లోక్‌సభతో విజయం సంపూర్ణం


Thu,March 7, 2019 12:52 AM

కొందరికి అమాయకమైన ఆలోచనలు కొన్ని ఉన్నా యి. అసెంబ్లీ ఎన్నికలలోనైతే స్థానిక అంశాల గురించి, లోక్‌సభ ఎన్నికలలోనైతే జాతీయ అం శాల గురించి ఆలోచించి ఆ ప్రకారం ఓటు చేయాలని. ఈ సూత్రీకరణను మౌలికంగా తప్పుపట్టడం లేదు. కానీ కేం ద్రం లో అధికారానికి వస్తున్న పార్టీలు, లేదా సంకీర్ణాల వ్యవహరణా ధోరణి వల్ల ఈ మంచి సూత్రానికి కాలం చెల్లిపోయింది. ఈ సూత్రం మనకు స్వాతంత్య్రం లభించిన తర్వాత తొలి దశలో, ముఖ్యంగా నెహ్రూకాలం లో, బాగానే పనిచేసింది. అప్పటి కేంద్ర నాయకత్వాలు రాజ్యాంగాన్ని, ఫెడరలిజాన్ని, రాష్ర్టాల హక్కులను గౌరవించేవి. రాష్ర్టాలలో ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయనే దానితో గాని, ఆ పార్టీలతో తమ సంబంధాలు ఎట్లా ఉన్నాయన్న ప్రశ్నతో గాని సంబంధం లేకుండా, రాష్ర్టాలకు రావలసినవి, అవసరమైనవి మంజూరు చేసేవారు. దేశం యావత్తూ అభివృ ద్ధి చెందాలన్నది వారి ఆలోచన. పక్షపాతాలు ఉండేవి కావు. ఇది నూటికి నూరు శాతం జరిగేదని అనటం లేదు. రాష్ర్టాల అధికారాలను తగ్గించి కేంద్రం అధికారాలను పెంచుకునే ధోరణి కొంత ఒకస్థాయిలో ఎల్లప్పు డూ ఉండేది. కాంగ్రెస్ ప్రాంత రాష్ర్టాల విషయమై కూడా ఇది జరిగేది కాదు. అందుకు యూనిటరిస్టు-ఫెడరలిస్టు శక్తుల సంఘర్షణ కారణం. ఏ శక్తుల వెనుక ఏయే ఆర్థిక-రాజకీయవర్గాలు ఉండేవి వగైరా వివరాల్లోకి ఇక్కడ పోలేము గాని, ప్రస్తుతానికి గుర్తించవలసింది ఏమంటే, ఫెడరలిస్టు సూత్రాలు ఆ దశలో తగినంత మేర సంతృప్తికరంగానే ఉండేవి.

ఇది తర్వాత క్రమంగా భంగపడటం మొదలైంది. భంగపడక ముం దుకాలంలోనైతే, అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక అంశాలు, లోక్‌సభ ఎన్నికల జాతీయ అంశాలు అనే సూత్రీకరణకు విలువ ఉండేది. కాని భంగపాటుతో ప్రాంతాల ప్రజలు, ప్రాంతీయ పార్టీలు కొత్తగా ఆలోచించి కొత్త సూత్రాలను తయారుచేసుకోవలసి వచ్చింది. ఈ రెండవ దశ ఇందిరాగాంధీ కాలంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ దశలో వచ్చిన స్థూలమైన మార్పులేమిటి? కేంద్రంలోని అధికార పార్టీలు తమ పరిపాలనా వైఫల్యాల వల్ల బలహీనపడ్డాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరించసాగాయి. నాయకత్వాలకు ఈ క్రమం లో రాజ్యాంగం పట్ల, ఫెడరలిజం పట్ల గౌరవం తగ్గాయి. ఆర్థికాభివృద్ధి, పరిపాలనలు కుంటుపడ్డాయి. మరొకస్థాయిలో ప్రాంతీయ ఫెడరల్ ఆర్థిక-సామాజిక-రాజకీయశక్తులు బలపడుతూ తమ అభివృద్ధి కోసం నిలబడటం ఎక్కువైంది. ద్రవిడ కజగం, అకాలీదళ్ రూపంలో స్వాతంత్య్ర కాలానికే ఉండిన ఈ తరహా ప్రాంతీయశక్తులు ఇప్పుడు కేంద్ర పార్టీల పరిపాలనా వైఫల్యాలు, ఫెడరలిస్ట్ వైఫల్యాల మూలంగా అనేక రెట్లు పెరిగాయి. కేంద్రంలోని బలహీన నాయకత్వాలు, వాటిని ఆసరా చేసుకున్న యూనిటరిస్టు ఆర్థిక-రాజకీయశక్తులూ ఈ ఘర్షణలో రాష్ర్టాల ఫెడరలిస్టు హక్కులను వీలైనంత హరించవేయటం మొదలుపెట్టాయి. రాష్ర్టాలలో అధికారానికి వచ్చే పార్టీలను కూడా నయాన, భయాన లొంగదీసుకోజూడటం, ఒక ప్రాంతీయ పార్టీకి మరొక ప్రాంతీయపార్టీతో కయ్యాలు పెట్టడం, చీల్చటం వంటివి చేయసాగాయి.

చివరికి తమ సొంత పార్టీలు అధికారంలో ఉన్నచోట్ల కూడా ఫెడరల్ ధర్మానికి విలువ ఇవ్వలేదు. తమ అధికారాలు, కేంద్రీకరణలు మినహా రాజ్యాంగ సూత్రాలకు, ఫెడరల్ నియమాలకు, దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి, సమతులన కు వారి దృష్టిలో ప్రాముఖ్యం లేకుండా పోవటం ఇందుకు కారణాలు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ఎటువంటి తేడా లేకుండాపోయింది. ఈ రెండు ప్రధాన పార్టీలు సొంత మెజార్టీలు లేనందున సంకీర్ణాలపై ఆధారపడక తప్పని దశ వచ్చిన తర్వాత సైతం, వారికి తమ మౌలికమైన వైఫల్యాలు ఏమిటో అర్థమై వివేకోదయం కలుగలేదు. పద్ధతులు మార్చుకోలేదు సరికదా మరింత వక్రీకరించాయి. తమ సంకీర్ణాలలో గల ప్రాంతీయపార్టీలు కోరినవి కొన్ని చేయటం, సంకీర్ణాలలో లేనివారి ప్రభుత్వాల పట్ల కక్షగట్టినట్లు వ్యవహరించటం సరికొత్త యుద్ధ సూత్రం, లేదా పతన సూత్రంగా మారింది. కావలసింది ఆ పార్టీలను చతురోపాయాల ప్రయోగంతో ఏదోవిధంగా దారికి తెచ్చుకోవటం. ఇటువంటి పరిణామాల వల్ల నిజమైన జాతీయ స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో, ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించే జాతీయపార్టీ అంటూ లేకుండాపోయింది. అటువంటప్పుడు, తమ బలం తాము అసెంబ్లీలో, పార్లమెంట్‌లో కూడా నిలబెట్టుకొని, తమ అభివద్ధి అవసరాల కోసం, హక్కు ల కోసం పట్టుదలగా ఉండటం మినహా రాష్ర్టాలకు మార్గంతరం లేకుండాపోయింది. ఆ స్థితిలో, అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక అంశాలపైన లోక్‌సభ ఎన్నికలకు జాతీయ అంశాలపైన ఓటర్లు ఆలోచించాలనే వాదనకు విలువ ఏమైనా మిగిలిందా? ప్రజలు ఎవరేమి బోధించనక్కరలేకుండా నే స్థానిక, జాతీయ ప్రయోజనాలు రెండింటి గురించి ఆలోచించగలరు. అప్పటి పరిస్థితులను బట్టి రెండింటినీ వేరుచేసిన ఉదాహరణాలున్నా యి.

కలిపిచూసిన ఉదాహరణలున్నాయి. అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు వారు తమంతట తామే ఆ పని ఎన్నోమార్లు చేశారు. అట్లా కానప్పుడు, వారు ఇక్కడా అక్కడా కూడా తమ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ఆలోచించుకోవటం అవసరం. పైగా, రాష్ట్ర ప్రయోజనాలన్నవి దేశ ప్రయోజనాలకు విరుద్ధమైనవి కావు గదా. విరుద్ధం అనిపించినప్పుడు జాగ్రత్త పడగల వివేచన ప్రజలు చేయగలరు. ప్రస్తుతానికి వస్తే, మరొక రెండు మాసాలలో జరుగనున్న లోకసభ ఎన్నికలకు సంబంధించి, బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ తెలంగాణలో బలహీనం గనుక తమ పాత వాదనను కొత్తగా ముందుకు తేజూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాల దృష్ట్యా టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే వేశారు గాని, లోకసభలో జాతీయంగా ఆలోచించి తమకు ఓటు వేయాలంటూ తెలంగాణ ఓటర్లను భ్రమ పెట్టజూస్తున్నారు. అంతేకాదు. ప్రధాని మోదీ ఘనమైన పాలన, ఇటీవలి పాప్యులిస్ట్ ఎన్నికల బడ్జెట్, పుల్వామా ఉదం తం కారణాలను ముందుకుతెస్తున్నారు. మరొకవైపు కాంగ్రెస్‌వారు మోదీ వైఫల్యాలను, మతతత్వాలను చూపుతున్నారు. ఈ రెండు విధాలైన వైఫల్యాల ప్యాకేజీలు వేర్వేరు రూపాల్లో ఇద్దరికీ ఉన్నాయి.
Ashok
ఒకస్థాయిలో అవెట్లున్నా, మనకు ప్రాథమికంగా కావలసింది ఫెడరల్ హక్కు లు, అభివృద్ధి. వాటిని ఒకవైపు బుద్ధిపూర్వకంగా చిరకాలంగా అణగదొక్కుతున్నవారు, అందువల్ల ఎదురుదెబ్బలు తగిలినా పద్ధతి మార్చుకొనని వారు, అసలు ఆ ఊసునే ఎత్తనివారు, ఎట్లాగయినా అధికారం సం పాదించటం కోసం జాతీయ అంశాలుగానే వాదనను నకిలీగా ముందు కు తేవటాన్ని చూసి తెలంగాణ ప్రజలు దారితప్పనక్కరలేదు. ఒకవేళ కాంగ్రెస్ అధికారానికి వచ్చి ఆ కూటమిలో చంద్రబాబు పార్టీ ఉన్నట్లయితే, ఆయన సాగించగల పన్నాగాలు ఏ విధంగా ఉండగలవో ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తుచేసుకోవాలి. జాతీయపార్టీలకు పూర్తి మెజార్టీలు లేని ఇంతకాలం రాజ్యం నడువలేదా? కనుక రెండుచోట్లా మెజార్టీలే మనకు శ్రీరామ రక్ష.

738

TANKASHALA ASHOK

Published: Thu,September 12, 2019 01:30 AM

‘విద్యాధికారం’ అక్కరలేదా?

ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక స్పష్టీకరణ అవసరం. ఇంత కూ రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ మాట మనకు కొంతకాలంగా తరచూ వినవస్తున్నది. దాన్ని ఉపయోగ

Published: Wed,August 21, 2019 10:54 PM

అంతిమ శ్రీరామరక్ష అభివృద్ధే

వర్తమానాన్ని గమనించినపుడు మనకు ఒకానొక భావ జాలం పైచేయి సాధిస్తున్నట్లు కన్పిస్తుంది. లోతుల్లోకి వెళ్లకుండా స్థూలదృష్టితో చూసినపుడు

Published: Thu,August 8, 2019 12:04 AM

ఒక అంతర్రాష్ట్ర ప్రేరణ

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టర్ అరుణ్ డోంగ్రే, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈ రచయితకు చెప్పి నదానిని బట్టి, వైన్‌గంగ-నల్‌గంగ

Published: Wed,July 31, 2019 10:47 PM

కొత్త ఆక్రమణలో ఫెడరలిజం

ఇటీవలి ఫెడరల్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను గమనించండి. మోదీ ప్రభుత్వం పోయిన నెల చివరి వారంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ని

Published: Thu,July 18, 2019 01:20 AM

ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో,

Published: Thu,July 11, 2019 12:14 AM

రైతుబంధు: చర్చకు రాని కోణం

ఈ కీలకమైన కోణాన్ని పరిశీలించే ముందు, రైతు బంధు గురించి కొందరు ఇప్పటికే సృష్టిస్తున్న అపోహల గురించి కొంత చెప్పుకోవాలి. ఆ పనిని వారు

