పర్యాటక మకుటంగా యాదాద్రి ..


Thu,July 23, 2015 12:20 AM

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో ఆహ్లాదకరంగా అలరారనున్నది. భక్తి భావన పెంపొందేవిధంగా, గుట్ట ప్రాంతమంతా మార్మోగే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు జరగనుంది. యాదాద్రి సమీపంలో వున్న బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి, అక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయనున్నారు.

నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, నేటి యాదా ద్రి నరసింహ దేవాలయం, దాని పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికా రచన, అమలు వేగవంతంగా సాగుతున్నది. చిరకాలంలోనే అక్కడున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా నిత్యం వచ్చే లక్షలాది భక్తులతో, పర్యాటకులతో భాసి ల్లే పర్యాటక యాత్రా స్థలంగా రూపుదిద్దుకోనుం ది. దేవాలయం, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరుగనున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో భక్తుల-యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

vanam


వారాంతపు ఇతర సెలవు దినాల్లో, శని-ఆదివారాలలో రెండు మూడు నెలలుగా భక్తుల సంఖ్య సుమారు రోజుకు 70వేలకు చేరుకున్నది. దేవస్థానం ఆదాయం కూడా పెరిగింది. బహుశా ఈ కారణాన దేవస్థానం చరిత్రలో మొదటిసారి, ప్రముఖులకు ప్రత్యేక వీఐపీ దర్శనం పద్ధతిని కూడా ఆలయ నిర్వాహకులు ప్రవేశపెట్టారు. టాటాలు, అంబానీలు, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు 500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి, దేవాలయ పరిసరాలలో మౌలిక వసతులు కల్పించేందుకు సంసిద్ధత కనబరిచారు.

హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిలో, హైదరాబాద్‌కు సుమారు 70కిలో మీటర్ల దూరంలో వుంది యాదగిరిగుట్ట దేవాలయం. అక్కడికి చేరుకోవడానికి, గుట్ట వరకు బస్ సౌకర్యం, సమీపంలో రైలు సౌకర్యం కూడా వుంది. పంచ నరసింహ క్షేత్రంగా పిలువబడే ఇక్కడి అతి పురాతన-పవిత్ర దేవాలయం లో నరసింహ స్వామి ఐదు అవతారాలలో (జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, గండ భేరుండ నరసింహ, లక్ష్మీ నరసింహ) భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి సంప్రదాయబద్ధమైన పూజలు చేస్తారు. అనేక రకమైన వేడుకలు కూడా జరుపుకుంటారు. అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు, అక్షరాభ్యాసం, వివాహాలు మొదలైనవి జరుగుతాయి. భక్తులు తల నీలా లు సమర్పించుకునే ఆనవాయితీ కూడా వున్నది. ఈ దేవాలయ ఆవిర్భావం గురించి స్కంద పురాణంలో ను, ఇతిహాసాలలోను పేర్కొనబడింది.

ఫాల్గుణ (ఫిబ్రవరి-మార్చి) మాసంలో వచ్చే బ్రహ్మోత్సవాలు, వైశాఖ (మే) మాసంలో వచ్చే నరసింహ జయంతిలతో సహా ఎన్నో పండుగలను, ఉత్సవాలను, ప్రతి ఏటా యాదాద్రిలో నిర్వహిస్తా రు. లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో దేవాలయంలో శత ఘటకాభిషేకం జరుపుతారు. ఇవి జరిగినప్పుడల్లా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పుణ్య క్షేత్రంలోనే ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న పెద్ద ఆగ మ శాస్త్ర సదస్సు జరిగింది. ఆ సదస్సులో దక్షిణాదికి చెం న అనేకమంది ఆగమ పండితులు పాల్గొని దేవాలయాలలో పాటించాల్సిన పద్ధతులను, అనుసరించాల్సిన విధివిధానాలను చర్చించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో పొందు పరిచారు. ఈ విషయాన్ని స్వయంగా చినజీయర్ స్వామి వెల్లడించారు.

పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా యాదగిరిగుట్టకున్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాటికన్ సిటీ తరహాలో, అక్కడి దేవస్థానాన్ని-పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. దేవాలయానికి కొన్ని మార్పులు,చేర్పులు చేయాలని కూడా సీఎం అదే సందర్భంగా సూచించారు. వీటిలో ప్రధానమైనవి, దేవాలయాన్ని స్వర్ణ తాపడం చేయ డం, గోపురం స్పష్టంగా కనిపించే రీతిలో ఎత్తు పెంచ డం, గుట్ట పరిసరాలలో అభివృద్ధికి చాలినంత భూసేకరణ చేయడం, ప్రస్తుతం వున్న స్థలంలో సేకరించనున్న స్థలంలో కల్యాణమండపం, వేద పాఠశాల, అభయారణ్యం, సంస్కృత పాఠశాల, ఆలయ అభివృద్ధికి స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు వున్నా యి.దీనికోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి యాదగిరిగుట్టకు వచ్చి దైవ దర్శనం చేసుకోవడానికి ముందు, ఆ గుట్ట పరిసరాలపై ఒక అవగాహనకు వచ్చేందుకు, దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి ఎలా ముందుకు పోవాలో నిర్ణయించేందుకు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు. అక్కడే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. గుట్టపై నున్న అస్తవ్యస్త కట్టడాలను తొలగించాలని, కాటేజీలను నిర్మించాలని, పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఆగమ శాస్ర్తానికి అనుగుణంగా దేవాలయ మండపాన్ని విస్తరించాలని, గుట్టపైన దైవ సంబంధమైన కార్యక్రమాలు మాత్రమే జరిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇవే కాక దూరంనుంచి కూడా భక్తులకు దేవుడు కనిపించే విధంగా గర్భగుడిని ఉత్తర దిశగా ఆగమ శాస్త్ర పండితుల సలహా మేరకు, విస్తరించాలని ఆయన అన్నారు. గుట్టపైన అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, గరుత్మంతుడి విగ్రహాన్ని నెలకొల్పడానికి అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, గుట్ట చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి అనువుగా స్థల సేకరణ, రహదారి ఏర్పా టు జరగాలని సూచించారు.

ముఖ్యమంత్రి సూచన మేరకు 13 మంది సభ్యులతో, సీఎం చైర్మన్‌గా, దేవాలయ ప్రత్యేకాధికారి కిష న్ రావు ఉపాధ్యక్షుడిగా యాదగిరిగుట్ట దేవాలయ అభిద్ధి అథారిటీ ఏర్పడింది. ఇందులో స్థానిక ఎంపీ, ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతరులు సభ్యులుగా వుంటారు. యాదగిరిగుట్ట, దాని పరిసరాల అభివృ ద్ధికి చుట్ట పక్కలున్న ఆరు గ్రామాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. రాయగిరి దగ్గరున్న చెరువును అం దంగా తీర్చిదిద్దాలని, భువనగిరి-యాదగిరిగుట్ట మధ్యలో నాలుగు వరుసల రహదారి నిర్మించాలని, గుట్టకు నాలుగు దిక్కుల వున్న వంగపల్లి,

తుర్కపల్లి, రాయగిరి, రాజుపేట రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. భూ సేకరణకు, ఇతర అభివృద్ధి పనులకోసం 100 కోట్లను కేటాయించారు. ఆగమ శాస్త్ర-వాస్తు నిబంధనలకు అనుగుణంగా, దేవాదాయ-ధర్మాదాయ శాఖ స్థపతిల సలహా మేర కు, అభివృద్ధికి కావాల్సిన డిజైన్లను తయారు చేసేందుకు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని నియమించింది అథారిటీ.

ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామితో కలిసి, ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టపై ఏరియల్ సర్వే నిర్వహించారు. యాదగిరిగుట్టతో పాటు, అభివృద్ధి చేయదల్చుకున్న గుట్ట చుట్టుపక్కల ప్రదేశాలను కూడా వారిరువురు పరిశీలించారు. చేపట్టదలచిన పనులను కూడా ఆయనకు వివరించారు. ఆలయ నిర్మాణ రూప శిల్పులు, స్థపతి, వేద పండితులు, దైవ క్షేత్రాల నిర్మాణ-నిర్వహణలో అనుభవజ్ఞులైన వారి సలహాలు-సూచనల మేరకు తాత్కాలికంగా రూపొందించిన డిజైన్లను జీయర్ స్వామికి ముఖ్యమంత్రి చూపించారు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపుదిద్దుకోనున్న యాదగిరిగుట్టతో పాటు చుట్టూ వున్న నవ గిరులకు నామకరణం చేయాల్సిందిగా జీయర్ స్వామిని కోరగా, వారు యాదాద్రిగా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అభినందించిన జీయర్ స్వామి, తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తిగా కేసీఆర్‌ను ప్రశంసించారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా దేవస్థానం, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. 943ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడంతో పాటు, మరో 100 ఎకరాలు సేకరించి, మొత్తం వెయ్యి ఎకరాలకు పైగా భూమిని ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 200 కోట్ల బడ్జెట్‌ను యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీకి కేటాయించింది ప్రభుత్వం. 180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో ఆహ్లాదకరంగా అలరారనున్నది. భక్తి భావన పెంపొందే విధంగా, గుట్ట ప్రాంతమంతా మార్మోగే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు జరుగనుంది. యాదాద్రి సమీపంలో వున్న బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి, అక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయనున్నారు.

యాదాద్రి గుట్టపై వున్న 15 ఎకరాల భూమిలో ప్రధాన గుడి కింద వచ్చే 5 ఎకరాలలో ప్రాకారం, మాడ వీధుల నిర్మాణం జరుగుతుంది. దేవాలయ ప్రాంగణంలోనే లక్ష్మీ నరసింహ స్వామి 32 రకాల ప్రతిమలు ఏర్పాటు కానున్నాయి. దేవుడి ప్రసాదాలు తయారుచేసే వంటశాల, అద్దాల మందిరం ఇక్కడే నిర్మిస్తారు. యాదాద్రి పైనే, పుష్కరిణి, కల్యాణ కట్ట, అర్చకులకు వసతి నివాస గృహాలు, రథ మండపం, క్యూ కాంప్లెక్స్, వీఐపీ గెస్ట్ హౌజ్ నిర్మించనున్నారు. యాదాద్రి కింది భాగంలో ఉద్యానవనం, కాటేజీలు, బస్ స్టాండ్, కళ్యాణమండపం, షాపింగ్ కాంప్లెక్స్, స్వామివారి పూజకు వినియోగించే పూల చెట్లతో కూడి న ఉద్యానవనం, యాత్రికులకు వసతి కేంద్రాలు, గోశాల, అన్నదానం కోసం భోజన శాల, హెలిపాడ్ నిర్మించనున్నారు. ప్రస్తుతం వున్న పున్నమి గెస్ట్ హౌజ్ ను ఆధునీకరిస్తారు. పాత యాదగిరిని దర్శించుకునేందుకు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
చిరకాలంలోనే యాదాద్రి-యాదగిరిగుట్ట ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్య క్షేత్రంగా, యాత్రా స్థలంగా రూపుదిద్దుకోనున్నది.

2561

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles