తమిళనాట ఫెడరలిజం


Thu,July 4, 2019 01:27 AM

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువంటి జాతివాదం దేశ స్వాతంత్య్రానికి ముందు చరిత్ర పొడవునా ఉండగా, ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వా మ్యం రాకతో ఫెడరలిస్టు భావనగా రూపాంతరం చెందింది. జాతివాదా లు, ఫెడరలిస్టు భావనలు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏదో ఒక మేరకు ఉన్నప్పటికీ, అవి ఏవీ తమిళ-ద్రవిడ జాతివాదానికి సరిరా వు. అందుకు తగు కారణాలున్నాయి. వాటిని ముందు గమనించాలి. అప్పుడుగాని అక్కడ ద్రవిడ పార్టీల వరుస విజయాలకు, జాతీయ పార్టీల వరుస పరాజయాలకు కారణాలు అర్థంకావు. ఈ మాటలు చెప్పుకున్న మీదట ఒక సందేహం కలుగవచ్చు. ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య కాలంలో టీఆర్‌ఎస్ వంటి ఫెడరలిస్టు శక్తులు జాతీయ పార్టీలపై వరుస విజయాలు సాధించాలంటే, జాతీయ పార్టీలను నామమాత్రంగా మిగిల్చివేయాలంటే, తమిళ-ద్రవిడ జాతీయవాదం వంటిది అదే స్థాయి లో ఇక్కడ ఒక పునాది శక్తిగా నేపథ్య శక్తిగా ఉండటం తప్పనిసరా? తమిళులు ఈ ద్రవిడ భూమిపై తమను తాము ఒక ఆదిమ జాతిగా నమ్ముతారు. క్రీస్తుపూర్వం నుంచి తమకు ఇతరులు అందరికన్న ముం దుగా ఒక భాష, లిపి, సాహిత్యం, సంస్కృతి, మతం వ్యవస్థీకృత సమా జం, నాగరికత ఉండేవని బలంగా చెప్తారు. అందుకు సంగం సాహి త్యం, సముద్రంలో మునిగి సునామీ వంటి సందర్భాలలో బయటపడే అతి ప్రాచీన నిర్మాణాల వంటి ఆధారాలు అనేకం చూపుతారు.

తమిళనాడు ద్రవిడ పార్టీలు ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ఘన విజయం సాధించి జాతీయ పార్టీలను నామమాత్రం చేయటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అక్కడ ప్రతిసారి ప్రాంతీయ పార్టీలలోనే ఏదో ఒకటి గెలుస్తుందని, జాతీయ పార్టీలకు స్థానం ఉండదని, అదే పద్ధతిలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలని తమ పార్టీ వాదులకు పిలుపునిచ్చారు. ఫెడరలిజం ప్రస్తావన కూడా చేశారు. తమిళనాడు తరహాలో ఫెడరలిస్టు శక్తుల మహా ప్రాబల్యం ఇతర చోట్ల ఎంతవరకు సాధ్యమన్నది జాగ్రత్తగా విచారించవలసిన విషయం.


భారతదేశం బయటి నుంచి వచ్చినట్లు, ఆర్యావర్తం అనబడే ఉత్తరాది నుంచి దక్షిణానికి చొచ్చుకువచ్చారని భావించే ఆర్యులతో తమ చారిత్రకమైన ఘర్షణలను పేర్కొంటారు. బ్రాహ్మణ వ్యతిరేకత, హిందూ దేవతల వ్యతిరేకత, హిందీ భాషా వ్యతిరేకత దీనిలో భాగమయ్యాయి. ఆ ఘర్షణలలో భౌతికమైనవి, మేధోపరమైనవి, సాంస్కృతికమైనవి, మతపరమైనవి కూడా ఉన్నాయి. ఆ విధంగా అనేక వందల సంవత్సరాల కాలంలో తమిళ-ద్రవిడ జాతి అన్నది రూపుదిద్దుకొని, స్థిరపడి ఘనీభవించింది. ద్రవిడ-తమిళ జాతి భావన ఒక ఫిలాసఫీగా మారింది. అదే చారిత్రక స్థితి స్వాతంత్య్రోద్యమ కాలానికి వ్యాపించింది. అప్పటి ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ కాగా, దానితో ఏకీభవించిన తమిళ వర్గాలు అంతకుమించి ఉండేవి. అవి ద్రవిడవాద డిమాండ్లను, భాషా సాంస్కృతిక అంశాలను, బడుగు బలహీనవర్గాల వాదనలను, ఉత్తరాది (ఆర్య) వ్యతిరేకతలను ముందుకు తెచ్చాయి. ఆ కాలపు వివిధ సామాజిక ఉద్యమాలు అట్లుండగా, ఈ ధోరణులకు ఒక రూపం జస్టిస్ పార్టీ, మరొక రూపం రామస్వామి నాయకర్ ఉద్యమం, ఇంకొక రూపం డి.కె.పార్టీ అయ్యాయి. ఈ సంప్రదాయాల నుంచి పుట్టుక వచ్చిందే ప్రత్యేక తమిళదేశ వాదన. స్వతంత్ర భారతదేశం నుంచి విడిపోయి వేరే దేశంగా అవతరించాలన్న నినాదం 1962లో చైనా దాడితో గాని ముగియలేదు. కాని మౌలికంగా తమిళ-ద్రవిడ జాతివాదం మాత్రం కొనసాగాయి. రాజ్యాంగంలోని ఫెడరలిస్టు లక్షణాలను ఆధారం చేసుకుంటూ ఈ చారిత్రక స్థితిగతులు, భావనలు, నినాదాలు ఆధునిక ఫెడరల్ శక్తులను నిలబెట్టాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎన్నికలలో ద్రవిడ పార్టీల నుంచే ఏదో ఒకటి గెలువటం, జాతీయ పార్టీలు వాటికి మహా అయితే జూనియర్ భాగస్వాములుగా మిగులటం అందువల్లనే జరుగుతున్నది.

తెలంగాణ విషయానికి సూటిగా వస్తే, ఇక్కడ జాతీయ పార్టీలను నామమాత్రం చేసి నిలువరించగల మార్గమేదైనా ఉన్నదా? తమిళ జాతి భావన వంటి తెలంగాణ జాతి ఫిలాసఫీ రాగల అవకాశం ఏమిటి? ఇది జరుగాలంటే ఈ ప్రాంతానికి చెందిన సాధారణ ప్రజా వర్గాలను, మధ్య తరగతిని, ఉన్నత తరగతులను తెలంగాణ భావనలతో ప్రభావితం చేయగల వ్యూహాన్ని రూపొందించాలి.


ద్రవిడ పార్టీలు కేడర్ బేస్‌డ్ పార్టీలు అయ్యాయి. వాటి నిలకడకు అది కూడా ఒక కారణం. క్రీస్తు పూర్వకాలం నుంచి ఇటువంటి మూలాలు, వేల సంవత్సరాలు గా ఈ తరహాలో ఎడతెగని భావనలు, ఇటువంటివన్నీ పెనవేసుకుపోయిన సంఘీభావ స్థితి, దానిని నేటికీ కొనసాగిస్తున్న పరిస్థితులు, శక్తులు దేశంలో మరెక్కడా లేవు. ఇంత ఉధృతమైన రీతిలో ఎక్కడా కన్పించవు. ఈ స్థితి అందుకు తగిన ఎన్నికల రికార్డు, రాజకీయ రికార్డు ఎంతో స్పష్టంగా ఉన్నప్పటికీ ఇటీవల ఆసక్తికరమైనవి కొన్ని జరిగాయి. తమిళనాడులో ప్రాబల్యం ద్రవిడ శక్తులదే అయినా, కొన్ని పరిస్థితుల కారణం గా జయలలిత ఒక ముఖ్య శక్తి కావటాన్ని కొందరు ద్రవిడ భావనలు బలహీనపడటానికి, ద్రవిడేతర ఆర్య శక్తి ముందుకురావటానికి, అట్లా ముందుకురావటాన్ని తమిళజాతి ఆమోదించటానికి సంకేతమంటూ చెప్పారు. ఆమె మరణంతో ఏర్పడిన ఒక శూన్యంలోకి బీజేపీ ప్రవేశించగలదని, అది ఆర్యశక్తి విజయం కాగలదని వ్యాఖ్యానించారు. ఆ మాట ఇంత నేరుగా అనకున్నా పరోక్ష సూచనలు చేశారు. అదేవిధంగా, చివరి ద్రవిడ మహానేత కరుణానిధి మృతి, ఇక ఏ ద్రవిడ పార్టీలోనూ గొప్ప నాయకులు లేకపోవటంతో ద్రవిడ వాదం ముగిసినట్లేనన్నారు. కాని తమిళవాదం ఆ జాతి ప్రజల మూలాలలో ఉండి కొనసాగుతున్నదని లోక్‌సభ ఫలితాలు తిరుగులేని విధంగా రుజువు పరిచాయి. పైన చెప్పుకున్నట్లు తమిళ-ద్రవిడవాదంతో పోల్చదగ్గ చారిత్రక జాతీయవాదం ఆ స్థాయి దేశంలో మరెక్కడా లేదు. కనుకనే అటువంటి ఆధారాలతో ముడిపడిన ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు ఫెడరలిజం ఇటువంటి పునాదులపై నిలిచి కొనసాగుతున్నది. ఇటువంటి స్థాయిలో చారిత్రక మైన పునాదులు, స్వాతంత్య్రానంతరం ఆధునిక ఫెడరలిస్టు రికార్డు లేకపోయినా, లేక పాక్షికంగా మాత్రమే ఉన్న ఇతర ప్రాంతాలలో ఫెడరలిజం బలంగా నిర్మితం కావాలంటే ఏమి చేయాలన్నది ప్రశ్న. ఉదాహరణకు తెలంగాణ వంటి చోట.