Published: Thu,July 4, 2019 01:27 AM

తమిళనాట ఫెడరలిజం

ఇందుకు సంబంధించి మొదట అర్థం చేసుకోవలసింది తమిళనాడు ఫెడరలిస్టు మూలాలను. ఆ మూలాలు తమిళ జాతివాదంలో, ద్రవిడ జాతివాదంలో ఉన్నా యి. ఇటువం

Published: Thu,June 27, 2019 02:18 AM

జీవితపు మూలాల్లోకి కాళేశ్వరం

ప్రస్తుతం తెలంగాణలో పాక్షికంగానో, పూర్తిగానో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, నిజాంసాగర్, సింగూ రు వంటి నీటిపారుదల పథకాలున్నా

Published: Wed,June 12, 2019 11:01 PM

కాంగ్రెస్ ఖాళీలోకి వచ్చేదెవరు?

కాంగ్రెస్ ఖాళీ కావటమనే ప్రస్తావన ఎందుకు వస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నది. అది కూడా మ

Published: Wed,June 5, 2019 11:17 PM

శూన్య పరంపర ముగియునా?

ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది.

Published: Wed,May 29, 2019 11:47 PM

బీజేపీ అతివిశ్వాసం

తెలంగాణలో జనసంఘ్, బీజేపీలది 70 ఏండ్ల చరిత్ర. కాని ఆశక్తులు ఒంటరిగా పోటీచేసి గాని, ఇతరులతో పొత్తులు పెట్టుకొనిగాని ఎన్నడూ పిడికెడ

Published: Wed,May 22, 2019 11:36 PM

గమనించాల్సినవి మూడున్నాయి

ఈ నెల 19 నాటి ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెప్పాయో తెలిసిందే గనుక వాటిని పునశ్చరించనక్కరలేదు. అదేవిధంగా వాటిని యథాతథంగా విశ్వసించనక్కరలేద

Published: Thu,May 16, 2019 11:09 PM

సెక్యులరిజపు కోట తెలంగాణ

తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా మేధోపరంగా నిత్యం అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాని వాటి లో లౌకికవాదాన్ని పెంపొందింపజేసేది దురద

Published: Thu,May 2, 2019 01:36 AM

బీజేపీ స్వాహా చేసేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గటం కనిపిస్తున్నదే. అది 2014లో, 2018లో కూడా జరిగింది. 20 19 లోక్‌సభ ఫలితాలపై పెద్ద ఆ

Published: Thu,April 18, 2019 01:22 AM

సిబ్బంది ఆత్మశోధన అవసరం

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గా

Published: Thu,April 11, 2019 12:08 AM

ఫెడరలిజపు మహాయజ్ఞం

దేశంలో నేటి నుంచి మొదలై జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమైన కోణాలు రెండున్నాయి. తెలంగాణ ప్రజ లు ఆ రెండింటిని కూడా అర్థం చేసుకోవ

Published: Thu,April 4, 2019 12:16 AM

ప్రభావం చూపని ప్రచారం

కేసీఆర్‌పైన బాబు, పవన్‌ల ఆరోపణలు వివిధ పత్రికల ఎడిషన్లు, ఛానళ్లలో హైదరాబాద్ కన్న ఎంతో ఎక్కువగా, వివరంగా విజయవాడను కేంద్రం చేసుకొని

Published: Wed,March 27, 2019 11:44 PM

టీడీపీ సహజ మరణం

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలు

Published: Wed,March 20, 2019 11:02 PM

పార్టీ మార్పులు, భిన్న పరిస్థితులు

రాజకీయవాదులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో మారటం సర్వసాధారణంగా స్వప్రయోజనాల కోసం జరుగుతుంటుంది. ఆయా పార్టీలకు ఉండే మౌలిక సిద్ధాంతా

Published: Wed,March 13, 2019 11:14 PM

ఆత్మవిమర్శ లేని మోదీ, రాహుల్

మోదీ, రాహుల్ గాంధీ ఇరువురూ దేశానికి స్వాతంత్య్రం లభించి 50 ఏండ్లు గడిచిపోయిన తర్వాత, ద్వితీయ అర్ధశతాబ్ది కాలంలో నాయకత్వాల స్థానంలో