యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు


Wed,August 12, 2015 01:49 AM

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిది.. ఈ నాటి సింగపూర్‌లాగా, ఒక పటిష్టమైన జాతిగా మనుగడ సాధించగలుగుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

సుమారు 52లక్షల జనాభా, 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగిన సింగపూర్ దేశమం తా అదే పేరు కలిగిన ఒక పెద్ద నగరం. బహుశా ప్రపంచంలో అలాంటివి అతి తక్కువగా వున్నాయి. 1965 ఆగస్టు 9న ఆవిర్భవించిన సింగపూర్ దేశం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. సంపన్న దేశాలలో ముందు వరుసన ఉన్న వాటిలో సింగపూర్ ఒకటి. ద్వీపాల సమూహంతో కూడిన ప్రధాన ద్వీప దేశం ఇది. ఐరోపా దేశాల ఆధిపత్యానికి గండి పడి, రెండో ప్రపంచ యుద్ధానంతరం పరిస్థితులు మారిపోవడం తో, వలస రాజ్యాలకు స్వాతంత్య్రం లభించడంతో పాటు, సింగపూర్ స్థితిగతులు కూడా మార్పుకు గురయ్యాయి. కామన్వెల్త్ దేశాల అధ్యాయం మొదలైంది. ఆ నేపథ్యంలో తొలుత సింగపూర్ మలయాలో విలీనమై, మలేషియాలో భాగమైంది. రెండేళ్లకే సింగపూర్‌ను వదిలించుకున్నది మలేషియా. సింగపూర్ జాతిపితగా, ఆ దేశ ఆవిర్భావ కారకుడిగా గుర్తింపు తెచ్చుకుని ఇటీవలే మరణించిన లీ క్వాన్ యూ దేశ ప్రధాని అయ్యారు.

vanam


గణతంత్ర సింగపూర్‌గా ఆవిర్భవించిన రోజుల్లోను, అంతకు ముందు బ్రిటన్ వలస రాజ్యం గా ఉన్న సందర్భంలోను, పలు దేశాల దృష్టిలో లేని దేశం ఇది. స్వాతంత్య్రం పొందిన వలస దేశాల తదనంతర రాజకీయ, ఆర్థిక చరిత్ర ఒక దానితో మరొకటి పోల్చడం చాలా కాష్టం. అలాంటి దేశాలలో సింగపూ ర్ ప్రత్యేక స్థానం మొదలైంది.
ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిది, ఈ నాటి సింగపూర్‌లాగా ఒక పటిష్టమైన జాతిగా మనుగడ సాధించగలుగుతుందని, బహుశా ఎవరూ ఊహించి ఉండరు. సింగపూర్‌లో కాలుమోపగానే మొదటగా అందర్నీ ఆకర్షించేది సింగపూర్ ప్రధాన విమానాశ్రయం చాంగి ఎయిర్‌పోర్ట్. సింగపూర్ ప్రధా న వాణిజ్య సముదాయాల కూడలికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ విమానాశ్రయం ఆగ్నేయాసియా మొత్తానికి ప్రధాన వైమానిక కేంద్రం. వందకు పైగా వివిధ దేశాలకు చెందిన ఎయిర్ లైన్లకు ఉపయోగపడుతున్న ఈ విమానాశ్రయం నుంచి ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలోని 220 నగరాలకు, పట్టణాలకు 6,100 విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

ఏటా సుమారు ఏడు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఈ ఎయిర్ పోర్ట్‌లో నాలుగు టర్మినల్స్ వున్నా యి. 1981 నుంచి ఇప్పటిదాకా 2011లో లభించిన 23 ఉత్తమ బహుమతులతో పాటు, ఈ విమానాశ్రయానికి 390 ఆవార్డులొచ్చాయి .సింగపూర్‌లోని చాలా రోడ్లకు ఏదో ఒకరకంగా ఆ బజారుకు అతికేటట్లు ఒక పేరుంటుంది. సూర్యోదయం రోడ్డు అని ఒక చోట ఉంటే, సూర్యాస్తమయం అని మరో చోట ఉంది. పండ్ల పేరు మీదో, పప్పు దినుసుల పేరు మీదో, రాచరిక వ్యవస్థకు గుర్తుగానో, రచయితల పేరుమీద, స్థలాల పేరు మీదో, మనిషి హావభావాల మీదో, నంబర్ల మీదో రోడ్ల పేర్లుంటాయి. ట్రాఫిక్ రెగ్యులేషన్‌కు, వేగం పరిమితం చేయడానికి చక్కటి వ్యవస్థ వుంది. ఎక్కడికక్కడ నియంత్రణ చేసేందుకు గోప్యంగా కెమెరాలుంటాయి. తెలిసి ఎవ రూ తప్పుచేయడానికి సాహసించరు. సింగపూర్‌లో ఎక్స్‌ప్రెస్ మార్గాలని, ఆర్చర్డ్ రోడ్లని, పాద చారుల మార్గమని, భవిష్యత్తులో నిర్మించనున్న మార్గాలని నాలుగు రకాల రహదారులుంటాయి.

ఎక్స్‌ప్రెస్ మానిటరింగ్ సలహా వ్యవస్థ ప్రమాదాలను పసిగట్టడంతో పాటు మార్గమధ్యంలో వాహనాలు చెడిపోతే సహా యం అందించేందుకు దోహదపడుతుంది.దీని ద్వారా ట్రాఫిక్ సులభంగా నియంత్రించడానికి, ఇబ్బందులు కలగకుండా కొనసాగించడానికి వీలవుతుంది. రహదారులకు ఇరువైపులా, భారీ వృక్షాలు, రకరకాల ఆర్నమెంటల్ చెట్లు, పూల చెట్లు దర్శనమిస్తాయి. ఒక క్రమ పద్ధతిలో వాటిని పరిరక్షించుకుంటూ వస్తోంది సింగపూర్ ప్రభుత్వం. రోడ్లన్నీ చూడ ముచ్చటగా వుం టాయి. వాహనం ముందు సీట్లో కూచున్నవారు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి.

సింగపూర్ అపార్ట్‌మెంట్‌లలో వుండేవారికి పూర్తి సెక్యూరిటీ వుంటుంది. ఎలివేటర్ చేరడానికి తెరవాల్సిన తలుపు దగ్గర నుంచి, ఎలివేటర్ డోర్ ఓపెన్ చేయడం వరకు, కాపురముంటున్న అంతస్తు చేరుకోవడం దాకా అంతా డిజిటల్ ఆపరేషనే! ఎలివేటర్ డోర్ సరాసరి నివాసముంటున్న అపార్ట్ మెంటులోకి తెరుచుకుంటుంది. ఆ అంతస్తులో ఆ లిఫ్ట్ ఆ అపార్ట్‌మెంటులో ఉన్నవారికే పరిమితం. అంత సేఫ్టీ వ్యవ స్థ సింగపూర్ మొత్తం ఉంటుంది. సింగపూర్ లోని నివాస ప్రాంతాలన్నింటిలోకి సెంటోజా కోవ్‌కు ఒక ప్రత్యేకత వుంది. సముద్ర తీరంలోని భూమిలో, నిర్మాణం చేపట్టిన సింగపూర్‌లోని ఒకే ఒక భవన సముదాయం సెంటోజా కోవ్ ప్రాంతం. ప్రభుత్వ రం గ సంస్థ సెంటోజా డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఐన సెంటోజా కోవ్ ప్రయివేట్ లిమిటెడ్ దీని నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేస్తున్నది. సింగపూర్ లాండ్ అథారిటీ నుంచి 80 కోట్ల సింగపూర్ డాలర్లకు ఈ భూమిని సెంటోజా కోవ్ కొనుగోలు చేసింది.

సింగపూర్‌లో కెసినోలకు ప్త్రసిద్ధి. అభిరుచిగలవారు ఎవరైనా కొన్ని నియమ నిబంధనలకు లోబడి జూదమాడేందుకు అనువైన ప్రదేశాన్నే కెసినో అంటా రు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో ఉన్న మకా వో, అమెరికా దేశంలోని లాస్‌వేగాస్ కెసినోల తరువాత సింగపూర్ ది మూడో స్థానం. అక్కడున్నవి కేవ లం రెండే! ఒకటి మెరీనా బే సాండ్స్, మరోటి రిసారట్స్ వరల్ సెంటోజా. సింగపూర్ కెసినోలకు, అక్కడి పౌరులు కాని, శాశ్వతంగా నివసిస్తున్న ఇతర దేశాల వారు కాని ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉం టుంది. సరైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న విదేశీయులకు ఎంట్రీ ఫీజు లేదు. 24 గంటలు కెసినోలో గడపాలంటే వంద సిం గపూర్ డాలర్ల టికెట్ కొనుక్కోవాలి. ఏడాదికి ఒక్క సారే తీసుకునేవారికి 2,000 డాలర్లు చెల్లించాలి.

ఆసియా ఖండం మొత్తంలో అత్యున్నత ఆరోగ్య వైద్య ప్రమాణాలను పాటిస్తున్న దేశం సింగపూర్. 1965లో సింగపూర్‌కు స్వాతంత్య్రం లభించిన కొద్ది రోజుల్లోనే, అప్పటికే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అంటువ్యాధులను ముందస్తుగానే అరికట్టే ప్రక్రియ ఆరంభమైంది. పెద్దఎత్తున ఇమ్యునైజేషన్ కార్యక్రమా న్ని ప్రభుత్వం చేపట్టింది. దరిమిలా, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడేందుకు 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. సింగపూర్‌లో అత్యవసర వైద్య సహాయ సేవలను, ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ పేరుతో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ నిర్వహిస్తుంది. 108 సేవల మాదిరిగానే, ఇక్కడ 995 నంబర్‌కు ఫోన్‌చేసి ఈ సేవలను పొందవచ్చు. జీవన్మరణ సమస్య తలెత్తినప్పుడు మాత్రమే 995 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరా లి. ఫోన్ చేసిన వెంటనే 108-అంబులెన్స్ తరహాలోనే ఇక్కడా అంబులెన్స్ వస్తుంది. వైద్య సహాయం కావాలని కోరుకునే నాన్-ఎమర్జెన్సీ పేషంట్ సౌకర్యం కోసం, వారికి అంబులెన్స్ పంపేందుకు 1777 అనే మరో నంబర్ కేటాయించింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే, 995 నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కోరినవారి దగ్గర నుంచి 180 సింగపూర్ డాల ర్లు ఫీజు కింద వసూలు చేస్తారు. లేకపోతే ఈ సౌకర్యం ఉచితమే.

సింగపూర్ జాతీయ ర్యాలీ డే అనేది ఏటా జరిగే ఒక నిర్దిష్ట కార్యక్రమం. ఆ ర్యాలీలో జాతినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించడం ఆనవాయితీ. ప్రతి ఏడు ఆగస్ట్ 9న జరిగే జాతీయ దినోత్సవం పరేడ్ ముగిసిన తరువాత, వచ్చే రెండో ఆదివారం నాడు ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. 1966 నుంచి నిర్విఘ్నంగా సాగుతున్న ఈ ర్యాలీ నాడు జాతినుద్దేశించి చేసే తన ప్రసంగంలో ప్రధాని, సింగపూర్ ఎదుర్కొన బోయే సమస్యలను, భవిష్యత్‌దర్శినిని, ప్రజల ముందుంచుతారు. అమెరికా అధ్యక్షుడు ఏటా చేసే, స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగం లాంటిదే ఇది. జాతీయ దినోత్సవం నాడు చేసే ప్రసంగంలోని వాడి వేడి అంశాల నుంచి ప్రజలు వారికి తోచిన అర్థాలను ఆకళింపు చేసుకునే పక్షం రోజుల లోపలే, జాతీయ ర్యాలీ డే ప్రసంగం ప్రజల ముందుంటుంది. సర్వసాధారణంగా ప్రధాని ఉపయోగించే ఆనవాయితీ పదా లు ఎలాగూ ఉంటాయని ప్రజలు ముందుగానే ఊహించుకుంటారు.

రెండేళ్ల క్రితం ప్రధాని చేసిన ప్రసంగం యావత్ సింగపూర్ ప్రజలను ఆకట్టుకుంది. అవర్ సింగపూర్ అన్న నినాదం లోతుపాతులను గురించి వివరణ ఇచ్చారాయన. ప్రధాని తనకు సూచించిన ప్రణాళికాబద్ధ కార్యక్రమంలో మూడు ప్రధానమైన లక్ష్యాలు,ధ్యేయాలు ఉంటాయని విశదీకరించారు. మొదటిది- ఇప్పటికే ప్రభుత్వం రూపొందించి అమలు పరుస్తున్న పథకాలలో దేశాభివృద్ధికి పని కొచ్చే వాటి విషయం లో సంపూర్ణమైన నమ్మకాన్ని ప్రకటించడం, రెండో ది-కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుకూలంగా ప్రభుత్వ ఆలోచనా విధానంలో కూడా ఎలాం టి మార్పు రావాలి అన్నది. మూడోది- నూతన ఆలోచనల దిశగా ఎలా అడుగులు వేయాలి అన్నది ఉంటుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సింగపూర్ ప్రజలకు ఇస్తున్న ఒక చక్కటి అవకాశమని, అన్నింటికన్నా దేశానికి ప్రధానమైంది ఏంటి? ఒక దేశంగా, దేశ ప్రజలుగా మనం ఎక్కడకు-ఎలా పయనించాలి? అని ప్రతి పౌరుడు ప్రశ్నించుకోవాలి అన్న ది ఆ ప్రసంగ సారాంశం. ఇలాంటి వాటి విషయంలో ఒక అవగాహనకు రావాలంటే, సుదీర్ఘమైన చర్చ జరగాలనీ, అందుకే, నేషనల్ కన్వర్జేషన్ ప్రతిపాదనను ప్రభుత్వం ప్రజల ముందుంచిందని ఆయన తెలిపా రు.

దరిమిలా, 26 మంది సభ్యులతో కూడిన సింగపూర్ కమిటీ రూపుదిద్దుకుంది. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను కమిటీ సభ్యులుగా చేసింది ప్రభుత్వం. ఒక టాక్సీ డ్రైవర్, సామాజిక కార్యకర్తలు, కళాకారులు, విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయు లు, రాజకీయ వాదులు, ఈ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు. ఒక్కో సెషన్‌లో 50 నుంచి 150 మంది వ్యక్తులు పాల్గొనే విధంగా, 30 డైలాగ్ కార్యక్రమాలను నిర్వహించాలని, ఆ విధంగా ప్రజలను భాగస్వాములను చేయాలనీ, డైలాగ్ వివిధ భాషలలో జరపాలనీ, కమిటీ నిర్ణయించింది. ఫేస్‌బుక్ లాంటి సామాజిక మీడియాలో కూడా, సింగపూర్ ప్రధాని ప్రకటించిన నేషనల్ కన్వర్జేషన్ ప్రతిపాదన బహుళ ప్రాచుర్యం పొందుతున్నది.బహుశా ప్రపంచ దేశాలలో సింగపూర్‌తో పోల్చదగిన దేశం మరోటి లేదని చెప్పాలి.

1879

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles