బీజేపీ స్వాహా చేసేనా?


Thu,May 2, 2019 01:36 AM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆశలు లేవు. అంతేకాదు. మరొకవైపు అధికారపక్షమైన టీఆర్‌ఎస్ నానాటికి బలపడుతున్నందున కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోగల అవకాశాలు కనుచూపు మేరలో లేవు. ఇటువంటి స్థితిలో కాంగ్రెస్ నాయకుల ైస్థెర్యం బాగా దెబ్బతినటం సహజం. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోవటం గాని, సీట్లు గణనీయంగా తగ్గటం గాని తన సుదీర్ఘ చరిత్రలో ఇది కొత్త కాదు. ఆ పార్టీకి తనదైన మధ్యే మార్గ సిద్ధాంతం ఒకటి ఉంది. అన్నివర్గాలను కలుపుకొని పోయే పద్ధతి కూడా స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నది. కాని ఈ లక్షణాలు క్రమంగా తగ్గుతూ ప్రజలకు దూరమైనా కొద్దీ, దానితోపాటు పరిపాలనా వైఫల్యాల వల్ల ఎన్నికల పరాజయాలు 1960 నుం చి మొదలయ్యాయి. ఆ విధంగా పరాజయాలు ఎదురైనా కొద్దీ కాంగ్రెస్ నాయకులకు అధికారం కోల్పోయే భయం ఎక్కువైంది. అధికారం పట్ల కాంక్ష, దానిని ఏ విధంగానైనా సంపాదించి కాపాడుకోవాలనే తపన పెరుగసాగాయి. ఒకవైపు ఈ క్రమం జరుగుతుండగా మరొకవైపు పార్టీ లో వెనుకటి తరాలు పోయి కొత్త తరాలు రావటం మొదలైంది. కొత్త తరాలకు పార్టీ సిద్ధాంతాల పట్ల తమ తండ్రులు, తాతలకు ఉన్నటువంటి నిబద్ధత లేదు. అధికారం, ధనార్జన పట్ల కోరికలు ఎక్కువ. ఇటువంటి పరిణామ క్రమం అంతా తెలంగాణ కాంగ్రెస్ నాయక శ్రేణులకు వర్తిస్తుంది. ఈ పరిస్థితుల వల్లనే కాంగ్రెస్ వారు ఇతర పార్టీలలోకి మారటం దేశవ్యాప్తంగా కన్పిస్తుంది. అదే సమయంలో అందులో గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది.

క్రమంగా బలహీనపడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ను బీజేపీ స్వాహా చేయగలదా? అసెంబ్లీ ఎన్నికలలో బాగా దెబ్బతిన్న ఆ పార్టీ నుంచి కొందరు బీజేపీలో చేరటం ఈ ఊహాగానాలకు తావిస్తున్నది. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలోనూ కాంగ్రెస్ బాగా నష్టపోయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పడినట్లయితే అప్పుడు కాంగ్రెస్ వాదులు బీజేపీ పట్ల ఆకర్షితులు కాగలరనే అంచనాలున్నాయి. తేలికగా కొట్టివేయగల మాట కాదిది. కాని బీజేపీకి ఎటువంటి పట్టు లభించని తెలంగాణ సమాజంలో ఎందరు అట్లా మారవచ్చుననేది జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం.


కాంగ్రెస్ బలహీనపడిన చోట, ఆ బలహీనత దీర్ఘకాలం పాటు కొనసాగినప్పుడు, ఒకవేళ పార్టీ మారినా, కాంగ్రెస్ సిద్ధాంతాలలో మౌలిక భిన్నత్వం లేని ఇతర మధ్యే మార్గ పార్టీలలోకి మారటం ఒక తరహాది. ఆ విధంగా కాంగ్రెస్ వాదులు సాధారణ మధ్యే మార్గ పార్టీలలోకి మారటం చాలానే జరిగిం ది. కనుక అది కాంగ్రెస్ నమ్మిన దానితో చూసినప్పుడు సైద్ధాంతిక వైరు ధ్యం కాలేదు. అక్కడి సమాజానికి కూడా అది వైరుధ్య స్థితిగా మారలే దు. అట్లా కాకుండా ఆ నాయకులు బీజేపీ తరహా పార్టీలలోకి మారటం మాత్రం వైరుధ్యమనాలి. కాంగ్రెస్-బీజేపీల మధ్య ఉండే సైద్ధాంతిక వైరుధ్యం ఒకటి కాగా, మొదటి నుంచి కాంగ్రెస్ తరహా మధ్యే మార్గ సిద్ధాంతాలకు అలవాటు పడిన సమాజానికి బీజేపీ తరహా మితవాదం తో ఏర్పడే వైరుధ్యం మరొకటి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం ఒకటున్నది. సిద్ధాంతాలు, సంప్రదాయాలకు సంబంధించి నాయకులు మారినంత త్వరగా సమాజాలు మారవు. నాయకులు తమ వ్యక్తిగత అధికారం, ధనార్జనల గురించి ఆలోచిస్తారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు మొత్తం సమాజపు మేలు ముఖ్యమనుకుంటారు. దాని అర్థం వారు కాంగ్రెస్ విఫలమైన చోట పరిపాలనాపరంగా బీజేపీ విజయవంతం కావచ్చునని భావించి మారబోరని కాదు. కాని నాయకుల మార్పులోని అధికార కాంక్షలకు, ఈ విధమైన సమాజపు భావనలకు కీలకమైన వ్యత్యాసం ఉంటుంది. బీజేపీ మతతత్వ ప్రభావాలు కూడా పరోక్షమైన రీతిలో పరిపాలనతో సంబంధం కలిగి ప్రజలను ప్రభావితం చేయవచ్చును. ఆ విధమైన ప్రభావాలలోకి వెళ్లిన ప్రజలు బీజేపీకి ఓటు చేయటం, తిరిగి వాటి నుంచి బయటపడటం జరిగిన సందర్భాలు మనం అనేకం చూశాము.

కాంగ్రెస్‌వాదులు, లేదా మరొక మధ్యే మార్గ పార్టీ అయిన టీడీపీ వాదు లు తమ పార్టీలకే కట్టుబడి కొనసాగవచ్చు, లేదా టీఆర్‌ఎస్ వంటి ఇం కొక మధ్యే మార్గ పార్టీలో చేరి తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనచూడవచ్చు. అంతే తప్ప, తెలంగాణ సమాజమన్నదే తన స్వభావాన్ని బీజేపీకి అనుగుణమైన రీతిలో మార్చుకోనంత వరకు, కాంగ్రెస్ వారు పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు సాహసించకపోవచ్చు. ఒకటీ అరా చేరికలు లెక్కించదగినవి కావు.


ఈ చర్చలోకి ఇంకా వెళ్లకుండా ప్రస్తుతానికి చెప్పుకోవలసింది ఏమంటే, అధికార దాహంతో నాయకులు మారినంత త్వరగా, ఉమ్మడి ప్రయోజనాల గురించి ఆలోచించే సమాజాలు మారవు. ఇప్పుడు ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితిపై దృష్టి పెడుదాము. తెలంగాణలో కమ్యూనిస్టులను అట్లుంచితే, ఇటీవలి కాలంలో ముఖ్యమైనవి ఉంటూ వచ్చిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్ అగ్రస్థానంలోకి వచ్చి తక్కిన రెండు వెనుకకు పోయాయి. ఇంకా ఇటీవల టీడీపీ దాదాపు అంతర్థాన స్థితికి చేరింది. సైద్ధాంతిక స్థాయిలో చూస్తే ఈ మూడు కూడా కొన్ని ప్రాధాన్యాల తేడా తో మౌలికంగా మధ్యే మార్గ పార్టీలు. మరొకవైపు తెలంగాణ సమాజానికి కూడా మౌలికంగా మధ్యే మార్గ స్వభావం ఉంది. ఉద్యమాలు, పోరాటల కారణంగా కొంత రాడికల్ లక్షణం ఉంటూనే మధ్యే మార్గ స్వభావం ఉంది. మతతత్వంతో, మితవాదంతో పోల్చితే మధ్యే మార్గమే ప్రగతిశీలమైనది కాగా, రాడికల్ లక్షణం గల మధ్యే మార్గం మరింత ప్రగతిశీలమైంది. ఈ విధంగా మనకు ఒకవైపు, అధికార కాంక్షతో తమ కాంగ్రెస్ మధ్యే మార్గ ప్రగతిశీల స్వభావాన్ని వదలుకొని బీజేపీ వైపు చూస్తున్న నాయకులు ఉన్నారు. మరొకవైపు, మధ్యేమార్గ/రాడికల్ మధ్యే మార్గ ప్రగతిశీల స్వభావం గల సమాజం ఉంది. అటువంటప్పుడు దేనిది పైచేయి కావచ్చుననేది ప్రశ్న. గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి ఇక్క డ. కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపుమారిన వారు ఇప్పటికి అతి కొద్దిమంది. గతంలో వాజపేయి గాలి ఉన్నప్పుడు గాని, 2014-19 మధ్య నరేంద్ర మోదీ ప్రభావం ఉన్నప్పుడు గాని, కాంగ్రెస్ బలహీనపడినా ఆ పార్టీ నుంచి బీజేపీ వైపు మళ్లిన వారు అతి తక్కువ.


కాంగ్రెస్‌లో అధికార కాంక్షతో వ్యవహరించే కొత్త తరాలు వచ్చినప్పటికీ ఇట్లా జరుగటానికి కారణం ఏమిటి? అది తెలంగాణ సమాజపు స్వభావంలో ఉన్న బలం. ఆ స్వభావమేమిటో పైన చెప్పుకున్నాము. అటువంటి స్థితి ఉన్నచోట కాంగ్రెస్‌వాదులు, లేదా మరొక మధ్యే మార్గ పార్టీ అయిన టీడీపీ వాదు లు తమ పార్టీలకే కట్టుబడి కొనసాగవచ్చు, లేదా టీఆర్‌ఎస్ వంటి ఇం కొక మధ్యే మార్గ పార్టీలో చేరి తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనచూడవచ్చు. అంతే తప్ప, తెలంగాణ సమాజమన్నదే తన స్వభావాన్ని బీజేపీకి అనుగుణమైన రీతిలో మార్చుకోనంత వరకు, కాంగ్రెస్ వారు పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు సాహసించకపోవచ్చు. ఒకటీ అరా చేరికలు లెక్కించదగినవి కావు. మజ్లిస్ పార్టీకి తాము తెలంగాణ రాష్ర్టాన్ని వ్యతిరేకించిన దశలో ఒక అంచనా ఉండేది. తెలంగాణ ఏర్పడినట్లయితే టీడీపీ బలహీనపడటం తథ్యమని, అప్పుడు ఆ పార్టీ నాయకుల చేరికతో బీజేపీ ప్రమాదకరంగా బలపడగలదని. ఈ అంచనాలు వేస్తూ మార్క్ మై వర్డ్ అన్న అసదుద్దీ న్ ఒవైసీ, తెలంగాణ సమాజ స్వభావం టీడీపీ నాయకులకు వేయగల పగ్గాల మాటను గ్రహించలేదు. టీడీపీ నేతలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది కూడా. కాని టీడీపీ వారు టీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ వైపు చూశారు తప్ప, నరేంద్ర మోదీ ప్రభావం సైతం వారిని బీజేపీ వైపు ఆకర్షించలేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల విషయంలోనూ ఇదే కన్పిస్తున్నది.
Ashok
కాంగ్రెస్ కార్యకర్తలు, దిగువ శ్రేణుల వారు తెలంగాణ సమాజానికి గల రాడికల్ మధ్యే మార్గ, లేదా ప్రగతిశీల స్వభావంలో తాము కూడా భాగస్వాములై ఉన్నారు. ఆ పార్టీ నాయకులపై అది గతంలో ప్రభావాన్ని చూపింది. మునుముందు కూడా చూపబోదు అనటానికి తగు కారణాలు ఏవీ కన్పించటం లేదు. కనుక, కొంత చమత్కరించి చెప్పాలంటే, కాంగ్రెస్‌ను, బీజేపీ నుంచి రక్షించగలది తెలంగాణ సమాజ స్వభావం.

468

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ

Featured Articles