేటుకే కొనేవాడు భూస్వామి. అప్పిచ్చిన ధాన్యానికి నాగులు, పెచ్చులు (వడ్డీ లాంటిది) కట్టేవాడు. నిలువు దోపిడీ కి కూలీని గురిచేసేవాడు. ఇక పెంట కుప్పలను తోలే బండి జల్లకు ఒక నికరమైన కొలతలుండకపోయేది. బలిష్టమైన ఎద్దుల బండిని కట్టి, పెద్దజల్ల నిండా పెం ట పోయించి, పాలేర్లతో కరువు తీరా తొక్కించి, పెం టను కుక్కించేవారు. పది బండ్లు అవుతుందనుకున్న పెంట నాలుగు బండ్లే అయ్యేది. అప్పు అలానే మిగిలేది. పెంట ఖాళీ అయ్యేది. దానికి వ్యతిరేకంగా కూలీ లు పోరాడేవారు.

భూస్వాముల మరో రకమైన దోపిడీ భూమి విస్తీర్ణాన్ని తక్కువ చేసి చెప్పడం.. తద్వారా తక్కువ కూలీ చెల్లించడం. వ్యవసాయ కూలీలు వరి నాట్లు, కోతలు, కలుపు తీయడం వంటి రోజువారీ పనులకు, కూలీరేట్లను పెంచాలని, పాలేర్ల జీతాలు పెంచాలని పోరాటాలు చేసేవారు.

2863

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles