జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం


Thu,June 27, 2019 02:18 AM

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నాయి. వాటి ప్రభావం ఏమిటన్నది ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలకు తెలుసు. ఆ ప్రాజెక్టులు నిర్మాణం కాకముందు అక్కడి వ్యవసాయాలతో పాటు ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక-రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉండేవో, ఆ తర్వాత ఏ విధంగా పెను మార్పులకు గురయ్యాయో వాటిని అధ్యయనం చేసినవారు చెప్పగలరు. నీటి అందుబాటు వల్ల, నేల తడియటం వల్ల, అది కూడా సరైన వర్షాల కు నోచుకోక నెర్రెలు బాసిన భూములలో జరుగటం వల్ల, జీవితాలు ఎల్లప్పుడూ కరువుల అంచున కొట్టమిట్టాడినప్పుడు, ప్రాజెక్టులు చేసే అద్భుతాలు ఏమిటో అనుభవించి పలువరించవలసిందే తప్ప అది మాటలకు అందని విషయం. అటువంటి తెలంగాణలో, పైన పేర్కొన్న కొద్దిపాటి మధ్యమ స్థాయి పథకాలు, అవి కలిగించిన పరిమిత ఫలితాల తర్వాత, ఇప్పుడు కాళేశ్వ రం రూపంలో ఒక కార్తవీర్యార్జున పథకం సగానికి సగం రాష్ర్టాన్ని నీళ్లతో ముంచెత్తనున్నది. గోదావరి, కృష్ణలలో చాలినంత నీరు అందుబాటులో ఉండి కూడా వినియోగించుకోక సముద్రం పాలవుతుండిన నికృష్టస్థితికి కాళేశ్వరం చరమ వాక్యం పలుకనున్నది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ఇతర పథకాలతో కలసికట్టుగా సాగి త్వరలోనే యావత్ తెలంగాణనే ఆర్థికంగా-సామాజికంగా-సాంస్కృతికంగా-రాజకీయంగా సమూలమైన రీతిలో మార్చనున్నది. దాదాపు 19 లక్షల ఎకరాలలో ఆయకట్టు స్థిరీకరణతో పాటు మరొక 18 లక్షలకు పైగా ఎకరాలలో, 13 జిల్లాల వ్యాప్తంగా కొత్త ఆయకట్టు సృష్టి అన్నది అత్యంత అసాధారణమైన విషయం.

కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రభావం ఏవిధంగా ఉండగలదన్నది ఎంత చెప్పినా కేవలం మాటలలో, అంకెలలో అర్థమయ్యేది కాదు. ఆ బహుళార్థక సాధక పథకం బహుముఖాలుగా సాగుతూ ఫలితాలు ప్రజల అనుభవంలోకి వచ్చే కొద్దీ, కాళేశ్వరాన్ని ఆవరించుకొని ఒక కొత్త ప్రపంచమే ఆవిష్కారమవుతుంది. దానిని కాళేశ్వర ప్రపంచమనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప నీటిపారుదల పథకాలు నిర్మితమైన చోట నల్లా ప్రజల ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక-రాజకీయ జీవితాలు సమూలంగా మారాయి. శాశ్వతంగా మారాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగనున్నది.


అది కూడా పొరుగు రాష్ర్టాలతో గల దీర్ఘకాలిక వివాదాలను నేర్పుగా పరిష్కరించుకొని, అహర్నిశల శ్రమతో, సర్వ వనరుల సమీకరణ ద్వారా కనురెప్ప మూసి తెరిచేలేగా ఫలితాలను అనుభవంలోకి తేవటం గురించి ఎంతరాసినా తక్కువే. దీనంతటి సూత్రధారి ముఖ్యమంత్రి కేసీఆర్. యథాతథంగా ఈ నీటి పారుదల ప్రభావమే పైన అనుకున్నట్లు తెలంగాణ ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక-రాజకీయ ప్రపంచాన్ని సమూలం గా మార్చి వేయనున్నది. ఇక ఇది బహుళార్థ సాధకమైన ప్రాజెక్టు కాబోతున్నందున ఆ మార్పు మరెంత సమూలంగా ఉండనున్నదో ఊహించేందుకు మనం ప్రయత్నించవచ్చు. ఇందులో బహుళార్థకతను కొద్దిసేపు పక్కన ఉంచి నీటి విషయానికి వద్దాము. ప్రాజెక్టులు కొత్తగా నిర్మించిన ఇతర వెనుకబడిన ప్రాంతాలలో ఏ పరిణమాలు సంభవించాయో వాటిని అనుసరించి చూస్తే జరిగేది ఏమిటి? అవి ఆర్థికంగా, సామాజికంగా సాంస్కృతికంగా రాజకీయంగా కూడా ఉన్నాయి. ఆ విధంగా అన్నింటికన్న మొదట జరిగేది వ్యవసాయం బాగుపడటం. ఆ రంగం అంతకుముందువలె వర్షాధారితం, చెరువులపైనా, బావులపైనా ఆధారపడేది కాకపోవటం వల్ల నికరంగా సాగుతుంది. ప్రాజెక్టులకు కూడా అం తిమంగా వర్షాలు తప్పనిసరి. కానీ ప్రాజెక్టుల కారణంగా ఆ నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకొని అవసరం కొద్దీ వినియోగించుకునే పద్ధతి రావ టం వల్ల నీటి సరఫరాకు భరోసా ఏర్పడింది. ఆ విధంగా వ్యవసాయం, ఆయకట్టు నికరంగా మారటమన్నది మొట్టమొదటి మార్పు అయింది. అది మౌలికమైన, విప్లవాత్మకమైన మార్పు. ఆ ప్రభావంతో దానిని వెన్నంటి తక్కిన మార్పులు వస్తాయి. అదే పద్ధతిలో ఇప్పుడు కాళేశ్వరం తో తెలంగాణలో అందుకు రాష్ట్రవ్యాప్త నాంది, గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగింది.

