టీడీపీ సహజ మరణం


Wed,March 27, 2019 11:44 PM

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ ఉద్యమం రాకతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మౌలికమైన వైరుధ్యాలు ఏర్పడ్డాయి. ఆ వైరుధ్యాలకు తార్కికమైన ముగింపు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ ఒక సహజ మరణానికి గురి కావటం. తమ 37 సంవత్సరాల చరిత్రలో వారు మొట్టమొదటిసారిగా ఒక ఎన్నికలో, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో, పోటీ చేయకుండా అధికారికంగా విరమించుకున్నారంటే అది సహజ మరణమే. ఇంకా ఒక ఎమ్మె ల్యే, కొద్దిమంది స్థానిక సంస్థల ప్రతినిధులు, ఒక పార్టీ వ్యవస్థ అంటూ మిగిలి ఉండటం సాంకేతికంగా సజీవంగా ఉండటమేనని ఆ పార్టీ నాయకత్వం భావించవచ్చు గాక. కానీ పార్టీలను సజీవంగా ఉంచేది రాజకీయమే తప్ప సాంకేతికతలు కాదు. ఆ విధంగా చూసినప్పుడు టీడీపీ నామమాత్రావ శిష్టత మరణ సమానమే అవుతుంది తప్ప సజీవత కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీది తప్పక ఒక చారిత్రకమైన పాత్ర. అంతవరకు ఏకపక్ష రాజకీయ వ్యవస్థగా ఉన్న స్థితిలో కాంగ్రెస్‌ను పడదోసి రాష్ట్రంలో రెండు పార్టీల వ్యవస్థ ఏర్పడింది టీడీపీ ఆవిర్భావంతోనే. అంతకుముందు వేర్వేరు దశలలో కమ్యూనిస్టులు, జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ వంటివి కాంగ్రెస్‌కు తాత్కాలిక సవాళ్లు కాగా, టీడీపీ ఒక దీర్ఘకాలిక సవాలుగా మారి స్థిరపడింది. ఇది ఒక మౌలిక మార్పు కాగా, తెలుగు సీమ కేంద్రంగా ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో పాటు ఒక వేదికగా మారటం రెం డవ మౌలిక మార్పు. మూడవది, ప్రజా సంక్షేమాన్ని ఎన్టీఆర్ తనకన్న ముందటి సుదీర్ఘ కాంగ్రెస్ పరిపాలనా కాలం కన్న ఎంతో ఎక్కువగా అజెండాపైకి తీసుకురావటం.

అంతర్గత వలస బాధితులు, ఇతరత్రా కూడా వెనుకబాటు తనానికి, ఆర్థిక సంస్కరణలకు బాధితులైన తెలంగాణ బడుగువర్గాలు చూస్తూ చూస్తుండగానే టీడీపీ వైపు నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లటంతో ఆ పునాదులు మరింత కదిలాయి. ఉద్యమం వైపు అన్నివర్గాలు మళ్లాయి. అదే సమయంలో ముఖ్యంగా టీడీపీ పెట్టనికోటగా ఉండిన బలహీనవర్గాలు, యువకులు మళ్లటం ఒక పెను మార్పు అయింది.


ఆ కాలమంతా ఎన్టీఆర్ పథకాలు, వాటి సత్ఫలితాలు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. నాల్గవది, అంతవరకు కాంగ్రెస్‌తో ఉండిన బడుగు బలహీన వర్గాలను ముఖ్యంగా బీసీలను ఎన్టీఆర్ తన వైపు బలంగా పెద్ద ఎత్తున ఆకర్షించి, పార్టీకి పునాదిగా మార్చుకోవటం. ఇక చివరగా రామారావు వ్యక్తిగతంగా జాతీయ ప్రతిపక్ష రాజకీయాల్లో నిర్వహించిన పాత్ర. ఆయ న కారణంగా తెలుగు వారికి జాతీయస్థాయిలో లభించిన ప్రశస్తి. ఈ అయిదింటిని కలిపి చూసినప్పుడు ఆ కాలమంతా టీడీపీది చారిత్రకమై న పాత్ర అంటున్నాము. ఈ అయిదు అంశాలను విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేస్తూ అకడమిక్ అధ్యయనాలు ఏవీ ఇంతవరకు వెలువడలేదు. ఆ పని జరిగినప్పుడు ఆ పాత్ర ప్రాముఖ్యం అర్థమవుతుంది. ఇదంతా ఇంతగా రాయటం ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాకతో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో టీడీపీకి వచ్చినటువంటి వైరుధ్యం ఎం త తీవ్రమైనదో అర్థం అయ్యేందుకు ఈ నేపథ్యం తప్పక తెలియాలి. ఆ వైరుధ్యానికి మూలం సీమాంధ్ర ధనిక వర్గాలు తెలంగాణను ఒక అంతర్గత వలసగా పరిగణించటంతో మొదలైంది. అసలు వారు ఉమ్మడి రాష్ర్టాన్ని కోరటంలోని ఉద్దేశమే తెలంగాణను అంతర్గత వలసగా మార్చుకోవటమనే బలమైన వాదన, అందుకు తగిన కొన్ని ఆధారాలు ఉండనే ఉన్నాయి. మొత్తమ్మీద అక్కడి వర్గాలకు ప్రతినిధి కావటం వల్ల అందువల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలతో ఏదో ఒక రోజున వైరుధ్యం తప్పసనిసరి అయింది. అక్కడి ప్రజల్లో స్వీయ చైతన్యం తలెత్తి ఆకాంక్షలు ముందుకురానంతవరకే ఎన్టీఆర్ కరిష్మా, సంక్షేమం, తెలుగువాడి ఆత్మగౌరవం వంటి నినాదాలు తెలంగాణ ప్రజలను భ్రమలలో ఉంచగలవు. అప్పుడు వైరుధ్యాలు ముందుకురావు. కానీ కాలక్రమంలో చైతన్యాలు పెరుగుతూ, ఆకాంక్షలు పెరిగేకొద్దీ పరిస్థితి మారింది.

అసెంబ్లీ పర్వం ముగిసి లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి, ఈ మూడు మాసాల కాలంలో టీడీపీ తక్కిన కూటమి పార్టీలన్నింటికీ కనీసం అంటరానిదిగా మారింది. కాంగ్రెస్ నుంచి పొత్తుమాట కాదుగదా అసలు సంప్రదింపులు లేకపోయాయి. తక్కినవారందరికి కూడా ఈ పార్టీ ఒక అక్ర మ సంబంధంగా తోచి భయపడ్డారు. పొత్తులు, సీట్లు అక్కరలేదు కనీసం మా మద్దతు అడగండి ఇస్తామన్న, ఆ అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా అందరికీ కలిసి ఒక జనరల్ అప్పీల్ మాత్రం చేశారు. నిజం చెప్పాలంటే ఇది ఒక పరాభవకరమైన స్థితి. కానీ చేయగలిగింది లేదు.


దీని ప్రభావంతో మొట్టమొదట బీటలువారటం మొదలైంది తెలుగుజాతి అనే భావన లేదా ప్రచారం. ఆ విధంగా, ఎన్టీఆర్ సృష్టించిన తన పార్టీ పునాదులు కదలసాగాయి. అంతర్గత వలస బాధితులు, ఇతరత్రా కూడా వెనుకబాటు తనానికి, ఆర్థిక సంస్కరణలకు బాధితులైన తెలంగాణ బడుగువర్గాలు చూస్తూ చూస్తుండగానే టీడీపీ వైపు నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లటంతో ఆ పునాదులు మరింత కదిలాయి. ఉద్యమం వైపు అన్నివర్గాలు మళ్లాయి. అదే సమయంలో ముఖ్యంగా టీడీపీ పెట్టనికోటగా ఉండిన బలహీనవర్గాలు, యువకులు మళ్లటం ఒక పెను మార్పు అయింది. ఈ మార్పుల మధ్య, తెలుగు జాతి భావన భంగపడింది. సీమాంధ్ర ధనికవర్గ తెలుగులు, తెలంగాణ తెలుగుల ప్రయోజనాలు వేర్వేరు అన్న ఆలోచన ఒకసారి రావటంతో, ఆ విధంగా జాతి భావన దెబ్బతినటంతో, టీడీపీకి ఆధారభూతమైన మరొక పునాది బలహీనపడటం మొదలైంది. ఇవన్నీ జరుగటమంటే ఇక సీమాంధ్ర ధనిక వర్గాల తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఆధారాలు లేకుండాపోవటన్నమాట. ప్రత్యేక రాష్ట్ర ఉద్య మం పెరిగినా కొద్దీ ఈ పరివర్తన స్పష్టమైన స్వరూప స్వభావాలను సంతరించుకుంది. అనగా, తర్వాతి కాలంలో టీడీపీ సహజ మరణానికి ఆ విధంగా బీజాలు పడటమన్న మాట. ఇది 2000వ సంవత్సరం తర్వాత కొద్దికాలానికి మొదలైంది. ఉద్యమం విస్తరించినా కొద్దీ ఆ బీజాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతూ, 2009లో కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన సమయానికి పరాకాష్టకు చేరింది. 2009-14 మధ్య జరిగింది చివరి అంకం. 2014లో రాష్ట్రం ఏర్పాటునుంచి ఆ పార్టీ ఇక తిరుగులేనివిధంగా మరణశయ్యపైకి చేరింది. వీటన్నిటి తర్వాత ఇక్కడ ఆ పార్టీ మనుగడకు ఆస్కారమే లేదు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మనం చూస్తున్నది టీడీపీ అంత్యక్రియల చివరి ఘట్టం.

2014 ఎన్నిక ల్లో వెనుకటి అవశేషపు అంశాలు మిగిలి ఉండినందున 15 స్థానాలు తెచ్చుకోగలిగారు. ఆ సభ్యులు తెలంగాణ కొత్త వాస్తవాలను గుర్తించి క్రమంగా పార్టీకి దూరమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాలుగేండ్ల కాలంలోనే వివిధ ఎన్నికలు, ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు, ఇతర పార్టీలతో కలగలసి పోటీచేసిన సందర్భాల్లో నూ ఉపయోగం లేని వైనం, చట్టసభల సభ్యులు కాని నాయకులతో పా టు దిగువ శ్రేణులవారు, కార్యకర్తలు పార్టీని వీడటం వంటివన్నీ మనం చూశాం. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీకి ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేకపోయింది. ఇతరులతో పొత్తు ద్వారా దక్కినవి కూడా కేవలం 15 కాగా అందుకు సమాధానపడవలసి వచ్చింది. పోటీ చేసినవాటిలో గెలిచివని రెండే కాగా, అవి కూడా ఖమ్మం వంటి ప్రత్యేక జిల్లా నుంచి కాగా, అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. ఈ దయనీయ స్థితి చాలదన్నట్లు, గెలిచిన ఇద్దరిలో ఒకరు పార్టీ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ పర్వం ముగిసి లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి, ఈ మూడు మాసాల కాలంలో టీడీపీ తక్కిన కూటమి పార్టీలన్నింటికీ కనీసం అంటరానిదిగా మారింది. కాంగ్రెస్ నుంచి పొత్తుమాట కాదుగదా అసలు సం ప్రదింపులు లేకపోయాయి. తక్కినవారందరికి కూడా ఈ పార్టీ ఒక అక్ర మ సంబంధంగా తోచి భయపడ్డారు. పొత్తులు, సీట్లు అక్కరలేదు కనీ సం మా మద్దతు అడగండి ఇస్తామన్న, ఆ అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా అందరికీ కలిసి ఒక జనరల్ అప్పీల్ మాత్రం చేశారు.
Ashok
నిజం చెప్పాలంటే ఇది ఒక పరాభవకరమైన స్థితి. కానీ చేయగలిగింది లేదు. తాము పోటీ చేయబోవటం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ సోమవారం నాడు ప్రకటించటంతో పార్టీకి రాజకీయ మరణ క్రతువు ముగిసింది. రమణ, ఆయన బృందం మాట తెలియదుగాని, ఈ పరిణామ క్రమానికి చివరన ఇదొక అనివార్యమైన సహజ మరణమన్నది మనందరికీ అర్థమవుతున్న విషయమే. ఇది సంతాపాలు అక్కరలేని మరణం.

708

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ

Featured Articles