ప్రభావం చూపని ప్రచారం


Thu,April 4, 2019 12:16 AM

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని చూసినప్పుడు కనిపిస్తున్నాయి. పోలింగ్ తేదీ ఏప్రిల్ 11 సమీపించినా కొద్దీ ఆ తీవ్రత పెరుగుతున్నది. అందుకు అంతే వివరంగా సమాధానాలు ఇస్తున్నవారెవరూ ఇక్కడలేరు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ ప్రభుత్వ బాధ్యులు, లేదా టీఆర్‌ఎస్ పార్టీ బాధ్యులు ఇస్తున్న సమాధానాలు ఎప్పుడైనా ఒకటి రెండు ముక్కలు తప్ప ఇక్కడి మీడియాలో వెలువడటం లేదు. సాధారణ సమయాలలోనే తెలంగాణ వార్తలను స్వల్పంగా ఇచ్చే ఇక్కడి మీడియా, ప్రస్తుతం ఒక యుద్ధ సమయం వంటిది కావటంతో మరీ తగ్గించి వేశాయి. అయినప్పటికీ గమనార్హమైనది ఒకటి జరుగుతున్నది. సాధారణ ప్రజలకు ఒకవైపు చంద్రబాబు పట్ల గల అపనమ్మకం, పవన్ కళ్యాణ్ ఆరోపణలు అతిశయోక్తులుగా, అపహాస్యపూరితంగా తోస్తుండటం, మరొకవైపు కేసీఆర్ పట్ల 2014 ప్రాంతంలో ఉండిన వ్యతిరేకత సుమారు 2016 నుంచి క్రమంగా తగ్గుతూ ఈ సరికి ఇంచుమించు కానరాకపోవటం వంటి పరిణామాల కారణంగా ప్రజలు తమంతట తాముగానే బాబు, పవన్‌ల ఆరోపణలకు విలువ ఇవ్వటం లేదు. మరొకవిధంగా చెప్పాలంటే వారు అట్లా విలువ ఇవ్వకపోవటమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు కౌంటర్ ఆర్గ్యమెంట్ వలె తయారైంది. అదే సమయంలో ఒక మాట చెప్పాలి. టీడీపీ, జనసేన అధినేతల ఆరోపణల ప్రభావం పూర్తిగా శూన్యమని కాదు. మధ్యతరగతి, ధనిక వర్గాలు, ఈ ఇద్దరు నాయకుల సామాజికవర్గాలకు చెందిన వారిలో కొద్దిమంది అది నిజమే అయి ఉంటుంది అనే అభిప్రాయంతో ఉన్నా రు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల ప్రభావం ఆంధ్రా ఓటర్లపై దాదాపు శూన్యంగా ఉంది. ఈ రచయిత గత కొన్నిరోజుల పాటు విజయవాడ కేంద్రం పరిసర గ్రామాలు, పట్టణాలలో స్వయంగా జరిపిన క్షేత్రస్థాయి పర్యటనతో పాటు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు టెలిఫోన్ ద్వారా చేసిన విచారణల దరిమిలా తేలుతున్న విషయమిది. పై ఇద్దరు నాయకుల విమర్శలు, ఆరోపణలకు ప్రజల్లో వివ్వసనీయత లభించకపోవటానికి పలు కారణాలున్నాయి.


తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నందున ఇక్కడి ఎన్నికల సందర్భంగా ఆయన పట్ల కేసీఆర్‌కు కోపం ఉంటుంది గదా అన్నది ఒక వ్యాఖ్య కాగా, చంద్రబాబు తెలివిగా కేసీఆర్ పేరును ప్రధాని మోదీ, వైఎస్సార్సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డిలతో జోడించి మాట్లాడటం ఒక ప్రాతిపదిక అవుతున్నది. ఇంత చేసినా పైన పేర్కొన్న మధ్య తరగతి, ధనిక వర్గాలు, ఆ రెండు సామాజిక వర్గాలలో ఈ విమర్శలను నమ్ముతున్నవారు చాలా తక్కువ. ఇక మొత్తం జనాభాలో వారి సంఖ్య లెక్కించనక్కరలేనంత తక్కువగా ఉంది. ఇందుకు తగిన కారణాలున్నాయి. అవి పట్టణాలు, గ్రామాలలో వివి ధ తరగతులకు చెందినవారు స్వయంగా చెప్తున్నవే. ప్రజలు అనేకానేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఓటు వేస్తారు. అవి ప్రభుత్వ పాలనకు, ఆయా పార్టీలతో పాటు అభ్యర్థుల మంచిచెడులకు, తమ వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు వృత్తి, ప్రాంతం, కులం-మతం ప్రయోజనాలకు సంబంధించినవి అయి ఉంటాయి. ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడి ఓటర్లు అందరూ (ఇక్కడ ఈసారి తటస్థ ఓటు అనేది సుమారు అయిదు శాతానికి తగ్గిపోయిందన్నది నిపుణుల అంచనా) ఆయా కారణాలతో ఎవరి అభిప్రాయానికి వారు వచ్చివేశారు. ఈ కారణాలన్నింటి మధ్య కేసీఆర్‌పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల విమర్శల స్థానం ఇసుక తట్టలో ఒక రేణువు వలె మాత్రమే కనిపిస్తున్నది. విమర్శలకు విలువ ఇవ్వని వారే అత్యధికులు కాగా, ఒకవేళ అది నిజమని భావించినా కేవలం అకారణంగా టీడీపీ, జనసేనలకు ఓటు వేయటమంటూ ఉంటదని, అట్టి విమర్శల్లో కొంత నిజం ఉంటుందని అన్నవారు సైతం కొట్టివేయటం గమనించదగ్గది. అనగా ఈ ప్రచారాల వెనుక గల ఉద్దేశాలు నెరవేర్చబోవటం లేదన్నమాట.

చంద్రబాబు తన విధానాలు, అభివృద్ధిని ప్రచారం చేసి ఓట్లు అడుగాలి తప్ప, అదెంత చెప్తున్నారో అందుకు సమానం అనదగ్గ స్థాయిలో కేసీఆర్‌ను విమర్శించటం ఏమిటన్నది ఆంధ్ర ప్రజలు అంతటా ఎత్తిచూపుతున్నమాట. ఆయన విమర్శలు ప్రతిపక్ష నాయకునికి, ప్రధానమంత్రికి పరిమితమైతే అర్థం చేసుకోవచ్చు. అది సహేతుకం అవుతుంది. కానీ కేసీఆర్‌ను వారితో సమానం చేసి మాట్లాడటం దేనికోసమన్నది వారికి అర్థం కాని విషయం. ఎప్పుడైనా ఒక విమర్శ చేసి ఉంటే సరిపోయేదేమో. వారి దృష్టిలో జగన్, మోదీలపై విమర్శలు ఉంటే ఉండవచ్చు కానీ, పైన చెప్పుకున్నట్లు, కేసీఆర్‌పై వ్యతిరేకత లేకుండా పోవటం 2016 నుంచే మొదలైంది. అంతకన్న గుర్తించదగింది ఏమంటే ఆయన పట్ల వివిధ కారణాల వల్ల అభిమానం గౌరవం పెరుగుతున్నాయి. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వచ్చినప్పుడు తాము గో బ్యాక్ నినాదాలు వినగలమనుకున్నామని, కానీ లక్షలాది మంది చప్పట్లు చరవటం చూసి ఆశ్యర్యానికి గురయ్యామని ఒక ముఖ్యుడు పదేపదే ప్రస్తావించాడు.


పైగా, పోలింగ్ రోజు సమీపించినా కొద్దీ బాబు, పవన్‌లు ఈ తరహా విమర్శలను తమకు ఇతరత్రా గల పరిస్థితుల నిస్పృహలో (ఒకరి మాటలో డెస్పరేషన్) ఇంకా తీవ్రం చేస్తున్నందువల్ల, సాధారణ ప్రజలకు వెగటు కలుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పుడు కొన్ని వివరాలు చూద్దాము. చంద్రబాబు తన విధానాలు, అభివృద్ధిని ప్రచారం చేసి ఓట్లు అడుగాలి తప్ప, అదెంత చెప్తున్నారో అందుకు సమానం అనదగ్గ స్థాయిలో కేసీఆర్‌ను విమర్శించటం ఏమిటన్నది ఆంధ్ర ప్రజలు అంతటా ఎత్తిచూపుతున్నమాట. ఆయన విమర్శలు ప్రతిపక్ష నాయకునికి, ప్రధానమంత్రికి పరిమితమైతే అర్థం చేసుకోవచ్చు. అది సహేతుకం అవుతుంది. కానీ కేసీఆర్‌ను వారితో సమానం చేసి మాట్లాడటం దేనికోసమన్నది వారికి అర్థం కాని విషయం. ఎప్పుడైనా ఒక విమర్శ చేసి ఉంటే సరిపోయేదేమో. వారి దృష్టిలో జగన్, మోదీలపై విమర్శలు ఉంటే ఉండవచ్చు కానీ, పైన చెప్పుకున్నట్లు, కేసీఆర్‌పై వ్యతిరేకత లేకుండా పోవటం 2016 నుంచే మొదలైంది. అంతకన్న గుర్తించదగింది ఏమంటే ఆయన పట్ల వివిధ కారణాల వల్ల అభిమానం గౌరవం పెరుగుతున్నాయి. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వచ్చినప్పుడు తాము గో బ్యాక్ నినాదాలు వినగలమనుకున్నామని, కానీ లక్షలాది మంది చప్పట్లు చరవటం చూసి ఆశ్యర్యానికి గురయ్యామని ఒక ముఖ్యుడు పదేపదే ప్రస్తావించాడు. అదిగాక పట్టణాల్లో, గ్రామాల్లో పలువురు పేర్కొన్నది ఒకటుంది. లక్షలాది మంది ఆంధ్రులు తెలంగాణలో ఉన్నారు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది అక్కడకు వెళ్లివస్తున్నారు. మరికొన్ని లక్షల మంది మధ్య ఫోన్ సంభాషణలు జరుగుతుంటాయి. ఈ సందర్భాలు అన్నింటిలో ఎక్కడ కూడా కేసీఆర్ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఆక్షేపణలు లేవు. పైగా ప్రశంసలు పెరుగుతున్నాయి.
Ashok
ఆయన పరిపాలన, వ్యవహరణ, ఆంధ్రులకు ఇస్తున్న పరిగణన విషయాలలో. ఇటువంటిదంతా సామాన్యుల స్వానుభవంలోని విషయం అయినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు పవన్‌లు ఎన్నికల కోసం అకస్మాత్తుగా ఈ తరహా ఆరోపణలు చేయటం వీరికి విలువ ఇవ్వదగినదిగా ఎంతమాత్రం తోచటం లేదు. వారి దృష్టిలో అవి అసలు ఇష్యూసే కావటం లేదు. చివరకు ప్రజలు దానిని అన్నీ రాజకీయాలు, ఇదొక రాజకీయం. ఎన్నికలు జరుగుతున్నాయి గదా మరి. అంటూ తేలికచేసి తోసివేస్తున్నా రు. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు జోక్యాన్ని కేసీఆర్ వ్యతిరేకించటం పనిచేసిన మాట నిజమని, అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యం వంటి పరిస్థితులు వేరని, కేసీఆర్‌పైన అదే తరహా వ్యతిరేకత రాగల పరిస్థితులు ఆంధ్రలో కనీసం 2016నుంచైతే లేవని ఈ రచయిత విజయవాడ పరిసరాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేకులతో జరిపిన సంభాషణల వల్ల అర్థమవుతున్నది. కనుక బాబు, పవన్‌ల ఇతర ఆయుధాల మాట ఏమోగానీ, ఈ ఆయుధం మాత్రం ప్రభావం చూపటం లేదు.

460

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