ఒక్క కాళేశ్వరం పథకం వల్ల వ్యవసాయికంగా, పారిశ్రామికంగా, ఇతరత్రా, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక-రాజకీయ రంగాలలో మార్పులు జీవితపు మూలాలకు ఏ విధంగా విస్తరించగలవో దీనిని బట్టి గ్రహించవచ్చు. వీటిలో కొన్ని మార్పులు స్వల్పకాలంలోనే మొదలై మధ్య కాలాలకు, దీర్ఘకాలానికి విస్తరిస్తాయి. ఇవి క్రమంగా ఒక సుభిక్ష రైతాంగాన్ని సమాజాన్ని, సంపన్న సమాజాన్ని ఆవిష్కరించగలవు.


నికరమైన సాగువల్ల మొదట జరిగేది రైతుల ఆకలి బాధ పోవటం. ఆ వెనువెంట రైతు కూలీలకు సంవత్సరం పొడవునా పనులు దొరుకటం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, లేదా రైతు ఆర్థిక వ్యవస్థపై ఆధారపడే వృత్తిపనుల వారికి పనులు సాగటం. ఇది తొలి దశ మార్పు. ప్రాజెక్టుల నిర్మా ణం జరిగిన వెనుకబడిన ప్రాంతాలన్నింట ఇదే జరిగింది. మరొకవిధంగా చెప్పాలంటే, నిర్మాణ ఫలితాలు ప్రజల జీవితపు మూలాలలోకి ప్రవేశించటమన్నమాట. ఈ మొదటి దశ తర్వాత జరిగేది వ్యవసాయదారునికి కొద్దికొద్దిగా మిగులు సంపద ఏర్పడటం. అప్పుడు రైతు తన అప్పులు తీర్చటం, ఇక అప్పులకు వెళ్లకుండా ఉండటం ధాన్యాన్ని వీలైన మేర విక్రయించి ఆ డబ్బుతో పిల్లలకు చదువులు చెప్పించటం, వైద్య అవసరాలకు ఖర్చు చేయటం, ఇతర కుటుంబ ఖర్చులకు వినియోగించటం వంటివి జరుగుతాయి. జీవన ప్రమాణాలు పలు విధాలుగా మెరుగుపడటం కన్పిస్తుంది. మూడవ దశలో మరింత వ్యవసాయ మిగులు అందుబాటులోకి వచ్చినా కొద్దీ వ్యవసాయ విక్రయాలు స్థానికాన్ని మించి బయటి ప్రాంతాలకు విస్తరించసాగాయి. ఇదే మూడవ దశ రైతుల వద్ద, వ్యాపారుల వద్ద మిగులును మరింత పెంచటం, వ్యాపారాలు, మిల్లులు, రవాణా, బ్యాంకింగ్, కమ్యూనికేషన్లు, వినోదం, విద్య, వైద్యం దైవభక్తి ఎగుమతి దిగుమతులు, మీడియా, ప్రచురణలు, కొత్త శాస్త్రసాంకేతిక పరికరాలు, ఆధునిక నిర్మాణాలు, ఆహారపు అలవాట్లు, పర్యాటకం, వినిమయ రంగం వృద్ధి చెందటం, వీటన్నింటికి తగిన లిటిగేషన్లు మొదలైనవి ఆరంభం కావటమో విస్తరించటమో జరుగుతుంది.

మరొకస్థాయిలో ఈ మార్పుల ప్రభావాలతో కుటుంబాల సంబంధా లు, మానవ సంబంధాలు, సామాజిక దృష్టి, సామాజిక సంబంధాలు మారుతాయి. వ్యక్తులు, వర్గాల ఆలోచనలు, లక్ష్యాలు, వ్యవహరణా పద్ధతులు కూడా మారుతాయి. వ్యాపారాలు, పరిశ్రమలు, వృత్తులు విస్తరిస్తాయి. స్థానిక రాజకీయాలు, రాష్ట్ర, జాతీయస్థాయి రాజకీయాలు అం దరినీ తమ పరిధిలోకి లాగి వేస్తాయి. అది ప్రత్యక్షం కావచ్చు, పరోక్షం కావచ్చు. గుర్తించవలసిందేమంటే నదీప్రవాహంలో నీటితోపాటు కొంత తాలూతరకా కూడా ఉన్నట్లు ఈ పరిణామాలలో అవాంఛనీయమైనవి కొన్ని ఉండవచ్చు గాక. కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కన్న ముందునాటి సమాజాలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఆ తర్వాత దశలుదశలుగా మారి తీరుతాయన్నది ఇందులో గుర్తించవలసిన ప్రధాన విషయం. ఇది అంతటా జరిగింది. మన పొరుగున గల ఆంధ్రప్రదేశ్‌లో 19వ శతాబ్దం మధ్యకాలంతో ఆరంభించి జరుగుతూ వచ్చింది ఇదే అయినట్లు ఆ విషయాలు అధ్యయనం చేసినవారు వివరించిన విషయం. ఇటువంటివే ఇంకా అనేకానేకం ఉంటాయి. ఇంతవరకు చెప్పుకున్నవన్నీ వ్యవసాయ, గ్రామీణ సంబంధమైనవికాగా, గ్రామీణ సమాజానికి, పట్టణ సమాజానికి ఉండే సంబంధాల దృష్ట్యా ఈ ప్రభావాలు పట్టణ సమాజాలపై కూడా కన్పిస్తాయి. పోతే, కాళేశ్వరం పథకం కేవలం నీటి పారుదల ప్రాజెక్టు కాకుండా బహుళార్థ సాధకం అయినందువల్ల ఈ నిర్మాణ ఉపయోగాలు, ప్రభావాలు తెలంగాణపై ఇంకా అనేక విధాలుగా ఉండనున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన దానిని బట్టి ఈ తరహా ప్రాజెక్టుల వల్ల సాధారణంగా జరిగే జల విద్యుత్ ఉత్పత్తితో పాటు పరిశ్రమల అవసరాల కోసం పది శాతం నీటి ని, హైదరాబాద్ నగరంతో సహా ప్రజల మంచినీటి అవసరాలను లేదా మిషన్ భగీరథ అవసరాలను తీర్చనున్నారు.
Ashok
ఇతర బహుళార్థ ప్రయోజనాలలో మత్స్య పరిశ్రమాభివృద్ధి, చెరువులలో నీళ్లు నింపటం, భూగ ర్భ జలాల మట్టాల పెరుగుదల, నీరు నిలువ ఉండే పొడవైన కాలువ ప్రాంతాలు, నదీ ప్రవాహ ప్రాంతాలలో జల రవాణా అవకాశం, టూరి జం మొదలైన వాటికి వీలుంటుంది. ఒక్క కాళేశ్వరం పథకం వల్ల వ్యవసాయికంగా, పారిశ్రామికంగా, ఇతరత్రా, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక-రాజకీయ రంగాలలో మార్పులు జీవితపు మూలాలకు ఏ విధంగా విస్తరించగలవో దీనిని బట్టి గ్రహించవచ్చు. వీటిలో కొన్ని మార్పులు స్వల్పకాలంలోనే మొదలై మధ్య కాలాలకు, దీర్ఘకాలానికి విస్తరిస్తాయి. ఇవి క్రమంగా ఒక సుభిక్ష రైతాంగాన్ని సమాజాన్ని, సంపన్న సమాజాన్ని ఆవిష్కరించగలవు. పోతే కాళేశ్వరంపై జరిగే 80 వేల కోట్ల రూపాయల ఖర్చు ఎక్కువని, ఆ మొత్తాలు తిరిగి రానివని కొందరు పొరపాటుగా భావిస్తున్నారు. ప్రాజెక్టుల లాభాలు ఎక్కడ కూడా ఛార్టర్డ్ అకౌంటెన్సీ లెక్కల రూపంలో ఉండజాలవు. లక్షల ఎకరాలలో రెండు పంటల రూపంలో వచ్చే సంపదలు, పైన పేర్కొన్న పరిశ్రమలు ఇతర అనుబంధ కార్యకలాపాల రూపంలో ఒనగూరే ప్రయోజనాలు ప్రత్యక్ష పరోక్ష రూపాలలో ప్రభుత్వ కోశాగారానికి క్రమమైన రీతిలో గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టగలవు. ఇక రైతులకు, పరిశ్రమల వారికి, సామాజికులకు కలిగే ఇతర నికరమైన లాభాలు లెక్కగట్టలేనివి. కనుక ఈ విస్తృత దృక్పథంతో కాళేశ్వరం ఒక వెలగట్టలేని సంపద.

539

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