ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!


Wed,May 1, 2013 01:41 PM

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, కిరణ్‌కుమార్‌డ్డి మోహరించిన బలాలతో మూడు సభలు దద్దరిల్లాయి. ఎన్టీఆర్‌ను అఖండ మెజారిటీతో గెలిపించిన హిందూపురంలో ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర 208 రోజులు సాగి, 2817 కిలోమీటర్ల దగ్గర విశాఖలో సమువూదతీరాన ముగిసింది. ఇన్ని రోజులు బాబు ప్రజల్ని కలుస్తూనే ఉన్నాడు. తన కోసమే యావత్ తెలుగునేల కలవరిస్తూ, పలవరిస్తున్నదని కలలు కంటూనే ‘చంవూదయాన్’ డైరీలో నోట్ చేసుకుంటున్నాడు.

తొందరలోనే ఆయన ప్రతి ముఖ్యమైన సమయంలో పాదయావూతను గుర్తుచేస్తూ ‘పైలాన్’ కట్టినట్లు, అక్షరాలు ఒక్క దగ్గర కూర్చి తెలుగుజాతిని ‘కట్టి’పడివేసే పుస్తకం తెస్తారేమో! కిరికిరి కిరణ్‌కుమార్‌డ్డిది అసమర్థ ప్రభుత్వమని ధ్వజమెత్తి తమ హయాంలో సంతకం పెట్టిన సెజ్ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నదని బాబు ధ్వజమెత్తిండ్రు. వైఎస్ రాజశేఖర్‌డ్డి ప్రజల్ని మభ్యపెట్టారని, అవినీతికి తెగబడ్డ వైఎస్ ప్రజావూదోహం, నమ్మకవూదోహం చేసిండని దుయ్యబట్టి, పిల్ల కాంగ్రెస్‌కు శాపనార్థాలు పెట్టారు. అంతటితో ఆగకుండా టీఆర్‌ఎస్ ఫాం హౌజ్ పార్టీ అని, కుంభకర్ణ నిద్రలో ఉందని బయ్యారం బొయ్యారాన్ని మొదట చెప్పింది తెలుగుదేశమే అని చెబుతూ, చివరగా పేదరికం లేని సమాజమే ఆయన జీవిత ఆశయమన్నారు. ‘మళ్లీ తెలుగుజాతికి పూర్వ వైభవం రావాలి, మీరు, మేము అందరం కలిసి ముందుకు వెళదాం’ జై జన్మభూమి, జై తెలుగుదేశం’తో ముగించారు.

ఆయనకు ఏడు నెలల పాదయావూతలో అమ్మ గుర్తుకు వచ్చిందట. తానే పెద్ద కొడుకు అయి ప్రజల్ని బాగుపరచాలని వెన్ను తట్టిందట. ఎవరి ప్రచారం వారిది. ఇందులో రాజకీయం చూసి వ్యాఖ్యానించాలని ఎవరూ కోరుకోరు. కానీ ఎందుకు చంద్రబాబు ఇన్ని వందల కిలోమీటర్ల తర్వాత కూడా విపరీత ‘రాజకీయ’ లౌక్యం ప్రదర్శిస్తున్నారు? జైలులో ఉన్న జగన్ ‘తెలుగుజాతి పూర్వ వైభవం’ కోసం రోజూ అమ్మతో, చెల్లెలితో తెలంగాణ బిడ్డలకు ఏమో చేయబోతున్నట్టు పాదయావూతల్లో, ప్రచారయావూతల్లో లక్షల హామీలు కుమ్మరిస్తారు?

తెలంగాణనే జైలుగా మార్చి ‘ఎన్‌కౌంటర్’తో ప్రతి తెలంగాణ ఇంటి పెద్దకొడుకును గద్దలా తన్నుకుపోయిన గతాన్ని మరచి, చంద్రబాబు ‘తెలుగుజాతి పూర్వ వైభవం’ కోసం తానే మీకోసం వస్తున్నా! అంటూ పలుకరించి అక్కున చేర్చుకొమ్మంటాడు. ఎక్కడి పాదయాత్ర ఇది? ఏమి సందేశాన్ని తెలంగాణకు, తెలుగు నేలకు మోసుకొచ్చిందని స్వాగతించి అక్కున చేర్చుకోవాలి? హిందూపురంలో మొదలయినప్పుడు మాట్లాడిన తీరు, తెలంగాణకు రాగానే మాట్లాడిన తీరు-కోస్తాకు చేరంగానే మాట్లాడిన తీరు ఏమి గుర్తుకు తెస్తున్నది? తెలంగాణ ఓట్లు అయిపోగానే నంద్యాలలో ‘హైదరాబాద్‌కు పోతే పాస్‌పోర్ట్ ’ తీసుకోవాల్సి వస్తుందేమోనని సీమాంధ్ర ఓటర్లను ప్రభావితం చేసిన వైఎస్‌ఆర్ మాటల తీరుకు పోలిక దొరకనంత అమాయకులు కారు తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు.

12వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్మూర్ సభలో కేసీఆర్ అన్నట్టు ఈ పాదయాత్ర మూడు అడుగులు ముందుకు, ముప్ఫై అడుగులు వెనక్కు కాదా? నడవడమొక్కటే మన పాదయావూతకు సార్దకత చేకూర్చదు. యాంత్రికమై నడక నాయకున్ని ‘రోబో’గా మార్చుతుంది తప్ప భవిష్యత్తు నడతకు విశ్వసనీయతను పెంచదు. చంద్ర బాబు 208 రోజుల నడక అంతా ‘ఆత్మస్తుతి’, పరనింద’ గానే కొనసాగింది. కానీ ఎక్కడైనా సెజ్ భూముల్లో నష్టపోయిన పోలేపల్లినో, కాకినాడ మత్స్యకారుల కారిడార్‌నో ఆత్మీయంగా పలుకరించి ‘అయ్యో! నా హయాంలో తొందరపడి ‘సంస్కరణ’ల పేర భూములు అప్పనంగా అప్పచెబితే ప్రజలకు ఎంత నష్టం జరిగింది. మళ్లీ నాకు అధికారం వస్తే ఇటువంటి తప్పుచేయను’ అనే పశ్చాత్తాపం ప్రకటించాడా? ప్రతిపక్షంగా ‘సెజ్’లకు వ్యతిరేకంగా నిజాయితీగా పోరాడుతానన్న చిత్తశుద్ధి ఆయనలో కనపడదుపతి ఇంటికి ఇప్పుడు పెద్ద కొడుకునయి, కడగండ్లు తీరుస్తానన్న చంద్రబాబుకు బషీర్‌బాగ్‌లో చనిపోయిన ముగ్గురు ‘పెద్ద కొడుకులు’ కనపడరు. మాయమైన వందలాది తెలంగాణ పెద్ద కొడుకులు కనపడరు. తాను తెలంగాణపై అవలంబించిన రెం డు కండ్ల సిద్ధాంతం ఫలితంగా, బలిదానాలకు ఒడికట్టిన వందల శ్రీకాంతచారి వంటి పెద్దకొడుకుల దుఃఖపరంపర కనపడదు.పాదయావూతలో అమ్మ గుర్తుకొచ్చింది. కానీ గుండెల రాయిపడిన తెలంగాణ పల్లె గుర్తుకు రాదు. పల్లె కంటికింది దుఃఖం గుర్తుకు రాదు.

కాంగ్రెస్‌తో సుదీర్ఘకాలం కలెబడి నిలబడింది ప్రతిపక్షంగా మేమే అనే చంద్రబాబు కిరణ్‌సర్కార్‌పై టీఆర్‌ఎస్ అవిశ్వాసం పెడితే ఎందుకు కలిసిరాలేదో జవాబు చెప్పడు, చెప్పలేడు. టీఆర్‌ఎస్ ఫాం హౌజ్ పార్టీ అన్న చంద్రబాబు హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమిని ఒకే సామాజిక వర్గానికి, రెండు జిల్లాల కోస్తాకు ఫాంహౌజ్‌లపేర, విల్లాల పేర అప్పజెప్పిన విషయం మాట్లాడలేడు. హెరి కాంపౌండంత కూడా లేని ఎక్కడో మారుమూల వ్యవసాయ క్షేత్రాన్ని టార్గెట్ చేసి అవాకులు చెవాకులు పేలుతాడు. నిత్యం కాంగ్రెస్‌తో మాటల యుద్ధం, రాత్రి సీమాంధ్ర ఐక్యతా రాగం ఆలపించే చంద్రబాబుకు నానా యాగీ చేయకుండా ఒకే పనిమీద ఉన్న టీఆర్‌ఎస్ కుంభకర్ణ నిద్రలో ఉన్నట్లే కనపడుతది.

వ్యవసాయ భూముపూందుకు దండుగ అని, టూరిజానికో, సెజ్‌లకో, ఫాం హౌజ్‌లకో అప్పజెప్పమన్న చంద్రబాబుకు ఇప్పుడు రెండంకెలు దాటని ఎకరాల భూమిపై ఇన్ని ‘సెటైర్‌లు’ ఎందకు వస్తున్నట్టు? చంద్రబాబు విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్‌కు వచ్చి అట్టహాసంగా ‘పాదయాత్ర’ గొప్పలు చెప్పుకున్నా హెలికాప్టర్ చంద్రబాబు కేరాఫ్ ఎప్పటికీ ‘గాలియావూత’నే కాని మరొకటి కాదు.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles