ఆచితూచి.. అసలైన నిర్ణయం


Fri,July 31, 2015 11:18 PM

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉండాల్సిన పనిలేదు. చట్ట ప్రకారం నడుచుకోకపోతే దాని పరిణామాలు ఒక విధంగా ఉంటాయి. సంప్రదాయాలకు అలాంటి ఇబ్బంది లేదు. చట్టాలను సవరించవచ్చు. సంప్రదాయాలను మెరుగుపర్చవచ్చు. ఎంత మంచి సంప్రదాయమైనా చట్టానికి లోబడితేనే దానికి విలువ ఉంటుంది. చట్టం స్పష్టంగా ఉంటే, స్పీకర్‌కు సరైన మార్గదర్శకాలుంటే.. ఆయన తీసుకునే నిర్ణయం తిరుగులేనిదే అవుతుంది.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి న ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించమని శాసన సభాపతికి, గవర్నర్‌కు విజ్ఞప్తులు చేశారు కొందరు ప్రతిపక్ష నాయకులు. టీడీపీ టికెట్‌పై గెలిచి మంతివర్గంలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాకు సంబంధించి, సమాచార హక్కు చట్టం కింద వివరాలను సేకరించి ఆ విషయాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం కూడా జరిగింది. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించిందని వార్తలొచ్చాయి.

vanam


ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా సభాపతికి కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో కూడా కాంగ్రె స్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యేలు వెళ్లడా న్ని ఆక్షేపిస్తూ, వారు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించినా స్పీకర్ ఎందుకు మిన్నకుండిపోయారో వెం టనే సమాధానం చెప్పాలనీ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. ఎమ్మెల్సీల విషయంలో కూడా మండలి ఛైర్మన్‌ను అనర్హతలపై తేల్చిచెప్పాలని హైకోర్టు ఆదేశా లు జారీ చేసింది.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నిబంధనలున్నాయి. కాకపోతే అవి ఏ మేర కు అమలుకు నోచకుంటున్నాయనేది మిలియన్ డాల ర్ల ప్రశ్న. పోనీ.. సత్సంప్రాదాయాలేమన్నా నెలకొన్నాయా అంటే, అలా ఏ రాష్ట్రంలోనూ జరిగిన దాఖలాల్లే వు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పదికాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నిబంధనలకు అదనంగా, చిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పనిసరి. దాదాపు రాజకీయ పార్టీలన్నీ తమ తమ అనుకూలతలు, అననుకూలతల ఆధారం గా నడచకుంటాయన్న అపవాదు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఫిరాయింపులను పోత్సహించని పార్టీ బహు శా దేశంలో ఏ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో! తప్పొప్పుల సంగతి వేరే విషయం.

అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా సభాపతిదే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి ఆయన తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా, న్యాయస్థానాల తీర్పు పరిధిలోకి రాదు. తదనుగుణమైన విధి, విధానాలను రూపొందించకునే అధికారం సభాపతికి ఉన్నది. రాజకీయ పార్టీలు తమ తమ సభ్యుల వివరాలు, కొత్తగా చేరిన వారి వివరాలు, పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలు, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసి న వారి వివరాలు, సంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను నమోదు చేసుకోమని అడి గే అధికారం సభాపతికి ఉన్నది. సభ్యుల అర్హత, అనర్హతలు నిర్ధారించవలసిన సమయంలో అవి ఉపయో గపడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులు, యాంత్రికంగా, హఠాత్తుగా, తమ సభ్యత్వాన్ని కోల్పో రు. వారిని పార్టీ నుంచి తొలగించవచ్చు కానీ, చట్ట సభల సభ్యత్వాన్నుంచి తొలగించడానికి పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధి, సంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకువెళ్లాలి. విచారణానంతరం సభాపతియే తగు నిర్ణయం తీసుకుంటారు.

ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేకపోయినా, చట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం, రాజ్యాంగపరంగా, న్యాయమూర్తులకు ఉన్నది. దేశ వ్యాప్తంగా పార్టీలు మారడం చాలాకాలం నుంచి జరుగుతున్న వ్యవహారం. పాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినా, దాని అమలు అం తంత మాత్రమే. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని పార్టీ లు చేస్తూనే ఉన్నాయి.

ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోను, దానికి కారణమైన వారి మాతృసంస్థ రాజకీయ పార్టీల విషయంలోను ఎన్నికల సంఘం అప్రమత్తంగా ఉం డాలి. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో పార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలి. ఒక పార్టీ, ఒకసారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించి, అమలుకు నోచుకోని అంశాల విషయంలో, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పార్టీల ను వీడేవారు ఉండే అవకాశాలున్నాయి. పదవ షెడ్యూల్ అమలు విషయంలోను కనీస సభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనా, ఎన్నికల సం ఘం పాత్ర ఉండడం మంచిది. ఐదేళ్లకోసారి మేల్కొ న కుండా, రాజకీయ పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మరిచిపోకూడదు.

భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలావర కు, వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్ధతితోనే రూపుదిద్దుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారత, ఇంగ్లండ్ దేశాలకు దాదాపు ఒకే రకమైన సంప్రదాయాలు, ప్రక్రియలున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్ నియమ, నిబంధనలు, సంప్రదాయాలు భారత దేశం అనుకరించడం జరుగుతున్నప్పటికీ, ఆ దేశంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలో రాజీనామా చేయాలనుకున్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తితో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సంబంధించిన ప్రకరణ మన రాజ్యాంగంలో పొందుపరచకపోవడం బహుశా పొరపాటేనేమో! అసలా మాటకొస్తే వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ విధానంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే విధానం అంతర్లీనంగా ఉంటుందనాలి. అలాంటివి ప్రజాస్వామ్యం బలపడటానికి దోహదపడతాయి. ఉదాహరణకు, ఆ దేశంలో లాగా, ఇక్కడి లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు, చట్టసభల కాలపరిమితి తర్వాత జరిగే ఎన్నికలలో, ఏ పార్టీకి చెందని అభ్యర్థులుగా పోటీచేసే అవకాశం కలిగించాలి.

ఇంగ్లీష్ పార్లమెంటుకు ఒకసారి ఎన్నికైన వ్యక్తికి, పదవీ కాలం పూర్తవకుండా, లేదా మళ్లీ ఎన్నికలొచ్చే వరకైనా రాజీనామా చేసే అవకాశం లేదు. పదిహేడవ శతాబ్దంలో, రాచరిక వ్యవస్థ నేపథ్యంలో, బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నిక కావడం, సభ్యులుగా ఉండడం అరుదైన గౌరవంగా, ప్రజలకు సేవచేసే గొప్ప అవకాశంగా భావించినందున ఎవరు రాజీనామా చేసేందు కు ఇష్టపడేవారు కాదు. ఆ అవసరం దృష్ట్యా, ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు వీలుపడకుండా, 1623 మార్చి 2న సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మన దేశంలో పరిస్థి తి వేరు. చట్ట సభలకు గెలిచిన అభ్యర్థి తన ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేసి, ఉప ఎన్నికలు వచ్చేదాకా చూసి తిరిగి పోటీకి దిగవచ్చు. బహుశా ఈ విధానాని కి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందనాలి.

ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో, చట్ట సభలకు ఎన్నికైనవారు, రాజీనామా చేయదల్చుకుంటే, ఆ విషయాన్ని ఫార్మాట్‌లో, స్పీకర్‌కు తెలియచేస్తే సరిపోతుంది. స్పీకర్ తక్షణం రాజీనామా ను ఆమోదించవచ్చు లేదా నిర్ణయం వాయిదా వేయడమో తిరస్కరించడమో చేయవచ్చు. స్పీకర్ అందుబాటులో లేకపోతే, రాజీనామా చేయదల్చుకున్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్‌కు లేదా కార్యాలయంలోని సిబ్బందికి ఇచ్చిపోవచ్చు. ఎంత వేగంగా వారు రాజీనామాలను సమర్పించకుంటారో అంతే మోతాదులో, అత్యంత నెమ్మదిగా నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చు.

ఇంగ్లండులో సభ్యులకు రాజీనామా చేసే అవకాశం లేకపోయినా, సభ్యత్వం నుంచి తొలగడానికి రాజ్యాంగం ఒక వెసులుబాటు కలిగించింది. రాజీనామాకు బదులుగా పదవీ విరమణ చేయవచ్చు. పార్లమెంటు సభ్యులుగా ఉన్నవారు ఆదాయం లభించే పదవులను అంగీకరించరాదన్న నిబంధన ఉన్నందున సభ్యులు దాని ప్రకారం సభ్యత్వాన్ని కోల్పోయేందుకు, ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా దీని కోసమే ఉద్దేశించిన ఒక పద వి కావాలంటూ అభ్యర్థన చేసుకోవాలి. దాన్ని మన్నిం చి, బ్రిటిష్ రాణి లేదా రాజు, ఆర్థిక మంత్రి (ఛాన్సిలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్) ద్వారా ఆ పదవిలో వారిని నియమించడం, తక్షణమే సభ్యత్వం రద్దు కావడం జరుగుతుంది. అలాంటి వారు తాము ఖాళీ చేసిన సీటుకు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధారణంగా సాహసించరు. పార్టీ టికెట్ కూడా లభించదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దీని కోసం కేటాయించిన పదవులు కాగితంపై మాత్రమే ఉంటాయి. ఎప్పుడో రాచరిక వ్యవస్థ పూర్తిగా వేళ్లూనుకున్న రోజుల్లో, ఏర్పాటైన ఆ పదవులు, ప్రస్తుతం చట్టపరమైన కల్పితాలు గా మిగిలిపోయాయి.

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉం డి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉండాల్సిన పనిలేదు. చట్ట ప్రకారం నడు చుకోకపోతే దాని పరిణామాలు ఒక విధంగా ఉంటా యి. సంప్రదాయాలకు అలాంటి ఇబ్బంది లేదు. చట్టాలను సవరించవచ్చు. సంప్రదాయాలను మెరుగుపర్చవచ్చు.

ఎంత మంచి సంప్రదాయమైనా చట్టానికి లోబడితేనే దానికి విలువ ఉంటుంది. చట్టం స్పష్టంగా ఉంటే, స్పీకర్‌కు సరైన మార్గదర్శకాలుంటే, ఆయన తీసుకునే నిర్ణయం తిరుగులేనిదే అవుతుంది. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. చట్టంలో స్పష్టత లేనప్పుడు, సంప్రదాయాల ఆసరా దొరకనప్పుడు, స్పీకర్ జాగ్రత్తతో ముందుకుసాగాలి. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదు.
అనైతిక పార్లమెంటరీ పజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు? అని రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిదేమో!

2098

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles