సెక్యులరిజపు కోట తెలంగాణ


Thu,May 16, 2019 11:09 PM

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురదృష్టవశాత్తు ఏదీ కన్పించటం లేదు. బీజేపీని, సంఘ్‌పరివార్‌ను, మతతత్వాన్ని వీరు అప్పడప్పుడు వేలెత్తి చూపటం లేదని కాదు. కాని అందు లో రాజకీయ దృష్టి, అధికార దృష్టి మినహా లోతైన సామాజిక దృష్టి ఎక్కడా ప్రతిఫలించదు. స్థూలంగా మొక్కుబడి విమర్శలు మాత్రం చేసి సంతృప్తి చెందుతారు. సీరియస్‌గా చెప్పాలంటే అది తమను తాము మోసగించుకుంటూ తెలంగాణ ప్రజలను మోసగించటమే. ఇటువంటి సీరియస్ వ్యాఖ్య చేయటం ఎందుకంటే, వారి మొక్కుబడి విమర్శల వైఖరి వల్ల సమాజంలో లౌకిక భావనలు వ్యాప్తి చెందటం కాని, తెలంగాణలో ఇప్పటికైతే లేని మతతత్వం మునుముందు కూడా తలెత్తకుండా ఉండటం గాని జరుగదు. మొక్కుబడి మించిన దృష్టి ఉన్నప్పుడే లౌకికత, సహజీవన దృష్టి క్షేత్రస్థాయిలో బలపడి, భవిష్యత్తులో మతతత్వ శక్తులకు విస్తరించే అవకాశం లభించకుండా ఉంటుంది. ఇదంతా కేవలం ఊహాగానాల మాట కాదు. ఒకసారి దేశంలో వివిధ రాష్ర్టాల చరిత్రను గమనించండి. అదేవిధంగా జాతీయ పరిస్థితిని. దేశం లో మతతత్వ శక్తులు స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్నాయి. తమ భావజాల విస్తరణకు ప్రయత్నించి కూడా కొన్ని దశాబ్దాల పాటు విఫలమయ్యాయి. చివరికి రెండు విధాలైన పరిస్థితుల్లో వాటికి అవకాశం లభించింది. ఒకటి, మధ్యేమార్గ ప్రభుత్వాలు, వామపక్ష ప్రభుత్వాలు పరిపాలనలో విఫలమై ప్రజలకు దూరమై ఆ విధంగా ఒక శూన్యం ఏర్పడటం. రెండవది, ఈ రెండు విధాలైన పార్టీలు కూడా తాము అధికారం లో ఉన్న సమయంలోనైనా ఇతరత్రానైనా ప్రజలలో లౌకిక భావవ్యాప్తి కి నిరంతర కృషి జరుపకపోవటం.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరొక వారం రోజుల్లో వెలువడనుండగా, దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతున్న విషయం ఒకటున్నది. బీజేపీ తిరిగి అధికారానికి వచ్చి మతతత్వ వ్యాప్తికి, సమాజ విభజనకు దోహదం కలుగుతుందా లేక, అధికారం అసలు రాకపోవటమో, వచ్చినా ఆ పార్టీ సీట్లు పెద్ద ఎత్తున తగ్గి మతతత్వ ధోరణికి పగ్గాలు పడటమో జరుగుతుందా అన్నదే ఆ చర్చ. దీనంతటి మధ్య మత సామరస్యతకు, సామాజిక సహజీవనానికి ఆశారేఖగా కనిపిస్తున్న ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ స్థితిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉన్నది.


దేశ విభజన నాటి హింసాత్మక ఘటనల వల్ల కొంత, అప్పటి నాయకత్వాలకు ఉండిన లౌకిక దృష్టి వల్ల కొంత, పరిపాలనా చర్యల వల్ల మరికొంత తొలి దశాబ్దాలలో ఇటువంటి శూన్యతలు ఏర్పడలేదు. ఆ తర్వాత, పైన పేర్కొన్న వైఫల్యాల వల్ల శూన్యాలు తలెత్తి అందులోకి మతతత్వాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ వ్యాపింపజేయగలిగాయి. ఈ వైఫల్యాలు చివరికి వామపక్షాల విషయం లో కనిపించినప్పుడు, మధ్యేమార్గ పార్టీల గురించి చెప్పనక్కరలేదు. ఇదే క్రమంలో మరొక తరగతి వైఫల్యం మాట కూడా చెప్పాలి. వారు మేధావులు, రచయితలు, కళాకారులు, సమాజంలో పెద్ద మనుషులుగా గుర్తిం పు ఉన్నవారు, మీడియా వారు. మతతత్వం, లౌకికత, సామాజిక సామరస్యతలకు సంబంధించి 1947 అనంతర కాలాన్ని రెండు దశలుగా విభజించి చూసినట్లయితే మనకు 1990ల వరకు ఒక దశ, ఆ పిమ్మట రెండవ దశ కన్పిస్తాయి. మనం పైన చెప్పుకున్న విశ్లేషణ వెలుగులో ఈ రెండు దశలను పోల్చిచూసుకోవచ్చు. వాజపేయి, నరేంద్రమోదీలు ప్రధానమంత్రులు అయిం ది గాని, ఇప్పుడు మోదీ రెండవసారి ప్రధాని అయితే కావచ్చుననిపిస్తున్నదిగాని, సగానికి పైగా రాష్ర్టాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటంగాని, బీజేపీని నిలువరించేందుకు తక్కిన అందరూ ఒకటి కాకతప్పదనే నిస్సహాయకర స్థితి ఏర్పడటం గాని, మరొకస్థాయిలో చాపకింద నీరు వలె దేశంలో మతతత్వ ధోరణి విస్తరిస్తూ భయపెట్టడం గాని, ఇవన్నీ ఈ రెం డవ దశ పరిణామాలే. తెలంగాణ పరిస్థితిని ఇటువంటి చారిత్రక నేపథ్యం నుంచి, దేశవ్యాప్త నేపథ్యం నుంచి చూడవలసి ఉంటుంది. ఇక్కడ మతతత్వ వ్యాప్తికి అంత గా సహకరించని పరిస్థితులు కొన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముం దు నుంచి ఉన్నాయి. నిజాం పాలనను, గణేశ ఉత్సవాలను, రజాకార్లను ప్రచార అంశాలుగా చేసుకుంటూ ఒక కాలంలో జనసంఘ్ కొంత పునాదిని సంపాదించినా అది త్వరలోనే బలహీనపడింది. ప్రజలతో, వారి సమస్యలతో నిమిత్తం లేకపోవటం, సరైన నాయకత్వ లేమి, మతం తప్ప మరొక అజెండా లేదన్నట్లు వ్యవహరించటం అందుకు కారణాలయ్యాయి.

మోదీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, అనేక రాష్ర్టాలలో అధికారానికి రాక ఒక పరిస్థితిని సృష్టించింది. ఇప్పుడు బీజేపీ, సంఘ్‌పరివార్‌లు తమ భావజాల వ్యాప్తికి గతంలో ఎన్నడూలేని అవకాశం లభించినట్లు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ ప్రస్తుత నాయకత్వాలకు ఈ విషయంలో గత నాయకత్వాలకు అనేక రెట్లు మించిన పట్టుదల, ఉధృతి ఉన్నాయి. తమ లక్ష్యాన్ని సాధించగలమనే ఆశలున్నాయి. అందుకోసం సామ-దాన-భేద దండోపాయాలను ఉపయోగించటంలో ఎటువంటి సంకోచాలు లేవు.


ఇతరత్రా కాంగ్రెస్, టీడీపీలు ఆయా దశల్లో బలంగా ఉండ టం బీజేపీకి ఆటంకమైంది. వాజపేయి ప్రభుత్వ కాలంలోనూ బీజేపీ ఇక్కడ బలపడే ఆస్కారం లభించలేదు. టీడీపీతో పొత్తు, వాజపేయి పాల న ఇక్కడి నాయకులకు వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడ్డాయి. మోదీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, అనేక రాష్ర్టాలలో అధికారానికి రాక ఒక పరిస్థితిని సృష్టించింది. ఇప్పుడు బీజేపీ, సంఘ్‌పరివార్‌లు తమ భావజాల వ్యాప్తికి గతంలో ఎన్నడూలేని అవకాశం లభించినట్లు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ ప్రస్తుత నాయకత్వాలకు ఈ విషయంలో గత నాయకత్వాలకు అనేక రెట్లు మించిన పట్టుదల, ఉధృతి ఉన్నాయి. తమ లక్ష్యాన్ని సాధించగలమనే ఆశలున్నాయి. అందుకోసం సామ-దాన-భేద దండోపాయాలను ఉపయోగించటంలో ఎటువంటి సంకోచాలు లేవు. ఆ తెగువను ఇప్పటికే చూపుతున్నారు. అందుకు తగినట్లు మధ్యేమార్గ పార్టీలు, వామపక్షాలు చెల్లాచెదురుగా మారాయి. అధికారం కోసం ఏదో ఒక దశలో బీజేపీతో స్నేహం చేయని మధ్యేమార్గ పార్టీలు ఏవైనా ఉన్నాయా అంటే వెతుక్కోవలసిందే. స్వయంగా వామపక్షాల ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు సైతం బీజేపీలో చేరుతున్నారు. కనుక, తెలంగాణ పరిస్థితిని 2014కు ముందు ఒక విధంగా, ఆ తర్వాత మరొక విధంగా చూడవలసి ఉంటుంది. ముందు పరిస్థితే ఇప్పటికీ యథాతథంగా కొనసాగుతుండి ఉంటే, కొందరు కాంగ్రెస్ నాయకులు ఇటీవల బీజేపీలో చేరినటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఈ నెల 23 నాటి ఫలితాల దరిమిలా తిరిగి మోదీ అధికారానికి వచ్చి, కాంగ్రెస్ బలం ఏదో కొద్దిగా తప్ప పెరుగకపోయినట్లయితే, కనీసం చెదురుముదురుగానైనా ఇటువంటి చేరికలు మరికొన్ని జరిగితే ఆశ్చర్యపడనక్కరలేదు. సొంత భావజాల వ్యాప్తి చేయలేక, కష్టించి పనిచేసి ప్రజల్లో పునాది పెంచుకోలేకుండా ఉన్న ఆ పార్టీ, ఇటువంటి అడ్డదారుల్లో బలపడే ఆలోచనలో ఉన్నది.

అది ఎంతవరకు నెరవేరగలదన్నది అట్లుంచి, పైన వివరించినట్లు బీజేపీ, సంఘ్‌పరివార్‌లు దేశవ్యాప్తంగా ఒక స్థితిని సృష్టించడం కాదనలేని వాస్తవం అయినప్పుడు, అది తెలంగాణ తీరాన్ని తాకకుండా ముందు నుంచే జాగ్రత్త పడటం అవసరం. అందుకోసం ఎవరేమీ చేయాలన్నది ఆలోచించవలసిన విషయం. అటువంటి ఆలోచనలు, చర్యలు ప్రస్తుతానికైతే ఏమీ కన్పించటం లేదు. రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా, మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు సాగుతున్నా, లౌకిక వాదాన్ని, సామాజిక సహజీవనాన్ని పెంపొందించే సీరియస్ కార్యక్రమాలు ఏవీ దురదృష్టవశాత్తు కన్పించటం లేదని పైన అనుకున్నది ఇందుకే. ఇప్పటికైతే బీజేపీ, సంఘ్ పరివార్‌లు, మతతత్వం తెలంగాణలో విస్తరించకుండా ఆపుతున్నవి మూడున్నాయి. ఒకటి, తెలంగాణ సమాజానికి మొదటి నుంచి గల సామాజిక, చారిత్రక, ఉద్యమాల నేపథ్యం. రెండు కేసీఆర్ నాయకత్వాన గల ప్రభుత్వం కాంగ్రెస్‌తో సహా దేశంలోని అనేక ఇతర మధ్యేమార్గ ప్రభుత్వాల వలె పరిపాలనా పరంగా విఫలం కాకుండా, అవి విఫలమై బీజేపీకి అవకాశం ఇచ్చినట్లు కాకుండా, సంక్షేమం-అభివృద్ధి సాధనల ద్వారా ప్రజలను సంతృప్తిపరుస్తుండటం. మూడు, తెలంగాణ బీజేపీ బలహీనతని పైన చెప్పుకున్నవి. ఇవి ఇట్లా కొనసాగుతున్నంత కాలం ఇక్కడ మతతత్వ శక్తులకు ప్రవేశం ఉండదన్నది నిజమే. లౌకికవాదం తెలంగాణలో ఒక సామాజిక సంప్రదాయం గా, సంస్కృతిగా మారింది. అదే సమయంలో అటువంటి భరోసాతో జాగ్రత్తలు తీసుకోకపోవ టం పెద్ద పొరపాటు అవుతుంది.
Ashok
ఇది అధికారపక్షానికో మరొకరికో సం బంధించిన విషయం కాదు. యావత్ తెలంగాణ సమాజానికి, దాని వర్తమానానికి, భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. అటువంటప్పుడు లౌకిక భావజాలవ్యాప్తిని, మతతత్వ భావజాల ప్రతిఘటనను, సామాజిక సహజీవన ప్రోద్బలాన్ని మధ్యేమార్గ పార్టీలు, వామపక్షాలు, వివిధ సామాజిక సంస్థలు, ఉద్యమ సంఘాలు, మేధావులు, రచయితలు, కళాకారులు, సమాజంలో పెద్ద మనుషులు అయినవారు, మీడియా వారు తమ కార్యకలాపాలలో భాగం చేసుకోవాలి. తెలంగాణను ఇప్పటివలెనే సెక్యులరిజపు కోటగా నిలబెట్టాలి.

276

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