‘విద్యాధికారం’ అక్కరలేదా?


Thu,September 12, 2019 01:30 AM

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగిస్తున్నవారిలో పలు సామాజిక వర్గాల వారున్నారు. వారిలో పలువురితో ఈ రచయిత మాట్లాడిన మీదట ఒక విషయం అర్థమైంది. వారిలో అత్యధికులకు ఆ మాటకు గల భావం తెలియదు. రాజ్యాధికారం (స్టేట్ పవర్) వేరు, రాజకీయాధికారం (పొలిటికల్ పవర్) వేరు. రాజ్యం అన్నది సాధారణమైన ప్రభుత్వానికి మించిన వ్యవస్థ. రాజ్యం అధీనంలో సమాజంలోని అన్ని వనరులు, వాటి వినియోగం, పంపిణీ, వీటన్నింటికి సంబంధించిన నిర్ణయాధికారాలు, భవిష్య నిర్దేశనాలు కేంద్రీకృతమై ఉంటాయి. రాజ్యం అభివృద్ధి మార్గాలను, సామాజిక పురోగతిని నిర్దేశించి అమలుపరుస్తుంది. ఆ విధంగా రాజ్యాధికారమన్నది విస్తృతం, సమగ్రం, మౌలికం అయి లోతైన అర్థం కలది. రాజ్యం రాజకీయాన్ని నియంత్రిస్తుంది. ఇందుకు భిన్నంగా రాజకీయాధికారం కేవలం రాజకీయపరమైన ప్రభుత్వానికి పరిమితమైనది. తాత్కాలికమైనది. దళిత బహుజనవర్గాలు ఈ రెండింటిలో ఏ మాటను ఉపయోగిస్తున్నాయనేది అట్లుంచి, వారు కోరుకుంటున్నది రాజ్యాధికారాన్నా లేక రాజకీయాధికారాన్నా? ఈ వర్గాల వారి మాటలను, చేతలను చూడ గా, రెండు పదాల మధ్య గల తేడా ఏమిటో వారిలో అధికులకు తెలియకపోవటాన్ని బట్టి కూడా చూడగా, వారి దృష్టిలో గలది రాజకీయాధికార మే తప్ప రాజ్యాధికారం కాదు. తమ నుంచి నలుగురు మంత్రులు లేదా ముఖ్యమంత్రి కావటమే రాజ్యాధికారమైనట్లు వారు భావిస్తున్నట్లు కన్పిస్తున్నది. వారి మాటలు, వ్యవహరణ పూర్తిగా ఆ విధంగానే ఉన్నాయి. ఒకసారి అవగాహనపై, వ్యవహరణపై ఇటువంటి పరిమితులు ఏర్పడినాయంటే అది అన్నింటిలో ప్రతిఫలిస్తుంది. మనచుట్టూ గల దళిత బహుజనవాదులను, వారి రాజకీయాలను గమనించినప్పుడు కన్పించేది అదే. కనుకనే వారు రాజకీయాధికారం కోసం ఎవరికి వారు వ్యక్తులుగా, గ్రూపులుగా, కులాలలోని వర్గాలుగా అన్య వర్గాలను ఆశ్రయిస్తున్నారు.

కొన్ని సామాజికవర్గాలు రాజ్యాధికారాన్ని కోరుతున్నాయి. మంచిదే, కానీ వారికి విద్యాధికారం అవసరం లేదా? ఈ వర్గాలు వేల ఏండ్లుగా సరైన విద్య లేక చాలా కోల్పోయాయి. ఇప్పుడు తమ విద్యాభ్యాసానికి చరిత్రలో ఎప్పుడూ లేనన్ని అవకాశాలున్నాయి. వాటిని వారు సరిగా ఉపయోగించుకుంటున్నారా? స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు దళిత బహుజన ఉపాధ్యాయుల్లో అనేకులు పాఠాలు సరిగా చెప్పరు. దానితో ఆ వర్గాల విద్యార్థులు సరిగా చదువలేకపోతున్నారు. ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. రాజ్యాధికారానికి విద్య ఒక మూలస్తంభం అయినపుడు, చదువులు సరిగా లేనివారు రాజ్యాధికారాన్ని ఎట్లా సాధించగలరు?


ఐక్యమత్యాల్లేవు. కుంటుబడిన పాక్షిక చైతన్యాలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితులు వారిని సహజంగానే ఎక్కువ దూరం తీసుకుపోవటం లేదు. రాజ్యాధికారం సరికదా రాజకీయాధికారం సైతం ఇతరుల దయ పై ఆధారపడి ఒకస్థాయిలో మిగిలిపోతున్నది. ఈ స్పష్టీకరణ తర్వాత, విద్యాధికారం అన్న అసలు విషయానికి వద్దాము. పైన అనుకున్నట్లు రాజ్యాధికారానికి విద్య ఒక మూలస్తంభం. మనుషులు సమాజాలుగా స్థిరపడిన కాలం నుంచి విద్యది, విద్య గల వారిది కీలక స్థానం అయింది. సమాజంలోనే గాక రాజకీయ వ్యవస్థలో, రాజ్య వ్యవస్థలో కూడా. తొలి దశలలోనైతే రాజు కన్న కూడా విద్య గల వారిదే పైచేయి. ఆ తర్వాత అధికారం కారణంగా రాజుది పైచేయిగా మారినా విద్యగల వారి ప్రాముఖ్యం తగ్గలేదు. ఈ స్థితి ప్రాచీనం నుంచి, మధ్యయుగాల నుంచి, ఆధునికం వరకు కొనసాగుతున్నది. భవిష్యత్తులోనూ మారదంటే పొరపాటు కాబోదు. విద్యకు గల ఈ కీలక స్థానాన్ని గుర్తించినందు వల్లనే దళిత బహుజనవర్గాలకు చెందిన ఫూలే, అంబేద్కర్‌లు ఈ రంగంలో అంతగా కృషిచేసి గుర్తింపు పొందారు. ముఖ్యం గా అంబేద్కర్‌కు గల ప్రఖ్యాతి గురించి ఎవరూ ఎవరికీ చెప్పనక్కరలేదు. అందుకు పరాకాష్ట రాజ్యాంగ నిర్మాణం. దళిత బహుజనవర్గాలు ఆయనను చూపి గర్విస్తాయి. తనను ఆరాధిస్తాయి. అన్యవర్గాల ఎదుట రొమ్ము విరుచుకుంటాయి. అంబేద్కర్ ఆ స్థాయి గల విద్యావంతుడు, మేధావి, ప్రతిభాశాలి కాకుండా కేవలం రాజకీయాధికార వ్యవస్థలో ఒక మంత్రిగా అయి ఉంటే, లేదా టాటా-బిర్లాల వలె ధనికుడు అయి ఉం టే, ఈ వర్గాలకు ఇంతటి గర్వం, ఆరాధనాభావం ఉండేవా? కనుక అం బేడ్కర్ అనే వ్యక్తి ఈ వర్గాలకు జెండా గుర్తుగా మారటానికి ఏకైక కార ణం తన విద్య. అందువల్ల సమకూరిన మేధోశక్తి, ప్రతిభా సామర్థ్యాలు. ఇదంతా దళిత బహుజన వర్గాలకు పూర్తిగా తెలిసిన విషయమే. అయినప్పటికీ విద్యకు సంబంధించి వారి ఆచరణలో ఇది ప్రతిఫలించకపోవటమన్నది ఒక పెద్ద విషాదం. విద్య లేకుండా రాజకీయాధికారం సాధ్యం కావచ్చు.

విద్య లేకుండా రాజకీయాధికారం సాధ్యం కావచ్చు. ఎవరైనా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు. కానీ రాజ్యాధికారం సాధ్యం కాదు. ఈ వర్గాలకు చెందిన వ్యక్తులు ఎవరికి ఏ పదవులు లభించినా ఒక సమూహంగా రాజ్యాధికారం మాత్రం కాదు. దీని అర్థం వీరంతా గొప్పగా చదివినంత మాత్రాన రాజ్యాధికారం రాగలదని కాదు. అందుకు జరుగవలసినవి ఇంకా ఉంటాయి. ఇక్కడ చర్చిస్తున్నది విద్య గురించి అయినందున, రాజ్యాధికారానికి చదువు కూడా ఒక కీలక స్తంభమని గుర్తించటం అవసరమని నొక్కిచెప్పటం మన ఉద్దేశం.


ఎవరైనా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు. కానీ రాజ్యాధికారం సాధ్యం కాదు. ఈ వర్గాలకు చెందిన వ్యక్తులు ఎవరికి ఏ పదవులు లభించినా ఒక సమూహంగా రాజ్యాధికారం మాత్రం కాదు. దీని అర్థం వీరంతా గొప్పగా చదివినంత మాత్రాన రాజ్యాధికారం రాగలదని కాదు. అందు కు జరుగవలసినవి ఇంకా ఉంటాయి. ఇక్కడ చర్చిస్తున్నది విద్య గురించి అయినందున, రాజ్యాధికారానికి చదువు కూడా ఒక కీలక స్తంభమని గుర్తించటం అవసరమని నొక్కిచెప్పటం మన ఉద్దేశం. ఈ విషయాన్ని ఈ వర్గాలు గుర్తించి వ్యవహరించటం లేదు. పూర్వకాలపు పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ వర్గాలు అసలు చదువుకునేందుకే వీలులేదని శాసించారు. దానితర్వాత ఈ వర్గాలు ప్రతిఘటించటం, ఉన్నత తరగతులు తమ పట్టును కొంత సడలించటం, దేశం బయటినుంచి వచ్చిన పాలకులది భిన్నమైన దృష్టికావటం వంటి పరిణామాల వల్ల చదువులు కొద్దికొద్దిగా దళిత బహుజన వర్గాలకు అందుబాటులోకి రాసాగాయి. ఈ మార్పు ఎక్కువగా పాశ్చాత్య వలస పాలకుల కాలంలో జరిగింది. అప్పటినుంచి ఈ వర్గాల విద్యా పురోగతి స్పష్టంగా కన్పించిం ది. ఇప్పటి దృష్టితో ఆలోచిస్తే అది ఎందుకూ కొరగాకపోవచ్చు. కానీ, సంప్రదాయిక సంకెళ్లను తెంచుకొని వీరొక్క అడుగైనా ముందుకు వేయ టం అప్పటికీ అదే గొప్ప. ఈ వర్గాలకు నిజమైన మలుపు అన్నది దేశం స్వాతంత్య్రమై ఆధునిక ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టడంతో మొదలైంది. విద్యావకాశాలు స్పష్టమైన రూపంలో అందుబాటులోకి రావటం మొదలైంది. ఆ పని వాంఛనీయమైన స్థాయిలో లేకపోవచ్చు. జరిగినదానిలో లోపాలుండవచ్చు. ఈ వర్గాల కుటుంబ పరిస్థితుల రీత్యా ఆ పిల్లలంతా చదువుకోగ ల పరిస్థితులు లేకపోవచ్చు. కానీ ఒక కొత్త ఆరంభం జరుగటాన్ని కాదనలేం. అదేవిధంగా, కాలం గడిచినాకొద్దీ ఈ వర్గాలకు విద్యావకాశాలు పెరుగుతూ పోయాయన్నది గుర్తించాలి.

