కొత్త ఆక్రమణలో ఫెడరలిజం


Wed,July 31, 2019 10:47 PM

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదాన్ని పొందింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను, ఉగ్రవాద చర్యలను ప్రభుత్వాలు నిరోధించాలనటంలో భిన్నాభిప్రాయానికి తావులేదు. ఒకోసారి ఈ కార్యకలాపాల నిర్వచనంపై, వ్యక్తులను గుర్తించటంపై, శిక్ష ల స్థాయిపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక. అటువంటి భిన్నాభిప్రాయాన్ని గతంలో అనేక కేసుల విషయంలో సాక్షాత్తు కోర్టులు సైతం కించపరిచాయి. అదే సమయంలో మౌలికంగా ఈ తరహా కార్యకలాపాల నియంత్రణ మాత్రం అవసరం. అందువల్లనే పై బిల్లును పార్లమెంటులో దాదాపు అన్ని పార్టీలు బలపరిచాయి. కానీ అట్లా బలపరుస్తూనే కొం దరు తమ విమర్శలను తెలియజెప్పారు. ఉదాహరణకు, ఈ కేసులపై పరిశోధనల కోసమని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా రాష్ర్టాలలో వివిధ చర్యలు తీసుకోవటం. అది ఫెడరలిజానికి విరుద్ధంగా ఈ రాష్ర్టాలలో మితిమీరి జోక్యం చేసుకోవటమేనని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే.కేశవరావు రాజ్యసభ లో, బి.వెకంటేశ్ లోక్‌సభలో ఆక్షేపించారు. ఇదే ఆక్షేపణ ఇతర ప్రతిపక్షాల నుంచి కూడా ఎదురైంది. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల అంశం రాష్ర్టాల జాబితాలో ఉంది. కేంద్ర సంస్థ ల దృష్టికి వచ్చి, అంతర్రాష్ట్ర స్వభావం లేదా జాతీయ స్వభావం గల నేరాలు కొన్ని ఉంటాయి. ఆర్థికనేరాలు లేదా ఉగ్రవాదం నేరాల వంటి వి. ఇవి మొదటి నుంచి ఉన్నవే. అటువంటప్పుడు కేంద్ర సంస్థలు సం బంధిత రాష్ట్ర పోలీసుల సహకారం తీసుకుని దర్యాప్తు జరుపటం సంప్రదాయకంగా వస్తున్న విషయం. ఆ పద్ధతిలో కేసుల పరిశోధనకు ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదు. అటువంటి స్థితిలో బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాలతో ఎటువంటి నిమిత్తం లేకుండా రకరకాల చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టంలో వీలు కల్పించవలసిన అవసరం ఏమున్నది? సమ స్య ఏమంటే ఇటువంటి కేంద్ర సంస్థల చర్యల వల్ల తమ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో, ఎవరిని అరెస్టు చేస్తున్నారో, ఎవరి ఆస్తులు జప్తు చేస్తున్నారో, ఎవరికి ఏమవుతున్నదో, దానంతటిలోని మంచి చెడులేమిటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండా పోతుంది.

ఫెడరలిజంపై బీజేపీ ఆక్రమణలు వేగాన్ని పుంజుకుంటున్నాయి. మనది సహకార ఫెడరలిజమని ప్రకటిస్తున్న రాజ్యాంగాన్ని దేశానికి ప్రసాదించింది తామేనని చెప్పే కాంగ్రెస్ పార్టీ తన కాలంలో ఇదే పనిచేసింది. తమ విధానం సహకార ఫెడరలిజమని 2014లో మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం అదే మార్గంలో వెళ్తున్నారు. ఆ పని ఇంకా వేగంగా చేయజూస్తున్నట్లు కన్పిస్తున్నది. ఈ దేశ వైవిధ్యతను, అందుకు అనుగుణమైన ప్రజాస్వామికతను కాపాడుకోవలసిన బాధ్యత గతంలో వలె ఇప్పుడు కూడా ఫెడరల్ శక్తులదే అవుతున్నది.


