సాంబశివుని ఉద్యమస్ఫూర్తి


Tue,March 26, 2013 12:05 AM


సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసినందుకు నాలుగు పదుల జీవితం నిండకుండానే నెత్తుటి మడుగై నేలరాలడం ఏడాదికేడాది మోదుగు పువ్వు విరగబూసి నేలరాలినంత సహజంగా తెలంగాణ గడ్డమీద కొనసాగుతున్నది. ఎక్కడో నల్లగొండజిల్లాలో మారుమూల దాసిడ్డి గూడెంలో గొల్లకురుమ ఇంటిలో పుట్టిన పాలబుగ్గల జీతగాడు కునపురి అయిలయ్య. ఈ నేలకు, ఈ ఆసాములకు ఏండ్లనుంచి చేసిన వెట్టి, కుదిర్చిన జీతం చాలు అనుకొని అక్షరాలు నేర్చి, లోకాన్నీ ప్రపంచాన్ని అధ్యయనం చేసి పోరు జెండా పట్టాడు. మూసి పరివాహక ప్రాంతం దాటి రాచకొండ గుట్టల్ని దాటి దుర్గమారణ్య నల్లమలకు చేరి ప్రవహిస్తున్న కృష్ణానది ఆవలి గట్టున ఉద్యమంలో అమరుడైన సాంబశివుడిని ఆవాహన చేసి పాలమూరును కలెతిరిగి మావోయిస్టు అగ్రనేత సాంబశివుడిగా ఎదిగాడు. ఏకారణం చేతనో.. సాయుధపోరాట మార్గాన్ని వీడినా...ఆచరణలో ఉద్యమ పుత్రుడిగానే.. కొనసాగాడు. ఫలితంగానే చర్లప ల్లి జైలులో ఏడాది పైబడి నిర్బంధ జీవితం గడిపి తెలంగాణ ఉద్యమంలో తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు కంకణబద్దుడయ్యాడు.

అజ్ఞాత జీవితంలో మావోయిస్టు పార్టీ నేతగా తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరును మరింత విస్తృత పరుచుకుని తెలంగాణ ఉద్యమాన్ని పోరాటపథంలో నడుపవలసిన అవసరాన్ని గుర్తించి తెలంగాణ ఉద్యమంతో మమేకమయ్యాడు. సాంబశివుడు టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత మిలియన్ మార్చ్ లంకె వేయబడి మిలిటెంట్ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అయ్యింది. సీమాంధ్ర సర్కార్ నిర్బంధ కోరల మధ్య, ముళ్ల కంచెల ను ఛేదించుకుని తెలంగాణ బిడ్డల ధర్మాక్షిగహం కట్టలు తెగి కదం తొక్కి భారతదేశ చరివూతలోనే ఒక శాశ్వత మిలియన్ మెగావాట్ల ఉజ్వల ఘట్టంగా మిగిలిపోయింది. ఇలాంటి మిలిటెంట్ పోరాటాల కొనసాగింపులో భాగంగానే.. సడక్‌బంద్ సాంబశివుడి రెండవ వర్థంతి ముందు అదే పాలమూరు నుంచి అలంపూర్ వద్ద మొదలై హైదరాబాద్‌కు విస్తరించింది. ఆ అలంపూర్ దగ్గరే జాతీయ రహదారిపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఉద్యోగ జేఏసీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ జితేందర్‌డ్డిలను నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి పాలమూరు జైలుకు పంపింది. పోరాట కొనసాగింపుకు ఆనవాళ్లుగా.. రెండేళ్ల కిందట వలిగొండ మండలం గోకారం స్టేజీ వద్ద సాంబశివుడు హత్యగావించబడిన చోటనే సాంబశివుడి స్థూపాన్ని కోదండరాం ఆవిష్కరించబోతున్నారు.‘మీ దోపిడి కొట్టాలకు నిప్పులంటుకొంటున్నయ్,మా ఊపిరి తిత్తులతో ఊది ఊది మండిస్తం’ అని చెరబండరాజు పాడిన పాట తెలంగాణ యాంగ్రీ యెంగ్ మెన్‌కు మూడు దశాబ్దాల క్రితం మార్మోగిన పాటయితే, ఇప్పుడది తెలంగాణ ఉద్యమానికి అన్వయించబడి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో మార్మోగుతున్నది. పల్లెలను మేల్కొలిపి మిలియన్ మార్చ్‌లను, సాగర హారాలను, సడక్ బంద్‌లను ఆవిష్కరిస్తున్నది. కాకుంటే.. మొన్న మిలియన్ మార్చ్‌లో ఉన్న ఐలన్న ఇవ్వాల లేడు. రాజ్యానికి తలవంచని ధిక్కార స్వరం తమ స్వతంత్ర రాష్ట్ర ఆకాంక్ష కోసం మానుకోటను వొరుసుకుని, నకిరేకల్‌ను వొంపుకుని మారో జాతీయ రహదారి దిగ్బంధానికి దారులు వేసుకుంటున్నది.

