భూమిపుత్రుడు భూమన్న..


Tue,December 31, 2013 04:12 AM

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు. భూమికి మనుషులకు ఉన్న సంబంధం గురించి, పంపకం గురించి, దానికోసం జరిగిన పోరాటం గురిం చి పలువరించి, పరితపించి భూమి కోసమే భూమిక పోషించినావు. భూమయ్యను కన్న అమ్మ ఆయనను మనం భూమి ఉన్నంత వరకు యాది పెట్టుకోవాలని భూమయ్య అని పేరు పెట్టుకుంది. ఆయన భూమ్మీద చెట్టంత మనిషి కోసం పడుతున్న ఆరాటానికి వంటినిండా ఆకులు మొలిచినయ్.

ఆ ఆకుల్లో మనిషిని అడివంత పచ్చగా ఉంచాలన్న నిండు పత్రహరితమూ ఉన్న ది.ఎవరు పత్రహరితాన్ని హరించకూడదని ఆయన ఎర్రని మోదుగు పూవుగా వికసించడం అలవాటు చేసుకున్నాడు. ‘భూమికి పచ్చాని రంగేసినట్లు’ అని కవి యువక పల్లవి ఎత్తుకున్నదానికి కొనసాగింపుగా భూమికి పచ్చని ఆకుల రంగేసి,ఎర్రని ముద్ద మందారమై, నిగనిగలాడే మోదుగు పూవై పెద్దపల్లి అడవు ల నుంచి తెలంగాణ పెద్దన్నగా నిలిచి అమరుడయినాడు.


ఆయన చిగురుటాకును ప్రేమించాడు. పచ్చనాకు పరిడవిల్లే అడవిని ప్రేమించాడు. అడవిని ప్రేమించడమే కాదు గాఢంగా హత్తుకున్నాడు. అడవిని అడ్డగోలుగా నరికితే, అడవికింద భూమి ని, భూమి పొరల్ని పెల్లగించి, అడవి బిడ్డల్ని ఆగం చేస్తమంటే అడ్డంగా నిలబడాలన్నాడు. ఆ అడవిని దండకారణ్యమని అంటరని అందులో లక్షల చెట్లు, జీవజాలంతో పాటు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్న లక్షల గిరిజనులున్నారని ఏలిన ప్రభువులకు తెలియజెప్పాడు. పచ్చని అడవి కింద ధనరాసుల ఖనిజ సంపదను దోచుకు వెళుదామంటే అడవిబిడ్డ అడ్డుగా ఉన్నాడు కనుక వాళ్ళను, వాళ్ళతో దండుకట్టి ఎదురు నిలిచిన వాళ్ళపై దండయావూతకు రంగం సిద్ధ్దమయ్యిందని నిరసించాడు. గ్రీన్‌వూటెజ ర్‌పై గ్రీన్‌హంట్ అన్నందుకు అరుంధతీరాయ్‌లకు జైలు శిక్షపూందుకు అని ప్రశ్నించిన ఆకు ప్రేమికుడు, అడవి ప్రేమికుడు ఆకుల భూమన్న. అందుకే ఆయనపై పాలకుల కంటగింపు.

కాశీం ‘అవునునేను తెలంగాణ నేల మీద నుంచే మాట్లాడుతున్నా’ పుస్తకావిష్కరణలో తెలంగాణ అస్త్తిత్వం ప్రజాస్వామిక ఆకాంక్షల గురించి లోతుగా మాట్లాడి భౌగోళిక తెలంగాణ సాకారమవుతున్న సమయంలో బుద్ధిజీవులు, ధర్మయుద్దాన్ని కాంక్షించేవాళ్ళు ఏం చెయ్యాలో ఎన్నో మాట్లాడిన కొద్దిసేపటికే నగరం నడిబొడ్డున మున్సిపల్ కార్పోరేషన్ వాహనం డీకొని చనిపోయిన ఆకుల భూమన్నను ప్రభుత్వం హత్య చేసిందనే అనుమానాలున్నాయి. ఆరోపణకు బలమైన కారణాలున్నాయి.1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 2013 డిసెంబర్, 24 దాకా విస్తరించిన ఆకుల భూమన్న జీవితంలో ప్రతి మలుపు ప్రజలతో, ప్రజల పోరాటాలతో ముడి పెట్టుకున్నదే.ఆయన ఉపాధ్యాయుడిగా ఉద్యమకారుడిగా ఎప్పుడు విడదీయరాని అనుబం ధం కొనసాగించినందుకు ఏపీటీఎఫ్, డీటీ ఎఫ్ ను తీర్చిదిద్దినందుకు, తెలంగాణ జనసభకు, వరంగల్ డిక్లరేషన్‌కు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు నాయకత్వం వహించినందుకు చాలా కష్టా లే పడినారు.
1997ఆగస్టు 11న సూర్యాపేటలో ‘తెలంగాణ మహాసభ’ వేలాది మందితో ఏర్పడడానికి పునాది ఉత్సాహంలో భూమన్న, గద్దర్ కదం తొక్కిన భువనగిరి తెలంగాణ సభలు ప్రధాన కారణం. 1998కి ఆయన నాయకత్వంలో తెలంగాణ జనసభ ఏర్పడినాక మేము బహుజన తెలంగాణ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాలని ముందుకొచ్చింది.


