బీజేపీ అతివిశ్వాసం


Wed,May 29, 2019 11:47 PM

bjp-national
తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడుకు మించిన సీట్లు గెలువలేదు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. అక్కడ కూడా టీడీపీ పొత్త వల్లనే కొన్ని పదుల స్థానాలు వచ్చాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త పరిస్థితి అన్ని ఎన్నికల్లోనూ తీసికట్టుగా మారింది. 2014లో ఒకే ఒక లోక్‌సభ, అయితే అయిదు అసెంబ్లీ. అన్నీ రాజధాని నగరానికి పరిమితమైనవే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచింది రెండే రెండు. అయిదు నెలల కిందట గత డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో 2014 నాటి అయిదు సీట్లు కేవలం ఒకటికి వచ్చి మిగిలాయి. 103 స్థానాల్లో డిపాజిట్లు దక్కలేదు. ఇటువంటి ఘనమైన 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల బీజేపీ, ఇప్పు డు అనుకోకుండా ఏవో తాత్కాలికంగా కలసివచ్చి నాలుగు స్థానాలు గెలువగలిగింది. పార్టీలకు, అభ్యర్థులకు ఒక్కోసారి కొన్ని కలిసిరావటం లేదా కలసిరాకపోవటం, అందువల్ల గెలువటం లేదా ఓడటం సహజంగా జరిగేవే. ఈ నాలుగు బీజేపీ విజయాలు గురించి సమస్య అది కాదు. కాని అది అసాధారణం అయినట్లు, దానితో అసలు చరిత్ర అన్నదే కొత్త మలుపు తిరిగి తమకు అనుకూలంగా మారినట్లు చిత్రీకరించబూనటంలోనే సమ స్య వస్తున్నది. పార్టీ గెలిచిన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలో చివరిది వారు తరచూ గెలుస్తూనే వస్తున్నది. 2014 లోనూ గెలిచిందే అయినందున అట్లుంచుదాం.

ఆత్మ విశ్వాసం ఎంత మంచిదో అది మితిమీరితే అంత చెడ్డది. తెలంగాణ బీజేపీకి ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని కలిగించాయి. అది సహజం. కాని వారు ఆ ఉత్సాహంలో అతిగా పొంగిపోతున్నారు. ఇక్కడ గత 70 ఏండ్ల జనసంఘ్, బీజేపీ ఎన్నికల చరిత్రను గమనించినా, ప్రస్తుత క్షేత్రస్థాయి బలాన్ని చూసినా, వాస్తవాలు ఏమిటన్నది అర్థమవుతుంది. అటువంటిస్థితిలో కొన్ని అంశాలు తాత్కాలికంగా కలిసి రావటం వల్ల నాలుగు స్థానాలు గెలిచిన బీజేపీ, తమ చరిత్ర ఇక కొత్త మలుపు తిరిగినట్లు భావించటం తొందరపాటు అవుతుంది.


తక్కిన మూడింటిలో జరిగిందేమిటి? ఆదిలాబాద్ ఏడు అసెంబ్లీ స్థానాలు కలిపి డిసెంబర్‌లో లక్షా 46 వేలు ఉండిన బీజేపీ ఓట్లు ఒకేసారి 3 లక్షల 77 వేలకు పెరుగ టం, కరీంనగర్ ఓట్లు, నిజామాబాద్ ఓట్లు కూడా ఇంతే గణనీయంగా కేవలం అయిదు మాసాల కాలంలో పెరుగటం ఒక పెద్ద అసాధారణ స్థితి కాదా? ఇది బీజేపీ క్షేత్రస్థాయి బలం పెరుగటం వల్ల జరిగిందనుకోవాలా లేక ఏవైనా తాత్కాలిక పరిస్థితుల వల్లనా? క్షేత్రస్థాయి బలం ఇంతగా రాకెట్ వేగంతో పెరిగినట్లు బీజేపీ నాయకత్వం చెప్పదలచుకుంటే అది ఏ విధంగా జరిగిందో వివరించాలి. లేదంటే తాత్కాలికంగా కొన్ని కలిసి వచ్చినట్లు అంగీకరించాలి. మనకు బయటి పరిశీలనకు కన్పిస్తున్నవి మాత్రం కొన్ని తాత్కాలిక అంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల, ఆయన జాతీయ నాయకత్వం పట్ల దేశమంతటి వలెనే ఇక్కడ కూడా ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో, యువకులలో, మధ్య తరగతిలో, అగ్రవర్ణాలలో కొంత ఆకర్షణ పెరుగ టం ఒకటి. బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించాలన్న కక్షతో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు బీజేపీకి ఓటు వేసినట్లు ఇక్కడ తెలంగాణలోనూ కరీంనగర్, నిజామాబాద్ వంటి చోట్ల కాంగ్రెస్ వారు కేసీఆర్ పట్ల కక్షతో బీజేపీకి ఓటు వేయటం రెండు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల కొన్ని వర్గాలలో ఉన్న కొన్ని అసంతృప్తులు మూడు. ఈ మూడింటిలో ఏది కూడా బీజేపీకి క్షేత్రస్థాయిలో నికరమైన బలానికి గాని, దాని పెరుగుదలకు గాని సంబంధించినది కాదు. డిసెంబర్ నుంచి ఇప్పటికి కేవలం ఐదు నెలలలో పెరిగేది అంతకన్నా కాదు.

పునాదులు లేకుండా గాలివాటపు విజయాలతో చరిత్రలు మలుపు తిరుగుతాయా? ఎన్టీఆర్, చంద్రబాబు కాలాలలో పొత్తుల ద్వారా, వాజపేయి హయాంలో ఢిల్లీ గాలుల వల్ల తెలంగాణలో కృత్రిమ వాతావరణాలు, భ్రమలు ఏర్పడటం మినహా క్షేత్రస్థాయి బలం నికరంగా పెరుగటం గాని, చరిత్ర మలుపు తిరగటం గాని జరుగనట్లు, కాంగ్రెస్ ఎత్తుగడలు, మోదీ గాలులతో చరిత్ర సృష్టి కాబోదు.


లోగడ వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలోనూ తెలంగాణ బీజేపీకి స్వయంగానో, పొత్తులతోనో బలం పెరిగినట్లు ఇప్పటివలెనే కనిపించింది. క్షేత్రస్థాయిలో నికరంగా అటువంటిదేమీ జరుగకపోయినా, ఆ తాత్కాలిక ఉపరితల స్థితినే వీరు శాశ్వతమైనట్లు నమ్మారు. కాని అది భ్రమ అయినట్లు త్వరలోనే తేలింది. అది నికరమైన క్షేత్రస్థాయి బలం అయి ఉన్నట్లయితే వాజపేయి అనంతర కాలంలోనూ కొనసాగేది. కాని అట్లా జరుగలేదు. ఇక్కడ గమనించవలసిన కీలకం ఒకటుంది. చరిత్ర పరిణామాల మధ్య ఒక్కోసారి కొన్ని అయాచితంగా, అనూహ్యంగా కలసివస్తాయి. వివేకవంతులైనవారు వాటిని ఉపయోగించుకొని, కష్టించి పనిచేసి, ఒక పునాదిని నిర్మించుకుంటారు. అట్లా కలసివచ్చినవి తర్వాత అంతర్థానమైనా ఆ పునాది నిలిచి ఉంటుంది. వాజపేయి కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడి బీజేపీ నాయకత్వం అటువంటి వివేకాన్ని, కష్టించే తత్వాన్ని చూపలేదు. కనుక పునాది అన్నది అంతకుముందు లేనట్లే ఈ కాలంలోనూ ఏర్పడలేదు. బీజేపీ నాయకత్వం తమ చరిత్ర కొత్త మలు పు తిరిగినట్లు భ్రమించటం మాత్రం ఆగలేదు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభావం విషయం కూడా అంతే కాదన్న హామీ ఏమైనా ఉందా? ఈ సందేహం ఎందుకంటే, మోదీ 2014-19 మధ్య పరిపాలించి ఏదో ఒక స్థాయిలో ఇదేవిధమైన వ్యక్తిత్వ ప్రభావాలు చూపి, మతతత్వ ధోరణులను వ్యాపింపజేసి, కొందరిని విలన్లుగా నిలబెట్టి, తన పరిపాలన ఎంతో సమర్థవంతంగా సాగుతున్నట్లు ప్రచారాలు సాగించిన అయిదేండ్లలో, తెలంగాణ బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడింది ఎంత? ఈ నాయకులంతా ఎందుకూ పనికిరానివారని జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విసుగు చెందేటంత.

అటువంటిది, 2014-19 మధ్య మలుపు తిరుగని చరిత్ర, 103 అసెంబ్లీ సీట్లలో డిపాజిట్లు పోగొట్టుకున్న చరిత్ర, ఇప్పుడు మోదీ రెండవ టర్మ్‌లో కొత్త మలుపు తిరుగగలదని నిజంగా భావించగలమా? అందువల్ల, నాలుగు లోక్‌సభ స్థానాలను గెలిచేందుకు ఉపయోగపడిన మూడు అంశాలలో ఒకటి అయిన మోదీ ఫ్యాక్టర్, నిన్నటి వాజపేయి ఫ్యాక్టర్ వలె పరిణమిస్తే ఆశ్చర్యపడవలసింది ఉండదు. ఇండియా షైనిం గ్ తర్వాత వాజపేయి వలె మోదీయే ఓడవచ్చు. మతతత్వ నినాదాలు, చర్యల ప్రభావం తగ్గవచ్చు, అటువంటిదే మరేవైనా జరుగవవచ్చు. అప్పుడు చరిత్ర మలుపు తిరిగేది ఏ విధంగా? రెండవది కాంగ్రెస్ వారి ఉడతాభక్తి సహాయం. ఈ రణతంత్రపు ఎత్తుగడ ఈ సారి వారికి ఉపయోగపడింది గనుక బీజేపీకి తాత్కాలికంగా కలసి వచ్చింది. మునుముందు కాంగ్రెస్ ఎత్తుగడలు మారవచ్చు. ఇతరుల ఎత్తుగడల ఆధారంగా బీజేపీ క్షేత్రస్థాయి బలం, పునాది నిర్మాణం అవుతాయా? పునాదులు లేకుండా గాలివాటపు విజయాలతో చరిత్రలు మలుపు తిరుగుతాయా? ఎన్టీఆర్, చంద్రబాబు కాలాలలో పొత్తుల ద్వారా, వాజపేయి హయాంలో ఢిల్లీ గాలుల వల్ల తెలంగాణలో కృత్రిమ వాతావరణాలు, భ్రమలు ఏర్పడటం మినహా క్షేత్రస్థాయి బలం నికరం గా పెరుగటం గాని, చరిత్ర మలుపు తిరగటం గాని జరుగనట్లు, కాంగ్రెస్ ఎత్తుగడలు, మోదీ గాలులతో చరిత్ర సృష్టి కాబోదు.
Ashok
మూడవది అయిన చివరి అంశం ప్రభుత్వం పట్ల గల కొన్ని అసంతృప్తులు. ఇవి చాలా ఉండి, విస్తృతంగా ఉండి, బలంగా ఉండి, తగినంత కొనసాగుతూ పోయినప్పుడే బీజేపీ, కాంగ్రెస్, లేదా ఇతర ప్రతిపక్షాలకు మౌలికమైన రీతిలో ఉపయోగపడుతాయి. ఇతరుల పునాది నిర్మాణాలకు, వారు చరిత్రను మలుపు తిప్పేందుకు పనికివస్తాయి. ప్రభు త్వం సమీక్షలు చేసుకొని దిద్దుబాటు చర్యలు చేపడితే ఈ అంశం అదృశ్యమవుతుంది. ఇది సహజమైన తర్కం. గతంలో అనేక చోట్ల జరిగిందే. దిద్దుబాట్లు ఒక నిరంతర ప్రక్రియ. ఇవన్నీ తెలంగాణ బీజేపీ నాయకులకు తెలియనివి కావు. అటువంటి స్థితిలో ఈ నాలుగుసీట్ల గెలుపును చూసి ఉత్సాహపడటం వరకు సరేగాని, అది మితి మీరటం, చరిత్ర మలు పు అనే పెద్ద మాటలు సరికాదు.

435

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ

Featured Articles