నియంతలే చరివూతను శాసిస్తే చరిత్ర ఇట్లా ఉండేది కాదు. కన్నుగానని అహంభావమే రాజమువూదగా ఆమోదించబడుతూ ఉంటే చరివూతలో ఇన్ని ధిక్కార పాద ముద్రలు ఉండేవి కావు. నాటి కౌరవ నిండు సభ మొదలు నేటి అసెంబ్లీ సాక్షిగా ఇకనుంచి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వం ఏం చేస్తరో చేసుకోండన్న దాకా రాజ్యధికార దురహాంకారం కళ్లకు కడుతూనే ఉన్నది. అయి తే.. నాటి నుంచీ నేటి దాకా ఈ దురహాంకారాన్ని నాటి ఐదుగురి వలెనే.., నేడు తెలంగాణ ప్రజలు ధర్మపోరా టం చేస్తున్నరు. ఇలాంటి ధర్మపోరాటాలను దుర్మార్గ కౌరవపక్షంగా ఎవన్ని కుట్రలు పన్నినా.. ధర్మపోరాటం నాడూ గెలిచింది. నేడు కూడా సీమాం ధ్ర సర్కారు ఎన్ని కుట్రలు, కుహకాలు పన్నినా తెలంగాణ ధర్మపోరాటాన్ని అణచివేయలేరు. ఓడించలేరు. ఈ నేపథ్యంలోనే న్యాయం కోసం నిలబడి ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు ఎప్పుడూ ప్రజల కు స్ఫూర్తిగా ఉంటూనే ఉంటాయి. సాంబశివుని త్యాగం తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకంగా ఉంటూనే ఉంటుంది. ప్రవాహం జీవన సహవాసంగా ఎంచుకున్న వాడు సాంబశివుడు. ఎప్పుడూ జనం మధ్య ఉంటూ.. జనం ఆకాంక్షల కోసం తపించాడు. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాట ఒక ముగింపుకు రావాలని కోరుకున్నాడు. రాజ్యాంగంబద్ధంగా సంక్రమించిన న్యాయమైన హక్కుగా తెలంగాణ ఏర్పడాలని ఆశించాడు. దానికి రాజ్యాంగబద్ధంగా పోరాటాలకు శ్రీకారం చుట్టాడు. ప్రజలను కదిలించడు. ఊరూరా సబ్బండవర్గాలను సంఘటితం చేశాడు. రాబోయే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం పునాదిగా సమ న్యాయం దక్కాలని కోరుకున్నాడు. ఇది దోపిడీ పాలక పక్షాలకు కంటగింపు అయ్యింది. ఒక హెచ్చరికగా సాంబశివుడి హత్య జరిగింది. అందుకే సాంబశివుడి హత్య ను ఒక ఘటనగా చూడవద్దు. వ్యక్తిగత, స్వార్థ పూరిత ల్యాండ్ మాఫియా పరస్పర ఘటనల్లో చంపబడినట్లు పెదవి విరవొద్దు. అలా చేయడం, చూడటం సీమాంధ్ర పాలకుల కుట్రలను భుజాన మోయడానికి సిద్ధమైనట్లుగా భావించాలి. సాంబశివుడు చనిపోయి రెండేళ్లు అయినా ఇప్పటికీ అసలు నింధితుల్ని వదిలి డమ్మీలను ఎందుకు ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వం? నిఖార్సయిన మిలిటెంట్ తెలంగాణ ఉద్య మ నేతలకు ఒక హెచ్చరికగా ఉండాలని పాలకులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. హత్యానంతరం ఉద్దేశపూర్వక ప్రభుత్వ అలసత్వం.., వెంటాడుతున్న భయంగా ఉండాలని సార్కారు భావిస్తున్నది.

తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, విద్యార్థి యువజనులు, ఉద్యమకారులు నిర్వర్తించాల్సిన బాధ్యతను అద్భుతంగా వివరించాడు సాంబశివుడు తన చివరి ఉపన్యాసంలో. నల్లగొండజిల్లా సంగెంలో జరిగిన టీఆర్‌ఎస్ ధూం ధాంలో నేను కూడా పాల్గొన్నాను. నక్సలైట్లు మట్టుపెట్టిన హోం మినిస్టర్ మాధవడ్డి బంధువుల ఊరిలోనే సభ జరుగుతున్నది. మాధవడ్డి అన్న ఎలిమినేటి కృష్ణాడ్డి మరో ముఖ్యవక్త ఆమిటింగులో. తాను మాట్లాడేటప్పుడు ప్రస్తావించాడు కూడా. మిలియన్ మార్చ్‌నుంచి, ప్రభుత్వం అనుసరించిన తీరు, నిర్బంధకాండ నుంచి మనం ఏం గుణపాఠాలు తీసుకోవాలో సోదాహరణంగా సాంబశివుడు వివరించిండు. మీటింగ్ అయిపోగానే వందలాది మంది యువకులు ఆయనతో కరచాలనానికి పోటీపడి, బారులు తీరి నిల్చుని ఆయనతో కలవడానికి చూపిన ఉత్సాహం సమరోత్సాహానికి సంకేతంగా నిలిచింది. సభ తర్వాత వలిగొండకు రమ్మని నన్న పిలిచినా.. నేను ధర్మభిక్షం అంత్యక్షికియలకు హాజరు కావాల్సిన అవసరాన్ని చెప్పి సాంబశివుని వద్ద సెలవు తీసుకున్నాను. కానీ అదే చివరి చూపు అవుతుందనీ, అదే చివరి మాట అవుతుందని కలలో కూడా ఊహించలేదు. సంగెం మీటింగునుంచి విడిపోయిన 20 నిమిషాల్లోనే గోకారం స్టేజీ దగ్గర హత్యాయత్నం జరిగిందని పిడుగులాంటి వార్త. నేను వలిగొండకు చేరుకుని హైదరాబాద్‌కు తరలిస్తుండగానే మార్గమద్యంలో నాచేతుల్లోనే తుదిశ్వాస విడువటం... గుండెను పిండే విషాదం. సాంబశివుని మరణం నుంచి ఎవరు ఏమి నేర్చుకుంటారో అది వైయక్తికమైనదిగానే భావిద్దాం. జంకేవా డు జంకుతాడు. వెనుకకు తిరగొద్దనుకునేవాడు ముందుకేపోతా డు. సాంబశివుని రెండవ వర్ధంతి సందర్భంగా ప్రధానమైన చర్చ-ఇంతకు మిలియన్ మార్చ్ నుంచి సడక్‌బంద్ జంగ్‌దాకా ఏమి నేర్చుకుంటున్నాం. సాంబశివుడు మాజీ నక్సలైట్ కనుక మిలియన్ మార్చ్‌కు బాధ్యుల్ని చేసి తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని నక్సలైట్ల లింకులో ఉన్నదని ప్రచారం చేసిందీ ఈ సీమాంధ్ర సర్కార్. మరి అలంపూర్‌లో విధ్వంసం ఊసేలేదు. పాల్గొన్న వారు ప్రజా ప్రతినిధులు, విద్యాధికులు, ప్రభుత్వ ఉద్యోగులు మరి వారిపై ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టింది? కిరణ్‌కుమార్ రెడ్డి సీమాంధ్ర సర్కార్ తెలంగాణ వాదులను బెదిరించేందుకు దీన్ని ఒక సందర్భంగా ఎంచుకున్నది. శాంతియుత నిరసనోద్యమంపై నిర్బంధ ఉక్కుపాదాన్ని మోపింది. నేతలను జైలుకు పంపింది. ప్రభుత్వం ఎంత నిర్బంధానికి పాల్పడ్డా.. , ఉద్య మం కోసం ప్రాణాలర్పించిన సాంబశివుడు, బెల్లి లలిత వారసత్వం నిఖర్సయిన తెలంగాణ ఉద్యమకారులందరికీ మార్గం చూపుతూనే ఉన్నది. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా.. సాంబశివుని స్మరణలో మరింత పోరాట పటిమతో ముందుకు మునుముందు కే పోతారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తారు.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు
(నేడు సాంబశివుని రెండవ వర్ధంతి)

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-