పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు


Wed,March 20, 2019 11:02 PM

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతాలను బట్టి మారటం ఒకటైతే, సిద్ధాంతాల లో ఎక్కువ తేడాలు లేకున్నా పరిపాలన తీరును చూసి మారటం ఇంకొకటి అయితే, ఇటువంటివి ఏమీ లేకున్నా కృత్రిమ కారణాలను చూపు తూ స్వప్రయోజనాల కోసం మారటం మరొకటి. మరొకస్థాయిలో చూసినప్పుడు, ఎన్నికలకు ముందు, సరిగా ఎన్నికల సమయంలో, ఎన్నికలు ముగిసినాక అంటూ మూడు విధాలైన సమయాలలో ఆ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటినన్నింటిని జాగ్రత్తగా పరిశీలించిన మీదట గాని ఏది ఆరోగ్యకరం, ఏది కాదు? దేనివల్ల రాజకీయానికి, ప్రజాస్వామ్యానికి మేలు జరుగవచ్చు, దేనివల్ల కాదు? అనే ప్రశ్నలపై ఒక అభిప్రాయానికి రాలేము. ఇప్పుడు ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ మార్పిడులను చూద్దాము. అక్కడ గత అయిదేళ్లుగా టీడీపీ అధికారంలో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో బీజేపీ, కమ్యూనిస్టులు, జనసేన వంటి మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో జనసేన 2014 ఎన్నికల తర్వాత రంగంలోకి వచ్చిన కొత్త పార్టీ. మొత్తానికి వీటికి అన్నింటికి తమ తమ సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోలు ఉన్నాయి. ఏ పార్టీలో ఏ సామాజికవర్గానిది ఆధిపత్యమో అందరికీ తెలుసు. ఏ పార్టీ నాయకుని సామ ర్థ్యం, మంచిచెడులు ఏమిటో ఎవరికీ కొత్తగా చెప్పవలసింది లేదు. గతం లో పరిపాలించింది టీడీపీ అయినందున వారి పరిపాలన గురించి కూడా తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల వేళ అయినందున ఎవరు ఏ హామీ లు ఇస్తున్నారో చూస్తున్నదే.

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొకపార్టీకి మారటం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు రెండింటిలోనూ ఇటీవల మామూలుకన్న ఎక్కువగా జరుగుతున్నది. అట్లా మారుతున్న వారు అందుకు చెప్తున్న కారణాలు రెండుచోట్ల వేర్వేరుగా ఉంటున్నాయి. అందులో ఏవి సమంజసమైనవో, ఏవి కృత్రిమమైనవో గ్రహించటం నిష్పాక్షికులైన పరిశీలకులకు కష్టమైన విషయం కాదు. ఈ భిన్నమైన కారణాలు ఆ రెండు రాష్ర్టాలలోని మౌలిక రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయనాలి.


ఎవరు ఎదుటి వారిని ఏమని విమర్శిస్తున్నారన్నది సాధారణ రాజకీయం అయినందున దానిని ఈ జాబితాలోకి తీసుకురావలసిన అవసరం లేదు. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, పార్టీ మార్పిడులు జరుగుతున్నాయి. అవి ఎట్లానో గమనించండి. మారుతున్న వారిలో కొందరు కనీసం ఒక సాకుగానైనా ఏదో ఒక కారణం చెప్తుండగా, కొంద రు అసలు ఏమీ చెప్పటం లేదు. ఏదో ఒక కారణం చెప్పే దానిలో అది సాకు మాత్రమేనని స్పష్టంగా అర్థమవుతుంటుంది. అందుకు ఒక మోస్త రు విలువ అయినా కన్పించదు. వినేవారికి నవ్వు వస్తుంది లేదా వెగటు పుడుతుంది. అంతేతప్ప ఆ కారణం నిజం అయి ఉంటుందా అని ఒక క్షణం అయినా ఆలోచించాలనిపించదు. ఉదాహరణ ఒకరు ముఖ్యమం త్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా విషయంలో నిజాయితీ లేదంటారు. ఉత్తరాంధ్ర పట్లనో, రాయలసీమ పట్లనో ఏదో ఒక నియోజకవర్గం పట్ల, ప్రాజెక్టు పట్ల, సామాజికవర్గం పట్ల శ్రద్ధ లేదంటారు. చంద్రబాబుకు ఇవి ఉన్నాయని, అయినప్పటికీ వారు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన టం లేదు. ఇవన్నీ నిజమే అయి ఉండవచ్చు. కానీ పార్టీ ఇప్పుడు మారుతున్న వారికి ఇదంతా గత అయిదేళ్ల కాలంలో గుర్తురాలేదు. పార్టీలు మారే వారిలో కొందరు ఇటువంటి సాకులు వెతకటం ఎప్పుడై నా, ఎక్కడైనా ఉన్నదే. కానీ దానిస్థాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కన్పించినంతగా లోగడ కనీసం ఉమ్మడి రాష్ట్రంలో లేదు. దీనిఅర్థం చంద్రబాబు ఒక బాధితులు అవుతున్నారని కాదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమాజం వివిధ కారణాల వల్ల ఇంతగా పతనమైందనే మౌలి క మార్పును గుర్తించాలి. ఈ స్థితికి చంద్రబాబు ఎంత బాధితులో అంత దోషి కూడా. ఈ పతనానికి వీరంతా కారకులు. వీరంతా బాధితులు.

తెలంగాణ విషయానికి వస్తే, ఇక్కడ ఇతర పార్టీల నుంచి అధికారపక్షంలోకి మారుతున్న వారు అభివృద్ధి, సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలన, నాయకత్వ బలం అనే కారణాలను చూపెడుతున్నారు. ఇందులో ఒక విచిత్రం ఉంది. పార్టీలోకి మారే వారిలో ఎందరికి ఇవే నిజమైన కారణాలు అవుతున్నాయో తెలియదు గాని, అవి తోసిపుచ్చలేనివి మాత్రం కాదని గమనించాలి. గత అసెంబ్లీ తీర్పు ఇందుకు ధృవీకరణం. అది చాలదన్నట్లు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు అన్నీ గణనీయంగా బలహీనపడుతున్నాయి. తిరిగి కోలుకోగల సూచనలు కనుచూపు మేరలో లేవు.


టీడీపీ నుంచి ఇతర పార్టీలలోకి మారుతున్న వారు చెప్తున్న సాకులనే ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరుతున్న వారు కూడా చెప్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయమే ఆ పద్ధతిలో పతనమవుతుంది. పోనీ ఇదే మాటను కొంత మర్యాదపూర్వకంగా చెప్పాలంటే, ఆ విధంగా పరిణమిస్తున్నది. ఇంతకన్న గమనించదగ్గది అసలు ఏ కారణమూ చెప్పనివారు. కారణం చెప్పకుండా ఇవాళ ఒక పార్టీ, రేపు ఉదయం మరొక పార్టీ, రేపు సాయంత్రం ఇంకొకటి అనే పద్ధతిలో మారుతూ కొన్ని సందర్భాలలోనైతే రెండు రోజులలోనే తిరిగి వెనకటి పార్టీలోకి రావటం వంటి ఉదంతాలు ఈ పతన క్రమానికి పరాకాష్ట అనాలి. గమనించదగినదేమంటే ఈ తరహా పతనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బాగా కన్పిస్తున్నది. ఇది ఆయాపార్టీలు, నాయకులపై ఎంత ప్రతిఫలిస్తుందో అక్కడి సమాజంపై కూడా అంతే ప్రతిఫలిస్తుంది. అక్కడి సమాజం దీనిని ఆమోదిస్తుందనటం లేదు. కానీ తిరస్కరించి, శిక్షించి, సరిదిద్దే స్థాయికి వారి చైతన్యం ఎదుగుతున్నదా? రాజకీయం ఈ విధంగా పతనం కావటంలో నిజానికి ప్రజల ప్రత్యక్ష ప్రమేయం ఏమీ ఉండదు. ఇందుకు అంతిమం గా నిజమైన బాధితులు వారు, వారి సమాజమే. కానీ ఒకోసారి ప్రజల నిస్సహాయ పాత్ర ఇందులో ఉంటుంది. మన ప్రజాస్వామిక-సామాజిక వ్యవస్థలో గల పోషకులు-పోషితుల (ప్యాట్రన్-క్లయంట్) సంబంధాల కారణంగా సమాజంలోని గణనీయమైన వర్గం తమ ప్రయోజనాల కోసం ఈ తరహా పార్టీ మార్పులను, పతనాన్ని ఆమోదించటం అందుకు కారణం.

