గమనించాల్సినవి మూడున్నాయి


Wed,May 22, 2019 11:36 PM

modi-bjp
ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేదని, అవి నిజమైన సందర్భాలూ కానివీ కూడా గతంలో ఉన్నాయనేది కూడా తెలిసిన విషయమే. అందువల్ల, కొద్ది గంటల్లో తెలియనున్న వాస్త వ ఫలితాల మాట అట్లుంచి, పైన పేర్కొన్న మూడు విషయాల గురించి చర్చించుదాం. నరేంద్ర మోదీ తిరిగి ప్రధానమంత్రి అయినట్లయితే, లేదా కాకపోయినట్లయితే దాని అర్థమేమిటి? బీజేపీకి 2014 కన్న ఎక్కు వ సీట్లు వచ్చినట్లయితే, లేదా తగ్గినట్లయితే దాని అర్థం ఏమిటి? బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు, లేదా పూర్తి వ్యతిరేకమో, పూర్తి అనుకూలమో కాకుండా ఉండే పార్టీల స్థానాలు ఎక్కువ అయితే, లేదా తగ్గితే అందుకు అర్థం ఏమిటి? ఇవన్నీ కలిసి మనదేశ రాజకీయాల గురించి, సామాజిక ధోరణుల గురించి ఏమి చెప్తాయి? 2014లో బీజేపీకి ఎన్డీయేతో సంబంధం లేకుండా కూడా పూర్తి ఆధిక్యత లభించింది. అది స్వయంగా బీజేపీ నాయకత్వంతో సహా అందరి నీ ఆశ్చర్యపరిచింది. అటువంటి సొంత మెజార్టీ బీజేపీకి మొదటిసారి కాగా, కాంగ్రెస్‌కు వచ్చి కూడా అప్పటికి కొన్ని దశాబ్దాలు గడిచింది. అట్లా ఎందుకు జరిగిందన్న విశ్లేషణలు చాలా సాగాయి. ఆ విజయం ఒక పార్టీగా బీజేపీదా లేక ఒక నాయకునిగా నరేంద్ర మోదీదా? రెండు కలగలిశాయనుకుంటే ఎవరి పాలు ఎంత అని కూడా పండితులు చర్చించారు.చివరికి స్థూలంగా కన్పించింది ఈ విధంగా ఉంది:-కాం గ్రెస్, ఇతర పార్టీలు, ఫ్రంట్‌లు వరుసగా విఫలమవుతుండగా అందువల్ల ఏర్పడిన ఒక పెద్ద శూన్యంలోకి బీజేపీ పార్టీ, మోదీ అనే నాయకుడు కలిసి అంతే పెద్ద ఎత్తున ఒక బిగ్ బ్యాంగ్ వలె ప్రవేశించారు.

నేడు వెలువడే ఎన్నికల ఫలితాలలో తేలే విషయాలు మూడున్నాయి. మోదీ తిరిగి అధికారానికి రాగలరా అన్నది అన్నింటికన్న ప్రధానమే కాగా, దానితో పాటు గమనించవలసిన మరొక రెండున్నాయి. బీజేపీ బలం 2014 కన్న పెరుగుతుందా తగ్గుతుందా అనేది వాటిలో ఒకటి కాగా, బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల బలం ఎట్లా ఉంటుందనేది రెండవది. ఈ మూడింటిని కలిపి చూసినప్పుడే దేశంలో రాజకీయ-సామాజిక ధోరణులు ఎట్లా సాగుతున్నాయనేది అర్థమవుతుంది. ఫలితాలు ప్రస్తుతానికి ముఖ్యం కాగా ఈ ధోరణులు భవిష్యత్తుకు ముఖ్యమవుతాయి.


ఆ బిగ్ బ్యాంగ్ సంభవించినప్పుడు గాని, ఇతర పార్టీలు కొన్ని దశాబ్దాల పాటు సృష్టించిన శూన్యం ఎంత పెద్దదో తెలిసిరాలేదు. అప్పటి నుంచి ఐదేండ్లు గడిచి 2019 ఎన్నికలు వచ్చేసరికి తేలవలసినవి ఏమిటి? అంతపెద్ద శూన్యంలోకి ప్రవేశించిన బీజేపీ ప్లస్ మోదీ ఆ శూన్యాన్ని తమ పరిపాలన ద్వారా, రాజకీయాల ద్వారా భర్తీ చేయగలిగారా లేదా అన్నది మొదటిది. భర్తీ చేసినట్లు ప్రజలు నమ్మితే తిరిగి బీజేపీని ఎన్నుకోవటమే గాక, ఆ భర్తీ స్థాయిని బట్టి సీట్ల పెరుగుదల, తగ్గుదల ఆధారపడి ఉంటాయి. ఇందులో ఒక మెలిక కూడా ఉంది. ఒకవేళ ఆ శూన్యాన్ని వీరు సరిగా భర్తీ చేయలేకపోయినా, తమకు అవకాశమిస్తే భర్తీ చేయగలమనే నమ్మకాన్ని కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రజలకు కలిగించలేకపోయినట్లయితే, అప్పుడు ఉన్నంతలో బీజేపీ-మోదీయే మెరుగని ప్రజలు తిరిగి వారినే ఎన్నుకోవచ్చు. ఈ రకరకాల పరిస్థితుల కు కూడా ఎవరికెన్ని సీట్లు వచ్చాయి, పెరిగినవి ఎన్ని, తగ్గినవి ఎన్ని అనేవి సూచికలు అవుతాయి. బీజేపీ మతతత్వ భావనలను రెచ్చగొట్టి లాభపడేందుకు చూడటమనే ప్రశ్న ఒకటుంది. అది సాధారణ రాజకీయానికి, పరిపాలనకు అతిరిక్తమైంది కావటం నిజమే. అదే సమయం లో ఏదో ఒక రూపంలో రాజకీయమే అవుతుంది. అందుకు సమాధానంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు చేయవలసిందేమిటి? తమ సెక్యులర్ భావజాలాలు, ఆచరణల ద్వారా మతతత్వ ధోరణులను నిరోధించి ప్రజలను తమవైపు తిప్పుకోగలగటం. తాము అధికారంలో గల రాష్ర్టాలలో పరిపాలనాపరమైన శూన్యాలు ఏర్పడకుండా, బీజేపీకి కొత్త అవకాశాలు లభించకుండా జాగ్రత్తపడటం. అంతే తప్ప, బీజేపీ కమ్యూనల్ రాజకీ యం చేసిందంటూ ఎలిబీలు వెతుకటం తమ వైఫల్యానికే సూచిక అవుతుంది.

మోదీ-బీజేపీల గెలుపును బట్టి, గెలుపు స్థాయిని బట్టి, లేదా ఓటమిని బట్టి, ఓటమి స్థాయిని బట్టి భారతదేశ రాజకీయ సామాజిక ధోరణులు గత ఐదేండ్లలో ఏ విధంగా పరివర్తన చెందుతూ వచ్చాయో అర్థమవుతుంది. ఇదే సూత్రీకరణ కాంగ్రెస్ తదితర పార్టీలకు వర్తిస్తుంది. రానున్నకాలంలో ఎవరేమి చేయాలనేది దానిపై ఆధారపడి ఉంటుంది. గత ఐదేండ్లలో తమతమ సాఫల్య వైఫల్యాలను అందరూ సమీక్షించుకొనవచ్చు.


ఆ విధంగా 2014-2019 మధ్య ఏమి జరిగింది? బీజేపీ-మోదీల పరిపాలనా జయాపజయాలు, రాజకీయ సాఫల్య వైఫల్యాలు, ఇతర పార్టీలూ ప్రభుత్వాల వైపు నుంచి ఇవన్నీ ఏ విధంగా సాగి దేశవ్యాప్తంగా ప్రజలను మెప్పించి ఉంటాయి? ఈ కొలబద్దలను బట్టి నేటి ఎన్నికల ఫలితాల అర్థాలను మనం గ్రహించవలసి ఉంటుంది. బీజేపీ-మోదీ ఓట్లు, సీట్లు పెరిగాయంటే, 2014 సమయానికి కాంగ్రెస్ తదితరులు సృష్టించిన శూన్యాన్ని వారు 2014లో కన్న ఇప్పుడు మరింత సమర్థవంతంగా భర్తీ చేశారన్న మాట. ఇట్లా భావించటం ఎందుకంటే, 2014లో బీజేపీ-మోదీలపై ప్రజలకు ఉండింది ఆశాభావం మాత్రమే. కానీ 2019 వచ్చేసరికి ప్రజలు వీరి ఐదేండ్ల పాలనను, రాజకీయాలను చూసి ఓటు వేస్తున్నారు. అప్పుడది బీజేపీ-మోదీలకు 2014కు మించిన విజయం కాగా, కాంగ్రెస్ తదితరులకు అంతకన్న పెద్ద పరాజయం అవుతుంది. ఒకవేళ బీజేపీ స్థానాలు మరింత పెరిగి, కాంగ్రెస్ తదితరులవి తగ్గితే ఇక చెప్పనక్కరలేదు. ఒకవేళ బీజేపీ బలం తగ్గినప్పటికీ అధికారంలోకి రాగలిగితే అది కూడా కాంగ్రెస్ తదితరుల వైఫల్యమే అవుతుంది. బీజేపీ స్థానంలోనికి రాగల అర్హతలు తమకు 2014-2019 మధ్య లభించినట్లు, వారు ప్రజలను మెప్పించలేకపోయారన్నమాట. తమకు 2014లో వచ్చిన సీట్లు కొన్ని ఈ సారి బీజేపీకి కోల్పోతే ఇక చెప్పనక్కరలేదు. బీజేపీ అధికారాన్ని కోల్పోయినా లేక సీట్లు గణనీయంగా తగ్గినా అదొ క కొత్త శూన్యం ఏర్పడుతున్నదనే దానికి సంకేతమవుతుంది. దాని అర్థం ఆ శూన్యంలోకి ప్రవేశించగల విశ్వాసాన్ని ప్రజల నుంచి కాంగ్రెస్ తదితరులు సంపాదించారని కాదు. అదొక యాదృచ్ఛికత మాత్రమే. అనగా ఒకవేళ బీజేపీ-మోదీ బలహీనపడినప్పటికీ, ఆ శూన్యంలోకి ప్రజల విశ్వాసం ద్వారా పాజిటివ్‌గా ప్రవేశించేందుకు కాంగ్రెస్ తదితరులు చేయవలసింది చాలా ఉంటుంది.
Ashok
మోదీ-బీజేపీల గెలుపును బట్టి, గెలుపు స్థాయిని బట్టి, లేదా ఓటమి ని బట్టి, ఓటమి స్థాయిని బట్టి భారతదేశ రాజకీయ సామాజిక ధోరణులు గత ఐదేండ్లలో ఏ విధంగా పరివర్తన చెందుతూ వచ్చాయో అర్థమవుతుంది. ఇదే సూత్రీకరణ కాంగ్రెస్ తదితర పార్టీలకు వర్తిస్తుంది. రానున్నకాలంలో ఎవరేమి చేయాలనేది దానిపై ఆధారపడి ఉంటుంది. గత ఐదేండ్లలో తమతమ సాఫల్య వైఫల్యాలను అందరూ సమీక్షించుకొనవచ్చు. ఎవరు ఏమిటని ఆయా రాష్ర్టాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాల ప్రజలు భావిస్తున్నారో దేశవ్యాప్తంగా ఇతర రాష్ర్టాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాల ప్రజలకు అర్థమవుతుంది కూడా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. బీజేపీ గెలుపోటములు, సీట్ల పెరుగుదల తగ్గుదలను ఉత్తరాది-దక్షిణాది అనే గీటురాయిని బట్టి చూడవలసిన అనివార్య స్థితి ఒకటుంది. ఇది అనేక చారిత్రక పరిస్థితుల నుంచి, వాటివల్ల ఉత్పన్నమైన వర్తమాన పరిస్థితుల నుంచి ఏర్పడినటువంటిది. ఈ కమ్యూనల్ విభజనలు ఉత్తరాన ఉన్నట్లు దక్షిణాన లేవు. కనుక బీజేపీ జయాపజయాలు, సీట్ల స్థితిని దక్షిణాది దృక్కోణం నుంచి విడిగా విశ్లేషించుకోవలసి ఉంటుంది.

446

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