జయశంకర్ సార్ మాతో సభల్లో పాల్గొన్నప్పుడు రెండు ఒకటే, భౌగోళిక తెలంగాణను సాధించి ప్రజాస్వామిక, బహుజన తెలంగాణ కోసం ఉద్యమించాలనేవారు.జయశంకర్ సార్ అనేవాడు.. ఠక్కర్ చేసే బద్మా ష్ గిరికి దొరకకుండా తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మలచాలని ఆ వెదుకులాటలో తెలంగాణ రాష్ర్ట సమితి దగ్గర, కేసీఆర్ దగ్గర జయశంకర్ ఆగింది, వెంట నడిచింది అందుకోసమే అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ వచ్చే మూల మలుపులో ఆకుల భూమన్న మీద ఈ ఠక్కర్ ప్రయోగం చేయరని ఈ టక్కరి సీమాంధ్ర పాలకులను ఎట్ల నమ్మాలి?


భూమన్నతో ఎక్కువ సాన్నిహిత్యం లేకపోయినా, ఎక్కడో హుస్నాబాద్ దగ్గర సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టించడానికి తప్పకుండా నువ్వు రావాలి అని పదే పదే ఫోన్ చేయించి, పిలిపించుకొని, తెలంగాణ కోసం పీడి యాక్ట్‌తో జైలుకు పోయిన నీవు, ఇగో సర్వాయి పాపన్న సర్వాయి గ్రామం సాక్షిగా బహుజనుల రాజ్యం కోసం, అధికారం కోసం తెలంగాణలో కొట్లాడితే ఎవ రి దారుల్లో వాళ్ళు కృషి చేసినా, తెలంగాణ ఇట్లుంటే కుదరదు. ఇవ్వాల కాకపోతే రేపు పది జిల్లాల తెలంగాణ వస్తది. అందులో పదిమందికి అక్కరకు వచ్చి, పది కులాలకు ప్రాతిని ధ్యం రావాలే కదా! అని వెన్ను తట్టిన ప్రేమ, కరస్పర్శ నిజంగానే నన్నే కాదు అందరిని వెం టాడాలే. భూమన్నను వెంట తీసుకొని భూమి కి పచ్చని రంగేసినట్టు అంటూ ఆకుపచ్చ తెలంగాణలోకి, ప్రజాస్వామిక బహుజన తెలంగాణలోకి తీసుకెళ్ళాలె. ఎర్రని ముగ్గుల్లో తెలంగాణ ముగ్గు పోసిన భూమన్నను ఆకులల్ల పెట్టి యాది చేసుకోవాల


వరంగల్ ఇంజనీరింగ్ విద్యార్థులు నిన్ననే ఆకుల నుంచి విద్యు త్ సృష్టించినారట. వెనుకట కూడా అడవిలో విద్యుత్ సృష్టించిం ది వరంగల్ విద్యార్థులే ఆకుల్లో మిల్లీవోల్ట్ సృష్టించిన ఈ తరం రేపు వేల మెగావాట్ల విద్యుత్ సృష్టించి జనం కళ్ళల్లో వెలుతురు నింపాలని ఆకుల భూమన్న ఆశపడుతున్నాడు.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

442

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles