ఆకుపచ్చని తెలంగాణ దిశగా..


Thu,July 2, 2015 04:46 AM

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రూపకల్పన చేసిన మరో ప్రజా యజ్ఞం. ప్రజలే కేం ద్రంగా అమలు కానున్న చెట్లు నాటే బృహత్తర కార్యక్రమం రేపు లాంఛనంగా ప్రారంభం కానుంది. తెలంగాణను హరిత హారంగా, ఓ ఆకుపచ్చ తోరణం గా మలిచే దిశగా ముఖ్యమంత్రి ఏడాది క్రితం ఈ పథకానికి ఆలోచన చేశారు. సంవత్సర కాలంగా తన ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఎన్నో రీతులుగా ప్రణాళికలు రూపొందించుకుంటూ వస్తున్నారు. తెలంగాణ అంటే బీడు నేల కారాదని, పచ్చదనం కరువైన పీఠభూమి అనే అపప్రథ తొలగిపోవాలని సీఎం కోరిక. ఒకనాడు దట్టమైన అడవులు వున్న తెలంగాణలో ప్రస్తుతం వాటి విస్తీర్ణం తగ్గిపోతూ వస్తున్నది. పచ్చదనంతో కళకళలాడే రీతిలో అటవీ భూముల విస్తీర్ణం పెంచడం,

పర్యావరణ సమతు ల్యం కాపాడటం అనే ద్విముఖ లక్ష్యాలు హరిత హారంలో వున్నాయి. కృష్ణా, గోదావరి వంటి జీవ నదులు తెలంగాణలో పారుతున్నప్పటికీ, ఈ ప్రాంత రైతులు ఇంకా వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. అందుకే ఇక్కడ వర్షపాతం పెరగాలి. అది పెరగాలంటే చెట్ల పెంపకం ఒక్కటే తరుణోపాయం. కోతులు అడవుల్లోకి తిరిగి పోవాలన్నా, వానలు రావాలన్నా చెట్ల పెంపకం ఒక్కటే సరైన మార్గం.

అందుకే ఈ విషయంలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత హారం పథకానికి రూపకల్పన చేశారు. ఆయన స్వయంగా రూపొందించిన పథకా ల్లో ఇది చాలా ముఖ్యమైంది. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో చెట్ల శాతాన్ని 24నుంచి 33 శాతానికి పెం చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు తెలంగాణ భూభాగంలో అదనంగా నాటాలనేది ఈ బృహత్తర కార్యక్రమ లక్ష్యం. ఇందులో హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడంతో సహా, అటవీ యేతర భూముల్లో 130 కోట్ల మొక్క లు నాటే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఇదిగాక అట వీ భూముల్లో మరో వంద కోట్ల మొక్కలు నాటి అడవులను మరింత సుసంపన్నం చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగం. తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల చొప్పున ప్రతి ఏటా 40 కోట్ల మొక్కలు నాటుతారు.

దీనికోసం మొత్తం పంపిణీకి అవసరమయ్యే మొక్కల్ని వర్షాకాలాని కంటే ముందుగానే సిద్ధం చేయించి ఉంచారు. అడవుల్లో పెంచడానికి అనువైన అటవీ పండ్ల మొక్క లను కూడా సిద్ధం చేయించి పెట్టారు. వాటిల్లో వైద్యానికి అవసరమయ్యే ఔషధ మొక్కలు కూడా ఉన్నా యి. ఈ మొత్తం పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో అమలు చేయడం సీఎం ఉద్దేశం. హరితం, శివం, సుందరం అనే సరికొత్త నినాదాన్ని ప్రజా ఉద్యమం గా మలిచారు సీఎం. ఈ బృహత్తర హరిత హారం పథకాన్ని రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోణంలోను, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తయారు చేసే ఉద్దేశంలో భాగంగాను రూపొందించారు. నగర శోభను ద్విగుణీకృతం చేయడం ఈ పథకం ప్రత్యేకత.

పాత పద్ధతిలో కాకుండా సింగపూర్ తరహాలో ఒక పథకం ప్రకారం మొత్తం రాష్ర్టాన్ని హరిత వనం గా మార్చే వినూత్న రీతిలో రూపకల్పన జరిగింది. మొక్కలు పెరిగిన తర్వాత, వాటి పరిసరాల్లో నడిచే పౌరులకు తామొక దట్టమైన ఆకు పచ్చని అడవిలో సంచరిస్తున్నామన్న భావన కలిగేలా మొక్కల పెంప కం జరగాలన్నది ఆయన అభిప్రాయం. ఒక్క జనవాసాలే కాకుండా, నదులు, వాగులు, వంకలు చెరువు కట్టలు ఇలా ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు కనబడేలా చేయడం ఈ హరిత హారం లక్ష్యం. అలాగే విద్యాసంస్థలు, పారిశ్రామిక వాటికలు, విశ్వవిద్యాలయా లు మొదలైన ప్రదేశాల్లో హరిత హారం మొక్కలు పచ్చ-పచ్చగా కనిపించేలా చేస్తారు. మొక్కలు పెం చడం అంటే ఏదో మొక్కుబడిగా చేసే కార్యక్రమం కాకూడదని, దీర్ఘకాలిక లక్ష్యాలతో అమలు చేయాల నే సీఎం కేసీఆర్ భావజాలానికి అనుగుణంగా ఈ హరిత హారం రూపుదిద్దుకున్నది.

అందుకే ముఖ్యమంత్రి దీన్ని ఒక సవాలుగానే కాకుండా ఓ దీర్ఘకాలిక యజ్ఞంలా కొనసాగించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ పథకం రూపకల్పన, అమలు తీరు గురించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులతో, మొక్కల పెంపకంతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులతో, అటవీ శాఖ సిబ్బందితో, ఈ సమావేశాలు జరిగిన తీరు హరిత హారం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న పట్టుదల అర్థమవుతుంది. ఏ సమస్య ఎదురుకాకుండా ఈ పథకం సాఫీగా అమలు జరగడానికి వీలుగా ఆయన కింద స్థాయి అధికారులతో కూడా మాట్లాడుతూ తగు సలహాలు సూచనలు ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అటవీ శాఖ సిబ్బం ది తమ విధులను నిర్భయంగా నిర్వహించేందుకు వీలుగా సాయుధ పోలీసు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటవీ భూముల సరిహద్దులను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖాధికారులు సంయుక్తంగా తనిఖీలు జరపాలని సూచించారు.

అలాగే మరో సమావేశంలో హరిత హారం మరిం త విస్తృత పరిచి, మంచి ఫలితాలను సాధించడానికి వీలుగా, నాటే మొక్కల సంఖ్యను 320 కోట్లకు పెం చాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి 60నుంచి 70 కోట్ల మొక్కలకు పెంచుతూ పోవాలన్నారు. ఏటా జూలై నెల మొదటి వారం లేదా రెండో వారా న్ని హరితహారం వారంగా పరిగణించి మొక్కలు నాటాలని చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉద్బోధించారు. తెలంగాణలో మాదిరిగా ఇటువంటి కార్యక్రమం ముందెన్న డూ ఎవ్వరూ తలపెట్టిన సందర్భం దేశంలో మరెక్క డా లేదని పలువురు చెబుతున్నారని అన్నారు. మొక్కల పెంపకం విషయంలో పోలీసు అధికారులు చూపుతున్న శ్రద్ధను ఆయన ప్రత్యేకించి ప్రస్తావించా రు. హరిత హారం అనేది అటవీ శాఖకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా చూడకూడదనీ ఇది ప్రజలందరి పథకం అని అన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్రంలోని రహదారుల పక్క న కూడా మొక్కలు నాటాలని సూచించారు.

ఈ నేపథ్యంలో హరిత హారం కోసం ప్రభుత్వం 39కోట్ల 60 లక్షల మొక్కలు ఇప్పటికే సిద్ధం చేసింది. జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగానే కాకుండా, గ్రామ స్థాయిలోనూ పంపిణీ చేయడానికి మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో ఆ ప్రదేశాలను గుర్తించడం జరిగింది. హరి త హారం పథకంలో ఔటర్ రింగు రోడ్డు కూడా పచ్చ ని చెట్లతో హరితవర్ణం ధరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇందుకోసం అవసరమయ్యే నిధులు శాఖలవారీగా విడుదల చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఏ నిధులు, అటవీ శాఖ నిధులు, పారిశ్రామిక, మున్సిపాలిటీ శాఖల నిధులు ఇతర రకాల నిధులు పథకానికి ఉపయోగించనున్నారు. గ్రామస్థాయిలో ఈ పథకం కోసం గ్రామ పంచాయతీ హరిత రక్షణ కమిటీలు ఏర్పాటయ్యాయి. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోవడంతో సహా, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత, ప్రజలను కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ఈ కమిటీ ద్వారా జరుగుతుంది.

vanamjwalanarasimharao


ఈ పథకం ప్రచారం కోసం, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం కోసం ఆకర్షణీయమైన లఘు చిత్రాలను తయారు చేసి టీవీల్లో ప్రదర్శిస్తున్నారు. రేడియో శ్రోతల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించారు. ఇక పోస్టర్లు, కరపత్రాలతో హరిత హారం ప్రచారం జోరుగా సాగుతున్నది. సాంస్కృతిక సారథి బృందాలు కళాకారులతో చక్కటి ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఈ పథకానికి మద్దతు కోరుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మిలిటరీ అధికారులతో సమావేశాలు జరిగాయి. హరిత హారం డైరెక్టరీలు ముద్రించి సిద్ధంగా పెట్టారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా మొక్కల వివరాలను, లభ్యమయ్యే ప్రదేశాలను ఈ డైరెక్టరీల్లో ముద్రించారు. వీటిని ప్రజాప్రతినిధులకు, గ్రామ పంచాయతీలకు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి అధికారి పాత్రను ఈ మార్గదర్శక సూత్రాలలో పొందుపరిచారు. జిల్లాల వారీగా హరిత హారం పథకం పర్యవేక్షణ కోసం సీఎం కార్యాలయంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించింది ప్రభుత్వం.
తెలంగాణకు హరిత హారం కార్యక్రమం చూస్తుం టే, అప్పుడెప్పుడో, చైనాలో ఇలాంటి తరహాలోనే చెట్ల పెంపకం జరిగిన విషయం గుర్తుకొస్తున్నది. గ్రీన్ గ్రేట్ వాల్‌గా పిలువబడిన ఆ కార్యక్రమం కన్నా కూడా, బహుశా తెలంగాణ హరిత హారం కార్యక్రమాన్నే, రాబోయే రోజుల్లో యావత్ దేశం, ప్రపంచం కూడా, ఒక అత్యుత్తమ పర్యావరణ పరిరక్షణ పథకంగా గుర్తిస్తారనడంలో అతిశయోక్తి కాదేమో.

తెలంగాణకు హరిత హారం కార్యక్రమం చూస్తుంటే, అప్పుడెప్పుడో, చైనాలో ఇలాంటి తరహాలోనే చెట్ల పెంపకం జరిగిన విషయం గుర్తుకొస్తున్నది. గ్రీన్ గ్రేట్ వాల్‌గా పిలువబడిన ఆ కార్యక్రమం కన్నా కూడా, బహుశా తెలంగాణ హరిత హారం కార్యక్రమాన్నే, రాబోయే రోజుల్లో యావత్ దేశం, ప్రపంచం కూడా, ఒక అత్యుత్తమ పర్యావరణ పరిరక్షణ పథకంగా గుర్తిస్తారనడంలో అతిశయోక్తి కాదేమో.

3446

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles