పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు


Thu,June 25, 2015 01:13 AM

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకంలో ఆవిర్భవించి, ఆ రాష్ట్రంలో 136 కిలోమీటర్లు ప్రయాణించి, నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర తెలంగాణ
ప్రవేశిస్తుంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, ఏటూరు నాగా రం, భద్రాచలం ప్రదేశాల మీదుగా 480 కిలోమీటర్లు ప్రవహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల గుండా పారి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది.

బృహస్పతి సింహరాశిలో ప్రవేశించడంతో ఈ సంవత్సరం జులై 14న ప్రారం భం కానున్న గోదావరి పుష్కరాలను తెలంగాణలో అంగరంగ వైభోగంగా, నభూతో అన్న రీతిలో జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. బృహస్పతి ప్రతి సంవత్సరం ఏదో ఒక రాశిలో ఉం టాడు. పుష్కరుడు, బృహస్పతి కలిసి ఉండే స్థితిలో వచ్చేవే పుష్కరాలు. సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. అలానే, వివిధ రాశు ల్లో ఉన్నప్పుడు గంగ, రేవా, సరస్వతి, యమున, కృష్ణ, కావేరి, భీమరథి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సిం ధు, ప్రణీతా నదులకు పుష్కరాలొస్తాయి. పుష్కారాలొచ్చిన నదిలో 33 కోట్ల దేవతలు వచ్చి స్నానం చేస్తారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఏడాది గోదావరికి వచ్చిన పుష్కరాల్లాంటివి 144 ఏళ్లకో సారి వస్తాయి.
దక్షిణ భారతదేశంలోని నదులన్నింటిలో పెద్దదైన గోదావరి నది, గంగా నదికంటే కూడా ప్రాచీనమైనదని పురాణోక్తి. గోదావరినే దక్షిణ గంగ అని కూడా అంటారు.

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావి ంచబడే గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకంలో ఆవిర్భవించి, ఆ రాష్ట్రంలో 136 కిలోమీటర్లు ప్రయాణించి, నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, ఏటూరు నాగారం, భద్రాచలం ప్రదేశాల మీదుగా 480 కిలోమీటర్లు ప్రవహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు-పశ్చి మ గోదావరి జిల్లాల గుండా పారి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది.

vanam


పుష్కరాలనేవి ప్రధానంగా ఆచార వ్యవహారాలతో కూడుకున్న ఓ పవిత్రమైన కార్యక్రమం. పుష్కరుడు పన్నెండేళ్లకోసారి నదులను ఆవహిస్తాడని, పుష్కర సందర్భంగా నదీ స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందనే నమ్మకం ఆబాలగోపాలానికి ఉంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, నమ్మకాల నేపథ్యంలో, పుష్కర స్నానం చేసిన వారికి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. పుష్కర సందర్భంగా పితృ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, నిర్వహిస్తే పుణ్యలోకాల్లో ఉన్న పెద్దలు సంతృప్తి చెందుతారు. అందుకే పవిత్ర నదీ స్నానం చేసేందుకు లక్షలాది మంది ఆసక్తి కనబరుస్తారు. అలాంటి పుష్కరాలను తెలంగాణలోని గోదావరి నది ప్రవహించే ప్రదేశాలలో ఘనంగా, అద్భుతంగా నిర్వహించాలనేది ప్రభుత్వ సంకల్పం. దీన్ని ప్రభుత్వ కార్యక్రమం లాగా కాకుండా, ప్రభు త్వ బాధ్యతలాగా నిర్వహించ తలపెట్టింది ప్రభు త్వం. భక్తులందరికీ సౌకర్యాలు కలిగించే బాధ్యత, శాంతి భద్రతలు కాపాడే బాధ్యత, ఇబ్బందులు తలె త్తకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే.

2003లో గోదావరికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, త్వరలో రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని, ప్రచార ఆర్భాటంతో వ్యవహరించింది. దానికి భిన్నంగా, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం, నదీ స్నానం చేయడానికి వచ్చే అవకాశమున్న లక్షలాది మంది యాత్రీకులకు వసతులు కలిగించే విషయం మీద అధిక శ్రద్ధ కనబరిచింది. దీనికి తోడు, దక్షిణ భారతదేశంలోని ప్రము ఖ పీఠాధిపతులను ఆహ్వానించడమైంది. ధార్మిక-ఆధ్యాత్మిక-సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి, హైదరాబాద్‌తో సహా ఇతర ప్రదేశాల నుంచి గోదావరి నదీ స్నానానికి వెళ్లదలచుకున్న వారికి అన్ని రకాల రవాణా సౌకర్యం కలిగించడానికి, పుష్కర స్నానం చేసినవారికి సమీపంలోని దేవాలయాల్లో భగవత్ దర్శనం చేసుకోవడానికి ఆయా దేవాలయాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టడానికి ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

అదే విధంగా పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి పుష్కర స్నానాలకు రాదల్చుకునే యాత్రికులకు కూడా సౌకర్యాలు కలిగించనుంది ప్రభుత్వం. ముంబయి, భీవండి, షోలాపూర్, సూరత్‌లాంటి ప్రదేశాలలో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా పుష్కరాలలో పాల్గొనేలా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అవగాహనా ప్రచారం జరిగింది. ఉత్తర భారతదేశంలో కూడా తెలంగాణ గోదావరి పుష్కరాల గురించి విరివిగా ప్రచారం జరిగింది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలంగాణ కు చెందిన ప్రవాస భారతీయులు ఈ సందర్భంగా రాష్ర్టానికి వచ్చి పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉన్న ది. నదికి వెళ్లే రహదారుల, స్నాన ఘట్టాల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని అధికారులు అంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్న బాసర, ధర్మపురి, కాళేశ్వరం, కందకుర్తి, భద్రాచలం ప్రాంతాలలో అదనపు ఏర్పాట్లు జరిగాయి.

మహిళల కోసం ప్రత్యే క సదుపాయాలు జరిగాయి. యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించే ఏర్పాట్లు కూడా జరిగాయి. వైద్య శిబిరాల ఏర్పాట్లకు కూడా చర్యలు చేపట్టింది ప్రభుత్వం.ఈ అవసరాలన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఏడాది క్రితమే, గోదావరి పుష్కర ఏర్పాట్లకు శ్రీకారం చుట్ట డం జరిగింది. నెల-నెలా అధికారులతో, సంబంధిత మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. దరిమిలా, రాష్ట్రవ్యాప్తంగా, ఐదు జిల్లాలలో వున్న బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం పుణ్య క్షేత్రాలున్న ప్రాంతంలోని గోదావరి నదిలోను, కందకుర్తి, పోచంపాడు, మంచిర్యాల, గూడెం, రామన్న గూడెం, పర్ణశాల సమీపంలోని గోదావరి నదిలోను, లక్షలాది మంది స్నానం చేసే అవకాశం వున్నందున ఆ ప్రాంతాలలో మొత్తం 106 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అన్ని ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నాయి.

ఉత్కృష్టంగా, వేదోక్తంగా, సాంప్రదాయ బద్ధంగా యజ్ఞయాగాదుల నిర్వహణ, విశేష పూజలు, పితృ తర్పణాలు, నూతన వధూవరుల పుణ్య స్నానాలు, ఇతర పుణ్య కార్యాలు జరుపుకునేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి.
ధార్మిక దృష్టితో ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, పుష్కర సందర్భంగా అవలంబించాల్సిన పద్ధతులను, అనుసరించాల్సిన విధానాలను, పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి, వివిధ పీఠాధిపతుల సలహాలు-సూచనలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు. దానికనుగుణంగా ప్రభుత్వ సలహాదారుడు కె.వి.రమణాచారి, ముఖ్యమంత్రి గురువు శ్రీ మృత్యుంజయ శర్మ, శ్రీ యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి, తొంభై ఏళ్ల వయసున్న పాలకుర్తి నృసింహ సిద్ధాంతి, తదితరులు ఒక బృందంగా పీఠాధిపతుల సందర్శనార్థం వెళ్లి వారిని పుష్కరాలకు ఆహ్వానించి వచ్చారు. వీరు సందర్శించి, ఆహ్వానించిన పీఠాధిపతుల్లో, శృంగేరి, కంచి, పుష్పగిరి, మంత్రాలయం, కుర్తాళం, విజయదుర్గా పీఠాధిపతి మొదలైన వారున్నారు.

వీరు కాక, స్వరూపానంద స్వామిని, గురుమదనానంద స్వామిని, చినజీయర్ స్వామిని, ధర్మపురి సచ్చిదానంద స్వామిని కూడా కలిసి ఆహ్వానించారు. వీరంతా సూత్రప్రాయంగా పుష్కరాలలో పాల్గొనడానికి అంగీకరించారు. చినజీయర్ స్వామి భద్రాచలం పుష్కర ప్రారంభ సమయంలో అక్కడికి వెళ్తానన్నారు. తర్వాత, మంచిర్యాలలో ఐదు రోజు లు వుంటామన్నారు. ఆ సందర్భంగా వారున్న చోట, యజ్ఞయాగాదుల నిర్వహణ, అనుగ్రహ భాషణ చేస్తామన్నారు. బాసరలో గురు మదనానంద సరస్వతీ స్వామి పుష్కర ప్రారంభ సమయంలో వుండి, తర్వాత పన్నెండు రోజులు తెలంగాణలోని వివిధ పుణ్యక్షేత్రాలలో పర్యటిస్తామన్నారు. పుష్పగిరి, మం త్రాలయం, ఇతర పీఠాధిపతులు ధర్మపురి, కాళేశ్వ రం, బాసర, ఇతర పుణ్య క్షేత్రాలకు వెళ్తామన్నారు.

2789

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Featured Articles