పాట గుండెను చీల్చే విఫలయత్నం


Fri,April 5, 2013 11:36 PM

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జంతర్ మంతర్‌ను వెదికి వెదికి పొదివి పట్టుకున్న పాట గద్దర్.‘నీ పాటనయి వస్తున్నానమ్మో! మా తెలంగాణ పల్లెలారా! ననుగన్న తల్లులారా!’ అని పాట మొదలుపెడి తే ఆయన వెంట డాక్యుమెంటరీ రీల్ తిరిగినట్లు చరిత్ర మన కండ్లముందు సాక్షాత్కరిస్తది.అన్నమయ్యను కన్న తెలుగు నేలమీదనే చీకటి నెట్టేసినప్పుడు వెన్నెలను పట్టిచ్చే అన్నలను, తమ్ములను, తాతలు, తం డ్రులు, అవ్వలను, అమ్మలను కీర్తించే ప్రజావాగ్గేయకారుడు-గద్దర్‌ను ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా! పోరు తెలంగాణమా!’ అంటూ రోజూ చూస్తున్నం.

తెలంగాణ కోసం ఆరు పదుల వయస్సు దాటినా గోదావరి పరివాహక ప్రాంతమంతా పాదయాత్ర చేసిండు. మానేరుకు మొక్కి, మట్టిని మూటగట్టుకొచ్చి, కాలం కత్తుల వంతెన దాటిన కరీంనగర్ పోరు చైతన్యాన్ని పది జిల్లాలకు పంచిండు. భద్రాద్రి రామున్ని, సీతమ్మను పోలవరం పేరుతో మునగబోతున్న వందల గిరిజన గూడాలను, రాముల వారి గుడిని కాపాడమని మొక్కుకున్నాడు. ఓరుగల్లు జంపన్న వాగు లో మునిగి, సమ్మక్క, సారక్కలకు తక్కెలకొద్ది బెల్లం సమర్పించకుకొని అమ్మా! తెలంగాణ అనుభవించిన గర్భశోకం చాలు, బలిదానాలు ఆపి తెలంగాణ ఆత్మగౌరవం నింపే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని మొక్కుకున్నడు. నల్లగొండలో ఫ్లోరిన్ విషపూరిత జలాలనుంచి విముక్తి కోసం పోరాడుతున్న వందల దుశ్చర్ల సత్యనారాయణలను,అంశుల స్వామిలను కలిసి ఉదయ సమువూదమంత విస్తృతంగా తెలంగాణ చెరువులు, కుంటలు నిండాలని కోరుకున్నడు. మెతుకు సీమ మెదక్‌లో మంజీరను ముద్దాడి తూఫ్రాన్‌లో కన్నుతెరిచి ఊపిరున్నదాక ‘మెతుకు కోసం,పోరాడే బడుగు జీవులకు వెంట ఉం టానన్నడు.

నిజామాబాద్,ఆదిలాబాద్ నిండా కలెతిరిగి, సింగరేణి బొగ్గు గనుల్ని కలె తిరిగి,అలసి, సొలసి, మధుమేహంతో, జనమోహంతో బాధపడుతూ, గుండెల్లో బుల్లెట్‌ను అట్లనే దాచుకొని మనతో నడుస్తున్నడు గద్దరన్న. ఆయన పాటను వెంటాడి గురిచూసి కాల్చి పారిపోయిన విఫలయత్నానికి నేటికి పదహారేండ్లు.
1997 ఏప్రిల్ 6న హైదరాబాద్‌లోని ఆయన నివాసం వెంకటాపూర్‌లో అందరూ చూస్తుండగానే ‘గుర్తుతెలియని వ్యక్తులు’ కాల్పులు జరిపి, గద్దర్ చాతిలోకి బుల్లెట్లు దించిండ్రు. వాళ్లని అప్పట్లో గ్రీన్ టైగర్స్, బ్లాక్ టైగర్స్ పేరు మీదనో.. పోలీసులు గుర్తించిండ్రు. వాళ్లు ఏరంగు పులులో వాళ్లే ప్రకటించుకున్నరు. కుప్పకూలిన గద్దర్‌ను నిమ్స్‌కు తరలిస్తే, అత్యవసర చికిత్స విభాగంలో ప్రతి ఉచ్వాసనిశ్వాసకు మధ్య జీవన్మరణ పోరాటాన్ని చూసి, ఆయన చేయి పట్టుకొని రోదించిన క్షణాలు గుర్తుకొస్తే ఒళ్లు గగుర్పొడుస్తున్నది.

1996లో భువనగిరిలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణగా జరిపిన తెలంగాణ సదస్సులో, సభలో ‘అమ్మా! తెలంగాణమా! ఆకలికేకల గానమా! అని పాటందుకున్న గద్దరన్న అప్పుడే ఏడాదికాకముందే బుల్లెట్‌లు దిగి మృత్యువుతో పోరాడుతున్నడు. గద్దరన్నతో గొంతు కలిపి ‘తాగబోతే నీళ్లులేక తుమ్మెదాలో! తడి గొంతులు ఆరిపోయే తుమ్మెదాలో! తడి గొంతులు ఆరిపోయే తమ్మెదాలో! నీళ్లు రాక బోరింగు-సప్పుడేమో టింగు. టింగు’ పాటతో నల్లగొండ నీటి కష్టాలను పాటతో వల్లెవేసిన చెల్లెలు బెల్లి లలిత తమ్మెదలు, సీతాకోక చిలుకలను ముక్కలు ముక్కలుగా నరికి నీళ్లులేని బావులలోకి విసిరేసిన కాలం గుర్తుకు వస్తున్నది.

అప్పుడే మారోజు వీరన్న గద్దర్ ఇంకా స్పృహలోకి రాకముందే తెలంగాణ గాయకుడే నాయకుడు కావాలని, సకల పీడిత ప్రజల ఉద్యమాలకు నాయకత్వం వహించాలని హైదరాబాద్ వీధుల్లో ఊరేగింపులు తీస్తున్న రోజులు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు వచ్చి ఈ ఘటనలను ఖండించినా, గద్దర్‌పై కాల్పులు జరిపిన ‘పులులు’ ఎవరో ఇప్పటికీ తేల్చలేకపోయారు పాలకులు. భువనగిరి సభతో ఉత్తేజం పొందినవాళ్లు స్పష్టత, ప్రజా సంఘాల దన్నుతో గద్దర్‌పై కాల్పులు జరిపిన నాలుగు నెలలకే సూర్యాపేటలో ‘తెలంగాణ మహాసభ’ ఏర్పాటు చేసిండ్రు. దానికి వ్యవస్థాపక కన్వీనర్‌గా నేను తెలంగాణ వ్యాప్తంగా వందల మీటింగ్‌లు పెట్టడం జరిగింది. తెలంగా ణ మహాసభ పోస్టర్‌తో భరత్‌భూషణ్ రూపొందించిన కాపు రాజయ్య తెలంగాణ బతుకు చిత్రాలతోపాటు పోరాట ప్రతీక అయిన గద్దర్ రాజ్యం ధ్వంసం చేసిన తెలంగాణ ముంగిలి, బుల్లెట్ గుర్తులు ఉంటా యి. తెలంగాణ మహాసభకు అన్నిరకాల మద్దతు తెలిపిన మారోజు వీరన్నను ఈ ప్రభుత్వం కాల్చిచంపింది. తర్వాత తెలంగాణ జనసభ, ఇంద్రాడ్డి తెలంగాణ ఉద్యమ వేదిక, తెలంగాణ ఐక్యవేదిక అనేకం ఉనికిలోకి వచ్చాయి.