అట్లా జరిగే వాటికి ఒక్కో సారి పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా జవాబుదారీ కావలసి వస్తుంది. అనగా, చర్యలు కేంద్ర ఏజెన్సీలవి కాగా, జవాబుదారీతనం రాష్ర్టాలది అవుతుందన్నమాట. ఫెడరలిజం, సహకార ఫెడరలిజం సాగవలసింది ఈ విధంగానేనా? అంతేకాదు. తమ అధికారాలను కేంద్ర సంస్థలు రకరకాల కారణాలతో దుర్వినియోగపరుచబోవనే హామీ లేదు. సభలో కొందరు ఎత్తిచూపినట్లు కేంద్రంలో గల అధికారపక్షానికి ఈ చట్టం రాజకీయంగానూ ఉపయోగపడవచ్చు. తన పాలనాకాలమంతా కాంగ్రెస్ పార్టీ సీబీఐని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను, ఆదాయం పన్ను శాఖను విచ్చలవిడిగా దుర్వినియోగపరుచటం ఇందుకు తిరుగులేని తార్కాణం. అందుకు కాంగ్రెస్ ను విమర్శించిన పార్టీలలో బీజేపీ కూడా ఉన్నది. వివిధ సంస్థలు, చట్టా ల ప్రయోగంలో రాష్ర్టాలకు ఎంతో కొంత ప్రమేయం ఉండగల సందర్భాలలోనే ఇటువంటి దుర్వినియోగం జరుగగా, అసలు ఏ జోక్యమూ లేనివిధంగా ప్రస్తుత చట్టాన్ని తయారుచేస్తున్నప్పుడు రాష్ర్టాల పరిస్థితి ఏమిటి? ఫెడరలిజం ఏమయేను? హోంమంత్రి అమిత్ షా గుర్తు చేసినట్లు ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి ఇప్పటికే గల చట్టానికి సవరణ బిల్లు మాత్రమే నన్నది నిజమే. చట్టాన్ని చేయటంతో పాటు దానిని కొన్ని సవరణల ద్వారా కఠినతరం చేసింది కాంగ్రెసే. దానిని ఇప్పుడు మరింత కఠినం చేస్తున్నారు. ఇదే విమర్శను కాంగ్రెస్‌పై మజ్లిస్ సభ్యుడు ఒవైసీ చేశారు. ఈ గత చరిత్ర అంతాసరే. ఇక్కడ మనం యథాతథంగా చట్టంలోని మంచి చెడులను చర్చించటం లేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన సవరణలు రాష్ర్టాల ఫెడరల్ పాత్రను గతంలో ఎన్నడూ లేనివిధంగా కుంచింపజేస్తున్నాయి. అధికారాలను దుర్వినియోగపరుచటంలో కాంగ్రెస్‌కు బీజేపీ ఎంతమాత్రం తీసిపోవటం లేదు. అట్లా తీసిపోని స్థితిలో రాష్ర్టాల అధికారాలను గతం కన్న అతిక్రమించటమంటే దుర్వినియోగానికి ఆస్కారాన్ని పెంచటమన్నమాట. రాష్ర్టాల ఫెడరల్ హక్కులు, అధికారాలపై ఏదో ఒక రూపంలో ప్రభా వం ఉండటం నదీజలాల బిల్లు, విద్యారంగ ముసాయిదా సమాచార హక్కు చట్టం, కార్మిక చట్టాల వంటి విషయాలలోనూ కన్పిస్తున్నది. ఇవ న్నీ ఇటీవలి వారాలకు సంబంధించినవే. నదీ బేసిన్ల అథారిటీ నియామకం, వేర్వేరు ట్రిబ్యునళ్ల రద్దు వంటివి స్థూలంగా చూసినప్పుడు ఉపయోగంగానే కన్పిస్తాయి.

సమాచార హక్కు సంస్థల నియామకాలు, కమిషనర్ల విధి విధానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంతగా జోక్యం కల్పించుకోవలసిన అవసరం ఏమిటో కూడా బోధపడటం లేదు. ఆ బాధ్యతలను రాష్ర్టాలు సొంతంగా తమ స్థాయిలో గాక కేంద్రం చట్టం ప్రకారమే నిర్వర్తిస్తున్నాయి. అయినప్పుడు రాష్ర్టాలకు గల ఆ మాత్రపు ఫెడరల్ అధికారాలను సైతం మోదీ ప్రభుత్వం హరించబూనింది.


వివాదాల పరిష్కారంలో ఆలస్యాల నివారణ, అభివృద్ధిని వేగవంతం చేయటం మంచి ఉద్దేశాలే. అదే సమయంలో తమ సొంత అవసరాల కోసం పట్టుబట్టి నిలిచే ఫెడరల్ అధికారాలు రాష్ర్టాలకు పరిమితమవుతాయి. ప్రస్తుతం సర్కులేషన్‌లో గల ఈ బిల్లు రాష్ర్టాల అభిప్రాయాలను కోరుతున్నది. కానీ వాటి అభిప్రాయాలకు ఎం త విలువ ఇచ్చేదీ, చివరికి పార్లమెంటరీ మెజారీటీ సూత్రంతో కేంద్ర అధికార పక్షం తాను కోరుకున్నదానినే ఎంతవరకు నెరవేర్చుకునేదీ ఎవరైనా ఊహించవచ్చు. బిల్లు చట్టరూపం దాల్చి అమలుకు వచ్చినప్పుడు అథారిటీ సంస్థలలో కేంద్రం నియమించే వారిది పైచేయి కానున్నది. అప్పుడు వివిధ నిర్ణయాధికారాలు అన్నీ కేంద్రానికి, మరొకవిధంగా చెప్పాలంటే అక్కడి అధికార పక్షానికి లభిస్తాయి. ఇటువంటివి పలు రూపాలలో ఆ పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడుతాయని వేరుగా చెప్పనక్కరలేదు. అది ఎట్లున్నా, రాష్ర్టాలు ప్రధానంగా ఆలోచించవలసిన విష యం తమ అంతర్రాష్ట్రీయ నదీ ప్రయోజనాల విషయమై తమ వైఖరికి ఇంతకాలం గల విలువ స్పష్టంగా తగ్గిపోనుండటం. ఈ విధంగా ఫెడర ల్ వ్యతిరేక కేంద్రీకరణ వేగం పెరుగుతున్నది. సమాచార హక్కు సంస్థల నియామకాలు, కమిషనర్ల విధి విధానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంతగా జోక్యం కల్పించుకోవలసిన అవసరం ఏమిటో కూడా బోధపడటం లేదు. ఆ బాధ్యతలను రాష్ర్టాలు సొం తంగా తమ స్థాయిలో గాక కేంద్రం చట్టం ప్రకారమే నిర్వర్తిస్తున్నాయి. అయినప్పుడు రాష్ర్టాలకు గల ఆ మాత్రపు ఫెడరల్ అధికారాలను సైతం మోదీ ప్రభుత్వం హరించబూనింది. దీనిని బట్టి, దేశ ప్రయోజనాలు, పరిపాలనా సౌలభ్యతలు అనే వేటితోనూ నిమిత్తం లేకుండా అత్యధిక అంశాలను, అధికారాలను తన చేతిలో కేంద్రీకరింపజేసుకోవటం కేంద్ర ప్రభుత్వపు ఫెడరల్ వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. విద్యారంగాన్ని కేంద్రీకృతం చేయనుద్దేశించిన విధానం కూడా ఇటువంటిదే. ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో గల ఈ రంగం నిర్వహణకు, నియంత్రణకు ప్రధాని అధ్యక్షతన గల రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ నియామకం ఈ జాతీయ విద్యా విధానం ముసాయిదాలో భాగం. దాని ప్రకారం, ఆ సంస్థ ఏది నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అమలుపరచాలి.
t-Ashok
అనగా పరోక్షంగా విద్యారం గం కేంద్ర జాబితాలోకి వెళ్లటమే. కేంద్రంలోని అధికారపక్షపు ఆలోచన లు, అవసరాలే రాష్ర్టాల ఆలోచనలు, అవసరాలుగా మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి జాబితాతో నిమిత్తం లేకుండా కార్మిక చట్టాల విషయంలోనూ ఇటువంటి ప్రయత్నాలనే కేంద్రం చేస్తున్నది. విచారకరం ఏమంటే, ఒకవైపు ఇటువంటివి వేగంగా జరుగుతుండగా మరొకవైపు ఫెడరల్ శక్తులు, ప్రజాస్వామికవాదులు ఎక్కువగా ఏమీ చేయలేని పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి. దీనిని మోదీ ప్రభు త్వం అనువుగా ఉపయోగించుకుంటున్నది. ఫెడరలిస్ట్ ఐక్యత నేటి అవసరం.

399

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ

Featured Articles