ప్రభుత్వాల వైపు నుంచి పెరిగాయి. ఆ వర్గాల పిల్లలలో విద్యాభిలాష క్రమంగా పెరిగింది. తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించాలనే కోరిక పెరిగింది. ప్రభుత్వాలు బడ్జెట్ల ను, విద్యాసంస్థల సంఖ్యను, హాస్టళ్లను, స్కాలర్‌షిప్‌లను పెంచుతూ పోయాయి. మొత్తం మీద ఒక దశాబ్దంతో పోల్చితే మరొక దశాబ్దానికి విద్యావకాశాలు విస్తరించినమాట నిజం. ఇప్పుడు ప్రశ్న ఈ అవకాశాలను బడుగు బలహీనవర్గాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏ మేరకు ఉపయోగించుకుంటున్నారన్న ది. అవకాశాలు పెరుగటంలో రెండు దశలు కన్పిస్తాయి. ఆర్థిక సంస్కరణలకు ముందు దశ ఒకటి కాగా, ఆ తర్వాత దశ ఒకటి. ముందు దశలోగాని, ఆ తర్వాతి దశలో గాని దళిత బహుజన ఉపాధ్యాయులు తమ వర్గాలకు చెందిన పిల్లలను చదువుల్లో పైకి తీసుకురావటం కోసం ప్రత్యేక శ్రద్ధ ఏమైనా చూపారా? రెండవ దశలోనైతే మధ్యతరగతి, ఉన్నత తరగతుల పిల్లలు దాదాపు అంతా ప్రైవేట్ విద్య వైపు, ఉన్నత శ్రేణి విద్యాసంస్థల వైపు, ఇతర రాష్ర్టాలూ దేశాల వైపు మళ్లారు. దానితో, ముఖ్యంగా రెండవ దశ వచ్చేసరికి. ప్రభుత్వ స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు అధ్యాపకులు, విద్యార్థుల్లో అత్యధికులు దళిత బహుజనవర్గాల వారే అయ్యారు. స్కూళ్ళు, క్యాంపస్‌లు వారితోనే నిండిపోయాయి. వారి చదువులకు గతంలో ఇదెప్పుడూ లేని చారిత్రక అవకాశం వారికీ సీట్లు, హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్లు చాలా అందుబాటులో ఉన్నాయి. అటువంటి స్థితిలో ఈ అధ్యాపకులకు, రాజ్యాధికార నినాదాలు ఇచ్చే ఇతరులకు నిజంగా ఆ దృష్టి, చిత్తశుద్ధి ఉన్నట్లయితే, తమ పిల్లలకు చదువులను శ్రద్ధాసక్తులతో బోధిస్తున్నారా? పరిశోధనలు చేయిస్తున్నారా? అది జరిగితే ఆ పిల్లలు ఉపాధి ఉద్యోగాల కోసం అన్యులతో పోటీపడగ ల స్థితికి ఎదుగటమే కాదు. రాజకీయాధికారంతో పాటు రాజ్యాధికార సాధనకు తగిన శక్తి ప్రపత్తులను సాధించుకునే దిశగా ముందుకుపోయేవారు.
t-Ashok
పైన ప్రస్తావించిన రెండు దశలు కొన్ని దశాబ్దాల పాటు విస్తరించి సాగాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ ఈ విద్యాధికారం లేదా విద్యాసాధికారత కోసం దళిత బహుజన అధ్యాపకులు, మేధావులు, యాక్టివిస్టులు చేస్తున్నదేమైనా కన్పిస్తున్నదా? వారికి లేని విద్యాసదుపాయాల కోసం డిమాండ్ చేయవలసిందే. అదే సమయంలో, ఇప్పటికే అందుబాటులో గల అవకాశాలను ఏ మేరకు సద్వినియోగపరుచుకొని విద్యాధికారాన్ని సాధిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

373

TANKASHALA ASHOK

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