అప్పటికి జయశంకర్‌సార్‌తో కలిసి నేను విపకాశ్, భరత్, నాట్యకళ ప్రభాకర్, మహేందర్, పోశెట్టి, వేణుగోపాల్ తదితరులం పదుల సంఖ్యలో తిరుగుతూనే ఉన్నాం. 2001కి ముందు ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నిలువునా చీలి తెలంగాణ అనుకూల శక్తులంతా కలిసి జలదృశ్యం వేదికగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశీస్సులతో 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. తెలంగాణలో అప్పటిదాక ఉన్న నిర్బంధ మేఘాలు నెమ్మదినెమ్మదిగా తగ్గుముఖంపట్టాయి. నిజంగా 2001 తెరాస బ్రీతింగ్ టైమ్ ఇవ్వకపోతే ఒక జాతి హననం (జీవోసైడ్) తీరు గుట్టలుగుట్టలుగా తెలంగాణ బిడ్డలు పద్మాక్షి గుట్టల్లో, చిలుకల గుట్టలో, వెన్నెల వంకల్లో, చేను చెలకల్లో మొక్కజొన్న కంకులు కరుసుకొని పట్టుకొని, పక్కన తెచ్చిపెట్టిన ఏకె-47, యస్‌యల్‌ఆర్‌లతో శవాలై కనిపిస్తుండిరి. ఇప్పుడు శ్రీలంకలో తమిళటైగర్‌లపై, ప్రజలపై జరిగిన హత్యాకాండకు ప్రపంచమం తా నివ్వెరపోతున్నది.కానీ అంతకంటే తక్కువేం కాకుండా సీమాంధ్ర పాలకులు గోస పుచ్చుకొని హత్యాకాండ జరిపిండ్రు తెలంగాణలో.
అందుకోసమే పదహారేండ్ల గద్దర్ బుల్లెట్ గాయాన్ని కెలకటమంటే ఇన్నిటిని తేనెతుట్టె కదిలిచ్చినట్లు కదిలియ్యాల. మది నిండా భారంగా గుచ్చుకుపోయిన ముళ్లకంచె చిక్కుముడి విప్పాలి.

గద్దరన్న భార్య విమలక్క తదితరులు హోం మినిష్టర్ దగ్గరకుపో యి ఏప్రిల్ 6 నిందితుపూవరో తేల్చాలని వినతి పత్రం ఇచ్చారు. సాంబశివుడిని హత్య చేసిన నిందుతుపూవరో తేల్చాలని ఆయ న తమ్ముడు కునపురి రాములు టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్‌తో కలిసి ఇదే హోంమంత్రి కి వినతిపత్రం ఈ మధ్యనే ఇచ్చాడు. సీన్ ఏమి రివర్స్ కాలేదు. పాటను, పోరాటబాటను వెంటాడడం తల్లికోడిని రాకాసిగద్ద వేటాడినంత సహజమని పాలకులు చెబుతూనే ఉన్నారు.మలిదశ తెలంగాణ ఉద్యమం 1996 నుంచే మొదలైందని అనుకున్నా, 2001లో తెరాసతో కొత్త పుంతలు తొక్కింది. 2009లో కేసీఆర్ నిరాహారదీక్షతో పతాక స్థాయి చేరిందని అనుకున్నా, సకల జనుల సమ్మె నలభైండు రోజుల మహత్తర తెలంగాణ ఐక్య సంఘటన ప్రజల శక్తిని చాటినా తెలంగాణ ఉద్యమంపై కక్షగట్టినవాళ్లు అరెస్టులు మొదలు హత్యా ప్రయత్నం దాకా ఉండవచ్చుని ఏప్రిల్ 6 హెచ్చరిస్తున్నది. రాజ్యం మెట్లెక్కి దోషుల్ని గుర్తించి, శిక్షించమని అడిగినా, అది ఒంటిరి పోరాటం కాకూడదు. దానికి ప్రజల్నే బాధ్యుల్ని చేసి నిందించే బదులు, రాజ్యాన్ని ప్రశ్నించి ఎగబడే ఒక మహాదండుగా మళ్లడం, దండయావూతగా సాగడం ఏప్రిల్ 6 నుంచి నేర్చుకోవాలి. ఉద్యమంలో ఉన్న అన్ని రకాల బలహీనతలను అధిగమించి ఐక్యమవ్వడమే ఈ పదహారేండ్ల పాట గుండె చీల్చే విఫలయత్న దాడికి ధీటైన జవాబు.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Featured Articles