అయితే ప్రపంచంలో ఫెడరలిజం ప్రతిచోటా చారిత్రక జాతి భావన ల ఆధారంగా మాత్రమే జరుగలేదు. తమిళనాడు పరిస్థితి ఒక మినహాయింపు వంటిది. నిజానికి జాతి భావన, ఫెడలరిస్టు భావన రెండూ చారిత్రకమైనవే. చరిత్రలో రాజ్యాలు అంటూ మొదట ఏర్పడిన దశలో, కేం ద్ర స్థానంలో ఉండిన రాజు వివిధ చిన్న రాజ్యాలు, తెగల ప్రజలతో ఫెడరలిస్టు అంగీకారాల వంటివి చేసుకునే రాజ్యాన్ని నడిపేవాడు. అంగీ కారం భంగపడినప్పుడు, లేదా సామంత తెగలకు స్వతంత్రేచ్ఛ కలిగినప్పుడు ఘర్షణలు తలెత్తాయి. రాజ్యాలు, సమాఖ్యలు భంగపడ్డాయి. ఆ సందర్భాలలో అందరినీ కలిపి ఉంచిన జాతీయ భావనలు, సమైక్యతా భావనలంటూ ఏమీ లేవు. మరొకవైపు, జాతి భావన లేకపోయినా తగు అవగాహనతో తగినంతకాలం కొనసాగిన సమాఖ్యల వంటి రాజ్యాలు న్నాయి. అవగాహన పోయినప్పుడు భంగడపడ్డాయి. ఈ నేపథ్య చర్చలను అట్లుంచి తెలంగాణ విషయానికి సూటిగా వస్తే, ఇక్కడ జాతీయ పార్టీలను నామమాత్రం చేసి నిలువరించగల మార్గమేదైనా ఉన్నదా? తమిళ జాతి భావన వంటి తెలంగాణ జాతి ఫిలాసఫీ రాగల అవకాశం ఏమిటి? ఇది జరుగాలంటే ఈ ప్రాంతానికి చెందిన సాధారణ ప్రజా వర్గాలను, మధ్య తరగతిని, ఉన్నత తరగతులను తెలంగాణ భావనలతో ప్రభావితం చేయగల వ్యూహాన్ని రూపొందించాలి. వేర్వేరు వర్గాలను వేర్వేరు అంశాలు ప్రభావితం చేస్తాయి. మరొక స్థాయి లో అందరినీ కలిపి ఉమ్మడిగా ప్రభావితం చేసే అంశాలుంటాయి. ఉదాహరణకు తమిళ జాతి వాదంలో సంస్కృతి, సాహిత్యం, జాతివాదం, చరిత్ర ప్రధానాంశాలు అనుకుంటే, ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన వి బలంగా, విస్తారంగా, నిరంతరం ముందుకుతేవటం తెలంగాణలో ఉపయోగకరం కాగలదు.
Ashok
ఇది అన్నివర్గాలను ప్రభావితం చేసే కామన్ అంశం అవుతుంది. నిర్దిష్టంగా చూసినప్పుడు, సాధారణ ప్రజా వర్గాలకు, అన్నింటికన్న ముఖ్యమైనవి జీవిత సం క్షేమం, జీవన భద్రత, ఉపా ధి, ఇతర జీవితావసరాలు, సుపరిపాలన వం టివి. అవి వీలైనంత బాగా జరిగి అందుకు సంస్కృతి, సాహిత్యం, స్థానిక జాతి భావనలు కూడా తోడైనప్పుడు ఆ రెండింటి బంధం వల్ల ఈ వర్గాల లో కూడా ఫెడరలిస్టు ధోరణులు బలపడుతాయి. ఫెడరలిస్టు శక్తులకు మద్ద తు పెరుగుతుంది. ఉన్నతవర్గాలకు సంబంధించి వారిలో స్థానిక జాతి భావనలు గలవారు ఉండవచ్చు, తమ సంకుచిత ఆర్థిక, రాజకీయ ప్రయోజనా ల కోసం జాతీయ రాజకీయ శక్తులను అనుసరించేవారు కూడా ఉండవ చ్చు. వ్యూహం అందుకు తగినట్లే ఉండాలి. వారిలో ఫెడరలిస్టు విశ్వాసాల ను, విధేయతలను వీలైనంత పెంచాలి. దీనంతటి అర్థం జాతి వాదనకు భిన్నంగా జాతీయవాదం గాని ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా జాతీయ పార్టీ లు గాని అవాంఛనీయమైనవని కాదు. కాని జాతీయ పార్టీలు అనబడేవి మనం రాజ్యాంగంలో చెప్పుకున్న సహకార ఫెడరలిజాన్ని ధ్వంసం చేయబూనటంతో సమస్య మొదలైంది. ప్రాంతీయ భాషా సంస్కృతులను, ప్రాం తీయ ఆర్థిక-రాజకీయ శక్తులను విస్మరించటం, అణిచివేయ టం అందుకు ఆజ్యం పోయసాగింది. ఈ సోకాల్డ్ జాతీయ పార్టీల వల్లనే కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడి బలపడుతున్నాయి. అవి వర్ధిల్లటం చారిత్రక అవసరం.

381

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ

Featured Articles