అందువల్లనే ఈ పరిణామ క్రమం ఆయా పార్టీల సిద్ధాంతాలను, పరిపాలనను, నాయకుల తీరును లెక్కించకుండా ఏ తరహా పార్టీ మార్పులకైనా చప్పట్లు చరుస్తుంది. జరుగుతున్న దానిలో మనకు నేరుగా కన్పిస్తున్నది పార్టీ మార్పులన్నీ కేవలం టికెట్ల చుట్టూ తిరగటం. ఇది లోగడ కూడా ఉన్నదే అయినా మరీ ఇంతగా లోగడ కన్పించలేదు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఒక తత్వవేత్త అన్నట్లు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజకీయ సంబంధాలన్నీ టికెట్ సంబంధాలు అన్నట్లుగా మారిపోయాయి. టికెట్‌లో ముడిపడి ఉన్నవి అధికారం, ధనం అయినందున ఆంధ్రప్రదేశ్‌లో సర్వస్వం సూటిగా, నగ్నం గా అధికార సాధ్యం సంబంధాలు, ధన సంపాదనా సంబంధాల చుట్టూ తిరుగుతున్నాయన్న మాట. అట్లా తిరగటం ఈ సరికి విపరీతంగా పెరిగిందన్న మాట. సాధారణంగానైనా ఇటువంటి స్థితి ధన సంస్కృతి, అధికార సంస్కృతి, ప్రాబల్య కుల సంస్కృతి మితిమీరిన సమాజాలలో ఏర్పడుతుంటుంది. అందుకుతోడు సిద్ధాంతాలు అనేవి బలహీనపడినప్పుడు ఇది ఇంకా ఎక్కువవుతుంది. అప్పుడు అధికారం, ధనమే సర్వస్వమై సాధారణ రాజకీయ విలువలు కూడా లేకుండాపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజం, రాజకీయాలు ఈ దశలోకి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రవేశించాయన్నది స్పష్టం. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఏర్పడిన తీవ్రమైన స్పర్ధ దీనిని మరింత పెంచుతున్నది. ఈ స్థితి నుంచి తిరుగుముఖం పట్టటం తేలిక కాదు. సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు.
Ashok
తెలంగాణ విషయానికి వస్తే, ఇక్కడ ఇతర పార్టీల నుంచి అధికారపక్షంలోకి మారుతున్న వారు అభివృద్ధి, సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలన, నాయకత్వ బలం అనే కారణాలను చూపెడుతున్నారు. ఇందులో ఒక విచిత్రం ఉంది. పార్టీలోకి మారే వారిలో ఎందరికి ఇవే నిజమైన కారణాలు అవుతున్నాయో తెలియదు గాని, అవి తోసిపుచ్చలేనివి మాత్రం కాదని గమనించాలి. గత అసెంబ్లీ తీర్పు ఇందుకు ధృవీకరణం. అది చాలదన్నట్లు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు అన్నీ గణనీయంగా బలహీనపడుతున్నాయి. తిరిగి కోలుకోగల సూచనలు కనుచూపు మేరలో లేవు. అటువంటప్పుడు, ఇతర పార్టీల నుంచి మారుతున్న సభ్యుల నియోజకవర్గాలకు ఒక భరోసా అంటూ ఏర్పడేది ఏవిధంగా? ప్రభు త్వం పక్షపాతం చూపటం లేదు నిజమే. అయినప్పటికీ ఆయా సభ్యుల కు, నాయకులకు, ప్రజలకు స్థిరమైన భరోసా అవసరం. కనుక వారు చెప్పే కారణాలను సాకులని, అధికార ఆకర్షణ అని రొటీన్ పద్ధతిలో వర్గీకరించలేము. తెలంగాణ సమాజానికి, రాజకీయానికి ఆంధ్ర తరహా సంస్కృతి ఇంకా రాలేదు కూడా.

664

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో

Published: Thu,March 7, 2019 12:52 AM

లోక్‌సభతో విజయం సంపూర్ణం

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించ

Featured Articles